
2. ముత్తైదువులు పట్టుస్నానంలో శిరస్సు తడవకుండా స్నానం చేయాలి.
3. వైధవ్య స్త్రీలు పట్టుస్నానంలో శిరస్సు తడిపి స్నానం చేయాలి.
4. గ్రహణం ముగిసిన తదుపరి సర్వులు శిరస్సు తడిపి స్నానం చేయాలి.
5 .గ్రహణ సమయంలో ఆహారపదార్ధాలపై నువ్వులుగానీ, దర్భగానీ ఉంచాలి.

భారత కాలమాన ప్రకారం ప్రతిరోజు ఉదయం 7.30 గంటలకు జాతకపరంగా సమస్యలకు, సందేహాలకు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానములు భక్తి టివిలో కేంద్ర ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగ కర్త, మహాశక్తి ఉపాసకులు, కుర్తాళం సిద్దేశ్వరి ఆస్థాన సిద్దాంతవర్యులు, ద్విశతాధిక ప్రతిష్టాచార్య, త్రిస్వర్ణ ఘంటా కంకణ గ్రహీత, త్రికాలజ్ఞాన విభూషణ, ఓంకార మహాశక్తి పీఠ ధర్మాధికారి దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాసగార్గేయ గారిచే లైవ్ కార్యక్రమం వుండును.
2012 లో ఏమి జరగనుంది ? ..... ప్రతి ఒక్కరు ఏదో జరుగుతుంది అనే భయంతో వణికిపోతున్నారు. ప్రధాన కారణాలు ఏమిటి?.... మయాన్ కాలెండరు నిజమే చెబుతుందా?..... ప్రపంచం వినాశనమగుననే ప్రచారం నిజమేనా ? .... ఇంతటి ప్రచారానికి అడ్డుకట్ట వేయలేమా? ... ప్రసార మాధ్యమాలు, ఇంటర్నెట్ విశేషాలు ప్రపంచ ప్రజలకు నగ్న సత్యాలే తెలుపుతున్నాయా? లేక తప్పు సమాచారం అందిస్తున్నాయా?... ఈ విషయం లో వైజ్ఞానిక శాస్త్రం ఏముంటుంది?.... వేదాలు ఏమని ఘోషిస్తున్నాయి?.. జ్యోతిష్య శాస్త్రం తెలిపేది ఏమిటి? ... ఎన్నో.. ఎన్నెన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి... ప్రపంచ ప్రజలు మాత్రం 2012 ప్రపంచ అంతం అనే మాటతో అట్టుడికిపోతున్నారు..... దీనిలో భాగంగా 2012 లో గ్రహ స్థితులు ఎలా వున్నాయి?... గ్రహణాలు ఎలా వున్నాయి?.. ప్రభావాలు ఎలా వుంటాయి? ... చివరికి ఫలిత సారాంశం ఏమిటి? అని ఆసక్తికర నగ్నసత్యాలతో 2012 సీరియల్ పోస్టింగ్స్ నేటినుంచే సీరియల్ గా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ నేపధ్యంలో మొదటి పోస్టింగ్ గా ఈ 21 వ శతాబ్దపు రెండవ శుక్ర గ్రహణ వివరాలను మీ ముందువుంచుతున్నాను.
ఈ విరోధి నామ సంవత్సరంలో 16 జూలై 2009 గురువారం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాలకు........... శ్రీ సూర్యభగవానుడు పునర్వసు నక్షత్ర నాల్గవ పాదప్రవేశంతో కర్కాటక సంక్రమణం జరిగింది. అంటే..... అదే దక్షిణాయన ప్రారంభమన్నమాట.... ఈ రోజునే కర్కాటక సంక్రాంతి అంటారు. అలాగే 14 జనవరి 2010 గురువారం మద్యాహ్నం 12 గంటల 49 నిమిషాలకు........ శ్రీ సూర్యభగవానుడు ఉత్తరాషాడ నక్షత్ర రెండవ పాదప్రవేశంతో మకర సంక్రమణం జరుగుతుంది. .... అంటే ఆ రోజు ఉత్తరాయణ ప్రారంభం... మకర సంక్రాంతి అన్నమాట....
శ్రీ విరోదిలో దక్షిణాయనం ప్రారంభంకాగానే...... 19 జూలై 2009 చంద్ర నక్షత్రమైన రోహిణి ఆదివారం నుంచి 26 జూలై 2009 సూర్య నక్షత్రమైన ఉత్తర ఆదివారం మధ్యలో ......... 22వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం జరిగింది. 2 సూర్యవారాల మధ్యలో సూర్యగ్రహణం జరిగింది. ఇందుకుగానూ 26 జూలై 2009ఆదివారం నాడు ..... అంటే నాగపంచమి పర్వదినాన ......... నాగవల్లీ పత్రంతో నాగదేవతను ఆరాధించాలి .... నాగవల్లీ పత్రం అంటే....... క్రొత్తగా వుందని అనుకోవద్దండి..... నాగవల్లీ పత్రం అంటే నాగదేవత పేరుతో వున్నఓ పవిత్రమైన ఆకు. సకల శుభాకార్యాలలోనూ, భగవతారాధనలోనూ ఈ ఆకుకి ప్రముఖ స్థానం వుంది..... అదే తమలపాకు. ఆకు రూపం కూడా నాగ పడగలాగానే వుంటుంది. గనుక, 26 ఆదివారం నాడు ఎనిమిది తమలపాకులను తీసుకొని, దానిపై మంచి తేనెను రాసి ... నాగదేవతను ఆరాధించే పుట్ట దగ్గరగానీ, నాగ ప్రతిమల వద్ద గానీ పై చిత్రంలో చూపిన విధంగా..... మధ్యలో పసుపు కుంకుమలను వుంచి, దానికి ఎనిమిది వైపులా తేనె రాసిన తమలపాకులను పెట్టి..... సూర్య భగవానుడి వైపు చూస్తూ మనసులోని కోర్కెను తెలియచేస్తూ నాగ దేవతకు ఈ ఎనిమిది ఆకులను నివేదించండి... అంతే ఆరాధన పూర్తి అయినది . ఇవిగాక ఇంకా ఇంకా మీరు నైవేద్యాలు సమర్పించాలంటే ...సమర్పించండి వానిలో ఎటువంటి మార్పు లేదు.... ఈ ఎనిమిది తేనె పూసిన ఆకులు మాత్రమే ఈ నాగపంచమికి ప్రత్యేకం.
ఎనిమిది ఆకులే ఎందుకు? తొమ్మిది వుంచవచ్చు కదా !!... అష్ట దిక్కులకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఎనిమిది ఆకులను వుంచుతున్నాం. ఓ సర్పదేవతకు తల భాగాన్ని రాహువుగానూ. తోక భాగాన్ని కేతువు గానూ పురాణ, జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా, పిలుచుకుంటాం. ఈ రాహు కేతు గ్రస్తాలతో ఏర్పడిన ఈ గ్రహణాలలో ప్రారంభంలోనే నాగపంచమి పర్వదినాన నాగవల్లీ పత్రంతో రాహు కేతువుల ప్రీతికి ఆరాధన చేసి, నాగదేవత కృపకు పాత్రులుకండి....... శ్రీనివాస గార్గేయ

సూర్యచంద్ర గ్రహణాల రోజున దైవ దర్శనాలను నిలపాలని, గర్భాలయాన్ని మూసివుంచాలని శాసించే ధర్మశాస్త్ర గ్రంధాలు ఎన్నో వున్నాయి కానీ గ్రహణాలలో శ్రీ కాళహస్తి గర్భాలయాన్ని మూయకూడదని, భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వాలని చెప్పే వివరం, ఏ ధర్మశాస్త్ర గ్రంధంలో, లేక ఏ శైవాగమ గ్రంధంలో వున్నదో ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత శ్రీ కాళహస్తి దేవస్థాన పాలకమండలికి, పండితులకి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు వుంది. కేవలం ఆలయ అర్చకులు చూపే ఏవో చిన్నిపాటి కారణాలు కాక, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు స్పందించి ముక్కంటికి మచ్చ లేకుండా చేయాల్సిన అవసరం వుంది.
ఈ విరోధిలో ప్రధానంగా దక్షిణాయనం ప్రారంభమైన వారం రోజులకే 2009 జూలై 22 సంపూర్ణ సూర్య గ్రహణము, 15 జనవరి 2010 అతిపెద్ద కంకణ సూర్య గ్రహణము సంభవించనున్నది. ఉత్తరాయనము ప్రారంభమైన రెండవ రోజే కుంభమేళ పవిత్ర స్నాన సందర్భములో ఈ గ్రహణము ఓ ప్రపంచారిష్టం. ప్రజలు భయపడవలదని మా మనవి.
కనుక ఆయా రోజులలో శ్రీ కాళహస్తి దేవస్థానాన్ని తెరవకుండా వుంచి, భక్తులకు దర్శనాలను ఆపవలెనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారులకు వినయముగా తెలియజేయుచున్నాను. లేదా ఆలయాన్ని తెరవవచ్చు అని చెప్పే సరియైన సక్రమమైన అసలుసిసలైన ప్రామాణిక గ్రంధాన్ని చూపెట్ట వలసిన భాద్యత వున్నదని గుర్తుచేస్తున్నాను. ప్రజల క్షేమంకోరే ఈ వార్త వ్రాయటం జరిగింది. అంతేకాని ఆలయ పండితుల మీద అక్కసుకాదని గ్రహించేది. మీడియా ప్రభంజనం ఉన్న నేటి రోజులలో జనవిజ్ఞానవేదిక నుంచి వచ్చే సూటి ప్రశ్నలకు మనం కూడా ఖచ్చిత ప్రమాణాలను చూపించాల్సిన అవసరం వుంది. - శ్రీనివాస గార్గేయ.

" గ్రహభూమి" పాఠకులకు నమస్కారములు. 