Wednesday, November 16, 2016

ఆర్ధిక సంక్షోభం రాబోతుందని చెప్పిన వార్త రుజువైనది

2016 జనవరి 29న సింహరాశిలోనికి రాహువు ప్రవేశించాడు. అప్పటికే అక్కడ గురు గ్రహ సంచారం ఉన్నది. ఈ రెండు గ్రహాల సంచారాన్ని గురు చండాల యోగంగా భావిస్తారు. ఆ తర్వాత 2016 జూన్ 24న రాహువు, గురువు ఒకే బిందువులోనికి రావటంచే గురువుకు రాహువు  చేత నాగబంధనం ఏర్పడింది. ఇదే సమయంలోనే వైరి గ్రహాలైన కుజుడు, శని ఒకేచోట కలవటం కూడా తటస్థించింది. అంటే శని కుజుల సంఘర్షణ, నాగబంధనం జరిగాయన్నమాట.

వచ్చే సంవత్సరం మర్చి నెలలో వజ్రోత్సవాలు జరుపుకోబోతున్న ఐరోపా సమాఖ్య (ఈ.యూ) కు అక్షరాలా నాగ బంధన ప్రభావం శరాఘాతంగా గుచ్చుకుంది. అగ్రరాజ్యమైన అమెరికా కు ధీటుగా, ఆర్ధిక వ్యవస్థగా ప్రసిద్ధికెక్కిన, 28 దేశాల ఐరోపా సమాఖ్య నుంచి యునైటెడ్ కింగ్డమ్ వైదొలగటం జూన్ 24నే జరిగింది. ఇది చరిత్రలో తొలిసారి. నాలుగు దశాబ్దాల పై చిలుకు అనుబంధం చెదిరిపోయింది.

బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునేందుకు భారతదేశం సంపూర్ణంగా సిద్ధంగా ఉంది అని అమిత్ షా పైకి చెప్పినప్పటికీ, రాబోతున్న ఆర్ధిక సంక్షోభాన్ని మాత్రం ఎదుర్కొంటాం కష్టమవుతుందని, దీని కారణంగా భారత దేశంలో వివిధ రాష్ట్రాలపైనా రాజకీయ అస్థిరతలు చోటుచేసుకొని ఆర్ధిక సంక్షోభాన్ని నాగబంధనం ప్రారంభించునని, తద్వారా భారతదేశంలో నిత్యావసరాలు విపరీతంగా పెరుగునని చాప క్రింద నీరులా సమస్యలు చుట్టుకొనునని 2016 జూన్ 23, 24 తేదీలలోనే పత్రికా ముఖంగా కూడా తెలియచేస్తూ నా ఫేస్బుక్ లో ఉంచటం జరిగింది.

అంతేకాక  గతంలో 1984లో శని, కుజుల సంఘర్షణ ఏర్పడినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అంగరక్షకులచే హతమార్చబడినదని, భోపాల్ లో గ్యాస్ లీకేజీ, పంజాబ్ గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగినవి. అదే శని కుజుల సంఘర్షణ ఇప్పుడు  జరగటం దీని ప్రభావం మరియు, నాగ బంధన ప్రభావం భారతదేశ ఆర్ధిక స్థితిని చిన్నాభిన్నం చేయును.

కనుకనే పైన చెప్పిన వ్యతిరేక గ్రహస్థితులు ప్రభావం 2017 మధ్యవరకు ఉండును. కనుక ప్రజలందరూ ఈ వ్యతిరేక గ్రహసంచారా స్థితుల నుంచి బయట పడటానికి, రాబోతున్న వ్యతిరేక స్థితుల నుంచి కూడా ఉపశమనం  పొందటానికి తదుపరి పోస్టింగ్లను పరిశీలించేది. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ


Tuesday, November 15, 2016

మహతి యోగ పెద్ద జాబిలి తదుపరి నిత్య తిధుల దేవతార్చనలు

మహతి యోగ పరంపరలో భాగంగా నిత్య తిధి దేవతలను ఆరాధిస్తే 75 శాతం వరకు మహతి యోగం దేవతా మూర్తుల అనుగ్రహానికి తోడ్పడును. అయితే దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం సాయంత్ర సమయంలో నిత్య తిధి దేవతలను షోడశ నామావళితో ఆరాధించాలి.

కనుక నిన్నటితో 15 మంది దేవతలు శుక్ల పక్షంతో పూర్తైనారు. ఈరోజునుంచి బహుళ పాడ్యమితో కృష్ణ పక్షము ప్రారంభమైనది. బహుళ పాడ్యమికి నిత్య తిధి దేవత చిత్రా. కనుక నిన్న ఆరాధించిన దేవతనే ఈరోజు కూడా ఆరాధించాలి. 


ఈ దేవతను ఆరాధించిన కారణంగా లబ్ది ఏమిటంటే.. మన కోరికలన్నింటిని తీర్చటానికి అవకాశాలను అందించే విధంగా మార్గాలను ఈ దేవత చూపును. అంతేకాక ఆరోగ్య అంశాలలో కూడా సరియైన నిర్ణయాలను పొందగలుగుదురు. కనుక ఈ సాయంత్రం ఈ దేవతను ఆరాధించేది.
నామాల కొరకుగా ఈ క్రింది వీడియోను చూడండి. 



గమనిక - 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న గ్రహసంచార స్థితిగతులపై ఓ విశ్లేషణాత్మక వ్యాసం రేపు పోస్టింగ్ చేయబడును.- దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Monday, November 14, 2016

14 నవంబర్ 2016 మహతీ యోగానికి చిత్రా దేవతార్చన


దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 14 నవంబర్ 2016 సోమవారం నాడు పూర్ణిమ తిధి నిత్య దేవత అయిన చిత్రా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. పూర్ణిమ తిధి సాయంత్ర సమయంలో ఉన్ననూ లేకున్ననూ, ఈనాటి ప్రదోష సమయంలో చంద్ర దర్శనంతో చిత్రా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Sunday, November 13, 2016

13 నవంబర్ 2016 మహతీ యోగానికి జ్వాలామాలిని దేవతార్చన

 

దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 13 నవంబర్ 2016 ఆదివారం నాడు శుక్ల చతుర్దశి  తిధి నిత్య దేవత అయిన జ్వాలామాలిని దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 13 సాయంత్ర సమయానికి శుక్ల చతుర్దశి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు జ్వాలామాలిని దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Saturday, November 12, 2016

12 నవంబర్ 2016 మహతీ యోగానికి సర్వమంగళ దేవతార్చన




దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 12 నవంబర్ 2016 శనివారం నాడు శుక్ల త్రయోదశి  తిధి నిత్య దేవత అయిన సర్వమంగళ దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 12 సాయంత్ర సమయానికి శుక్ల త్రయోదశి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు సర్వమంగళ దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ







Thursday, November 10, 2016

11 నవంబర్ 2016 మహతీ యోగానికి విజయా దేవతార్చన



దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 11 నవంబర్ 2016 శుక్రవారం వారం నాడు శుక్ల ద్వాదశి తిధి నిత్య దేవత అయిన విజయా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 11 సాయంత్ర సమయానికి శుక్ల ద్వాదశి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు విజయా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

Wednesday, November 9, 2016

10 నవంబర్ 2016 మహతీ యోగానికి నీలపతాక దేవతార్చన


దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 10 నవంబర్ 2016 గురువారం వారం నాడు శుక్ల ఏకాదశి తిధి నిత్య దేవత అయిన నీలపతాక దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 10 సాయంత్ర సమయానికి శుక్ల ఏకాదశి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు నీలపతాక దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

Tuesday, November 8, 2016

మరోసారి మహాశాంతి యాగం వాయిదా

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా... నవంబర్ 10వ తేది జరగవలసిన మహా శాంతియాగం వాయిదా వేస్తున్నందుకు ఎంతో చింతిస్తున్నాం. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చిన సామాన్య ప్రజానీకం తిరిగి వెళ్లేంతవరకు ఖర్చుపెట్టవలసిన డబ్బులలో 500 మరియు 1000 రూపాయల కాగితాలు రద్దు అయిన కారణంగా, వారు ఇబ్బందులకు గురికాగలరు.  కాబట్టి ఇంటి నుంచి బయలుదేరింది మొదలు తిరిగి ఇంటికి చేరేంతవరకు ఆర్ధిక లావాదేవీలలో ఇబ్బందులు ఉన్నాయి కనుక, అలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం వాయిదా వేయబడినది. ఈ విషయాన్ని దయచేసి మీ బంధు, మిత్రాదులకు తెలియచేయవలసినది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

9 నవంబర్ 2016 మహతీ యోగానికి నిత్యా దేవతార్చన



దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 9 నవంబర్ 2016 బుధవారం వారం నాడు శుక్ల దశమి తిధి నిత్య దేవత అయిన నిత్యా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 9 సాయంత్ర సమయానికి శుక్ల దశమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు నిత్యా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 




Monday, November 7, 2016

8 నవంబర్ 2016 మహతీ యోగానికి కులసుందరి దేవతార్చన

దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 8 నవంబర్ 2016 మంగళవారం వారం నాడు శుక్ల నవమి తిధి నిత్య దేవత అయిన కులసుందరి దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 8 సాయంత్ర సమయానికి శుక్ల నవమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు కులసుందరి దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ




Sunday, November 6, 2016

7 నవంబర్ 2016 మహతీ యోగానికి త్వరిత దేవతార్చన

దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 7 నవంబర్ 2016 సోమవారం నాడు శుక్ల అష్టమి తిధి నిత్య దేవత అయిన త్వరిత దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 7  సాయంత్ర సమయానికి శుక్ల అష్టమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు త్వరిత దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ




10 నవంబర్ 2016 విజయవాడలో మహాశాంతి యాగము

2015 జూలై  14 గురుగ్రహము సింహరాశిలోకి ప్రవేశించటంతో గోదావరి  పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ సింహరాశిలోకి  ప్రవేశించిన గురువు శాస్త్ర రీత్యా దోషప్రదుడు. ఇది ఇలా ఉండగా 2016 జనవరి 29న ఈ సింహరాశిలోనికే రాహువు ప్రవేశించటంతో గురువు మరింత దోషప్రదుడయ్యాడు. సింహరాశి అధిపతి సూర్యుడు. ఈ సూర్యునికి ఈ సంవత్సరం గురు నక్షత్రమైన పూర్వాభాద్రలో  సంపూర్ణ గ్రహణం జరిగింది. అలాగే సెప్టెంబర్ 1వ తేదీన తిరిగి సింహరాశిలోనే సూర్యునకు మరో  సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. అంతేకాక శత్రు గ్రహాలైన శని, కుజులు ఇక కాలంలో వక్రం కావటం, ఆగష్టు 24న శని, కుజులు కలవటం జరిగింది.

ఈ రెండు గ్రహణాల మధ్య కాలంలో అనగా జూన్ 24న గురువు, రాహువు ఒకే బిందువులోకి రావటంతో నాగబంధనం ఏర్పడింది. ఈ నాగబంధనమే మరింత దోష ప్రదమైనది. దీని ప్రభావం వలన ముందు మూడు మాసాలు, తదుపరి ఆరు మాసాలు వెరసి 9 మాసాల వరకు దాని ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం భారతదేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా సరిహద్దు దేశాల మధ్య యుద్ధభయ వాతావరణం నెలకొనటం,  రాష్ట్రాల నడుమ కలహప్రద సూచనలు ఉండును. అంతేకాక తరచూ భూకంపాలు, వైమానిక ప్రమాదాలు, జల సంబంధిత ప్రకృతి ఉండటమే కాక, రాష్ట్రాలను పాలించే నాయకులపైనా కూడా దాని ప్రభావం ఉండునని 2016 మార్చి 1న విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పటం జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో నాగ బంధన దోష నివృత్తికై 2016 మార్చి 6 హైద్రాబాద్లోనూ, ఏప్రిల్ 3 విశాఖపట్నంలోనూ, మే 1 ఒంగోలులోను , మే 29 రాజమండ్రిలోను, జూన్ 24 సికింద్రాబాద్లోను, జులై 1 తిరుపతిలోను, జులై 31 గుంటూర్లోనూ విశేష రీతులలో సప్త సూర్య మహాయాగాలు జరిగినవి.

2016 నవంబర్ 7 మధ్యాహ్నం 11 గంటల 58 నిముషాల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల 31 నిముషం వరకు గ్రహ మాలికా యోగము జరుగుచున్నది. ఈ యోగం జరుగనున్న రోజులలోని గురువారం నాడు పరిహారంగా మహా శాంతి యాగం జరగనున్నది. అందుచే సప్త యాగాలలో సేకరించిన భస్మాలను సప్త నదుల నీటితో తడిపి, సప్త కలశాలకు నింపి , ఈ సప్త కలశాలను 2016 నవంబర్ 10 గురువారము గురునక్షత్రమైన పూర్వాభాద్రలో, ప్రజలందరి చేత విశేష రీతిలో నదీ జలంతో, శాంతి మంత్రాలతో అభిషిక్తం కావించబడును. ఇదే మహాశాంతి యాగము.

రుద్ర స్తోత్రంలో చెప్పబడిన శివుని యొక్క అష్టమూర్తిత్వములలో శర్వుడు భూమికి, భవుడు జలానికి, రుద్రుడు అగ్నికి, ఉగ్రుడు వాయువునకు, భీముడు ఆకాశమునకు ఆధిపత్యములు వహించగా మనలోని జీవునకు పశుపతి, సూర్య చంద్రులకు ఈశుడు, మహాదేవుడు ఆధిపత్యం వహిస్తున్నారు. కనుక ఈ కార్తీక మాసంలో శివుని యొక్క అష్టమూర్తిత్వాలలో రెండవ దైన  జలంతో మహాశాంతి యాగం  జరుపబడును.


ఈ మహాశాంతి యాగము విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజ్ కి ప్రక్కన గల ఉండవల్లి కరకట్ట పైన గల శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీ వారి పీఠంలో 10 నవంబర్ 2016 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.


కార్యక్రమం తదుపరి సప్త కలశాలలోని తడిసిన భస్మములన్నింటిని ప్రత్యేక పద్దతిలో కలిపి, డిసెంబర్ మొదటి వారంలో భక్తులకు  అందజేయబడును.  ముఖ్యంగా 2016 నవంబర్ 14 కార్తీక పూర్ణిమ సోమవారం నాడు మహతి యోగ సమయంలో సాధారణ స్థాయి కంటే అత్యధిక స్థాయిలో పున్నమి చంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. విశాఖ నక్షత్రంలో సూర్యుడు ఉండి, కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్న సమయంలో కార్తీక పూర్ణిమని మహతి యోగం అంటారు. ఈ మహతీ యోగం అనగా దేవతలు అనుగ్రహించుటకు అనువైన సమయమని అర్థము. ఈ యోగము దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు ప్రభావం ఉండును . ఈ సమయము పూర్తిగా స్త్రీ దేవత మూర్తులను ఆరాధించుటకు విశేష అనుకూల సమయముగా భావించాలి. అయితే ఈ యోగం ప్రభావంచేతను, మరో వైపునున్న వ్యతిరేక గ్రహస్థితులు వలనను  భూకంప సూచనలు మరియు సముద్రాలపై దాని ప్రభావం అధికంగా ఉండును. ఇందుచేతనే దీపావళి అమావాస్య నాడే ఇటలీలో భూకంపం తీవ్రస్థాయిలో రావటం జరిగింది. కనుక దీని ప్రభావం నవంబర్ 28వరకు ఉన్నది. కాబట్టి సముద్ర తీరాలలో స్నానాలు ఆచరించేవారు పై రోజులలో జాగ్రత్తలు తీసుకొనవలసినది.

మహతి యోగం ఒకవైపు వ్యతిరేక ప్రభావాన్ని ఇస్తూనే, మరోవైపు పూర్తి అనుకూల స్థితులను కూడా అందించును. అందుచేతనే జాతకులపై నాగబంధన దోష ప్రభావము తగ్గటానికి, మహతీ యోగ అనుకూల ప్రభావము పొందటానికి గాను, నా ఆధ్వర్యంలో పై సూర్య యాగాలు చేసి, నవంబర్ 10న మహాశాంతి యాగానికి సిద్ధం కాబోతున్నాము . ఈ యాగానికి వచ్ఛే వారు తమతో పాటు ఒక చిన్న పాత్రను కూడా తీసుకొని వచ్చేది. (ఎందుకంటే కృష్ణా నదిలో పారుతున్న నీటిని తీసుకొని కలశాలపై పోయుటకు, పాత్ర ఏ లోహంతో చేసినది అయిననూ పర్వాలేదు. ) 27 నక్షత్రములు మరియు నవగ్రహ మూలమంత్రములతో పాటు సంపుటీకరణ విధి విధానంతో జరిగే శాంతి సంబంధ వేద మంత్రోచ్చారణల మధ్య, ఎవరికీ వారు తమంతట తామే సప్త కలశాలపై నదీ జలాన్ని అభిషిక్తం చేసుకునే అవకాశం ఉన్నది. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొనవలసినది.- దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Saturday, November 5, 2016

6 నవంబర్ 2016 మహతీ యోగానికి శివదూతి దేవతార్చన



దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 6 నవంబర్ 2016 ఆదివారం నాడు శుక్ల సప్తమి తిధి నిత్య దేవత అయిన శివదూతి దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 6  సాయంత్ర సమయానికి శుక్ల సప్తమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు శివదూతి దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 



Friday, November 4, 2016

5 నవంబర్ 2016 మహతీ యోగానికి మహావజ్రేశ్వరి దేవతార్చన




దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 5 నవంబర్ 2016 శనివారం నాడు శుక్ల షష్ఠి తిధి నిత్య దేవత అయిన మహావజ్రేశ్వరి దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 5  సాయంత్ర సమయానికి శుక్ల షష్ఠి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు షష్ఠి దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

Thursday, November 3, 2016

4 నవంబర్ 2016 మహతీ యోగానికి వహ్నివాసిని దేవతార్చన


దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 4 నవంబర్ 2016 శుక్రవారం నాడు శుక్ల పంచమి తిధి నిత్య దేవత అయిన వహ్నివాసిని దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 4  సాయంత్ర సమయానికి శుక్ల పంచమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు వహ్నివాసిని దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ


Wednesday, November 2, 2016

3 నవంబర్ 2016 మహతీ యోగానికి భేరుండా దేవతార్చన




దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 3 నవంబర్ 2016 గురువారం నాడు శుక్ల చవితి తిధి నిత్య దేవత అయిన భేరుండా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 3  సాయంత్ర సమయానికి శుక్ల చవితి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు భేరుండా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 



Tuesday, November 1, 2016

2 నవంబర్ 2016 మహతీ యోగానికి నిత్యక్లిన్నా దేవతార్చన

దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 2 నవంబర్ 2016 బుధవారం నాడు శుక్ల తదియ తిధి నిత్య దేవత అయిన నిత్యక్లిన్నా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 2  సాయంత్ర సమయానికి శుక్ల తదియ ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు నిత్యక్లిన్నా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Monday, October 31, 2016

1 నవంబర్ 2016 మహతీ యోగానికి భగమాలినీ దేవతార్చన

శ్రీ లలితా సహస్ర నామాలలో 240 నామాలు అతి రహస్యములైనవి. ఈ నామాలను 15 మంది దేవతలకు విభజించగా, ఒక్కో దేవతకు 16 నామాలు వచ్చినవి. అనగా ఒక్కొక్క తిథి రోజున ఈ 16 నామాలతో లలితా పరమేశ్వరిలో నిత్య తిధి దేవతను వీక్షిస్తూ భక్తి విశ్వాసాలతో పారాయణ చేయాలి. మరింత అధిక  సమాచారం తెలుసుకొనవచ్చుననే ఉద్దేశ్యంతోనే దేవతా నామాలకు ముందుగా కొంత ఉపొద్ఘాతాన్ని కూడా అందిస్తున్నాను. అయితే అధిక భాగం నెటిజన్స్ కు ఈ ఉపోద్ఘాతం ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే... నేరుగా తేదీల ప్రకారం నిర్ణయించి దేవతా నామాలను ఇకపైన అందిస్తాను. ఉపోద్ఘాతాన్ని ఏదో ఒక సమయంలో ఈ నామాలతో కాకుండా ప్రత్యేక శీర్షికల ద్వారా అందచేయగలను.

కనుక ఈ రోజు నుంచి తేదీల ప్రకారంగా నామాలను, వారాన్ని, తిథిని, దేవతా స్వరూపాన్ని మరియు దేవత అనుగ్రహించే అంశాలను ఒకే ఇమేజ్ లో చేసి పోస్టింగ్ చేస్తున్నాను. అయితే తిధి విషయంలో సాయంత్ర సమయంలో ఇండియా, అమెరికా, లండన్ లలో తిధి ఒకే సమయంలో ఉంటే ఒకే ఇమేజ్ గా ఇస్తాను. అలా కాక సాయంత్ర సమయంలో తిధి మారి ఉంటే, ఆయా దేశాలకు విడివిడిగా ఇమేజ్ లు అందించగలను. కనుక ఈ మార్పును గమనించగలరు. ఈ క్రింద ఉన్న ఇమేజ్ లో దేవతా స్వరూప చిత్రం కూడా ఉంటుంది. ఆ చిత్రాన్ని పలుమార్లు వీక్షించినచో, మీ మనసులో ఓ చెరగని ముద్రగా దేవత ఉంటుంది. కనుక ఒక్కొక్క తిధికి దేవతా స్వరూపం ఎలా ఉంటుంది అనేది మీకు స్పష్టంగా అవగతమవుతుంది.

నా సారథ్యంలోనే గార్గేయ టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా "ప్రణతి" అనే పేరుతో ఆధ్యాత్మిక, జ్యోతిష టీవీ ఛానల్ ను మీ అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతం ప్రయోగాత్మకంగా యూట్యూబ్ లో Pranati Television అని టైప్ చేసి వీక్షించవచ్చు. పూర్తి స్థాయి కార్యక్రమాలతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటింటికి ప్రణతి టెలివిజన్ రావటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాను. కనుక ఇతర దేశాలలో ఉన్నవారు ప్రణతి టీవీని యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలలో ఉన్నవారికి ఈ టీవీ ప్రసారాలను త్వరిత గతిలో అందించటానికి ప్రయత్నాలు చేస్తున్నాను. కనుక నా సారధ్యంలో ప్రణతి టీవీ రానున్నదని, భారతీయ సంస్కృతీ సాంప్రదాయ స్రవంతిని అందించుననే విషయాన్ని మీ మీ బంధు మిత్రాదులందరికీ సోషల్ మీడియా ద్వారా తప్పక తెలియచేయగలరని మనఃస్ఫూర్తిగా కోరుతున్నాను.

ఇక నవంబర్ 1 మంగళవారం శుక్ల విదియ రోజున భగమాలినీ దేవతార్చనకు అవసరమైన షోడశ నామావళి ఇమేజ్ ను దిగువ ఇస్తున్నాను. గమనించేది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 


Saturday, October 29, 2016

దీపావళిన మహతీ యోగ సిద్ధికి శ్రీ లలితా షోడశ నామాలతో కామేశ్వరీ దేవతార్చన

శ్రీ - అంటే పరాశక్తి. మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతి. వీరు ముగ్గురూ  రూపాలే. చక్రం ఆమె నివాసం. శ్రీచక్రం అంటే పరాశక్తి సామ్రాజ్యమని భావము. ఈ తల్లి సృష్టించిన మానవ దేహంలో ఆమె సామ్రాజ్య లక్షణాలు ఉంటాయి. శ్రీచక్రంలో 5 చక్రాలు శక్తిని, 4 చక్రాలు శివునివి. ఈ విధంగా నవ చక్రాలు శక్తి, శివమయాలు. మానవదేహం నవ ధాతువులచే సృష్టింపబడింది. వీటిలో చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు అను ఐదు శక్తి ధాతువులు. ఇక మజ్జ, శుక్లము, ప్రాణము, జీవము అను నాలుగూ శివ ధాతువులు. ఇలా మానవ దేహంలోని 9 ధాతువులకు శ్రీచక్రంలోని నవ చక్రాలు (నవ యోనులు) ప్రతీకలు. శ్రీచక్ర నవ ఆవరణాలకి, మానవదేహానికి సంబంధం ఉన్నది.

నవ ఆవరణలతో ఉన్న శ్రీచక్రంలో.. 8వ ఆవరణ త్రిభుజాకారంగా ఉంటుంది. దీనిని సర్వసిద్ధిప్రద చక్రము అంటారు. ఈ త్రిభుజంలోని బిందువును 9వ ఆవరణగా పిలుస్తారు. ఈ బిందువునే సర్వానందమయ చక్రము అంటారు. ఈ బిందువులోనే కామేశ్వరీ, కామేశ్వరులు ఉంటారు.

ఇక 8వ ఆవరణగా చెప్పిన సర్వసిద్ధిప్రద చక్రము అనే త్రిభుజంలోని 3 భుజాలలో ఒక్కో భుజం వైపు 5 మంది దేవతల చొప్పున, 3 భుజాలకు 15 మంది దేవతలు ఉంటారు. ఈ 15 మందినే నిత్య తిధి దేవతలు అంటారు.


ఈ త్రిభుజానికి ఉన్న 3 కోణాలలో ఓ కోణాన్ని జలంధర పీఠంగాను, రెండవ కోణాన్ని పుష్పగిరి పీఠం గాను, మూడవ కోణాన్ని కామగిరి పీఠం గాను పేర్కొంటారు. ఇంక మరీ లోతులకు వెళ్లకుండా 15 మంది దేవతలలో ప్రధమ దేవతే కామేశ్వరీ. ఈ దేవత శుక్ల పక్ష పాడ్యమికి, కృష్ణ పక్ష అమావాశ్యకు నిత్య తిధి దేవతగా (చంద్రకళగా ) ఉండును.. వాస్తవానికి శుక్ల పాడ్యమి రోజున చంద్రుని చూడలేము. అలాగే అమావాస్య రోజున కూడా చంద్రుని చూడలేము.

చంద్రుడు కనపడని ఈ రెండు తిధులకు అధిష్టానంగా ఉన్న కామేశ్వరీ దేవతా స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. కామేశ్వరీ దేవత ఎరుపు మాణిక్యం పొదిగిన కిరీటాన్ని ధరించి ఎరుపు వస్త్రాలతో, కుడి కాలు మడిచి.. ఎడమకాలు క్రిందకి జారవిడిచి పీఠంపై ఆశీనురాలై ఉంటుంది. కోటి మంది సూర్యులు ఒక్కసారిగా సూర్యోదయంలో ఉంటే... అప్పుడు కనపడే అరుణవర్ణ కాంతి ఎలా ఉంటుందో.. అట్టి కాంతితో ఈ నిత్య తిధి దేవత విరాజిల్లుతుంటుంది . మూడు కన్నులు, 6 చేతులు, శిరస్సుపై చంద్రవంకను కలిగి, చిరు మందహాసంతో కామేశ్వరీ దేవత  ఉంటుంది.
ఈ దేవతకున్న 6 చేతులలో 1. చెరకు విల్లు, 2. పుష్పబాణాలు 3. పాశము 4. అంకుశము 5. తేనెతో నింపిన బంగారుపాత్ర 6. వరముద్రను కల్గి ఉండి...  ముంజేతికి, మెడకు, నడుముకు విశేష రీతిలో స్వర్ణాభరణాలని ధరించి భక్తులకు అనుగ్రహం ఇచ్చే రీతిలో సిద్ధంగా ఉంటుంది కామేశ్వరీ మాత.
ఖగోళంలో సూర్యుడు, చంద్రుడు ఒకే డిగ్రీలోనికి వచ్చినప్పుడు ఏర్పడే తిథిని అమావాస్య అంటారు. భూ చలనం వలన సూర్య చంద్రుల మధ్య దూరం పెరుగుతున్న కారణంగా, సూర్య కాంతి చంద్రునిపై పడి నెలవంకతో ప్రారంభమై, దిన దిన ప్రవర్ధమానంగా చంద్రుడు ప్రకాశిస్తూ పూర్ణిమ రోజున సూర్యునికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు. ఈ పూర్ణిమ వరకు 15 తిధులు జరగాలి. ఈ 15 తిధులకు ఉన్న నిత్య దేవతల చేతుల సంఖ్యను కలిపితే 108 వచ్చును. ఈ 108 కిరణాలతో (చేతులతో ) త్రిభుజంలో ఉన్న శ్రీ శివ శక్తుల వైభవం బ్రహ్మాండ రీతిలో ఉంటుంది.

కాబట్టి ప్రతి నెలలో వచ్ఛే ఈ తిధి సమయాలలో సాయంత్ర సమయంలో శ్రీలలితా పరమేశ్వరిని ధ్యానిస్తూ, ఆ పరమేశ్వరిలోనే పైన చెప్పిన కామేశ్వరీ రూపు రేఖలను భావించుకుంటూ... 8 అక్షరాలతో ఉన్న శ్రీ లలితా సహస్రంలోని 16 నామాలను పఠిస్తూ .. 16 ఉపచారాలుగా అందించటం శ్రేయస్కరం. ఇక సహజంగానే సంకల్పం చెప్పుకోవటం అనేది పూజ కార్యక్రమంలో ప్రధమంగా ఉండే అంశము. మనమెవరో, మన గోత్రమేమిటో అన్నీ ఆ తల్లికి తెలుసు. ఇట్టి స్థితిలో తిరిగి సంకల్పము అనవసరం.  మనకు బదులుగా, మనకొరకుగా మరొక వ్యక్తి దేవిని ప్రార్ధించే సమయంలోనే సంకల్పం అవసరము.
సంకల్పం చెప్పుకోవాలని ఉత్సాహం ఉన్నవారు చెప్పుకొనవచ్చును.  అంతేగాని ఎవరికి  వారు సంకల్పాలపైనా, అంగన్యాస కరన్యాసాల పైన దృష్టి ఉంచకుండా ఒక్కొక్క నామాన్ని పఠిస్తూ 16 ఉపచారాలను చేయటానికి ప్రయత్నించండి. ఉపచారాలు చేయలేకపోయిననూ కనీసం 16 నామాలను మానసిక పూజతో భక్తి విశ్వాసాలతో పఠించండి.

నివేదనగా మీకు నచ్చిన ఏ పదార్ధమైన సమర్పించండి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ 16 నామాలను పఠించే సమయంలో కామేశ్వరీ రూపాన్ని మనసులో ధ్యానించండి.

సంపద, సంతోషాల కొరకు, మానసిక శాంతికొరకు, కుటుంబ సఖ్యత అభివృద్ధి దిశలో ఉండుటకు, సమంజసమైన కోరికలను తీర్చుటకు కామేశ్వరి దేవత వరముద్రతో అనుగ్రహించటానికి ప్రతి పాడ్యమి, ప్రతి అమావాస్య తిధి సమయాలలో సిద్ధంగా ఉంటుంది.

చివరగా మహతీ యోగం ఏర్పడుతున్న కారణంగా దీపావళి అమావాస్య సాయంత్రం సూర్యుడు అస్తమించిన తదుపరి నుంచి తొలి 2 గంటలలోనే దీపారాధనతో ధ్యానించండి. (వత్తుల సంఖ్య, వెలిగించటానికి తోడ్పడే తైలాల గురించి అనసవసర సందేహాలకు వెళ్ళవద్దు). ఈ కామేశ్వరీ తల్లి చంద్ర కళలతో  కూడిన  నిత్య తిధి దేవత. చంద్రుడు మనసుకు కారకుడు. ఈ మనస్సుతో  ప్రధానంగా చేసే పూజా కార్యక్రమమే ఇది.

ఈ దిగువ ఇచ్చిన వీడియోలో కామేశ్వరీ దేవతను దర్శించి నామాలను తెలుసుకొని ప్రయత్నించండి.
దీపావళి తర్వాత రోజు శుక్ల పాడ్యమి కనుక ఆనాటి దేవత కూడా కామేశ్వరే. కనుక ఇవే నామాలు తరువాత రోజుకి కూడా వర్తిస్తాయి.   




గమనిక -
మహతీ యోగం రోజులలోనే కాకుండా, భవిష్య కాలంలో వచ్చే పాడ్యమి, అమావాస్య తిథులలో కూడా ఆరాధించవచ్చును. అంతేకాదండోయ్ సూర్యోదయం తర్వాత మొదటి రెండు గంటలలో కనపడే శ్రీ సూర్యనారాయణ మూర్తిని కనులు మూసుకొని వీక్షిస్తూ, ఈ కామేశ్వరీ దేవతా రూపాన్ని తలుచుకుంటూ ఆ 16 నామాలను పఠించటం సర్వదా శ్రేయస్కరం. (నామాలు కంఠస్థం వచ్చినప్పుడు మాత్రమే ఈ పని చేయండి. )

తదుపరి పోస్టింగ్లో శుక్ల విదియకు సంబంధించిన భగమాలిని దేవత గురించి తెలుసుకుందాం. - దైవజ్ఞ పొన్నలూరి  శ్రీనివాస గార్గేయ

మహతీ యోగ సిద్ధికి లలితా సహస్ర అతి రహస్యనామాలు

శ్రీ లలితా సహస్రనామాలలో 8 అక్షరాలతో వచ్చే నామాలు 240 ఉన్నాయి. ఇవి అతి రహస్య నామాలు. ఈ 8 సంఖ్యకు చాలా విశేష ప్రాధాన్యం ఉన్నది. ఈ  ప్రాధాన్యత చెప్పుకునేముందు తిధి దేవతలను గురించి చర్చించుకుందాం. శుక్ల పక్ష పాడ్యమి నుంచి దేవి కళ ప్రారంభమై కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నా, భేరుండా, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితా, కులసుందరీ, నిత్యా, నీలాపతాకా, విజయా, సర్వమంగళా, జ్వాలామాలినీ, చిత్రా అనే 15 నిత్యదేవతలు పూర్ణిమ వరకు ఆరాధించబడుదురు. 

అలాగే కృష్ణ పక్షంలో వెనుకనుంచి వరుసగా చిత్రా, జ్వాలామాలినీ, సర్వమంగళా, విజయా, నీలాపతాకా, నిత్యా, కులసుందరీ, త్వరితా, శివదూతీ, మహావజ్రేశ్వరీ, వహ్నివాసినీ, భేరుండా, నిత్యక్లిన్నా, భగమాలినీ, కామేశ్వరీ అనే విధంగా చంద్రకళలు నిత్య తిధి దేవతలుగా ఉంటారు. శుక్ల పక్షంలో వచ్చే 15 దేవతలలో 8వ (శుక్ల అష్టమికి) నిత్యా దేవత త్వరితా. అలాగే కృష్ణ పక్షంలో 8వ (బహుళ అష్టమికి) నిత్యా దేవత కూడా త్వరితే. మిగిలిన అన్ని తిధులకు వేరు వేరు నిత్యా దేవతలు ఉంటారు. కానీ శుక్ల అష్టమి, బహుళ అష్టమి తిథులలో మాత్రం త్వరితా అనే నిత్యా దేవత మాత్రమే ఉండును. అనగా అష్టమి తిధి నాడు తిధి దేవత మారదు. 

అందుకే "అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా" అను శ్రీ లలితా సహస్ర నామావళిలోని 15వ నామంలో 8 వ తిధి అయిన అష్టమినాడు ప్రకాశించు చంద్రుని కళవలె ప్రకాశించు తల్లి అని భావము. శుక్ల పక్షము లోని పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు నిత్యం చంద్రుడు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాడు. కృష్ణ పక్షంలోని బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్రమ క్రమంగా చంద్రుడు క్షీణిస్తూ ఉండటం అందరికీ తెలిసిందే. శుక్ల అష్టమి, బహుళ అష్టమి రోజులలో మాత్రం చంద్రుడు ఒకే సైజు లోనే ఉండటం విశేషం. ఈ 8వ చంద్రకళకు విశేష ప్రాధాన్యత ఉన్నది . 

ఎనిమిది (అష్టమి అంటే ) అనగానే చాలా మంది భయపడతారు. మత్స్య పురాణంలో "లక్ష్మీర్మేధా ధరా పుష్టిః గౌరీ తుష్టిః ప్రభా ధృతిః ఏతాభిః పాహి తనుభి రష్ఠాభిర్మాం సరస్వతీ" అని సరస్వతి 8 విధములైన ప్రాణస్వరూపిణిగా చెప్పబడింది. "ప్రాణశక్తి సరస్వతి" అని వేదం చెప్పింది. ఈ ప్రాణశక్తి ప్రపంచమంతా వ్యాపించి 8 విధాలుగా మనల్ని రక్షిస్తున్నది.

సరస్వతి శబ్దానికి ప్రవాహము కలది అని కూడా అర్ధము కలదు .శరీరంలో ఈ ప్రవాహ లక్షణము ప్రతి అణువు నందు ప్రసరిస్తుంటుంది. ఇట్టి ప్రాణ స్వరూపిణిగా ఉన్న అష్టమూర్తిత్వములో లక్ష్మీ అనగా ఐశ్వర్యము, సంపద.. మేధా అనగా బుద్ధి.. ధరా అంటే ధరించునది అనగా భూమి.. పుష్టి అంటే ఇంద్రియాలకు కావలసిన శక్తి.. గౌరీ అనగా వాక్స్వరూపిణి, తుష్టి అంటే తృప్తి, ప్రభా అనగా వెలుగు, ధృతి అనగా ధైర్యమని అర్ధము. ఈ 8 శక్తులు మానవులకు సహకరించి రక్షిస్తుంటాయి.

అలాగే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి అనబడే అష్టమాతృక దేవతలు కూడా ఉన్నారు. కామాక్షి దేవిని కూడా ధరణీమయీ, భరణీమయీ, పవనమయీ, గగనమయీ, దహనమయీ, హవనమయీ, అంబుమయీ, ఇందుమయీ అనే 8 రూపాలలో ప్రార్దిస్తుంటాము. 


ఇక ఆదిశంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహాదేవ అనే 8 పేర్లను అష్టమూర్తులుగా తెలియచేశారు. ఇక ఈ అష్టమూర్తులకు చెందిన శక్తి అమ్మవారులే భవాని, శర్వాణి, ఈశాని, పశుపాశవిమోచనీ, రుద్రాణీ, ఉగ్రాణి, మహాదేవీ అను 8 శివుని యొక్క శక్తులు. కనుక ఈ 8 అంకెలో ఉన్నదంతా శక్తి స్వరూపిణి అయినా జగన్మాతే.
కాబట్టి 8 అంకెలో ఉన్న జగన్మాత శక్తి స్వరూప అతి రహస్య నామాలు శ్రీ లలితా సహస్రనామావళిలో 240 ఉన్నాయి. ఈ 240 నామాలు ఒక్కొక్కటి 8 అక్షరాలతోనే ఉంటాయి. ఒక పక్షానికి 15 తిధులు. మొత్తం 240 నామాలను 15 తిధులకు విభజించగా, ఒక్కొక్క తిధికి 16 నామాలు వస్తాయి. ఈ పరంపరలో శ్రీ చక్ర 8వ ఆవరణను సర్వసిద్ధిప్రదా చక్రము అంటారు. ఇది త్రిభుజాకారాంలో  ఉంటుంది. ఒక్కోభుజానికి 5మంది దేవతలు (తిధి దేవతలు) చొప్పున మూడు భుజాలకి 15 మంది నిత్య తిధి దేవతలు ఉంటారు.

ఒక్కో దేవతకు 16 నామాలు చొప్పున పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 240 నామాలు సరిపోతాయి. అలాగే బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు తిరిగి ఇవే నామాలు పునరావృతం అవుతాయి. అయితే శ్రీ లలితా సహస్రంలోని 240 నామాలు ఏ ఏ తిధి దేవతలకు ఏ విధంగా వుంటాయో తెలుసుకుందాం.

కామేశ్వరీ - శుక్ల పాడ్యమి , అమావాస్య తిధులకు దేవత
భగమాలినీ - శుక్ల విదియ, బహుళ చతుర్దశి తిధులకు దేవత
నిత్యక్లిన్నా - శుక్ల తదియ, బహుళ త్రయోదశి తిధులకు దేవత
భేరుండా - శుక్ల చవితి, బహుళ ద్వాదశి తిధులకు దేవత
వహ్నివాసినీ - శుక్ల పంచమి, బహుళ ఏకాదశి  తిధులకు దేవత
మహావజ్రేశ్వరీ - శుక్ల షష్టి, బహుళ దశమి తిధులకు దేవత
శివదూతీ - శుక్ల సప్తమి, బహుళ నవమి తిధులకు దేవత
త్వరితా - శుక్ల అష్టమి, బహుళ అష్టమి తిధులకు దేవత
కులసుందరీ - శుక్ల నవమి, బహుళ సప్తమి తిధులకు దేవత
నిత్యా - శుక్ల దశమి, బహుళ షష్టి తిధులకు దేవత
నీలాపతాకా - శుక్ల ఏకాదశి, బహుళ పంచమి తిధులకు దేవత
విజయా - శుక్ల ద్వాదశి, బహుళ చవితి తిధులకు దేవత
సర్వమంగళా - శుక్ల త్రయోదశి, బహుళ తదియ తిధులకు దేవత
జ్వాలామాలినీ - శుక్ల చతుర్దశి, బహుళ విదియ తిధులకు దేవత
చిత్రా - పూర్ణిమ, బహుళ పాడ్యమి తిధులకు దేవత

పై విధంగా ఒక్కోదేవతకు రెండు తిధులు ఉంటాయి. ఈ నేపథ్యంలో మహతీ యోగ సందర్భంగా ఈ ఆశ్వయిజ అమావాస్య దీపావళి రోజున మరియు రెండవ రోజు శుక్ల పాడ్యమి రోజున కామేశ్వరీ దేవతే ఉంటుంది. కనుక ఈ కామేశ్వరీ దేవతకు సంబంధించిన 16 అతిరహస్య నామాలను దిగువున ఇవ్వటమైనది. ప్రతి నామానికి ముందు ఓం అని, చివరన నమః అని కలుపుకోవాలి. ఇలా కలిపే సందర్భాలలో నామము 8 అక్షరాలు అయినప్పటికీ సంధితో ఉన్నందున 9 అక్షరాలుగా ఒక్కోసారి కనపడతాయి. కానీ అవి 8 అక్షరాలే అని గమనించాలి.



కనుక దీపావళి అమావాస్య సాయంత్ర సమయంలో కామేశ్వరీ దేవతను 16 నామాలతో ఎలా ప్రార్ధించాలి, కామేశ్వరీ దేవతా స్వరూపం ఎలా ఉంటుంది అనే వివరాలను మరికొద్ది గంటలలో వుంచబోయే తదుపరి పోస్టింగ్లో తెలియచేస్తాను. మీ బంధు, మిత్రాదులందరికీ ఈ మహతీ యోగ వివరాలను గురించి తెలియచేయండి. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Friday, October 28, 2016

కార్తీక పూర్ణిమన విజయాలను అందించే మహతీ యోగాన పెద్దజాబిలి

నారదుడి వీణ పేరు మహతి. దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. ఒక గానామృత పరీక్షలో తుంబురుడి వీణాగానంతో దేవతలు మంత్రముగ్ధులై చేష్టలుడిగి సంగీతంలో లీనమయ్యారు.  తుంబుర గానం తదుపరి నారదుడు తన మహతి వీణని  మీటుతూ గానాన్ని సాగించాడు.
నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది.
తుంబురుడి గానంతో గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి.
నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి.
ప్రకృతి అంతా జీవకళతో ఉట్టిపడసాగింది.
దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. ఇది మహతి యొక్క ప్రత్యేకత. మహతి అంటే గొప్పది అని అర్థం. స్త్రీవాచక శబ్దంగా పిలుస్తారు. అంటే చేష్టలుడిగిన స్థితి నుంచి సహజ స్థితిలోకి తీసుకురావటానికి, గడ్డకట్టిన సముద్రాలని సైతం కరిగించగల స్థితి మహతికి ఉన్నదంటే... మహతి యొక్క ప్రాధాన్యత ఏమిటో గోచరమవుతుంది.

ఇక అసలు వివరాలలోకి వద్దాం. అతి గొప్పదైన, విశేషమైన విజయాలను అందించే దేవతలను అనుగ్రహించే విధంగా చేయగల అద్భుత యోగం ఒకటి నవంబర్ నెలలో రానున్నది. అదే మహతి యోగం.  ఇది  2016 నవంబర్ 14 కార్తీక పూర్ణిమ సోమవారం నాడు మహతి యోగ సమయంలో సాధారణ స్థాయి కంటే అత్యధిక స్థాయిలో పున్నమి చంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. విశాఖ నక్షత్రంలో సూర్యుడు ఉండి, కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్న సమయంలో కార్తీక పూర్ణిమని మహతి యోగం అంటారు. 

అయితే ఈ మహతి యోగంలో కనపడే అతి పెద్ద జాబిలి ప్రభావముచే... సరియైన పద్దతిలో స్త్రీ దేవతామూర్తుల మనస్సులను కరిగించి, విజయమనే అనుగ్రహం పొందుటకు తోడ్పడేదే మహతి యోగ  సమయము. కనుక ఇట్టి యోగాన్ని పొందాలంటే దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు నిత్యం రాత్రి సమయాలలో దీపారాధనతో పొందవచ్చుఁ . అవకాశం లేనివారు నవంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజులు సాయంత్ర సమయాలలో దీపారాధనతో జగన్మాత అనుగ్రహానికి పాత్రులుకండి.

ఈ పరంపరలో దీపావళి రోజు (అక్టోబర్ 30) నుంచి ప్రారంభిస్తే 16వ రోజే మహతి యోగ పెద్ద జాబిలి (సూపర్ మూన్) దర్శనం. తిరిగి కార్తీక పున్నమి (నవంబర్ 14) నుంచి మొదలుపెడితే 16వ రోజు కార్తీక అమావాస్య (నవంబర్ 29) వస్తుంది. దీపావళి నుంచి మొదలుపెట్టి  కార్తీక అమావాస్య వరకు , రోజుకి 16 నామాల చొప్పున లలితా సహస్రనామాలతో  ప్రదోషకాలంలో దీపారాధన చేసి ప్రార్ధించి ప్రక్రియను ఆచరించేది. ఇక ఈ ప్రక్రియ ఎలా ఆచరించాలి, ఏ సమయంలో ఆచరించాలి మొదలైన విషయాలను అన్నింటిని వెంట వెంటనే ఇచ్చే పోస్టింగులలో తెలియచేస్తాను . దీనితో పాటు యూట్యూబ్ లింక్ లను కూడా ఇస్తాను. కనుక వాటిని చదివి మీ బంధు మిత్రాదులకు తెలియచేయండి.

ఇక ముఖ్యంగా దీపావళి పర్వదినాన లక్ష్మీ పూజను ఏ ఏ సమయాలలో ఆచరించాలో తెలుసుకుందాం. భారతదేశంతో పాటు అమెరికా, లండన్, సిడ్నీ, సింగపూర్ ప్రాంతాలలో లక్ష్మీ పూజ ఆచరించుటకు శాస్త్రీయమైన సమయాలను క్రింది వీడియో ద్వారా తెలుసుకోవచ్చును.

గమనిక - ఈ వీడియోలోని స్క్రోలింగ్ మ్యాటర్లో... దీపావళి, ధన త్రయోదశి పర్వదిన ఆచరణ తేదీలలో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, ఫ్లోరిడా, టెక్సాస్, డల్లాస్, అట్లాంటా, చికాగో, వర్జీనియాలకు 29 శనివారం అని టైపింగ్ బదులుగా, 29 ఆదివారము అని పొరపాటున స్క్రోలింగ్లో ఉన్నది. కనుక 29 శనివారంగా సరిచూసుకొనవలసినదిగా కోరుతున్నాను. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ


Monday, September 5, 2016

ద్వాదశ రాశుల వారికి కుజ శనుల సంఘర్షణలో జాగ్రత్త సమయాలు

శని, కుజుల సంఘర్షణ ప్రభావముచే ఆగష్టు 24 నుంచి అక్టోబర్ 11 వ తేదీ వరకు గల 50 రోజుల కాలంలో గల ఈ క్రింది తేదీలలో ద్వాదశ రాశుల వారు
తగు జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. ఈ పై సమయాలు భారత కాలమానం అనుసరించి నిర్ణయించినవి. ఇతర దేశాలలో ఉండే వారు వారి వారి ప్రాంతీయ సమయాలకు మార్చుకొనేది.


మేషరాశి జాతకులు క్రింది సమయాలలో ఆర్ధిక, కుటుంబ, సంతాన అంశాలతో పాటు, ప్రయాణ విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.
అశ్విని జాతకులకు -
September 6th 10.38pm to 10th 6.52am,
September 16th 7.39am to 17th 5.39am,
September 24th 2.43pm to 25th 2.37pm,
October 4th 5.42am to 7th 2.26pm


భరణి నక్షత్ర జాతకులకు -
September 7th 12.08pm to 10th 6.52am,
September 17th 5.39am to 18th 3.22am,
September 25th 2.37pm to 26th 3.04pm,
October 4th 7.12pm to 7th 2.26pm 


కృత్తిక 1వ పాద జాతకులకు -
September 7th 12.08pm to 10th 6.52am,
September 18th 3.22am to 19th 00.55am
September 26th 3.04pm to 27th 4.00pm
October 4th 7.12pm to 7th 2.26pm


వృషభరాశి జాతకులు క్రింది సమయాలలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వాహన అంశాలతో పాటు ఇవ్వవలసిన బాకీలు, రావలసిన బాకీలతో పాటు శత్రు, మిత్రత్వాలు గమనిస్తూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి.
కృత్తిక 2,3,4 పాదాల జాతకులకు -
September 9th 4.26am to 12th 4.03pm
September 18th 3.22am to 19th 00.55am
September 26th 3.04pm to 27th 4.00pm
October 6th 11.41am to 10th 00.50am 


రోహిణి నక్షత్ర జాతకులకు -
September 10th 6.52am to 12th 4.03pm
September 19th 00.55 am to 19th 10.29pm
September 27th 4.00pm to 28th 5.25pm
October 7th 2.26pm to 10th 00.50am


మృగశిర 1,2 పాద జాతకులకు -
September 10th 6.52am to 12th 4.03pm
September 19th 10.29pm to 20th 8.11pm
September 28th 5.25pm to 29th 7.15pm
October 7th 2.26pm to 10th 00.50am


మిధునరాశి జాతకులు క్రింది సమయాలలో సోదర, సోదరి అంశాలలోను, రుణ, అనారోగ్య, శత్రుత్వ అంశాలలోను తగు తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి.

మృగశిర 3,4 పాదాల జాతకులకు -
September 11th 8.45am to 14th 9.39pm
September 19th 10.29pm to 20th 8.11pm
September 28th 5.25pm to 29th 7.15pm
October 8th 4.47pm to 12th 7.46am


ఆరుద్ర నక్షత్ర జాతకులకు -
September 12th 9.56am to 14th 9.39pm
September 20th 8.11pm to 21st 6.10pm
September 29th 7.15pm to 30th 9.27pm
October 9th 6.34pm to 12th 7.46am


పునర్వసు 1,2,3 పాదాల జాతకులకు -
September 12th 4.03pm to 14th 9.39pm
September 21st 6.10pm to 22nd 4.32pm
September 30th 9.27pm to October 1st 11.58pm
October 10th 00.50am to 12th 7.46am


కర్కాటకరాశి జాతకులు క్రింది సమయాలలో కుటుంబములో ముఖ్యముగా సంతాన విషయంలోనూ, మరియు లబ్ది పొందే విషయాలన్నింటిపైననూ జాగ్రత్తలు తీసుకుంటూ వాజీధోరణిని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి . నేత్ర విషయాలలో సమస్య వస్తే వైద్యున్ని తక్షణమే సంప్రదించేది.

పునర్వసు 4వ పాద జాతకులకు -
September 13th 10.24am to 17th 00.09pm
September 21st 6.10pm to 22nd 4.32pm
September 30th 9.27pm to October 1st 11.58pm
October 10th 7.40pm to 11th 8.00pm


పుష్యమి నక్షత్ర జాతకులకు -
September 14th 10.08am to 17th 00.09am
September 22nd 4.32pm to 23rd 3.22pm
October 1st 11.58pm to 3rd 2.45am


ఆశ్లేష నక్షత్ర జాతకులకు -
September 5th 7.40pm to 6th 10.38pm
September 14th 9.39pm to 17th 00.09am
September 23rd 3.22pm to 24th 2.43pm
October 3rd 2.45am to 4th 5.42am


సింహరాశి జాతకులు క్రింది సమయాలలో విద్యా, ఉద్యోగ, ఆరోగ్య, కెరీర్ అంశాలతో పాటు నిత్య దైనందిన కార్యక్రమాలలోను మరియు మానసిక, శారీరక అంశాలలోను తగు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

మఖ నక్షత్ర జాతకులకు -
September 6th 10.38pm to 8th 1.38am
September 16th 7.39am to 19th 00.55am
September 24th 2.43pm to 25th 2.37pm
October 4th 5.42am to 5th 8.43am


పుబ్బ నక్షత్ర జాతకులకు -
September 8th 1.38am to 9th 4.26am
September 17th 00.09am to 19th 00.55am
September 25th 2.37pm to 26th 3.04pm
October 5th 8.43am to 6th 11.41pm


ఉత్తర 1వ పాద నక్షత్ర జాతకులకు -
September 9th 4.26am to 10th 6.52am
September 17th 00.09am to 19th 00.55am
September 26th 3.04pm to 27th 4.00pm
October 6th 11.41pm to 7th 2.26pm


కన్యారాశి జాతకులు క్రింది సమయాలలో సోదర, సోదరీల మధ్య వ్యవహారాలలోను, ఇచ్చిపుచ్చుకోవటాలలోను, మాట్లాడే విషయాలలోనూ, ఖర్చు సంబంధమైన వ్యవహారాలలోను జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఉత్తర నక్షత్ర 2,3,4 పాదాల జాతకులకు -
September 9th 4.26am to 10th 6.52am
September 18th 3.22am to 21st 1.40am
September 26th 3.04pm to 27th 4.00pm
October 6th 11.41pm to 7th 2.26pm


హస్త నక్షత్ర జాతకులకు -
September 10th 6.52am to 11th 8.45am
September 19th 00.55am to 21st 1.40am
September 27th 4.00pm to 28th 5.25pm
October 7th 2.26pm to 8th 4.47pm


చిత్ర నక్షత్ర 1,2 పాదాల జాతకులకు -
September 11th 8.45am to 12th 9.56am
September 19th 00.55am to 21st 1.40am
September 28th 5.25pm to 29th 7.15pm
October 8th 4.47pm to 9th 6.34pm


తులారాశి జాతకులు క్రింది సమయాలలో ఆర్ధిక, కుటుంబ, వాక్ స్థాన మరియు నిత్య జీవితంలో ఆచరించే ప్రతి అంశాలకు సంబంధించిన విషయాలలో తగు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

చిత్ర నక్షత్ర 3,4 పాదాల జాతకులకు -
September 11th 8.45am to 12th 9.56am
September 19th 10.29pm to 23rd 3.57am
September 28th 5.25pm to 29th 7.15pm
October 8th 4.47pm to 9th 6.34pm


స్వాతి నక్షత్ర జాతకులకు -
September 12th 9.56am to 13th 10.24am
September 20th 8.11pm to 23rd 3.57am
September 29th 7.15pm to 30th 9.27pm
October 9th 6.34pm to 10th 7.40pm


విశాఖ నక్షత్ర 1,2,3 పాదాల జాతకులకు -
September 13th 10.24am to 14th 10.08am
September 21st 1.40am to 23rd 3.57am
September 30th 9.27pm to October 1st 11.58pm
October 10th 7.40pm to 11th 8.00pm 


వృశ్చికరాశి వారికి క్రింది సమయాలలో మానసిక, శారీరక సంఘర్షణలతో పాటు సూర్యోదయం నుంచి నిద్రించే వరకు చేసే ప్రతి వ్యవహార సరళిలోను ఆచితూచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబ వ్యవహారాలలో ముఖ్యంగా దంపతుల మధ్య ఘర్షణ వైఖరి లేకుండా చేసుకొనుట ఎంతో శుభప్రదమని గమనించాలి.

విశాఖ నక్షత్ర 4వ పాద జాతకులకు -
September 13th 10.24am to 14th 10.08am
September 21st 6.10pm to 25th 8.38am
September 30th 9.27pm to October 1st 11.58pm
October 10th 7.40pm to 11th 8.00pm


అనూరాధ నక్షత్ర జాతకులకు -
September 14th 10.08am to 15th 9.10am
September 22nd 4.32pm to 25th 8.38am
October 1st 11.58pm to 3rd 2.45am


జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు -
September 5th 7.40pm to 6th 10.38pm
September 15th 9.10am to 16th 7.39am
September 23rd 3.57am to 25th 8.38am
October 3rd 2.45am to 4th 5.42am


ధనుస్సు రాశి వారు క్రింది సమయాలలో తండ్రి సంబంధించిన అంశాలన్నింటిలోను, సరియైన అవగాహన ఉండాలి. దీనితో పాటు మిత్ర, శతృత్వాలను గమనిస్తూ అనవసర ఖర్చును తగ్గిస్తూ ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఆర్ధికంగా ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలయందు అధిక దృష్టి ఉంచాలి. వాహన ప్రయాణాలలోను, చోదకములో కూడా జాగ్రత్త అవసరము. 

మూల నక్షత్ర జాతకులకు -
September 6th 10.38pm to 8th 1.38am
September 16th 7.39am to 17th 5.39am
September 24th 2.43pm to 27th 4.00pm
October 4th 5.42am to 5th 8.43am


పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు -
September 8th 1.38am to 9th 4.26am
September 17th 5.39am to 18th 3.22am
September 25th 8.38am to 27th 4.00pm
October 5th 8.43am to 6th 11.41am


ఉత్తరాషాఢ నక్షత్ర 1వ పాద జాతకులకు -
September 9th 4.26am to 10th 6.52am
September 18th 3.22am to 19th 00.55am
September 25th 8.38am to 27th 4.00pm
October 6th 11.41am to 7th 2.26pm


మకరరాశి వారు క్రింది సమయాలలో సూర్యోదయం నుంచి రాత్రి నిద్రించేవరకు చేసే అన్ని వ్యవహారాలలో అనగా లబ్ది వచ్చే అంశాలలో అత్యధిక జాగ్రత్తలు తీసుకొనాలి. అంతేకాక సంతాన అంశాలపైనా కూడా కొంత దృష్టి ఉంచాలి. దీనితో పాటు ఆరోగ్య విషయాలలో వైద్యులు చెప్పిన నిర్ణయాలని పాటిస్తూ ప్రయాణాలలోను, వాహన చోదకములో కూడా అప్రమత్తత అవసరము. 

ఉత్తరాషాఢ నక్షత్ర 2,3,4 పాదాల జాతకులకు -
September 9th 4.26am to 10th 6.52am
September 18th 3.22am to 19th 00.55am
September 26th 3.04pm to 30th 1.48am
October 6th 11.41am to 7th 2.26pm


శ్రవణా నక్షత్ర జాతకులకు -
September 10th 6.52am to 11th 8.45am
September 19th 00.55am to 10.29pm
September 27th 4.00pm to 30th 1.48am
October 7th 2.26pm to 8th 4.47pm 


ధనిష్ఠ నక్షత్ర 1,2 పాద జాతకులకు -
September 11th 8.45am to 12th 9.56am
September 19th 10.29pm to 20th 8.11pm
September 27th 4.00pm to 30th 1.48am
October 8th 4.47pm to 9th 6.34pm


 కుంభరాశి వారు క్రింది సమయాలలో జీవన గమనంలో పాలనా సంబంధిత అంశాలలో అత్యంత జాగ్రత్త అవసరము. అంతేకాక దంపతుల మధ్య తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సహనం అవసరము. అంతేకాక ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వాహన విషయాలలో అప్రమత్తత కూడా అవసరము. 

ధనిష్ఠ నక్షత్ర 3,4 పాద జాతకులకు -
September 11th 8.45am to 12th 9.56am
September 19th 10.29pm to 20th 8.11pm
September 28th 5.25pm to October 2nd 1.21pm
October 8th 4.47pm to 9th 6.34pm


శతభిషం నక్షత్ర జాతకులకు -
September 12th 9.56am to 13th 10.24am
September 20th 8.11pm to 21st 6.10pm
September 29th 7.15pm to October 2nd 1.21pm
October 9th 6.34pm to 10th 7.40pm


పూర్వాభాద్ర 1,2,3 పాద జాతకులకు -
September 13th 10.24am to 14th 10.08am
September 21st 6.10pm to 22nd 4.32pm
September 30th 1.48am to October 2nd 1.21pm
October 10th 7.40pm to 11th 8.00pm


మీనరాశి వారు క్రింది సమయాలలో దీర్ఘ కాలంగా అనారోగ్యం ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇవ్వవలసిన బాకీలు, రావలసిన బాకీల అంశాలలో అప్రమత్తతంగా ఉండాలి. శత్రువులను గమనించి మెలుగుతుండాలి. ప్రయాణాలలో వాహన వేగం శృతి మించవద్దు, పితృ నిర్ణయాలలో మరియు సోదర సోదరీ అంశాలలోను ఆచితూచి అడుగులు వేయాలి. 

పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాద జాతకులకు -
September 3rd 2.27pm to 7th 6.53pm
September 13th 10.24am to 14th 10.08am
September 21st 6.10pm to 22nd 4.32pm
September 30th 9.27pm to 5th 1.57am
October 10th 7.40pm to 11th 8.00pm


ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు -
September 4th 4.54pm to 7th 6.53pm
September 14th 10.08am to 15th 9.10am
September 22nd 4.32pm to 23rd 3.22pm
October 1st 11.58pm to 5th 1.57am


రేవతి నక్షత్ర జాతకులకు -
September 5th 6.17am to 7th 6.53pm
September 15th 9.10am to 16th 7.39am
September 23rd 3.22pm to 24th 2.43pm
October 2nd 1.21pm to 5th 1.57am

Sunday, August 21, 2016

శని, కుజ సంఘర్షణ ఉపశాంతికై శ్రీ లలితా సహస్రంలోని షోడశ "రకార" నామాలు

వ్యాస మునీంద్రులు రచించిన 18 పురాణాలలో మార్కండేయ మహా పురాణం ఒకటి. దీనిలోని 13 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. శ్రీ దేవి మహాత్య్మము గురించి ఈ పురాణంలో సవివరంగా తెలియచేయబడింది.  మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో..
"సావర్ణిః సూర్యతనయో యో మనుః కథ్యతే అష్టమః" అనగా 8వ మనువుగా చెప్పబడే సూర్య భగవానుడి పుత్రుడైన సావర్ణి గురించి అని భావము. కానీ మంత్రం శాస్త్ర ప్రకారం పై పదాలకు అర్ధం ఏమనగా..  ఈంకార, రకార, హకారములతో కలిసిన హ్రీం కారమనే బీజాక్షరము మొదటి శ్లోకంలో వస్తుంది. ఈ విధంగా దుర్గా సప్తశతిలో 700 శ్లోకాలకు, శ్రీదేవికి సంబందించిన బీజములు మంత్రశాస్త్ర ప్రకారం ఉండును. ఈ హ్రీం అనే బీజములో రకారము అగ్ని బీజము. ఈ బీజాక్షరము చాలా విశేషవంతమైనది. కనుకనే ఈ రకారముతో కలిసిన నామాలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మనం గమనించవచ్చు.

71వ శ్లోకం - రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా ||

72 వ శ్లోకం - రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా ||


పై రెండూ శ్లోకాలలో మొత్తం 16 నామాలు ఉన్నాయి. ఈ 16 నామాలకి ప్రధమాక్షరము ర. మంత్రం శాస్త్రం ప్రకారం "ర" అనేది అగ్ని బీజము. ఈ ర కారముతో మొదలైన షోడశ నామాలు మహా తేజోవాచకములు. శని గ్రహ, కుజ గ్రహ సంఘర్షణ అగ్నితోనే ప్రారంభమవుతుంది. అంతేకాక ఖగోళంలో సెప్టెంబర్ 1 నాడు సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణంపైన శని దృష్టి ఏర్పడింది. అక్కడ గ్రహణం ఏర్పడేది కూడా అగ్ని సంబంధిత సూర్యునికే .

305వ నామం - ఓం రాజరాజార్చితాయై నమః
306వ నామం - ఓం రాఙ్ఞై నమః
307వ నామం - ఓం రమ్యాయై నమః
308వ నామం - ఓం రాజీవలోచనాయై నమః
309వ నామం - ఓం రంజన్యై నమః
310వ నామం - ఓం రమణ్యై నమః
311వ నామం -  ఓం రస్యాయై నమః
312వ నామం -  ఓం రణత్కింకిణిమేఖలాయై నమః
313వ నామం - ఓం రమాయై నమః
314వ నామం -  ఓం రాకేందువదనాయై నమః
315వ నామం - ఓం రతిరూపాయై నమః
316వ నామం - ఓం రతిప్రియాయై నమః
317వ నామం - ఓం రక్షాకర్యై నమః
318వ నామం - ఓం రాక్షసఘ్న్యై నమః
319వ నామం - ఓం రామాయై నమః
320వ నామం - ఓం రమణలంపటాయై నమః

ఈ తేజోవాచకములైన రకారము ద్వారా పరాశక్తి యొక్క ఆవిష్కరణ జరుగును. హ్రీం కారములో కూడా అగ్ని బీజమైన అట్టి "ర" కారమున్నది. ఆ చైతన్యమే చిదగ్ని అని చెప్పబడింది. దానికి సంకేతమే ఈ రకారము. రాజరాజార్చితా అనగా రాజులచేత అర్చింపబడినదని భావము. రాజులకు కూడా రాజులు అనగా ఆ పాలకులకు కూడా పాలకులైన వారిచే పూజింపబడినదని భావము. "శ్రీ మంత్రరాజా రాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ, హ్రీంబీజ జపసంతుష్టా" అంటూ పరాశక్తిని స్తుతించారు.

"రమతే యోగినో లలితే సత్యానంద చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మా విధీయతే"  అనునది ఉపనిషత్ వాక్యము. అనగా యోగులందరుకు పరమ యోగ్యమైన కైవల్యము ద్వారా ఆనందమును ప్రసాదించుచున్న పరమాత్మయే రామచంద్ర వాక్యము. అదే మంత్రం స్వరూపముగా 319వ నామమైన రామా అయినది. సర్వ స్త్రీ శక్తి అమ్మ యొక్క స్వరూపమని తెలుసుకోవాలి. ఇది మన భారతీయ సంస్కృతీ. శాక్తేయం పేరుతో మాతృ స్వరూపముగా అత్యుత్తమముగా ఆరాధించు పరబ్రహ్మ చైతన్యమే స్త్రీ శక్తిగా చెప్పబడింది.  కనుక ఇట్టి చిదగ్ని మయమైన అమ్మవారి తత్వమును పై రెండు శ్లోకములలో షోడశ "రకార" నామ పరంపరలో చెప్పబడినది.

దివ్యమైన, నిర్మలమైన, నిరంజనమైన, నిర్వికారమైన, సత్య శివ సచ్చితానంద సౌందర్యమే తల్లి స్వరూపము. కనుక శాశ్వతమైన సుఖమునిచ్చే ఈ రకారముతో కూడిన 16 నామములను ఆపత్కల్పము అంటారు. సమస్త ఆపదలను, విపత్తులను తొలగించి శక్తి కల్గిన కల్ప శాస్త్రము. కనుక నామములుగా గానీ లేక శ్లోకములు గాని భక్తి విశ్వాసాలతో ఉచ్ఛరించు వారలు ఖగోళంలో ఏర్పడే శని గ్రహ, కుజ గ్రహ సంఘర్షణ పూరిత ఆపత్తుల నుంచి విముక్తులగుటకు అవకాశములు ఏర్పడును.

కనుక ద్వాదశ రాశుల వారు ఖాళీ సమయాలలో పై రెండు శ్లోకములు కానీ లేదా లలితా సహస్ర నామావళిలోని 305 నుంచి 320 వరకు గల 16 నామాలను అక్టోబర్ 11 వరకు మననం చేస్తుండేది.

గమనిక 1 - పైన చెప్పిన 50 రోజులలో ద్వాదశ రాశుల వారు ఏయే సమయాలలో ఏయే అంశాలలో తగు తగు జాగ్రత్తలు తీసుకొనవలయునో తదుపరి పోస్టింగ్ లో చెప్పబడును.
గమనిక 2 - జాతకాలలో శని, కుజుల సంఘర్షణ ఉన్నటువంటి వారు కూడా ప్రతి మంగళ, శుక్ర శని వారాలలో అవకాశమున్నప్పుడల్లా మానసికంగా పై పదహారు నామాలను విశ్వాసంతో మననం చేసుకొనటం సర్వ విధాలా శుభకరం.

- దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

Thursday, August 18, 2016

ద్వాదశ రాశులపై శని కుజుల సంఘర్షణ ప్రభావం

ఈ 2016వ సంవత్సరం వృశ్చికరాశిలో శని గ్రహం ప్రారంభం నుంచే ఉన్నాడు. జ్యోతిష రీత్యా వృశ్చికరాశి అనేది కుజుని యొక్క సొంత ఇల్లు. కుజ గ్రహము తన స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలోకి 2016 ఫిబ్రవరి 20 శనివారం సాయంత్రం 4 గం.42 నిముషాలకు ప్రవేశించాడు. అనగా వృశ్చిక రాశిలో శని, కుజులు ఇరువురు ఉన్నారని భావము.

శని గ్రహము మార్చి 25 శుక్రవారం మధ్యాహ్నం 3 గం. 45 నిముషాలకి వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్ర 2వ పాదం నుంచి వక్రం ప్రారంభించాడు. అప్పటికే కుజుడు అనురాధ నక్షత్ర 3వ పాదంలో సంచారంలో ఉన్నాడు. శని గ్రహ వక్రం ప్రారంభమైన తదుపరి 2016 ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5 గం.47 నిముషాలకు కుజుడు కూడా వక్ర స్థితిలోనికి రావటం మొదలైనది. శని, కుజులిరువురు బద్ధ శత్రువులై వృశ్చిక రాశిలోనే వెనుకకు నడవటం జరుగుతున్నది.

ఈ వక్ర నడకతో జూన్ 17 శుక్రవారం రాత్రి 11గం. 45 నిముషాలకు తులారాశిలోనికి కుజుడు రావటం జరిగింది. అంటే 2 గ్రహాలూ వక్రంతో ఉన్నప్పటికీ వేరు వేరు రాశులలో ఉండటం జూన్ 17 నుంచి జరిగిందని భావము. జూన్ 29 బుధవారం రాత్రి 10 గం. 57 నిముషాలకు కుజగ్రహం వక్ర స్థితి నుంచి ఋజు మార్గంలోకి ప్రవేశించాడు.

జూలై  12 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2గం. 19 నిముషాలకి తిరిగి వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న శని గ్రహం ఆ సమయానికి అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తూ ఆగష్టు 2వ తేదీ మధ్యాహ్నం 11 గం.10 నిముషాలకి వక్ర స్థితి నుంచి బయటకి వచ్చాడు. ఆ సమయానికి అనూరాధ నక్షత్రంలోనే కుజ గ్రహం ఉండటం జరిగింది. అంటే శని మరియు కుజ గ్రహాలూ రెండూను అనురాధ నక్షత్రంలోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి.

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, అనూరాధ నక్షత్రానికి అధిపతి శని. కనుక ఈ ఇరువురూ కలిసి ప్రయాణం చేస్తూ ఆగష్టు 24 వ తేదీన ఒకే బిందువులో కలవటం జరిగింది. ఈ కలయికనే కుజ, శనుల సంఘర్షణ అంటారు. దీని ప్రభావం కలయిక ముందు కంటే కూడా కలయిక జరిగిన తదుపరి దాదాపు 4 మాసాల వరకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రం తెలియచేస్తుంది.

ప్రతి సంవత్సరం ఎదో ఒక రాశిలో ఈ రెండు గ్రహాలూ కలుస్తుంటాయి. కలిసే స్థితిని బట్టి, ఆ సమయానికి ఉన్న ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు ఒక్కోసారి అనుకూలంగాను, ఒక్కోసారి ప్రతికూలంగాను ఉంటుంటాయి. తులా, వృశ్చిక రాశులలో ఈ రెండు గ్రహాలూ కలిసిన సందర్భాలలో ప్రభావం దేశం మీదే కాకుండా ప్రపంచం మీద కూడా వ్యతిరేక ఫలితాలు చూపటానికి అవకాశములుండును.

1984లో ఈ రెండు గ్రహాలూ తులా రాశిలో కలిసినప్పుడు ఆనాడు ఉన్న ఇతర గ్రహ స్థితులను బట్టి విశ్లేషిస్తే ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం అధికంగా కనిపించింది. 1984 లో కలవటానికి కొద్దిరోజుల ముందు పంజాబ్ బంగారు దేవాలయంలో ఉగ్రవాదుల కాల్పులు, కలిసిన తదుపరి ఆనాటి ప్రధాని శ్రీమతి  ఇందిరాగాంధీపై  సెక్యూరిటీ గార్డ్ లే  కాల్పులు జరపటం, ఆ తర్వాత భోపాల్ గ్యాస్ పేలుడు జరగటం, దీనితో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో యుద్ధ వాతావరణం అలుముకోవటం జరిగింది.

శని, కుజ గ్రహాల కలయిక జరిగితే ప్రభావం ఎక్కువగా మారణకాండ, కాల్పులు, యుద్ధ భయ వాతావరణం, హింసాత్మక చర్యలు, అగ్ని సంబంధిత ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, రాజకీయ నేతలపై హత్యా ప్రయత్నాలే కాక ఇతర ప్రకృతి సంబంధమైన అగ్ని పర్వతాలు ప్రేలి లావా రావటము, పిడుగు పాట్లు  మొదలైనవి జరుగుతుండును. వ్యక్తుల మధ్య హింసాత్మక దుశ్చర్యలు అధికంగా ఉండే అవకాశాలు ఉండును.

ఈ పరంపరలో 2016 ఆగష్టు 24న జరిగే కుజ గ్రహ, శని గ్రహ ప్రభావం, అప్పటినుంచి తదుపరి నాలుగు మాసాల వరకు ఉన్నప్పటికీ అధికప్రభావం ఆగష్టు 23 నుంచి 50 రోజుల పాటు మాత్రం కొంత ఎక్కువగా ఉండును. ఎందుకంటే కుజ, శనుల సంఘర్షణ జరిగిన 250 గంటలలోపే సూర్య గ్రహణ బిందువుపై శని యొక్క దృష్టి కూడా పడుతున్నది. అందుచేతనే శని, కుజుల సంఘర్షణ ప్రభావం ఆగష్టు 23 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు (50 రోజుల పాటు) అల్జీరియా, మొరాకో, బ్రెజిల్, వాషింగ్టన్, దుబాయ్, ఇండోనేషియా, సూరత్, మధ్యప్రదేశ్, మలేసియా, పోలాండ్, ఐర్లాండ్, ఇరాన్, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, ఉక్రెయిన్, చైనా, కాలిఫోర్నియా, జపాన్, జార్జియా, టాంజానియా, హిందూకుష్ పర్వతాలు మొదలైన చోట్ల భారీ భూకంప సూచనలతో పాటు హిందూ మహా సముద్రం మరియు సుమత్రా దీవులలో సునామీ అవకాశాలు ఉన్నవి. ఇవి ప్రకృతి సంబంధితములు.

అంతేకాక ఇజ్రాయిల్, పారిస్, రష్యా, టర్కీ, ఉక్రెయిన్, సిరియా, నార్త్ కొరియా, చైనా, యు.యస్.ఏ, సౌదీ అరేబియా, పాలస్తీనా దేశాలలో అధిక తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని ప్రాంతాలలో యుద్ధాలకు కాలు దువ్వే విధంగా ప్రభుత్వాలు మరియు రాజకీయ సంక్షోభాలు ఉండును. అలాగే భారతదేశంలో కాశ్మీర్ మరియు ఇతర కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని చోట్ల రాజకీయ సంక్షోభాలతో పాటు కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులకు సమస్యలున్నవని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పవచ్చును.

మేషరాశివారు సంతాన విషయాలలోనూ, ప్రయాణ విషయాలలోనూ... వృషభ రాశివారు వృత్తి, ఆరోగ్య, వ్యాపార, విద్య, ఉద్యోగ, వాహన, గృహ, దాంపత్య విషయాలలోనూ ... మిధున రాశివారు సోదర, సోదరి, రుణ, అనారోగ్య, శత్రు అంశాలలోను... కర్కాటక రాశివారు సంతాన మరియు ధన, కుటుంబ, వాక్ స్థాన విషయాలపైనా అధికంగా దృష్టి ఉంచుతూ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

సింహరాశి వారు ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వాహన, తల్లి, గృహ, మానసిక, శారీరక అంశాలపైననూ.. కన్యా రాశివారు సోదర, సోదరీ మరియు ఖర్చు విషయాల పైనను జాగ్రత్తగా దృష్టిని పెట్టాలి... తులారాశి జాతకులు లాభ సంబంధిత అంశాల పైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆర్ధిక వాక్ స్థాన, కుటుంబ వ్యవహారాలలో అధిక దృష్టిని ఉంచాలి.. వృశ్చిక రాశి జాతకులు తమ మానసిక, శారీరక, అంశాల పైన అధిక దృష్టిని ఉంచుతూ తాము ఆలోచన చేసే అంశాలను సరియైనవా కాదా అనే భావంతో ఉంటూ తమ తమ నిత్యా జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి అంశం పైన సునిశితమైన దృష్టిని ఉంచి ప్రణాళికా బద్ధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనూ రాశి జాతకులు అనవసర ఖర్చు విషయంలోనూ మరియు పితృ సంబంధ విషయాలపైనా దృష్టి ఉంచి సమస్యలు రాకుండా పావులు కదుపుకోవాలి .... అలాగే మకరరాశి జాతకులు లాభ సంబంధ వ్యవహారాలన్నిటిపై తగిన శ్రద్ధను ఉంచుతూ వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులతో దురుసుగా వ్యవహరించకూడదు.

ఇక కుంభ రాశి జాతకుల విషయంలో నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశంలోనూ అత్యధిక శ్రద్ధను చూపుతూ ఉండాలి. దీనితో పాటు భార్య భర్తల మధ్య ఏదైనా చాప క్రింద నీరులా ప్రవేశించకుండా ఆలోచన చేస్తూ ఉండాలి... చివరగా ఉన్న మీనరాశి జాతకుల విషయంలో అనారోగ్య, శత్రు, వాహన చోదక మరియు ప్రయాణ విషయాలతో పాటు, పితృ సంబంధమైన అంశాల మీద కూడా దృష్టిని కేంద్రీకరించాలి .

మొత్తం మీద శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని  ఏ భాగం ద్వారా ద్వాదశ రాశుల వారు ఉపశాంతి మార్గం పొందగలరో తెలియచేసే అంశాలను తదుపరి పోస్టింగ్లో ఉంచగలను.

Monday, August 15, 2016

గ్రహ సంఘర్షణ ప్రభావాలు 50 రోజులా?

ఖగోళంలో పరస్పర వైరమున్న కుజ గ్రహము మరియు శని గ్రహము 2016 ఆగష్టు 24వ తేదీన ఒకే డిగ్రీలోకి రావటం జరగనుంది. దీని ప్రభావం వలన ఆగష్టు 23 నుంచి అక్టోబర్ 10 వరకు 50 రోజుల పాటు కుజ, శని గ్రహాల సంఘర్షణ ప్రభావం ఉండును. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీనే కుజుడు శని ఉన్న వృశ్చికరాశిలోనికి ప్రవేశించినప్పటకీ వక్ర గమనం వలన తిరిగి వెనుకకు తులా రాశిలోకి రావటం జరిగింది. జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ రెండు గ్రహాల సంఘర్షణకి ముందు రోజులలోను, వెనుక రోజులలోను ప్రభావాలు ఉండునని చెప్పవచ్ఛును. 1984లో శని, కుజులు ఇరువురు తులా రాశిలో కలవటం, దాని ప్రభావముచే కలయిక ముందు వెనుకలలో భారతదేశంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.  పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్ యందు ఆపరేషన్ బ్లూస్టార్ ద్వారా కాల్పులు, భోపాల్ లో గ్యాస్ పేలుడు, ఆనాటి ప్రధానమంత్రి  అంగరక్షకులు కాల్పులు చేయటం వంటివాటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడా పలు పరిణామాలు చోటు చేసుకున్నట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి. మరి ఈ 2016లోని శని, కుజుల సంఘర్షణ ప్రభావం ఆగష్టు 23 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు (50 రోజుల పాటు) ఉంటుంది.

ఈ ప్రభావముచే అల్జీరియా, మొరాకో, బ్రెజిల్, వాషింగ్టన్, దుబాయ్, ఇండోనేషియా, సూరత్, మధ్యప్రదేశ్, మలేసియా, పోలాండ్, ఐర్లాండ్, ఇరాన్, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, ఉక్రెయిన్, చైనా, కాలిఫోర్నియా, జపాన్, జార్జియా, టాంజానియా, హిందూకుష్ పర్వతాలు మొదలైన చోట్ల భారీ భూకంప సూచనలతో పాటు హిందూ మహా సముద్రం మరియు సుమత్రా దీవులలో సునామీ అవకాశాలు ఉన్నవి. ఇవి ప్రకృతి సంబంధితములు.

అంతేకాక ఇజ్రాయిల్, పారిస్, రష్యా, టర్కీ, ఉక్రెయిన్, సిరియా, నార్త్ కొరియా, చైనా, యు.యస్.ఏ, సౌదీ అరేబియా, పాలస్తీనా దేశాలలో అధిక తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని ప్రాంతాలలో యుద్ధాలకు కాలు దువ్వే విధంగా ప్రభుత్వాలు మరియు రాజకీయ సంక్షోభాలు ఉండును. అలాగే భారతదేశంలో కాశ్మీర్ మరియు ఇతర కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలతో పాటు కొన్ని చోట్ల రాజకీయ సంక్షోభాలతో పాటు కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులకు సమస్యలున్నవని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పవచ్చును.

గమనిక: పై వివరములు ఓ జ్యోతిష శాస్త్ర విశ్లేషణగా తెలియచేస్తున్నాను. ఇది ఒక జ్యోతిష అంచనా మాత్రమే. కొన్నిసార్లు రుజువు కాక పోవచ్చును కూడా. ఇది ప్రత్యేక వ్యక్తులను ఉద్దేశించి చెప్పినవి కానే కాదు, అలాగే భయం చెందే విధంగా చెప్పినవి అంతకంటే కాదు. ఉగ్రవాదం మితిమీరుతున్న ఈ రోజులలో ప్రతివారు తగు జాగ్రత్తలతో ఉండాలని చెప్పే ఒక సూచనగా మాత్రమే భావించాలని మనవి. చాప క్రింద నీరులా పాకుతున్న ఉగ్రవాదుల ఆచూకీలు ఎక్కడైనా ప్రజలు గమనించినా, అనుమానం వచ్చినా  తక్షణమే సమీప పోలీస్ శాఖ వారికి తెలియచేయవలసినదిగా మనవి.

పూర్తి వివరాలు రేపటి నుంచి grahabhumi.blogspot.com లో అందిస్తుంటాను. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Sunday, August 14, 2016

నీటిలో మునిగితే చేసిన పాపం పోయి పుణ్యం వస్తుందా ?

కశ్యప మహర్షికి ఇరువురు భార్యలు ఒకరు అదితి రెండవ వారు దితి. దితి గర్భాన్ని అదితి 7 ముక్కలు చేయించింది. (ఒక వస్తువును 7 ముక్కలు చేయాలంటే 6 సార్లు చేస్తే 7 ముక్కలవుతాయి. ఒక కర్రను 3 పర్యాయాలు నరికితే 4 ముక్కలవుతాయి.) అట్టి అదితి తదుపరి జన్మలో వసుదేవుని భార్య దేవకిగా జన్మించింది. దేవకికి గల్గిన మొదటి ఆరుగురు శిశువులను కంసుడు హతమార్చటం జరిగింది. పూర్వ జన్మలో అదితిగా ఉండి 7 ముక్కలుగా చేసినందున (6 సార్లు ఖండించినందున), తదుపరి జన్మలో తన గర్భాన జన్మించిన తొలి ఆరుగురు హతం కావటమే కర్మ సిద్ధాంతం. 

కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించి తీరాలి. కశ్యపుడి భార్య చేసిన పాపం తదుపరి జన్మలో దేవకీ ఆరుసార్లు శిక్ష అనుభవించింది. వసుదేవుని భార్య పైగా శ్రీ కృష్ణుని తల్లి అయిన దేవకికే గత జన్మ పాపం తొలగలేదు. కేవలం పాపాలు చేసి నీటిలో మునిగితే పుణ్యాలు వస్తాయనుకోవటం పొరపాటు. ఈమాట ఎందుకు చెబుతున్నానంటే 24 సంవత్సరాల క్రితం వచ్చిన గోదావరి, కృష్ణ పుష్కరాలలో మునకలు వేసిన వారు వేల సంఖ్యలో లేరు. మరి ఈ ఒక్క కృష్ణా పుష్కరాలకు 5 కోట్ల మంది మునకలేస్తారని అంచనా. మరి రాబోయే 12 సంవత్సరాలకు ఎన్ని కోట్ల మంది మునకలు వేస్తారు ? ఎన్ని వేలాది కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి ? కనీసం టెలివిజన్ కార్యక్రమాలలో చెప్పే పండితులందరూ పురాణాలు చెప్పిన విషయాల అర్ధాన్ని, పరమార్ధాన్ని విడమర్చి చెప్పాలి. అంతేతప్ప నదిలో మునిగితే చేసిన పాపం పోతుందని చెప్పటం హాస్యాస్పదం . పుష్కర స్నానం అంటే సరియైన అర్ధం చెప్పకుండా, పుణ్యం వస్తుందని ఊదర గొట్టటం సమంజసం కాదు. 

రాబోయే 12 సంవత్సరాలకు ప్రభుత్వ ఖజానా అంతా పుష్కరాలకు వెచ్చించాలి. ఇప్పటికైనా పండితులు గమనించండి. ప్రజలని చైతన్య వంతులుగా చేయటానికి కృషి చేయండి. అంతేతప్ప చేసిన పాపాలు పోతాయని చెప్పకండి. కలుషితమయ్యే నదులను ప్రక్షాళన చేయటానికే తుందిలుడు శివుని యొక్క అష్టమూర్తిత్వములో ఒకటైన జల రూప దేహాన్ని బ్రహ్మ ద్వారా స్వీకరించి పుష్కరుడుగా నీటి యందు ప్రవేశించి... జీవ నదులను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోటే బృహస్పతి రాశి ప్రవేశంతో నదులకు పుష్కరాలు వస్తుంటాయి. జీవావరణ పరిరక్షణార్థం ప్రతివారు ముందుండాలి. అంతేకాని ఇంటిల్లిపాది వెళ్లి ఆటపాటలతో మునకలు వేస్తున్నందున నది ప్రక్షాళన కాకపోగా మరింత కలుషితం అవుతూ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇప్పటికైనా ప్రజలు గమనించండి. టీవీలలో చెప్పే పండితులు ఆలకించండి. చేసిన పాపం ఈ జన్మలో లేక మరు జన్మలో అనుభవించి తీరాలి. అంతేతప్ప నీటిలో మునిగినా, దీపం వెలిగించినా పోనే పోదు. ఇదే కర్మ సిద్ధాంతం. 

పై అంశాన్ని ఫేస్ బుక్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా తెలియచేశాను. ఒకరు ఇది చదివి ఏమని స్పందించారంటే... పాపం పోనిమాట యదార్ధమే... తీర్ధ విధి, పుష్కర స్నానం పుణ్యప్రదమే కదా. ఈ పుణ్య ప్రదం అనటం ఆర్ష దృష్టే కదా అని వాట్సాప్ ద్వారా మెసెజ్ పంపారు. దానికి సమాధానంగా ... 

భారతీయ సనాతన ధర్మాలు చాలా  గొప్పవి. ఆర్ష సంస్కృతిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి యందు ఉన్నది. కానీ చేసే కార్యక్రమాలు వెర్రితలలు వేయకుండా చూడవలసిన బాధ్యత ప్రతి హిందువుపై ఉన్నదనే విషయాన్ని మరువకూడదు. ప్రస్తుతం ముద్రితమవుతున్న పురాణ గ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు కనపడుతున్నాయి. అలాగే ధర్మాన్ని పరిరక్షించవలసిన మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా వారి వారి నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ఆర్ష ధర్మం ప్రకారంగా సన్యాసం స్వీకరించిన వారు సముద్రం దాటి వెళ్లకూడదని నియమం ఉన్నది. గతంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఒకానొక అంశంలో ప్రాయశ్చిత్తం చేసుకొనవలసి వచ్చింది . మరి ఈనాడు పీఠాధిపతులుగా పేరెన్నిక గన్నవారు చేస్తున్న విదేశీ ప్రయాణాలకు అడ్డుకట్ట వేసే వారే లేరా? మరి ఆర్ష ధర్మాన్ని గురించి చెప్పవలసిన వారే ఈ విధంగా చేస్తుంటే కంచే చేను మేసినట్లు కాదా! సనాతన ధర్మాలు కానీ, పర్వదిన నియమాలు కానీ , ఇతర వ్రతాలు మొదలైన వాటిని పరిశీలిస్తే... ఇవన్నీఈ కూడా మానవాళి ఆరోగ్య శ్రేయస్సుతో  ముడిపడి ఉన్నాయనే నగ్న సత్యాన్ని తేటతెల్లం చేస్తాయి.

ప్రతిరోజు చేసే సంధ్యావందనాది సంకల్పాలలో జీవనదులు ప్రస్తావన ముడిపడి ఉంటుంది. ఆ ప్రకారంగానే ఎప్పుడైతే పుష్కరాలు జరుగుతాయో ఆ సమయంలో పుష్కర నదిని సంకల్పించుకుంటూ చేసే స్నానమే పుణ్య స్నానం. అసలు నదిని ప్రక్షాళన చేయటం కొరకుగా పుష్కర రాజు వేంచేయటం జరుగుతుంది. దీనిని ఆసరాగా తీసుకొని నదిని విపరీతంగా కలుషితం చేస్తున్నారు. రాబోయే పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల ప్రజా ధనమంతా పుష్కర ఘాట్ల ఏర్పాటుకే సరిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్న పుష్కర సరళిని గమనిస్తే... ఇప్పుడు నిర్ణయాలు చెప్పే వారే నిజమైన పండితులని, రెండు దశాబ్దాల క్రితం పండితులు లేరని, అందుకే ఆనాడు పుష్కరాలకు జన సందోహం లేరని అనుకునే వారు కూడా ఉన్నారు. ఇది పొరపాటు. ప్రతి గ్రామంలో ఓ పండితులవారు ఉంటారు. ఆ పండితులవారి చేతిలో పంచాంగము ఉంటుంది, వివరాలు ఉంటాయి. ఆ గ్రామం వరకు ఆ పండితుల వారు తెలియచేస్తారు. ఆనాడు దినపత్రికలు ఉన్నాయి, రేడియోలు ఉన్నాయి. మరి ఆనాటి పుష్కరాలకు జనసందోహం ఎందుకు రాలేదు? ... అంటే  రవాణా సౌకర్యాలు అధికంగా లేవు గనక జనసందోహం లేదని సమాధానం చెప్తారు. ఏది ఏమైనా భారతీయ సనాతన సంప్రదాయాలను సరియైన రీతిలో చెబుతూ ప్రజలకు మార్గ దర్శకులుగా ఉండాలి. అంతేతప్ప విపరీత ప్రచారాలు చేసి అనారోగ్యాలు తెప్పించే విధంగా ఉండకూడదు. టోల్ ప్లాజాల వద్ద గంటల పాటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ లు రోడ్ల మీద జరుగుతుంటే... పిల్లలు, వృద్దులు తాగటానికి నీళ్లు, తినటానికి తిండి లేక వాహనాలలో ఇబ్బందులు పడుతున్నవారు కోకొల్లలు. మరి ఈ పాపం ఎవరిది????

ఇప్పటికైనా ప్రతివారు మేల్కొనండి. ధర్మాన్ని కాపాడటానికి మార్గాలు ఎన్నో ఉంటాయి. రాబోయే సంవత్సరాలలో తెలిసీ తెలియక తప్పులు జరుగుతుంటే మూల్యం ఎవరు చెల్లించుకుంటారు. కనుక చెప్పవలసిన రీతిలో ప్రజలకు చెప్పాలి. తమ తమ స్వగృహాలలోనే ఉంటూ నదులను సంకల్పించుకుంటూ ఆయా రోజులలోనే స్నానాలు ఆచరించండి. అవే పుణ్యస్నానాలు. ప్రజలందరినీ నదులు దగ్గరికి వెళ్ళమని సలహాలు ఇవ్వకూడదు. ఉగాది పండుగ నాడే ఉగాది పచ్చడి తింటాము. అంతే కానీ శ్రీరామ నవమి రోజు ఉగాది పచ్చడి తినము.. ఇది ఎలాగో... అలాగే పుష్కరాలు వచ్చిన 12 రోజులలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ అక్కడ ఉండే జలాన్ని తీసుకొని సంకల్పిస్తే... తక్షణమే పుష్కరుడు ఆనీటి యందు ఉంటాడు. మనస్సాక్షిగా... ఆత్మసాక్షిగా చేసే సంకల్పాలకు దేవతల అనుగ్రహం ఉంటుందని ఆర్ష ధర్మం తెలియచేస్తుంది. కనుక అలాంటి సంకల్పాలకు వెళ్ళమని ప్రజలను చైతన్య పరచాలి. మన జీవ నదులను కాపాడుకోవాలి. మాటకు మాట విసురుతూ పొతే చివరలో ఆర్ష ధర్మానికి తూట్లు పడుతుంటాయి. ప్రజలకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తూ, విజయంవైపు పయనించేలా మంచి మనసును అందించేవాడే చంద్రుడు. ఈ చంద్రుడు జల రాశికి అధిపతి. కనుక మన సమీపంలో ఉన్న జలరాశులతోనే మనం విజయం సాధించేలా ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆర్ష ధర్మానికి పెద్దపీట వేసినట్లవుతుంది.

ముగింపుగా ప్రతిరాశిలోకి గ్రహ రాజైన సూర్యుడు ప్రవేశించటమే సంక్రమణం ప్రారంభమై, పితరులకు తర్పణాదులు పుణ్యకాలంలోనే ఆచరిస్తారు . అలాగే గురు గ్రహం కూడా ప్రతి రాశి ప్రవేశం కాగానే ఆ 12 రోజులు నదిని సంకల్పించుకొని చేసే స్నానాలే పుణ్య స్నానాలని అర్ధం. కనుక రాబోయే సంవత్సరాలలో శాస్త్ర అంశాలను అర్ధమయ్యే రీతిలో పండితులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. చెప్పటంలో పొరపాటు జరిగితే అవాంఛనీయ సంఘటనలు మొదలై పలు అనర్ధాలకు హేతువగుననే విషయం విస్మరించరాదు. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ