Pranati Television Youtube Channel

Saturday, March 26, 2016

నాగ బంధన నివృత్తికై ఏప్రిల్ 3న విశాఖ జిల్లాలో 2వ మహా సూర్య యాగం

శతాబ్దాల తదుపరి అరుదైన రీతిలో నాగబంధనం గురు చండాల యోగంలో జరగనుంది.  సింహరాశిలో గజరాజుపై పరివేష్టితుడైన గురు గ్రహం, మృగరాజుపై ఆశీనుడైన రాహువుచే  జూన్ 25 శనివారం సూర్యోదయానికి పూర్వము 3గంటల 34 నిముషాలకు నాగ బంధనం జరుగును. ఇది కేవలం రెండు సెకన్లు మాత్రమే బంధనం జరుగును. దీనినే నాగదోషము అని కూడా అంటారు.

2016 జనవరి 29 నుంచి ప్రారంభమై ఆగష్టు 11 వరకు గురు రాహు కలయికచే గురు చండాల యోగం జరుగును. అయితే ఈ గురు చండాల యోగం సింహరాశిలో జరుగుతున్నది కనుక, దాని అధిపతి సూర్యునికి 9 మార్చి 2016న సంపూర్ణ సూర్యగ్రహణం, తిరిగి 1 సెప్టెంబర్ 2016 న మరో సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించును.

ఈ రెండు గ్రహణాల మధ్యలో 17 ఏప్రిల్ 2016 నుంచి 17 జూన్ 2016 వరకు కుజ గ్రహం, శని గ్రహం పరస్పరం శత్రు గ్రహాలై, ఇరువురూ వెనుకకు నడవటం అనుకూల ఫలితాలను అందివ్వదు. నాగ బంధనం, గురు చండాల యోగం, తదితర వ్యతిరేక గ్రహస్థితుల ప్రభావం మానవాళిపై ఉండును. ఆర్ధిక, ఆరోగ్య, గృహ, సంతాన, కుటుంబ, దాంపత్య అంశాలపై చూపును.  కనుకనే ప్రతివారు తగు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ గ్రహభూమి బ్లాగ్‌లో ఆదివారం నాడు వెలిగించే గోధుమ పిండి దీపారాధనతో పాటు, గ్రహ సంచార స్థితి గతులు తగ్గుటకై చివరలో ఇచ్చే నంబర్లకు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చును.

కనుకనే శతాబ్దాల తర్వాత వచ్చే ఈ వ్యతిరేక గురు చండాల యోగ ప్రభావ నివృత్తికై రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగును. ఇందులో భాగంగా రెండవ యాగం విశాఖపట్టణానికి సమీపంలో జరుగును. ఆనాడు యోగి టెలివిజన్ ఛానెల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయును.

విశాఖ జిల్లా యలమంచిలికి 7 కిలోమీటర్ల దూరంలో గల శతాబ్దాల నాటి చోళ రాజులచే నిర్మితమైన పుణ్యక్షేత్రంలో ఈ రెండవ యాగం జరుగును. మైళ్ళ కొలది పాములా వ్యాపించి ఉన్న ఫణిగిరి కొండల శ్రేణువులో 5 గజముఖ శిల్ప రూపంనుంచి ధారాపాతంగా స్వచ్చమైన నీరు శతాబ్దాల నుంచి రావటం మహా విశేషం. 5 ధారలుగా నీరు వచ్చే ఈ క్షేత్రం కాలక్రమంలో పంచధార, పంచధార్లగా వ్యవహరింపబడుతున్నది. ఈ క్షేత్రంలో నిర్వహణ ఏర్పాట్లను ఆ గ్రామ మాజీ విలేజ్ ఆఫీసర్ వసంతవాడ పురుషోత్తమ రాజు (రాజబాబు) గారు పర్యవేక్షిస్తున్నారు. 

శతాబ్దాల తదుపరి అరుదైన రీతిలో నాగబంధనం గురు చండాల యోగంలో జరగనుంది. సింహరాశిలో గురు రాహు కలయిక 2016 మార్చి 29 నుంచి ప్రారంభమై ఆగష్టు 11 వరకు ఉండును. ఇందులో భాగంగా 2016 జూన్ 25 న గురువుపై రాహు బంధనం జరగనుంది. ఇందుకోసంగా మానవాళి శ్రేయస్సుకై నందనవనం నాగ ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నేను మరియు స్టూడియో ఎన్ టెలివిజన్ ఛానల్ వారి అనుబంధ సంస్థయైన యోగి శాటిలైట్ టీవీ వారి సంయుక్త ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాలో 7 సార్లు దోష నివృత్తికై సప్త మహా సూర్య యాగాలు జరగనున్నవి. రెండవ యాగం విశాఖపట్టణానికి సమీపంలో జరుగును. ఆనాడు యోగి టెలివిజన్ ఛానెల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయును. విశాఖ జిల్లా యలమంచిలికి 7 కిలోమీటర్ల దూరంలో గల శతాబ్దాల నాటి చోళ రాజులచే నిర్మితమైన పుణ్యక్షేత్రంలో ఈ రెండవ యాగం జరుగును. మైళ్ళ కొలది పాములా వ్యాపించి ఉన్న ఫణిగిరి కొండల శ్రేణువులో 5 గజముఖ శిల్ప రూపంనుంచి ధారాపాతంగా స్వచ్చమైన నీరు శతాబ్దాల నుంచి రావటం మహా విశేషం. 5 ధారలుగా నీరు వచ్చే ఈ క్షేత్రం కాలక్రమంలో పంచధార, పంచధార్లగా వ్యవహరింపబడుతున్నది. ఈ క్షేత్రంలో నిర్వహణ ఏర్పాట్లను ఆ గ్రామ మాజీ విలేజ్ ఆఫీసర్ వసంతవాడ పురుషోత్తమ రాజు (రాజబాబు) గారు పర్యవేక్షిస్తున్నారు.
Posted by Sreenivasa Gargeya Ponnaluri on Saturday, March 26, 2016
పూర్తి వివరములకై 7337596524, 7337596521, 7702021818 నంబర్లకు ఫోన్లు చేసి తెలుసుకొనవచ్చును.

Tuesday, March 15, 2016

వివాహాలలో వ్యతిరేకతలనిచ్చే అరుదైన నాగబంధనం - పార్ట్ 3

మంచి మనస్సుతో ఉంటూ నిబద్దతో కూడిన జీవితం సాగిస్తున్నప్పటికీ ఈ గురు రాహు నాగబంధన అంశాలు మొత్తం  432 ఉన్నవి. అసలు వివాహం విధి నిర్ణయమా ? లేక గ్రహచార, గోచార స్థితులలో వచ్చే మార్పుల అనుసరించి విధి నిర్ణయాన్ని తారుమారు చేసే ఫలితమా? ఈ రెండు అంశాలలో రెండవది నాగ బంధనానికి సంబంధించినది. వివాహం ముందే నిర్ణయింపబడితే చేయగలిగిందేమి లేదు. అది ప్రేమ వివాహమైనా మరేదైనా, ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం, అవసరం ఉండనే ఉండదు. చేయవలసినది వివాహం మాత్రమే.

ఎన్నో సంబంధాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఏ ఒక్కటి కుదరదు. సంవత్సరాలు గడిచిపోతాయి. తల్లి తండ్రులతో పాటు విసిగిపోయిన జాతకులు కూడా.. ఇక జన్మలో వివాహం చేసుకోకూడదనే పరిస్థితికి వచ్చేస్తారు. కాని అనుకోకుండా ఓ సంబంధం రావటం, కుదరటం చక చకా వివాహం జరగటం అంతే వేగంతోనే ఊహించని రీతిలో మలుపులు తిరిగిపోవటం నాగ బంధనానికి ఉన్న లక్షణం.

వివాహం నిశ్చయమైనది. ఫలానా తేది వివాహమని తెలియచేసుకున్నారు. అనుకోకుండా అవాంతరం వచ్చింది. వివాహం ఆగిపోయిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. మళ్లీ కొత్త శుభలేఖలు, పునః ప్రయత్నాలు చేయటమా లేక ఈ సంబంధంతో మానుకొని మరొకటి చూసుకోవటమా ఇది కూడా ఓ నాగ బంధనమే. అయితే ఇక్కడ పునః ప్రయత్నాలకు కారణమయ్యే గ్రహం శని. అవాంతరాలు కల్గించటం, కార్యక్రమాలని తల్లక్రిందులు చేసేయటం, వివాహ తేదిని మార్చివేయటం... ఒక విధమైన ఆందోళన కల్గించటం ఒక భాగమైతే, అసలు వధూ వరులలోనే ఒకరిని మార్చేయటం మరొక ఎత్తు. ఇంతటి చిత్ర విచిత్రాలు చేయగల సర్వ సమర్ధుడు ఈ శని మహారాజు. కాని ఇది అన్ని సమయాలలో కానేకాదు.
ఎక్కడైనా నాగ బంధనం జరిగి ఉండి ఉన్న జాతకాలలో మాత్రమే పై ప్రకారంగా జరుగుతుంటుంది.

మొత్తం మీద వివాహం అనేది ఇరు జీవితాలను శాశ్వతంగా ముడి వేసే స్నేహ సంబంధం వంటిది. ఇరువురికి వ్యవస్థ పై నమ్మకం లేకుంటే ఈ బంధం నిలబడదు. ఈ విధంగా నిలబడని బంధాలను అనేక కోణాల్లోనూ, విభిన్న రీతులలోను భంగపరిచే లక్షణం ఒక్క నాగబంధనానికే ఉన్నది.

ఒక్కోసారి ఇరు జాతకాలు అద్భుతంగా ఉన్నాయని ఓ పండితులవారు చెప్పారని, ఆ పండితులవారి మాట భరోసాతో కార్యక్రమం పూర్తయిందని, చివరికి పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మరో పండితులవారు ఇది గమనించి, జాతకాలు కలవలేదని, అందుకే సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పటం అనేది తరచూ వింటుంటాం. ఒకవేళ మొదటి పండితులవారు చెప్పిన నిర్ణయాన్ని ఖాతరు చేయకుండా, సెకండ్ ఒపీనియన్ గా ఆసమయంలో మరో అనుభవశాలి గల పండితుడిని ప్రశ్నిస్తే ఇలా జరిగి ఉండేది కాదేమో అని చాలా మంది వాపోతుంటారు. కాని నాగ బంధన దోషం ఉన్నప్పుడు , శాస్త్రీయమైన పరిహార పరిష్కారము చేసుకోకుండా సహస్రాది పండితులని సంప్రదించినప్పటికీ జరిగేది జరిగి తీరుతుంది.

అందుకే 13వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు గల ఏడూ సంవత్సరాలను టీనేజ్ అంటారు. ఈ 7 సంవత్సరాల టీనేజ్ లో మధ్యలో ఉన్నదే 16వ సంవత్సరం. కనుక దోష శాతము ఏ స్థాయిలో ఉన్నది ? మరి నాగ బంధన రూపంలో ఉన్నదా ? చండాల యోగంలో ఉన్నదా ? కుజ రాహు కలయికతో ఉన్నదా ? శుక్ర రాహు కలయికతో ఉన్నదా ? రెండు గ్రహాల మధ్య ఉన్న దూరమెంత ? ఈ రెండు గ్రహాలూ ఉన్న స్థానం పైన పాప గ్రహాల వీక్షణ ఉన్నదా ? లేక శుభ గ్రహాల వీక్షణ ఉన్నదా ? రాశి, నవాంశ చక్రాలలో స్థితి గతులు అనే అంశాలను తల్లి తండ్రులు 16వ సంవత్సరం దాటిన లగాయితు జ్యోతిష శాస్త్ర నిర్ణయాలను సరియైన రీతిలో తీసుకుంటూ దీర్ఘకాల పరిహారమును ఆచరించినప్పుడు మాత్రమే నాగబంధనం వంటి దోషాలకు పూర్తి స్థాయిలో పరిహారం చేసిన వారవుతారు.

అనగా ప్రస్తుత వయస్సు 16 సంవత్సరాలు. జాతకంలో వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలను బేరీజు వేసుకొని అనుకూల స్థితులు  ఎంత వరకు ఉన్నాయి ? లేక ప్రతికూల పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి తెలుసుకుని, ఆ 16వ సంవత్సరం నుంచి మొదటి 9 సంవత్సరాల వరకు అనగా 24వ సంవత్సరం వయసు వచ్చే వరకు ఖగోళంలో నాగ బంధనాలు ఏ ఏ సమయాలలో జరగబోతున్నాయి, అవి జాతకుల జన్మ రాశికి ఏ స్థానంలో ఉండబోతున్నాయి, ఆ ఫలితాలు ఎంత వరకు వ్యతిరేకంగా ఉంటాయి అనే వివరాలను ముందుగానే గమనించి తగిన రీతిలో దీర్ఘకాల పరిహారమును ఆచరించాలి.

నాగ బంధనం అనేది ఖగోళంలో ప్రతి 6 నుంచి 7 సంవత్సరాల మధ్యలో వస్తూనే ఉంటుంది. కాబట్టి 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే గమనించి, భవిష్య 36 సంవత్సరాల వరకు అనగా జాతకునికి దాదాపు 50 సంవత్సారాలు వయస్సు వచ్చేంతవరకు ఇట్టి బంధనాలు ఏయే రాశులలో ఎన్ని సార్లు వస్తున్నాయి ? ఆయా తేదీలు ఎప్పుడెప్పుడు ? ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే పూర్తి స్థాయి పూర్వాపరాలను తెలుసుకున్నప్పుడు మాత్రమే నాగ బంధన దోషాల నుంచి విముక్తి కావచ్చు.

అలా కాకుండా మరో 2 రోజులలో బంధనం జరగబోతున్నది అని తెలుసుకొని చేసే  ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. అందుకే రాబోవు సంవత్సరాలలో ఈ బంధన దోషాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే కొంత వరకు లోతైన విశ్లేషణ ఇవ్వటం జరిగింది. 432 అంశాలు ఉన్నాయి కనుక ఇట్టి అంశాలు అందరికీ ప్రస్తుత రోజులలో తెలియదు కనుక కొంతకు కొంత ప్రజలను చైతన్య వంతులు చేయాలనే సంకల్పంతోనే ఇప్పటినుంచి నాగ బంధన అంశాలను వెలుగులోకి తీసుకొని వస్తున్నాను. అందుకే గోధుమ పిండి దీపారాధనతో ప్రతి ఆదివారం చేయటం ఒక చిన్ని పరిహారం లాంటిది.  వీటితో పాటు వైదిక మార్గంలో శాస్త్ర క్రియలను ఆచరించి, క్రియ తదుపరి హోమం ద్వారా వచ్చే భస్మాన్ని ప్రత్యేక పద్ధతులలో కొన్ని ఇతర ద్రవ్యాలను కలిపి, తద్వారా వచ్చే దానిని కంఠమునకు బొట్టు రూపంలో ధరించటం చాలా శ్రేయస్కరం.

కనుకనే నాగ బంధనం వైవాహిక అంశంలో ఇంకా ఏ విధంగా సమస్యలను ఇస్తుంటుంది ? ఒక్కోసారి పూర్తి స్థాయిగా అనుకూలతలను రుచి చూపించి, అకస్మాత్తుగా సమస్యలను చిత్రీకరిస్తుంది అనే అంశాలను కూడా తదుపరి పోస్టింగ్‌లో తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరైనా ఆనందకరమైన స్థితులలో ఉండి, ఇటువంటి నాగ బంధన దోషాలను నమ్మకుండా ఉండే వారు కూడా ఉంటుంటారు. కనుక గత సంవత్సరాలలో ఈ బంధనాలు ఏయే సంవత్సరాలలో వచ్చాయో తెలుసుకుంటూ, ఆ సంవత్సర వివరాలను కూడా తదుపరి పోస్టింగ్‌లో చెప్పుకొని, భవిష్యత్ లో ఆనందకరమైన, సంతృప్తికరమైన, సుఖవంతమైన జీవితాన్ని పొందవచ్చును.

Saturday, March 12, 2016

2016లో అరుదైన గురు రాహు నాగబంధనం పార్ట్ 2

జ్యోతిష శాస్త్ర రీత్యా గురువు ఓ శుభ గ్రహం. గురు గ్రహానికి 3 స్వనక్షత్రాలు ఉన్నాయి. అవి పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు.. జాతక చక్రాలలో గురువు రాహువుతో కలిసిన  సందర్భాలలో వివాహ సంబంధ అంశాల మీద వ్యతిరేక ప్రభావాలు వస్తుంటాయి. ఈ గురు రాహు కలయికనే నాగ దోషము అంటారు. ఇక్కడ నాగ అంటే పెండింగ్ అని అర్థము. అనగా తరచూ వాయిదాలు పడటము  అని భావము.

గురు రాహువులు ఒక రాశిలో ఉన్నప్పుడు, ఈ రెండు గ్రహాల మధ్య దూరమును బట్టి ఫలితములు ఉండును. అంతేతప్ప ఈ రెండు గ్రహాలూ కనపడినంత మాత్రాన సమస్యలు వస్తాయని అనుకోకూడదు. వివాహానికి సంబంధించిన అంశాలలో కర్కాటక రాశిలో గురు రాహువుల కలయిక వలన ఫలితాలు ఓ రకంగా ఉంటే, మకర రాశిలో గురు రాహు కలయిక ఫలితాలు మరో రకంగా ఉంటే, ధను, మీన రాశులలో గురు రాహు కలయిక ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయి.

వివాహము ఒక్కోసారి ఆలస్యము కావటము, చిట్ట చివరి వరకు వచ్చి స్థిరం కాకుండా వాయిదా పడటము, ఒకవేళ ఆలస్యంగా వివాహం జరిగిననూ, తదుపరి ఏవో సమస్యలు వెంటాడటము, మానసిక శారీరక సంఘర్షణలు ఎదురుకావటము, వివాహమైనప్పటికీ సంతానం లేకుండా అనేక ఇబ్బందులకు గురి కావటము, ఒక్కోసారి ద్వితీయ వివాహ యోగానికి దారి తీయటము, ఒకే ఇంట్లో ఒకే సంబంధిత రుగ్మతతో బాధపడటము లేదా అంధులుగా గాని మూగ వారిగా గాని కుటుంబంలో అధికులుగా ఉండటము మొదలైన అంశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

మేష వృశ్చిక రాశులలో గురు రాహు కలయికల వలన వ్యతిరేక ప్రభావాల తీవ్రత అధికంగానే ఉంటుంది. ఒక్కోసారి చెప్పనలవి కాని సమస్యలు  ఉంటూ కష్ట నష్టాలను ఇతరులకు చెప్పుకోలేక బాధపడేవారు కూడా ఉంటుంటారు. ఇదే గురు రాహు కలయిక సింహరాశిలో ఉంటే ఫలితాలన్నీ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉండటమే కాకుండా పితరుల యొక్క ఆశీస్సులు కూడా లేకుండానే జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది.

మిధున, కన్య రాశులలో గురు రాహు కలయికలు ఉంటే ప్రముఖంగా శత్రుత్వంతో కూడిన వైవాహిక జీవితం అనుభవిస్తూ ఉండాలి. ఇక కుంభరాశిలో ఈ కలయిక జరిగితే వైవాహిక జీవితంలో చేసిన పనులే ఒకటికి రెండు సార్లు కూడా చేయవలసిన పరిస్థితులు కూడా వస్తుంటాయి.

పైన చెప్పిన వివరాలన్నీ నాణేనికి ఒకవైపున ఉన్న 50 శాతం మాత్రమే అని గమనించాలి. ఈ రెండు గ్రహాల కలయిక మధ్య దూరాన్ని బట్టే కాకుండా, వారి వారి జన్మ నక్షత్ర స్థితిని బట్టి కూడా ఫలితాలు ఉంటూ ఉంటాయి. జ్యోతిష రీత్యా 12 రాశులలో జన్మించిన వారు ఉంటుంటారు. వీర్లకు ఏ రాశిలో ఈ కలయిక ఉందో గమనించాలి. ఉదాహరణకు కృత్తిక నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులకు ప్రభావం ఓ రకంగా ఉంటే, కృత్తిక నక్షత్ర 2,3,4 పాదాలలో జన్మించిన వృషభరాశి వారికి ఫలితాలు మరో రకంగా ఉంటాయి. మొత్తం మీద గురు, రాహు కలయికలో ఉన్న నాగబంధన స్థితిగతులు మొత్తం 432 రకాలని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పవచ్చును.

ఈ 432 ప్రభావాలు వివాహ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని విచారిస్తే రక రకములైన స్థితి గతులు కనపడుతుంటాయి. ఒక్కోసారి నవాంశ చక్రంలో కూడా ఈ రెండిటి కలయికను పరిగణలోకి తీసుకొని ఫలిత విశ్లేషణ చేయాలి. అంటే జన్మించిన సమయానికి ఉన్న స్థితి గతులలో గురు రాహువులు ఉండి ఉంటే ప్రస్తుతం జాగ్రత్త ఒక విధంగా తీసుకోవాలి. జన్మ సమయానికి లేకుండా ఉండి ఉంటే, ప్రస్తుతం జరిగే ఈ కలయిక ప్రభావ విషయంలో జాగ్రత్తలు ఇంకో రకంగా తీసుకోవాలి.

కనుక గురు రాహు నాగబంధన ఒకటవ భాగానికి ముగింపు చెప్పే అంశంలో విశ్లేషించేది ఏమనగా... ఇలాంటి కలయికలు ఉన్న జాతకులు చెప్పబోయే పరిహారములను పాటిస్తూ ఉంటుంటే మానసిక ప్రశాంతతో పాటు వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పట్టేలా ఉండుటకు అవకాశం రాగలదు.

మంచి మనస్సుతో ఉంటూ నిబద్దతో కూడిన జీవితం సాగిస్తున్నప్పటికీ ఈ గురు రాహు నాగబంధన అంశాలలోని 432 ఫలితాలలో మచ్చుకు 1,2 తీసుకుంటే, తప్పు లేకపోయిననూ ఎదుటి వారి ముందు శిక్ష అనుభవించే రీతిలో ముద్దాయిగా నిలబడుతూ, ఒక్కోసారి న్యాయస్థానాల మెట్లెక్కటము, కారాగారంలో నివాసముండటము వంటి వ్యతిరేక పరిస్థితులు చోటుచేసుకుంటాయి.

కనుక ఏ నక్షత్రంలో జన్మించిననూ గురు మహాదశ గాని లేక గురు అంతర్దశ గాని, స్థూల సూక్ష్మ  ప్రాణ దశలలో గురువుకు సంబంధించినవిగా ఉంటే  ఫలితాలు వ్యతిరేకంగా ఉంటుంటాయని భావించాలి. కాబట్టి  సింహరాశిలో ప్రస్తుతం జరిగే గురు రాహు చండాల యోగంలో భాగంగా 25 జూన్ 2016 న ఖగోళంలో రాహువుతో గురు గ్రహానికి నాగ బంధనం జరగనుంది. ఇది అనేక శతాబ్దాల తరువాత వస్తున్న గ్రహస్థితిగా అభివర్ణించాలి. కనుకనే పూర్తి స్థాయిలో పరిహార విధి విధానమును తెలుసుకుంటూ, ఆచరిస్తుంటే మేలైన పరిస్థితులు తప్పక రాగలవని జ్యోతిష శాస్త్ర నిర్ణయము.

యోగి టీవీ మరియు నా ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నాగ బంధన నివృత్తికై ఆచరించే సప్త మహా సూర్య యాగాలలో భాగంగా రెండవ యాగం 2016 ఏప్రిల్ 3 న ఆదివారం నాడు విశాఖపట్టణంలో జరగనున్నది. కనుక ఆ ప్రాంతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చును. పూర్తి వివరములకు ఈ దిగువ నంబర్లలో సంప్రదిన్చవచ్చును. 

7337596524, 7337596521, 7702021818

మూడవ ధారావాహిక పోస్టింగ్‌లో సంతాన విషయాలపై నాగ బంధన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Friday, March 11, 2016

2016లో అరుదైన గురు రాహు నాగబంధనం పార్ట్ 1

మేషాది ద్వాదశ రాశులలో 5వ రాశి సింహరాశి. జ్యోతిష శాస్త్రంలో పంచమ స్థానము అనగానే సంతాన అంశాలను తెలుసుకునే భావమని అర్థము. సంతాన కారకత్వ గ్రహము గురువు. పితృ కారకత్వ గ్రహము సూర్యుడు. ప్రతి వ్యక్తి కూడా మరో వ్యక్తికి సంతానంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి తమ కుటుంబంలోని పెద్దలలో కొంతమంది మరణించి ఉండవచ్చు. ఇలా మరణించే వారు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు.. మామ, అత్త, మేనమామ, మేనత్త, సోదరుడు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, బాబాయి, పిన్నమ్మ, అక్క, బావ ఇలా రక్త సంబంధం ఉన్నవారు మరణించి ఉండవచ్చు. ఇలా మరణించిన వారినే పితరులు అంటారు.

ఈ పితరులనే పితృ దేవతలు అని పిలుస్తాం. ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలంటూ వస్తుంటాయి. ఈ పుష్కరాలలో  పితృ దేవతల ఆత్మలకు శాంతి కలగాలనే ఉద్దేశ్యంతోనే తర్పణ పిండ ప్రదానాదులు ఆచరిస్తూ ఉంటుంటాం. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలి. పితృ కారకత్వ గ్రహమైన రవి, సంతాన కారకత్వ గ్రహమైన గురువు... ఈ రెండింటితో సంబంధం ఉండే రాశి సింహారాశి మాత్రమే. మిగిలిన రాశులకు అధిపతులు ఇతర గ్రహాలు ఉంటుంటాయి. కనుక పితృ దేవతల ఆత్మలు శాంతి కలగాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి సంవత్సరము పుష్కరాలలో పితృ దేవతలకు తర్పణ, పిండ ప్రదానాదులు ఇస్తుంటారు. సింహరాశిలోనికి గురు గ్రహ ప్రవేశం చేయటంతో 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి వస్తాయి.

గోదావరి నదికి పుష్కరాలు కాకుండా ఇతర నదులకు పుష్కరాలు వస్తే వివాహాది శుభ కార్యములు నిరాటంకంగా ఆచరించుకోవచ్చు. గోదావరి నదికి పుష్కరాలు వస్తే మాత్రం వివాహాది శుభ కార్యములు ఉండవు. ఎందుకనగా పితృ కారకత్వ గ్రహమైన సూర్య రాశిలోనికి సంతాన కారకత్వ గ్రహమైన గురు ప్రవేశం చాలా విశేషవంతమైనది కనుక. అయితే ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోవాలి. మఘాది పంచ పాదేషు గురు సర్వత్ర వర్జితః. అని శాస్త్ర వచనం. అనగా మఘ నక్షత్ర నాలుగు పాదాలు, పుబ్బ నక్షత్ర 1వ పాదంలో గురువు సంచార కాలమంతా శుభకార్య నిషిద్దమని అర్థము. దీనినే సింహస్థ గురు దోషము అంటారు. ఉత్తర భారతంలో అయితే సింహరాశిలో గురు సంచారం ఉన్న సంవత్సరమంతయూ శుభ కార్యాలు నిషిద్దమని భావము.

పరోక్షంగా పితృ కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వటానికే ఈ శుభ కార్యాలు నిషిద్ధం కావించబడినవి. ఇంతవరకు బావున్నది. కాని వచ్చిన సమస్యేమిటంటే ఈ సంవత్సరం  సింహరాశిలో గురు సంచారం ప్రారంభం కాగానే గురువుకు సింహగురు దోషం ఆపాదించటమే కాక 2016 జనవరి 29 నుంచి ఆగష్టు 11 వరకు రాహువు గురువుకు చేరువ కావటంతో గురు చండాల యోగం కూడా తోడైనది. ఇంతటితో ఆగక... సింహరాశి అధిపతి సూర్యునికి మార్చి 9 మరియు సెప్టెంబర్ 11 న సంపూర్ణ సూర్య గ్రహణాలు సంభవిస్తున్నాయి. ఈ రెండూ గ్రహణాల మధ్యలోనే అనగా 25 జూన్ 2016న గురువును రాహువు కబలించబోతున్నాడు. దీనినే నాగబంధనం అంటారు.

గురు చండాల యోగం ప్రారంభమైన తర్వాత ఏదో ఒక సమయంలో  నాగ బంధనం జరిగి తీరుతుంది. కాని ఈ నాగ బంధనానికి ముందు వెనుకాలలో... రాశ్యాధిపతి రవికి గ్రహణాలు రావటం, పరస్పర వైరి గ్రహాలైన కుజ, శనులు ఏక కాలంలో వక్రం కావటం, ఏక బిందువులో సంయోగం చెందటం జరిగాయి. వీటన్నిటి ప్రభావం నాగ బంధనాన్ని మరింత బలపరిచేలా.. ప్రాభావితం చేస్తున్నాయి. గతంలో సింహరాశిలో జరిగిన నాగ బంధనాలకు, ఈ నాగ బంధనానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అనేక శతాబ్దాల తదుపరి రెండు గ్రహణాల మధ్య, అరిష్ట గ్రహ స్థితుల మధ్య ఏర్పడిన అరుదైన నాగ బంధనం ఇదే.

ఈ నాగబంధనం ప్రభావం ఒక స్థాయి వరకైతే, ఇతర అరిష్ట గ్రహ స్థితులతో గ్రహణాలు రావటం స్థాయి పెరగటమైనది. కనుక బంధనం జరిగేది గురువుకి. ఈ గురువే సంతాన కారకత్వ గ్రహం. ఈ సంతానం ఎవరు ?.. మనమే... మనము ఒకరికి సంతానంగా ఉంటున్నాం కదా ! అంతే కాకుండా షట్ చక్రాలలో కంఠ స్థానంలో ఉండే విశుద్ధి చక్రానికి ఆధిపత్య గ్రహం కూడా గురువే. అనగా వాక్ స్థానానికి అధిపతి ఈ గురువు. ఇట్టి గురువుకు రాహువుతో నాగ బంధనం జూన్ 25న జరగనుంది. కనుక అప్పటి నుంచి దాని ప్రభావం మరో ఏడు నెలలు వ్యతిరేకంగా ఉంటుందని భావము. కనుక గురు, రాహు కలయిక, శుక్ర రాహు కలయిక, కుజ రాహు కలయికలు మానవాళికి వివిధ రాశులలో సంచారం చేసే సమయాలలో అనేక సమస్యలను ఇస్తుంటాయి. ఈ సమస్యలు ముఖ్యంగా రాజకీయం మీద మాత్రమే కాకుండా ఇతర అతిముఖ్య అంశాలపై కూడా ప్రభావాలను చూపుతుంటాయి.

గతంలో గురు, రాహు కలయిక జరిగిన సందర్భంలో జన్మించిన వారు కూడా ఉండి ఉంటారు. మరి వారికి ఏ విధంగా ఫలితాలు ఉంటుంటాయి.. ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి ? గతంలో గురు రాహు కలయిక లేని సందర్భాలలో జన్మించిన వారికి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి ? అసలు ఈ నాగ బంధనం ఎంతవరకు ప్రభావాలని వ్యతిరేకంగా ఇస్తుంది ? ఆ ప్రభావాలు గతం నుంచి ఉండి ఉంటె రాబోయే రోజులలో ఎలా ఉంటాయి. శాస్త్ర రీత్యా ఈ నాగ బంధనం దేశాల నడుమ, రాష్ట్రాల నడుమ యుద్ధ భయ వాతావరణం ఏర్పరుస్తుందా? విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ, సంతాన, దాంపత్య, రుణ, రోగ, శత్రు.. ఈ విధమైన అంశాలలో ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందనే అంశాలను పూర్తి స్థాయిలో విశదంగా తదుపరి ధారావాహిక పోస్టింగ్ లలో  తెలుసుకుందాం.

Tuesday, March 8, 2016

ఓ పార్శ్వం పాక్షికం, మరో పార్శ్వం సంపూర్ణ గ్రహణం

9 మార్చి 2016 శ్రీ మన్మధ నామ సంవత్సర మాఘ అమావాస్య  బుధవారం రోజున పూర్వాభాద్ర నక్షత్ర కుంభ రాశిలో కేతు గ్రస్తంగా సంపూర్ణ  సూర్యగ్రహణం గోచరించును. అయితే భారత దేశంలో పాక్షికం మాత్రమే. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.46 నిముషాలకు పాక్షికంతో సూర్య గ్రహణ స్పర్శ ప్రారంభమగును. భారతదేశంలో వివిధ ప్రాంత సూర్యోదయాల కంటే ముందే గ్రహణం ప్రారంభమై తదుపరి కొన్ని కొన్ని నిముషాలు వివిధ ప్రాంతాలలో పాక్షికంగా కనపడి గ్రహణం ముగిసిపోవును.

భారతంలో ఉదయం 6.50 నుంచి 9.08 వరకు సూర్యుడు గ్రహణం లేకుండానే కనపడుతుంటాడు. కాని ఇదే సమయంలో సూర్యునికి రెండవ పార్శ్వంలో సంపూర్ణ గ్రహణం ఏర్పడును. భారత కాలమాన ప్రకారం  ఉదయం 7.25 నిముషాలకు సంపూర్ణ గ్రహణ స్థితికి  బింబము  వచ్చి 7 గం. 29ని 4 సెకన్లకు గ్రహణ విడుపు ప్రారంభమై 9.08 నిముషాలతో గ్రహణ ముగింపు జరుగును. కనుక గ్రహణ పూర్తికాలము 3గం. 22నిముషాలు. ఫసిఫిక్ మహా సముద్రంలో సంపూర్ణంగా కనపడును.

ప్రస్తుతం రాహువు, గురువును సమీపిస్తున్నందున గురుచండాల యోగం సింహరాశిలో జరుగుతున్నది. సింహరాశి అధిపతి సూర్యుడు కావటం సూర్యునికి కేతుగ్రస్తంగా సంపూర్ణ సూర్య గ్రహణం పంచ గ్రహ కూటమితో ఏర్పడటం, ఈ కూటమిపై కుజ గ్రహ వీక్షణ ఉండటం, తిరిగి సెప్టెంబర్ 1వ తేదిన సింహరాశిలోనే మరో కంకణ పూర్వక సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించటం, ఈ రెండు గ్రహణాల మధ్య నాగ బంధనంతో పాటు వైరి గ్రహాలైన కుజ, శనులు వక్ర సంచారం చేసి తిరిగి ఋజు మార్గంలోకి వచ్చి ఆగస్ట్ 24న ఏక బిందువులో కుజ శనులు కలవటం మొదలైన వ్యతిరిక్త గ్రహ స్థితుల ప్రభావం ఉంది కనుకనే సప్త మహా సూర్య యాగాలు ఆచరించటం జరుగుతున్నది. 

గ్రహణము ఉదయం 6.50తో భారత్ లో పాక్షికంగా ముగిసిపోవును. ఆకాశంలో సూర్యుడు  గ్రహణం లేకుండా కాంతివంతంగా భారతదేశంలో కనపడుతుంటాడు కనుక గ్రహణం లేదనుకొని  గర్భవతులు తమ తమ గృహాల నుంచి వెలుపలికి వచ్చి సూర్య కాంతి సోకేలా దిన చర్యను చేసుకొనేవారు చాలామంది ఉండవచ్చు. కాని ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతంలో 6.50 నుంచి 9.08 నిముషాల వరకు గ్రహణం లేని సూర్యుడు గోచరిస్తున్నప్పటికీ, రెండవ పార్శ్వం వైపు సంపూర్ణం ఏర్పడి ఇతర దేశాలకు కనపడును. కాని గ్రహణ వేద అనుభవిస్తున్న గ్రహ రాజైన సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణాలు గర్భవతులకు ఇబ్బందికరం.

కనుక సూర్యోదయాల నుంచి  9.08 వరకు గృహంలోనే గర్భవతులు ఉండవలసింది. వారి వారి అన్ని పనులు చేసుకోవచ్చును. మల, మూత్ర విసర్జనకు వెళ్ళవచ్చును. ఒకే ప్రాంతంలో పడుకోవాలనే నిబంధన లేదు. టీవీ లలో చూపించే గ్రహణ బిమ్బాలను కూడా చూడవచ్చును. ఆందోళన వద్దు.

ఉదయము 9.08 నిముషముల తదుపరి స్నానమాచరించి భోజన కార్యక్రమ ఏర్పాటు చేసుకొనవచ్చును.  పాలు, పెరుగు లాంటి ఆహార పదార్ధములపై దర్భలను వేసుకొనేది. ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానము, విడుపు స్నానము, మధ్య స్నానములు ఉండును. కాని ఇవి భారత దేశంలో సూర్యోదయాల నుంచి ప్రారంభమై ఉదయం 6.50 కి పూర్తగును. కనుక పట్టు స్నానం, మధ్య స్నానం ఆచరించలేక పోయిననూ 6.50 తదుపరి విడుపు స్నానం ఆచరించటం ఒక పద్ధతి. అలా కాకుండా సూర్యోదయం తదుపరే పట్టు స్నానం ఆచరించి, 7 గంటల 27 నిముషాలకు మధ్య స్నానాన్ని ఆచరించి 9.08 తదుపరి గ్రహణ మోక్ష స్నానాన్ని ఆచరించవచ్చును. మంత్రోపాసన చేయువారలు ఈ మూడు స్నానాలు ఆచరిస్తూ, మంత్రం జపాన్ని అనుష్టానం చేసినచో రెట్టింపు లబ్ధి లభించునని శాస్త్ర వచనం.

దీర్ఘ వ్యాధితో బాధపడే వారలు ఎటువంటి స్నానాలను దయచేసి చేయవద్దు. కేవలం పసుపు కలిపిన జలాన్ని స్వల్పంగా శరీరంపై ప్రోక్షించుకొనిన చాలును.

పూనే, బొంబాయి, అహ్మదాబాద్ ప్రాంతాలలో గ్రహణం కనపడదు.

భారతదేశంలో పాక్షికంగా గ్రహణ సమయాలు ఈ క్రింది విధంగా ఉండును
తిరుమల ఉ 6.26 నుంచి 6.48 వరకు, 22 నిముషాలు కనపడును
తిరుత్తని  ఉ 6.25 నుంచి 6.47 వరకు, 22 నిముషాలు కనపడును
శ్రీకాళహస్తి  ఉ 6.25 నుంచి 6.48 వరకు, 23 నిముషాలు కనపడును
మదనపల్లి ఉ 6.29 నుంచి 6.47వరకు,18 నిముషాలు కనపడును
చిత్తూరు  ఉ 6.27 నుంచి 6.48 వరకు, 21 నిముషాలు కనపడును
శ్రీశైలం  ఉ 6.28 నుంచి 6.48 వరకు, 20 నిముషాలు కనపడును
కర్నూల్ ఉ 6.32 నుంచి 6.48 వరకు, 16 నిముషాలు కనపడును
నంద్యాల  ఉ 6.30 నుంచి 6.48 వరకు, 18 నిముషాలు కనపడును
కడప  ఉ 6.28 నుంచి 6.47 వరకు, 19 నిముషాలు కనపడును
రాజంపేట ఉ 6.27 నుంచి 6.48 వరకు, 21 నిముషాలు కనపడును
ప్రొద్దుటూరు ఉ 6.30 నుంచి 6.48 వరకు, 18 నిముషాలు కనపడును
హైదరాబాద్  ఉ 6.31 నుంచి 6.47 వరకు, 16 నిముషాలు కనపడును
వరంగల్  ఉ 6.27 నుంచి 6.48 వరకు, 21 నిముషాలు కనపడును
ఆదిలాబాద్ ఉ 6.26 నుంచి 6.47 వరకు, 16 నిముషాలు కనపడును
భద్రాచలం  ఉ 6.21 నుంచి 6.48 వరకు, 27 నిముషాలు కనపడును
నిజామాబాద్ ఉ 6.33 నుంచి 6.47 వరకు, 14 నిముషాలు కనపడును
మహబూబనగర్ ఉ 6.33 నుంచి 6.47 వరకు, 14 నిముషాలు కనపడును
ఖమ్మం ఉ 6.24 నుంచి 6.48 వరకు, 24 నిముషాలు కనపడును
మెదక్ ఉ 6.32 నుంచి 6.47 వరకు, 15 నిముషాలు కనపడును
నల్గొండ  ఉ 6.28 నుంచి 6.48 వరకు, 20 నిముషాలు కనపడును
సిద్ధిపేట ఉ 6.33 నుంచి 6.47 వరకు, 14 నిముషాలు కనపడును
కరీంనగర్ ఉ 6.29 నుంచి 6.48 వరకు, 19 నిముషాలు కనపడును
సూర్యాపేట ఉ 6.26 నుంచి 6.48 వరకు, 22 నిముషాలు కనపడును
నెల్లూరు ఉ 6.24 నుంచి 6.48 వరకు, 24 నిముషాలు కనపడును
అనంతపురం ఉ 6.33 నుంచి 6.47 వరకు, 14 నిముషాలు కనపడును
హిందూపురం ఉ 6.34 నుంచి 6.48 వరకు, 14 నిముషాలు కనపడును
ఒంగోలు ఉ 6.25 నుంచి 6.49 వరకు, 24 నిముషాలు కనపడును
చీరాల ఉ 6.24 నుంచి 6.49 వరకు, 25 నిముషాలు కనపడును
గుంటూరు ఉ 6.23 నుంచి 6.48 వరకు, 25 నిముషాలు కనపడును
తెనాలి  ఉ 6.21 నుంచి 6.48 వరకు, 27 నిముషాలు కనపడును
విజయవాడ ఉ 6.22 నుంచి 6.48 వరకు, 26 నిముషాలు కనపడును
ఏలూరు  ఉ 6.20 నుంచి 6.48 వరకు, 28 నిముషాలు కనపడును
రాజమండ్రి  ఉ 6.17 నుంచి 6.48 వరకు, 31 నిముషాలు కనపడును
అమలాపురం ఉ 6.16 నుంచి 6.48 వరకు, 32 నిముషాలు కనపడును
కాకినాడ ఉ 6.15 నుంచి 6.48 వరకు, 33 నిముషాలు కనపడును
అన్నవరం ఉ 6.15 నుంచి 6.49 వరకు, 34 నిముషాలు కనపడును
పిఠాపురం  ఉ 6.15 నుంచి 6.48 వరకు, 33 నిముషాలు కనపడును
యానం ఉ 6.16 నుంచి 6.48 వరకు, 32 నిముషాలు కనపడును
విశాఖపట్నం ఉ 6.12 నుంచి 6.48 వరకు, 36 నిముషాలు కనపడును
శ్రీకాకుళం ఉ 6.09 నుంచి 6.49 వరకు, 40 నిముషాలు కనపడును
ఇచ్చాపురం ఉ 6.06 నుంచి 6.49 వరకు, 43 నిముషాలు కనపడును
టెక్కలి ఉ 6.09 నుంచి 6.49 వరకు, 40 నిముషాలు కనపడును
సాలూరు ఉ 6.12 నుంచి 6.49 వరకు, 37 నిముషాలు కనపడును
చెన్నై ఉ 6.22 నుంచి 6.48 వరకు, 26 నిముషాలు కనపడును
బెంగుళూరు ఉ 6.33 నుంచి 6.47 వరకు, 17 నిముషాలు కనపడును
త్రివేండ్రం ఉ 6.34 నుంచి 6.46 వరకు, 12 నిముషాలు కనపడును
ఢిల్లీ  ఉ 6.40 నుంచి 6.44 వరకు, కేవలం 4 నిముషాలు మాత్రమే కనపడును
కలకత్తా  ఉ 5.53 నుంచి 6.50 వరకు, 57 నిముషాలు కనపడును

లక్నో ఉ 6.24 నుంచి 6.45 వరకు, 21 నిముషాలు కనపడును
నాగపూర్  ఉ 6.30 నుంచి 6.47 వరకు, 17 నిముషాలు కనపడును

గమనిక : మాఘ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఖగోళంలో జరుగుతున్నది కనుక సముద్ర స్నానాలు ఆచిరించే వారు జాగ్రత్తలు పాటిస్తూ ఆచరించేది. ఎందుకంటే ఈ గ్రహణానికి ముందు ఒక వారము, తదుపరి రెండు వారాల వరకు భూకంప, సునామి సంబందితములు రాగల సూచన వున్నది. కనుక సముద్రపు అలలు ఉవ్వెత్తున లేచును. కాబట్టి సముద్ర స్నానాల వైపు వెళ్ళకుండా ఉండటం చాలా  మంచిదని గ్రహ సంచార రీత్యా తెలియచేస్తున్నాను. దేశ, విదేశ రాజకీయ స్థితిగతులపై గ్రహణ మరియి అరిష్ట గ్రహస్థితుల ప్రభావాన్ని తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.
 

Monday, March 7, 2016

నాగ బంధన నివృత్తికై రెండు తెలుగు రాష్ట్రాలలో సప్త మహా సూర్యయాగాలు

సింహరాశిలో గురు చండాల యోగం కారణంగాను, మరియు జూన్  25న ఏర్పడే నాగబంధన నివృత్తి కొరకుకై, యోగి టెలివిజన్ చానల్ మరియు నా ఆధ్వర్యంలో  తలపెట్టిన  సప్త మహా సూర్యయాగ పరంపరలో భాగంగా 1వ మహా యాగం 2016 మార్చి 6న ( నిన్న) హైదరాబాద్ నాగోల్‌కు సమీపంలోని అలకాపురి రోడ్ నంబర్ 11 లో ఉన్న శ్రీ శృంగేరి జగద్గురు మహా సంస్థాన శారదాంబ (శంకరమఠం) మందిరంలో జరిగిన కార్యక్రమ ఛాయా చిత్రములు ఈ క్రింద పొందు పరచబడినవి.

మార్చి 9 సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావము మరియు కుజ శనుల వక్ర సంచార ప్రభావము నాగ బంధన ప్రభావము, కుజ శనుల కలయిక, కంకణ సూర్య గ్రహణ ప్రభావాల నివృత్తి కొరకుగా మొత్తం 7 పర్యాయములు సశాస్త్రీయ పద్దతిలో వైదిక క్రియలు చేసుకొనుటకు.. 7 అవకాశ దినములు ఉన్నవి. ఈ 7 అవకాశ దినము లుగా పరిగణించబడే రోజులలో ఆచరించే సప్త మహా  సూర్య యాగ పరంపరలో భాగంగా రెండవ కార్యక్రమం  3 ఏప్రిల్ 2016 ఫాల్గుణ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరుగును. వేదిక వివరాలు త్వరలో నిర్ణయం జరుగును.... మూడవ కార్యక్రమం 1 మే 2016 ఆదివారం దుర్ముఖి చైత్ర అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం... నాల్గవ కార్యక్రమం  29 మే 2016 వైశాఖ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం... ఐదవ అతి ముఖ్య కార్యక్రమం  జూన్ 24 శుక్రవారం (నాగబంధనం జరిగే ముందురోజు)... ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగును. వేదిక వివరములు త్వరలో.  ఆరవ యాగం జూలై 3 ఆదివారం జ్యేష్ట అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం... చివరి యాగం జూలై 31 ఆదివారం ఆషాఢ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం రోజులలో నందనవనం నాగ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో యోగి టీవీ చానల్ మరియు నా ( శ్రీనివాస గార్గేయ ) సంయుక్త ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష రీతిలో దోష నివృత్తికై, మానవాళి శ్రేయస్సుకై కార్యక్రమములు జరగనున్నవి.

మార్చి 9 న సంభవించబోయే సంపూర్ణ సూర్య గ్రహణ వివరాలు తదుపరి పోస్టింగ్ లో.