గమనిక : 2018 జూన్ 26 రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు 121 రోజులు కుజగ్రహం వక్రంతో సంచారం చేయనున్నది. కనుక కుజ దోషం అనేది లేకున్ననూ, ఉన్నదని భయపడేవారు, ఋణ శత్రు శరీర పీడల నుంచి ఉపశమనానికి ప్రత్యేక అరుదైన విశేష రోజులలో కుజ గ్రహ దోష నివారణకు అద్భుత పరిహారములను ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి.- శ్రీనివాస గార్గేయ

Sunday, September 30, 2012

వివాహాలలో అనుకూల ప్రతికూల నక్షత్రాలు

మీ సంతానంలోని యువతీ యువకులకు వివాహం చేయాలంటే... ముందుగా గమనించాల్సింది సరియైనటువంటి పొంతన గల నక్షత్రాలను ఎంచుకోవటం. ఈ ఎంచుకునే సందర్భంలో క్షేమ తారాబలంతో ఉన్న నక్షత్రాలను వదిలివేయాలి. ఎందుకంటే రెండవ వైపు నుంచి లెక్కిస్తే నైధన అనే ప్రమాదకర తారాబలం వస్తుంది. కనుక వదిలివేయాలి.  అలాగే తారాబలంతో ఉన్న మరికొన్ని నక్షత్రాలు 'షష్ట అష్టకములు'గా ఉండును. (వ్యతిరేకములు) ఈ పరంపరలో అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు వివాహ పొంతనలకు ఏయే నక్షత్రాలు అనుకూలమో, ఏవి ప్రతికూలమో తెలుసుకోవాలంటే దిగువ వీడియోని క్లిక్ చేయండి. ఈ రోజు నుంచి 27  నక్షత్రాలు వారికి వివాహాలలో అనుకూల, ప్రతికూల నక్షత్రాలు తెలియచేస్తాను. అక్టోబర్ మధ్య నుంచి చక్కని పరిష్కార మార్గాలను మీ మీ సమస్యలకు తెలియచేయగలను. ఈ లోపల మీ బంధుమిత్రాదులందరికి భక్తిమాల. టీవీ వివరాలను తెలియచేయగలరని ఆశిస్తున్నాం. 

Saturday, September 29, 2012

సెప్టెంబర్ 28 భక్తిమాల టీవీలో - కుజదోష వివరాలు, పరిహారాలు

కుజదోషమనేది చాలా సమస్యలతో కూడి ఉంటుందని, దంపతులలో ఒకరికి కుజదోషముంటే... దాని ప్రభావం మరొకరికి ఉంటుందనే మాట మనం వింటుంటాం. ఇది వాస్తవమేనా అని ప్రశ్నించేవారు ఎంతోమంది ఉంటారు. అసలు కుజదోషం ఏ సమయంలో ప్రభావం చూపుతుంది ? ఏ నక్షత్ర జాతకులకు ప్రభావం చూపదు ? అసలు కుజదోషం ప్రభావం నూటికి నూరు భాగాలు ఉంటుందా ? అనే విషయాలు తెలుసుకోవటానికి, ఎన్ని చెప్పినప్పటికీ... ఇంకా.. ఇంకా భయపడుతూ ఉండే వారందరికీ అనుసరించాల్సిన ఒక పరిహారం తెలియచేస్తున్నాను. కనుక ఆ పూర్తి వివరాలను తెలుసుకోవటానికి ఈ దిగువ వీడియోను క్లిక్ చేసి వీక్షించండి.

Friday, September 28, 2012

సెప్టెంబర్ 27 భక్తిమాల టీవీలో - ఈ వారంలో కుజ, రాహు కలయిక ఫలితాలు, పరిహారాలు

ఖగోళంలో వృశ్చికరాశిలో కుజుడు మరియు రాహువు అక్టోబర్ 2 వ తేదిన కలవబోతున్నారు. కనుక ఆ కలయిక ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. అందువలన ఆచరించాల్సిన పరిహారమును ఈ దిగువ వీడియో చూసి తెలుసుకోండి.

Sunday, September 9, 2012

పర్యావరణాన్ని కాపాడుదాం


గణపతి నవరాత్రులు వచ్చాయంటే పర్యావరణవేత్తలపై వ్యాపారస్తులు కారాలు మిరియాలు నూరుతుంటారు. విషపూరితమైన రంగులను వేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, పరోక్షంగా మానవ జీవనంపై నీలినీడలు కమ్ముకుంటునాయన్న చేదునిజాన్ని జీర్ణిన్చుకోలేము. పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ మట్టితోనే వినాయకులను చేయటానికి ప్రయత్నించండి. మట్టితో వినాయకునిని ఏ విధంగా చేయాలో.... ఈ క్రింది వీడియో క్లిపింగ్స్ ను ఒకసారి తిలకించండి... మీ వంతు కర్తవ్యంగా కూడా పర్యావరణాన్ని కాపాడటానికి ప్రయత్నించండి.