Pranati Television Youtube Channel

Sunday, March 25, 2012

మార్చి 26 రాత్రి వినువీధిలో గురు, శుక్ర, చంద్రులతో సపర్షిమండలావిష్కరణ

2012  మార్చ్ 23 శుక్రవారం నాడు శ్రీ నందన నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ నందనకు రాజు శుక్రుడు. అలాగే శ్రీ నందన సంవత్సరానికి భాను దేవత అధిపతి. ఈ దేవత సింహ వాహనంపై కూర్చొని 5 శిరస్సులు పది భుజములతో దేదీప్యమైన వెలుగుతో ఉంటుంది. అలాగే శుక్రుడు రాజు, మరియు మంత్రి కావటం విశేషం. ఈ శుక్రుడు వినువీధిలో 5 కోణాలతో ఉన్న మండలానికి అధిపతి (పంచ కోణాకార మండలాధీశుడు ). భాను దేవతకు ఉన్న 5 శిరస్సులను శుక్ర మండలానికి ఉన్న 5 కోణాలుగా అన్వయించుకొంటే అత్యంత అరుదుగా రాజు మరియు మంత్రితో శ్రీ నందన ఉగాది రావటం, నాల్గవ రోజునే గణేశ దమనపూజ పర్వదినాన, శుక్ర నక్షత్రమైన భరణిలోనే చంద్రుడు ఉండటం, పైగా ఈ చంద్రుడు శ్రీ నందన రాజైన శుక్రుడు, గురువుతో కలసిన సప్తర్షిమండలం ఏర్పడటం వందలాది సంవత్సరాల తర్వాత వస్తున్న అపూర్వ ఘట్టం.

కనుక 26 మార్చ్ సోమవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకాశంలో పడమర దిశలో, దిగువన శ్రీ నందన సేనాధిపతి గురు గ్రహము, దానికి ఎగువన మహా కాంతితో శ్రీ నందన రాజు శుక్రుడు, శుక్రునకి స్వల్ప ఎగువగా చవితి చంద్రుడు దర్శనమిస్తారు. ఈ మూడు గ్రహాలను కలపగా వచ్చిన ఆకారమే సప్తర్షిమండలంగా భావించాలి. ఈ కలియుగము నాల్గు లక్షల ముఫై రెండు వేల సంవత్సరాలు. ప్రస్తుతం శ్వేతవరాహ కల్పములో, వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. మొత్తం మన్వంతరాలు 14 . ఇందులో 7 వ దిన వైవస్వత మన్వంతరానికి ఋషులే సప్తర్షులు.

 1. వసిష్ట 2. అత్రి 3. గౌతమ 4. కశ్యప 5. భరద్వాజ 6. జమదగ్ని 7. విశ్వామిత్రుడు 

పైన పేర్కొన్న సప్తర్షులను మనసులో తలచుకుంటూ సోమవారం నాటి రాత్రి కనపడే 3 గ్రహాలను దర్శిస్తూ, ఆ 3 గ్రహాలలో ఈ సప్తర్షులున్నారని భావిస్తూ, ఈ దిగువ తెల్పిన లలితాసహస్ర నామాలలోని 77 వ నామాన్ని వీలైనన్ని సార్లు భక్తితో చదువుకోండి.
 

ఓం శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరాయై నమః  
 

లేదా ఎవరికీ వారు వారి వారి ఇష్ట దైవాలను ప్రార్దించుకోండి. ఈ సమయంలో గృహంలోని పూజా మందిరంలో మీ ఇష్ట దైవానికి రెండు వైపులా దీపారాధనలను చేయండి. ఒక ప్రమిదలో మధ్యలో ఒక కుంభవత్తి, రెండు వాలు వత్తులను వేసి వెలిగించండి. రెండవ వైపున మరో ప్రమిదలో మధ్యలో ఒక కుంభవత్తి, రెండు వాలు వత్తులను వేసి వెలిగించండి. ఏనూనెతో అయినను వెలిగించండి. భక్తి , విశ్వాసము ముఖ్యము. ఉపవాసములు లేవు. సాయంత్రం చీకటి పడిన తర్వాత, 3 గ్రహాలూ కనపడుతున్నాయని తెలుసుకొని లేక చూసి ఆపై భక్తితో విశ్వాసంతో, పూజ మందిరంలో దీపారాధన చేసి, ఆ అగ్ని దేవునకు భక్తి తో నమస్కరించి, ఆపై బయటకు వచ్చి పశ్చిమదిశలో కనపడే 3 గ్రహాలను ఒకసారి దర్శించుకొని, అందులో మీ ఇష్ట దైవాలను ధ్యానించుకోండి. లేదా శ్రీ లలితా దేవిని ధ్యానించుకుంటూ  ఈ నామాలను గ్రహాలను దర్శిస్తూ కనీసం 7 పర్యాయాలు  పఠి౦చి ఆపై లోనికి వెళ్లి, మీ పూజ మందిరంలో కూడా 7 సార్లు  పఠి౦చి మీకు తోచిన నైవేద్యాన్ని నివేదించండి.

Friday, March 23, 2012

శ్రీ నందన ఉగాది ఫలితాలు

నాలుగు పాదములతో కలిసిన  కలియుగ ప్రమాణం 4 లక్షల 32 వేల సంవత్సరాలు.  శ్వేతవరాహ కల్పమందలి 7 వ దిన వైవస్వత మన్వతరములోని 28 వ మహాయుగము నందలి కలియుగ మొదటి పాదంలో 5113 వ దైనయు, ప్రభవాది 60 సంవత్సరాలలో 26 వ దైన ఈ సంవత్సరమునకు శ్రీ నందన నామ సంవత్సరముగా పేర్కొందురు.

భానుం నందన నామానాం భాసాచార పరిష్కృతం
మృగేంద్ర వాహనం పంచవ్రక్త్రం దశభుజం భజే5 శిరస్సులు, 10 భుజములతో ఉండి, సింహ వాహనంపై దేదీప్యమాన వెలుగుతో వస్తున్నభాను దేవత ఈ నందన నామ సంవత్సరానికి అధిదేవత. 

384 రోజులుండే ఈ నందన నామ సంవత్సరమునందలి రాజాధి నవనాయకులలో శుక్రుడు రాజు, మంత్రి పదవులను పొందాడు. సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి అను మూడు పదవులను గురువు పొందాడు. సస్య, నీరసాదిపత్యములను చంద్రుడు పొందగా, రసాధిపత్యమును బుధుడు, ధాన్యాదిపత్యమును శని కైవసం చేసుకొనగా, రవి కుజులకు ఎలాంటి ఆదిపత్యములు లభించలేదు.

ఖగోళంలో పంచ కోణాకార మండలానికి అధిపతిగా ఉన్న శుక్రుడికి రాజు, మంత్రి పదవులు రావటాన్ని విశ్లేషిస్తే ఓ ముఖ్య విషయం తెలుస్తుంది. ప్రత్యేకంగా శుక్రునియొక్క మండలానికున్న పంచకోణాలను పంచ శిరస్సులతో ఉన్న భాను దేవతగా అన్వయించుకొని , రాజు, మంత్రి శుక్రుడే కావటాన్ని విశ్లేషిస్తే చాలా అరుదుగా వస్తున్న ఘట్టం.

384 రోజులుండే ఈ నందన నామ సంవత్సరములో రాజు, మంత్రి శుక్రుడు కావటంచే పాలనాపర నిర్ణయాలు తీసుకోవటంలో ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. అంటే స్వయం నిర్ణయాలకే ప్రాధాన్యత అని అర్థము. అయితే జ్యేష్ట మాసంలోను, మాఘమాసం లోను శుక్రుడు అస్తమించటం వలన 58 రోజులు పాలనకు భంగం ఏర్పడుతున్నది. (అనగా జ్యేష్టమాసంలో 1.6.2012 నుంచి 10.6.2012 వరకు తిరిగి మాఘమాసంలో శుక్ల ద్వాదశి 22.2 .2013 నుంచి 48 రోజులు అంటే ఫాల్గుణ అమావాస్య వరకు శుక్రుడు పాలనలో ఉండడు.)

దీనిని బట్టి నిర్ణీత సమయంగా ఉన్న 384 రోజులలో, 48 రోజుల ముందుగానే రాజు, మంత్రి పదవులను అలంకరించిన శుక్రుడు నిష్క్రమిస్తున్నాడన్నమాట.
కనుక కేవలం 236 రోజులే రాజైన శుక్రుడు పరిపాలిస్తాడు. శుక్రుడు స్త్రీ గ్రహం.
పాలనా యంత్రాంగాలలో స్త్రీల పాత్ర అధికము. రాజకీయ రంగ స్త్రీలు ప్రాధాన్యతను సంతరించుకుంటారు.
సనాతన మార్గవాసులు సంప్రదాయ విలువలను గాలికి వదిలేస్తారు. సినీ రంగ తళుకు తారలకు తీవ్ర సమస్యలేదురగును.
ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పోటి ఏర్పడి నీచ సంస్కృతికి తెర తీస్తారు. ప్రేమ వివాహాలలో వైఫల్యాలధికము.
తీవ్రవాద, ఉగ్రవాద చర్యలు చాప క్రింద నీరులా అల్లుకుపోవటాన్ని పాలకులు గుర్తించలేరు.
సినీ మాఫియా గణం తమ కార్య కలాపాలను యధేచ్చగా ఉధృతం చేస్తారు.
మత్తుపదార్ధాల దొంగ రవాణా అధికము. ప్రభుత్వ శాకలలో అవినీతి, అశ్లీల కార్యాలు అధికమైనను పాలకులు పట్టించుకోరు.
సాఫ్ట్వేర్ సంస్థలు కొన్ని సమస్యలలో చిక్కుకుంటాయి.
వస్త్ర, టెలికాం, కంప్యూటర్, సినీ మరియు సౌందర్య సాధన వ్యాపారాలలో లోపాలు పెరిగి నష్టాలు చవి చూచుదురు.
విలాస జీవితం గడిపే వారికి, సంపన్న వర్గీయులకు చేదు అనుభవాలు ఎదురగును.
రాజకీయ కక్షలతో రాష్ట్రాల నడుమా, దేశాల నడుమ, ప్రాంతాల నడుమ విరోధాలదికమగును.
అనేకమార్లు స్టాక్ మార్కెట్ కుప్ప కూలుతుంటుంది.
అంతర్జాతీయ వాణిజ్య మార్పులచే పసిడి ధర పెరుగుతుంటుంది.
సేనాధిపతి గురువు యొక్క సాత్వికంచే దుష్టులపై కఠినచర్యలు తీసుకోలేడు.
తరచూ ఉద్త్రిక్త పరిస్థితులూ, అశాంతి కార్యాలు, తీవ్రవాదుల ప్రాభల్యం అధికం.
మతతత్వ ఛాందస వాదుల విద్వంసాలతో భారీనష్టం.
ధైర్య సాహసాలతో రౌడియుజంపై ఉక్కుపాదం మోపలేరు.
సస్యాధిపతి చంద్రుడు కావటంచే అన్నదాతలు మనఃస్పూర్తిగా వ్యవసాయంపై అభిమానాన్ని పెంచుకుంటారు.
వర్షరుతువులో ఓ పూర్ణిమ అధికంగా రావటంచే పాడిపరిశ్రమకు మంచి రోజులు వస్తున్నవి.
ధాన్యాధిపతి శని 249 రోజులు తులా రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నందున ధాన్యాలకు సరియైన గిట్టుబాటు ధరలు ఉండవు.
మేఘాధిపతి గురువు కావటంచే నైరుతి ఋతుపవనాలు స్వల్ప ఆలస్యంగా వచ్చినను అన్నదాతలకు నష్టం వాటిల్లదు.
జూలై 10 నుంచి 25 వరకు, సెప్టెంబర్ 8 నుంచి 24  వరకు, అక్టోబర్ 24 నుంచి 31 వరకు అధిక వర్షపాతం.
ఆవర్తన మేఘంచే 9 భాగాలు సముద్రంపైనా, 9 భాగాలు పర్వతాలపైనా, 2 భాగాలు భూమిపైనా వర్షించును.
2 భాగాల మోతాదు మించితే రైతాంగం నష్టాలలో కూరుకుపోతారనేది వాస్తవం. కనుక 2 తో సంతోషించాలి.
పుష్కలంగా ధాన్యం పండినను అన్నదాతలకు మార్కెట్ లో సరియైన ధరలు దొరకవు.
జూన్ 22 నుంచి ఆగష్టు 5 వరకు సర్వధాన్యాలకు అనుకూలమైన కాలం కాదు.
అర్ఘాదిపతి గురువు కావటంచే వాణిజ్య రంగం మేధావుల కృషితో విజయమార్గాన వెళ్ళును.
భారతీయ వాణిజ్యం కొత్త పుంతలు త్రొక్కును.
చిన్న ఉత్ప్పత్తులు కార్పొరేట్ రంగంలో హెచ్చు ధరలతో దర్శనమగును.
రసాధిపతి బుధుడు కావటంచే రసవస్తువులైన ఉప్పు, బెల్లం, చక్కర, చింతపండు ధర వరలలో మార్పులుండును.
నీరసాదిపతి చంద్రుడు కావటంచే తీపి మిఠాయి ఉదృతంగా ఉండును.
పారిశ్రామిక రంగం కష్టాలలో నలిగి పోతుంటుంది.
రవాణ, విద్య, వైద్య రంగాలు పూర్తిస్థాయిలో కలుషితమగును.
స్త్రీ, శిశు సంక్షేమ రంగాలు వైభవాన్ని చూపిస్తుంటాయి.
రాజకీయ రంగం సంక్షోభంలో కూరుకుపోవును.
క్రీడారంగ వాసులకు తీపి వార్తలు, చేదు అనుభవాలు మెండు.
ఆధ్యాత్మిక, జ్యోతిష రంగాలపై ప్రజలు మక్కువను, నమ్మకాన్ని పెంచుకుంటారు.
న్యాయరంగం తమ తీర్పులతో ప్రాధాన్యతను సంతరించుకొనును.
బూటకపు ఎన్కౌంటర్లు తగ్గును. శాంతి భద్రతలు దెబ్బతినును.
రక్షణ శాఖ కీర్తి ప్రతిష్టలను పొందలేదు.
వైమానిక రంగానికి సమస్యలతో పాటు, బాంబు బెదిరింపులు ఉండును .
ప్రజా కర్షక పధకాలకు ఆర్ధిక మాంద్యం అడ్డు తగులును.
జలవిద్యుత్ ప్రాజెక్ట్లు నత్తనడకన సాగును.
నిత్యావసర వస్తు నిల్వ దారులపై దాడులు పెరుగును.
దేవాలయ సంపదను దోపిడీ చేసే మేలి ముసుగు వ్యక్తుల గుట్టు రట్టగును.
రైలు, విమాన ప్రమాదాలు, భూకంపాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
స్వాతి నక్షత్రం మంగళవారంతో ఆశ్వీజం ప్రారంభమై, స్వాతి మంగళవారంతో అమావాస్య వచ్చి, స్వాతి కార్తె ఇదే నెలలో మంగళవారంతో రావటం విశేషం. దీని ఫలితాలు నిదానంగా తెలుసుకొందాం.
ఆగష్టు 14 నుంచి 28 వరకు తులా రాసిలో కుజ గ్రహ, శని గ్రహ కలయికలు.
సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 9 వరకు వృశ్చిక రాసిలో కుజ గ్రహ, రాహు గ్రహ కలయికలు.
ఆగష్టు 17 నుంచి నవంబర్ 16 వరకు తులా రాసిలో శని గ్రహ, నీచ రవి ఏక కాల సంచారం.
మే 21 నుంచి జూన్ 4 వరకు వృషభరాశిలో పంచగ్రహ కూటమి. దీని ఫలితాలు నిదానంగా తెలుసుకొందాం.
జూన్ 5 నుంచి 14 వరకు వృషభరాశిలో చాతుర్గ్రహ కూటమి. దీని వివరాలు తర్వాత తెలుసుకొందాం.
2013 ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 4 వరకు కుంభ రాశిలో చాతుర్గ్రహ కూటమి. దీని ఫలితాలు నిదానంగా తెలుసుకొందాం.
2013 జనవరిలో బంగాళాఖాతంలో భీకర తుఫానుకు అవకాశం.
శని, కుజులు ఆగష్టు 15 , శని శుక్రులు నవంబర్ 27 , శుక్ర రాహువులు డిసెంబర్ 12 న కలియుదురు. దీని ఫలితాలు నిదానంగా తెలుసుకొందాం.
2012 ఏప్రిల్ 20 , 21 , 22 , 23 .. మే 12  నుంచి 16 , జూన్ 1 నుంచి 20 , జూలై 15 నుంచి 20 , ఆగష్టు 13 నుంచి 19 , అక్టోబర్ 1 నుంచి 26 , నవంబర్ 25 , 26 , 27 .. డిసెంబర్ 10 , 11 , 12 , 13 .. 2013 జనవరి 5 , 6 , 7 ... పిబ్రవరి 7 నుంచి 26 తేదిలలో వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నందున, దాని ఫలితాలు ప్రజలపై ఉంటాయని భయందోళనలు చెందవద్దు. సరియైన పరిహారలతో చక్కని రాజమార్గాలను ఆచరిస్తూ, ద్వాదశ రాసులవారు అధిక లబ్దిని పొందవచ్చు. వివరాలు నిదానంగా తెలుసుకొందాం.
ధను, మీనరాసులవారికి ఆదాయం 5  ఉంటే ఖర్చు భాగం 14 ఉందని బాధపడకండి. మంచి వివరాలు అతి త్వరలోనే తెలుసుకుందాం.
మేష, వృశ్చిక రాసులవారికి ఆదాయం 2 ఉంటే ఖర్చు 8 భాగాలని విచారించకండి.  తీపి వార్తలు  అతి త్వరలోనే తెలుసుకుందాం.
వృషభ, కర్కాటక, తులా రాశులవారికి 3 భాగాలు అధికంగా వ్యయం ఉందని ఆలోచించకండి. ఈ వ్యయం ఎందుకోసమో త్వరలోనే తెలుసుకుందాం.
మిధున, కన్య రాశులవారికి 3 భాగాలు ఆదాయం మిగిలిందని సంతోషించండి. వివరాలు మరిన్ని తెలుసుకుందాం.
అన్ని రాశుల కంటే సింహ రాశి వారికే 9 భాగాలు ఆదాయం మిగిలిందని నిద్ర పోకండి. వివరాలు తెలుసుకొని మరింత లబ్దిని పొందండి.
మకర కుంభ రాశులకి వచ్చిన ఆదాయం అంతా ఖర్చైందని నివ్వెర పోవద్దు. తియ్యటి వివరాల కోసం వేచి చూడండి.
ఈ నందన నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి సకల శుభాలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కో రాశికి పూర్తి వివరాలను తెలియచేస్తాను. మరొక్కసారి మీ అందరికి ఈ నందన సంవత్సర శుభాకాంక్షలు. 


- పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Thursday, March 15, 2012

2012 ఏప్రిల్ 6 నాటి కలశపూజ సంపూర్ణ వివరాలు

ఏప్రిల్ 6 శుక్రవారం 5 వ కలశపూజ మాత్రమే
 1. ఇంతవరకు 5 రక్షాకవచాలకు చెందిన 5 కలశపూజలను చెప్పటం జరిగింది.
 2. వరుసగా 1 నుంచి 5 వరకు క్రమం తప్పకుండా చేసుకున్నవారు ఎందరో వున్నారు.
 3. కొంతమంది అనివార్య కారణాలవలన మధ్య మధ్యలో చేస్తున్నవారు ఉన్నారు.
 4. ఈ పరంపరలో 5 వ కలశపూజ చేయనివారు ఏప్రిల్ 6 వ తేదిన ఆచరించుకోవచ్చు.
 5. 2012 ఏప్రిల్ 6 శుక్రవారం కేవలం ఐదవ కలశపూజ మిగులుగా ఉన్నవారు మాత్రమే భారతదేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 6 వ తేది ఉదయం 6  గంటల నుంచి 10 గంటలలోపల ఆచరించుకోవాలి.
 6. 5 వ కలశపూజను ఆచరించాలనుకున్నవారు,  ఏప్రిల్ 5 వ తేదీ గురువారం రాత్రి సమయంలో చంద్రుడిని భక్తితో దర్శించి కలశపూజను, 2 వ రోజు ఆచరిస్తున్నామని మనసులోని సంకల్పాన్ని శ్రీ చంద్రగ్రహ సందర్శనం చేస్తూ మనసులోనే ప్రార్దించుకోండి.
 7. ఒకవేళ ముందురోజు రాత్రి చంద్రుడిని దర్శించుకోలేనివారు, 6 వ తేదీ శుక్రవారంనాడే కలశపూజ ప్రారంభానికి ముందు శ్రీ సూర్య భగవానుణ్ణి భక్తితో దర్శించి కలశపూజను ఆచరిస్తున్నామని మనసులోని సంకల్పాన్ని శ్రీ సూర్యగ్రహ సందర్శనం చేస్తూ మనసులోనే ప్రార్దించుకోండి.
 8. ఉదయం నుంచి ఎటువంటి ఆహార నియమములు లేవు.
 9. ఇంతవరకు మీ వద్ద స్వస్తిక్ మార్క్ రుమాలు, 11 పోగుల ఎరుపు దారంతో చేసిన సూత్రము, నాణెములు, 16 బిందువులతో కూడిన త్రిభుజ చిత్ర రుమాలు ఉన్నవి.
 10. ఇప్పుడు 5 వ రక్షాకవచాన్ని సిద్దం చేసుకోవాలి. 
 11. 16 బిందువులతో కూడిన త్రిభుజ చిత్ర రుమాలు కంటే నాలుగు వైపులా స్వల్పంగా అర అంగుళం తగ్గుదలతో వుండే మరో తెలుపు వస్త్రాన్ని తీసుకొనండి.
 12. ఎరుపు కుంకుమను ఆవునేతితో కలిపి రుమాలు మధ్య భాగంలో  'శ్రీం' అనే బీజాక్షరాన్నివేసుకోవాలి.
 13. పూజకు తెలుపు రంగు పుష్పాలను వినియోగించండి. లేనిచో  ఏరంగు  పుష్పాలైనను వినియోగించండి. ప్రాధాన్యత తెలుపు రంగు.
 14. పసుపు , నెయ్యి కలిపిన అక్షతలు సిద్దం చేసుకోండి. 
 15. దీపారాధనకు వాడే తైలము మీ నిర్ణయము.  వత్తుల సంఖ్య, ప్రమిదల సంఖ్య మీ నిర్ణయమే.
 16. కలశం మీద పీచు తీసిన కొప్పులా ఉండే కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయను కుంకుమతో చక్కగా అలంకరించుకోండి.
 17. నివేదనకు బెల్లం లేక పంచదారతో చేసిన పాయసం. (బియ్యము లేక సేమ్యా లేక బియ్యపురవ్వ, పాలు) కొబ్బరికాయ ఇతర ఫలములు మొదలైనవి నివేదించటము  మీ ఇష్టానుసారం. 
 18. ఇక పూజకు ఓ పీట, పీట పైన పరిచే ఎరుపు రంగు నూతన వస్త్రము లేక అంతకు ముందు కలశపూజలకు వాడిన వస్త్రమైనను వినియోగించవచ్చు.
 19. వస్త్రం పైన మంచి బియ్యం, పూజకు అగరు బత్తీలు , కర్పూరము మొదలగునవి అవసరము.
 20. కలశంలోని కొబ్బరికాయ క్రింద ఉంచుటకు 5 మామిడాకులు లేక 5 తమలపాకులు అవసరము.
 21. సహజంగా ప్రతి ఇంటిలో పూజలకు వినియోగించుకొనే గంట మొదలగు సామగ్రిని వినియోగించుకోండి. 
  పూజా పద్ధతి
2012 ఏప్రిల్ 6 శుక్రవారం కేవలం ఐదవ కలశపూజ మిగులుగా ఉన్నవారు మాత్రమే భారతదేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 6 వ తేది ఉదయం 6  గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును.
పురుడు లేక మరణ అసౌచము వున్నవారు ఆచరించవద్దు ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము.
ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు. విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.

 • గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
 • ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
 • దీపారాధన చేసుకోండి.
 • బియ్యంపైన స్వస్తిక్ మార్క్ రుమాలును వుంచండి.
 • స్వస్తిక్ మార్క్ రుమాలుపై త్రిభుజాకారంగా ఉండే రుమాలును ఉంచండి. స్వస్తిక్ దిగువన ఉన్న వస్త్రపు కోణము మీ వైపుకు ఉండేలా పెట్టుకోండి.
 • అలాగే త్రిభుజం వేసిన వస్త్రంలోని త్రిభుజ కోణము మీ వైపుకు ఉండేలా, స్వస్తిక్ రుమాలు పై వేయండి. అనగా కలశానికి ముందు వైపు త్రిభుజం యొక్క భుజం రాకూడదు. కోణం రావాలి.
 • త్రిభుజ రుమాలుపై,  'శ్రీం' అనే బీజాక్షరం వేసిన రుమాలును ఉంచండి.
 • 'శ్రీం' రుమాలుపై కలశాన్ని పెట్టండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు ) కలశాన్ని కూడా గంధ, కుంకుమలతో అలంకరించుకోండి.
 • కలశంలో సగానికంటే తక్కువగా నీటిని పోయండి. ఆ నీటిలో సుగంధమునకై ఓ యలక్కాయను వేయండి. కలశంలో 5 మామిడాకులు లేక 5 తమలపాకులు  ఉండేలా చేసుకోండి.
 • కలశంపై కొబ్బరి కాయను వుంచండి. కలశం మీదనున్న కొబ్బరి కాయ కొప్పుపై దండవలె  11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి.
 • కలశం ముందున నాణెమును లేక నాణెములను ఉంచుకొనండి.
 • తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని శ్రీ గణపతిని ప్రార్దించండి. ( పసుపుతో చేసిన గణపతిని చేయవద్దు )   • ఈ దిగువ ఇచ్చిన 11 నామాలను నిశితంగా పరిశీలించండి.
1.        ఓం శ్రీమాత్రే నమః                              ఇది లలిత సహస్ర నామాలలో 1 వ నామం
  
2.      ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః                      ఇది లలిత సహస్ర నామాలలో 2 వ నామం  

3.      ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః           ఇది లలిత సహస్ర నామాలలో 3 వ నామం

4.      ఓం శ్రీమన్నగరనాయికాయై నమః      ఇది లలిత సహస్ర నామాలలో 56 వ నామం

5.      ఓం శ్రీకర్యై నమః                            ఇది లలిత సహస్ర నామాలలో 127 వ నామం 
  
6.      ఓం శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః             ఇది లలిత సహస్ర నామాలలో 392 వ నామం
  
7.      ఓం శ్రీవిద్యాయై నమః                     ఇది లలిత సహస్ర నామాలలో 585 వ నామం  

8.      ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః       ఇది లలిత సహస్ర నామాలలో 587 వ నామం

9       ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః       ఇది లలిత సహస్ర నామాలలో 996 వ నామం 

10.    ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః         ఇది లలిత సహస్ర నామాలలో 997 వ నామం
  
11.    ఓం శ్రీశివాయై నమః                       ఇది లలిత సహస్ర నామాలలో 998 వ నామం
  
 • ఈ నామాలను మొదటిసారి పై నుంచి దిగువ వరకు పఠి౦చండి. రెండవ సారి క్రింద నుంచి పైకి పఠి౦చండి. మూడవసారి పై నుంచి క్రిందకి పఠి౦చండి. ఈ విధంగా మొత్తం 9 పఠి౦చాలి.
 • అనగా పైన నుంచి క్రిందకు 5 సార్లు గాను, క్రింద నుంచి పైకి 4 సార్లు గాను అయినది.
 • 11 నామాలను 9 సార్లు ఎలా పఠి౦చాలో వివరంగా ఈ దిగువన ఇవ్వబడినది. దీనిని వెంకట్ అనువారలు చక్కగా అర్థమయ్యే రీతిలో డిజైన్ చేసారు. వారికి మా ధన్యవాదాలు. ఆ లింక్ ను ఈ దిగువన ఇస్తున్నాము. 99 నామావళి కొరకుగా క్లిక్ చేయండి. HERE
 • 99 నామాలను పఠి౦చే సమయంలో అక్షతలను గాని, పుష్పాలను గాని కలశంపై వేయండి.
 • అనగా 99 నామాలను పఠి౦చినట్లు అగును. పై నుంచి చదివేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అంటూ మొదలు పెడతాం. ఒకసారి 11 నామాలను చదివితే ఒక శక్తి కోణం అగును.
 • క్రింద నుంచి పైకి చదివేటప్పుడు ఓం శ్రీ శివాయై నమః అంటూ మొదలు పెడతాం. ఒకసారి 11 నామాలను చదివితే ఒక శివకోణం అగును.
 • ఆ విధంగా పై నుంచి క్రిందకి 5 సార్లు అనగా 5 శక్తి కోణాలు..... క్రింద నుంచి పైకి 4 సార్లు అనగా 4 శివ కోణాలు అగును.
 • శ్రీ చక్రంలో మధ్యభాగం లో ఉన్నబిందువుకు దిగువన 5 ముక్కోణాలు ఉండును. వీటిని శక్తి కోణాలు అంటారు.
 • శ్రీ చక్రంలో మధ్యభాగం లో ఉన్నబిందువుకు ఎగువున 4 ముక్కోణాలు ఉండును. వీటిని శివ కోణాలు అంటారు.
 • కనుక మొత్తం 99 నామాలలో..... 9 + 9 =18 ......... 1+ 8 = 9. ఈ తొమ్మిదే శివ శక్తుల కలయిక. 
 • తదుపరి ధూప, దీప, నైవేద్య, కర్పూర, తాంబూలాదులను సమర్పించండి.
 • నైవేద్యమనగా పాయసాన్ని జగన్మాతకు నివేదించండి. మీకిష్టమైన ఫలాలను, కొబ్బరికాయను కూడా సమర్పించుకోవచ్చును.
 • చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తితో, విశ్వాస, నిర్మల, నిశ్చలత్వంతో పూజ చేసుకొనండి.
 • చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి.
 • పూజ పూర్తి అయిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి.
 • ఈ పూజా కార్యక్రమంలో కుంకుమార్చన చేయవద్దు.
 • 9 కలశపూజలు పూర్తైన తదుపరే ప్రత్యేక పద్దతిలో కుంకుమార్చన చేయాలి.
 • ఈ పూజ చేసే సమయంలో మీ బంధు, మిత్రాదులను పిలుచుకొనవచ్చు.
ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు, షోడశ బిందు సహిత త్రిభుజంతో ఉన్నరుమాలు, శ్రీం బీజ రుమాలు అనబడే ఐదు కలశపూజలు  పూర్తి చేసిన వారగుదురు.

ఏప్రిల్ 6  నాటి రక్షాకవచాన్ని క్రియాత్మకంగా ఉత్తేజపరచుటకు (activation ) సమయము

 • భారత దేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 6 వ తేది రాత్రి 7 గంటల నుంచి 12 గంటల లోపల చైత్ర పూర్ణిమ పూర్ణ చంద్రునికి 5 వ రక్షాకవచాన్ని దర్సింపచేయండి. దీనితో పాటు మిగిలిన 4 రక్షాకవచాలను కూడా దర్శింపచేయవచ్చు. 
 • అనివార్య కారణాలచే దర్శింప చేయలేనివారు భారతదేశం మరియు విదేశాలలో ఉండే వారు ఏప్రిల్ 7  శనివారం రోజున పగటి సమయంలో 10 గంటల లోపల శ్రీ సూర్యనారాయణ స్వామికి దర్శింపచేయండి.
 • ఒకసారి ఉత్తేజపరిచిన రక్షాకవచాలను ఎన్నిపర్యాములైననూ ఉత్తేజపరచుకోవచ్చు, లేదా నూతన కవచాన్ని మాత్రమే ఆక్టివేట్ చేసుకోవచ్చు.
తొమ్మిది రక్షాకవచాలను ఒకేసారి పొందుటకు అతిత్వరలోనే ఒక శుభకరమైన రోజు సిద్ధంగా వుంది.
కనుక ఇప్పటివరకు టీవీ ద్వారా 5 రక్షాకవచాలను గురించి చెప్పటం జరిగింది.
 
ఇంకనూ 6 , 7 రక్షాకవచాలను 2012 ఏప్రిల్ 15 న భారతదేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 15 ఉదయం 6  గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించి,  రెండింటిని పొందబోతున్నాము.
 
అలాగే 8, 9 రక్షాకవచాలను కూడా 2012 మే 5 న భారతదేశంలో మరియు విదేశాలలో మే 5 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల  లోపల ఆచరించి, పొందబోతున్నాము.
 
ఈ రోజు కూడా 5 వ దానిని చేసుకోలేని వారు నిరుత్సాహపడవద్దు. ఏప్రిల్ 15 వ తేదిన 6 , 7 పూజలతో కలిపి చేసుకొనవచ్చును. అయితే చాలా శ్రమ పడాలి. అందుచేత వీలైనంత వరకు ఏప్రిల్ 6 ను మిస్ కావద్దు.
 
9 రక్షాకవచాలను కూడా పొందుటకు 2012 జూన్ 5 భారతదేశంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆచరించుకోవాలి. విదేశాలలో జూన్ 5 ఉదయం 10 గంటల లోపల ఆచరించుకోవాలి.

గమనిక 1 : కలశంలోని నీటిని కుటుంభ సభ్యుల శిరస్సుపై చల్లుకొని మిగిలిన నీటిని తులసి చెట్టు, లేక ఇతర మొక్కల మొదళ్ళలో పోయాలి. యాలక్కయను ప్రసాదంగా స్వీకరించవచ్చును. కలశం పై కొబ్బరి కాయను కొట్టుకొని వృధా కానివ్వకుండా తీపి వంటకాలలో ఉపయోగించుకోవాలి. కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని తర్వాత రోజులలో
భోజన పదార్ధంగా వినియోగించుకోనేది. వృధాగా పోనివ్వవద్దు. బియ్యం క్రింద వ్రుంచిన వస్త్రమును తదుపరి కలశ పూజలలో ఉపయోగించుకోవచ్చు.
గమనిక 2 : గతంలో పొట్టు ఉన్న గోధుమపిండి అవసరము అని చెప్పి ఉన్నాను. ఈ గోధుమపిండి ఒకే సారి తొమ్మిది కలశపూజలు చేసుకొనే సమయములో మాత్రమే అవసరము. ప్రస్తుతము అవసరము లేదు.
గమనిక 3 :తొమ్మిది కలశపూజలు పూర్తి అయ్యే వరకు, పాఠకులకు కొంత అయోమయంగా ఉంటున్నట్లు గా వుంటుంది. అందుచేత అయోమయంతో చేసుకోలేనటువంటి వారు ప్రస్తుతం ఆగి ... 2012 జూన్ 5 న ఒకేసారి నా ఆధ్వర్యంలో, నా పర్యవేక్షణలో,  ఆంద్రప్రదేశ్ లో ఓ ప్రత్యేక ప్రాంతంలో ఓంకార మహాశక్తి పీఠం నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొని ఆచరించుకోండి.

ఒకరి తరఫున మరొకరు కూడా చక్కగా సంకల్ప సహితంగా భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో ఆచరించుకోవచ్చు.  దయచేసి ఈ పై తేదీలను తెలియనివారందరికీ తెలియచేయగలరని మనవి.

Sunday, March 11, 2012

మార్చ్ 14 నాటి కలశపూజ సంపూర్ణ వివరాలు

మార్చ్ 14 బుధవారం 4 వ కలశపూజ మాత్రమే
 1. 2012 మార్చ్ 14 బుధవారం కేవలం నాల్గవ కలశపూజ మిగులుగా ఉన్నవారు మాత్రమే భారతదేశంలో మరియు విదేశాలలో మార్చ్ 14 ఉదయం 6  గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
 2. ఉదయం నుంచి ఎటువంటి ఆహార నియమములు లేవు.
 3. ఇంతవరకు మీ వద్ద స్వస్తిక్ మార్క్ రుమాలు, 11 పోగుల ఎరుపు దారంతో చేసిన సూత్రము, నాణెములు ఉన్నవి.
 4. ఇప్పుడు 4 వ రక్షాకవచాన్ని సిద్దం చేసుకోవాలి. 
 5. స్వస్తిక్ మార్క్ రుమాలు కంటే నాలుగు వైపులా స్వల్పంగా తగ్గుదలతో వుండే మరో తెలుపు వస్త్రాన్ని తీసుకొనండి.
 6. పసుపును నేతితో కలిపి వస్త్రం పై మధ్య భాగంలో త్రిభుజాన్ని వేయండి.
 7. కుంకుమను నేతితో కలిపి త్రిభుజానికి మూడువైపులా 15 బిందువులను, త్రిభుజం మధ్యలో పెద్ద బిందువును వేయండి.
 8. పూజకు ఏరంగు  పుష్పాలైనను వినియోగించండి.
 9. పసుపు , నెయ్యి కలిపిన అక్షతలు సిద్దం చేసుకోండి.
 10. దీపారాధనకు వాడే తైలము మీ నిర్ణయము.  వత్తుల సంఖ్య, ప్రమిదల సంఖ్య మీ నిర్ణయమే.
 11. కలశం మీద పీచు తీసిన కొప్పులా ఉండే కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయను కుంకుమతో చక్కగా అలంకరించుకోండి.
 12. నివేదనకు బెల్లంతో చేసిన బియ్యపు పొంగలి. కొబ్బరికాయ ఇతర ఫలములు మొదలైనవి నివేదిన్చాతము మీ ఇష్టానుసారం. 
 13. ఇక పూజకు ఓ పీట, పీట పైన పరిచే ఎరుపు రంగు లేక ఏ రంగు వస్త్రమైన లేక అంతకు ముందు పూజలకు వాడిన వస్త్రమైనను వినియోగించవచ్చు
 14. వస్త్రం పైన మంచి బియ్యం, పూజకు అగరు బత్తీలు , కర్పూరము మొదలగునవి అవసరము.
 15. కలశంలోని కొబ్బరికాయ క్రింద ఉంచుటకు 5 మామిడాకులు అవసరము.
 16. సహజంగా ప్రతి ఇంటిలో పూజలకు వినియోగించుకొనే గంట మొదలగు సామగ్రిని వినియోగించుకోండి. 
  పూజా పద్ధతి
2012 మార్చ్ 14 బుధవారం కేవలం నాల్గవ కలశపూజ మిగులుగా ఉన్నవారు మాత్రమే భారతదేశంలో మరియు విదేశాలలో మార్చ్ 14 ఉదయం 6  గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి. పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును. పురుడు లేక మరణ అసౌచము వున్నవారు ఆచరించవద్దు ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము. ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు. విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.
 • గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
 • ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
 • దీపారాధన చేసుకోండి.
 • బియ్యంపైన స్వస్తిక్ మార్క్ రుమాలును వుంచండి.
 • స్వస్తిక్ మార్క్ రుమాలుపై త్రిభుజాకారంగా ఉండే రుమాలును ఉంచండి. స్వస్తిక్ దిగువన ఉన్న వస్త్రపు కోణము మీ వైపుకు ఉండేలా పెట్టుకోండి.
 • అలాగే త్రిభుజం వేసిన వస్త్రంలోని త్రిభుజ కోణము మీ వైపుకు ఉండేలా, స్వస్తిక్ రుమాలు పై వేయండి. అనగా కలశానికి ముందు వైపు త్రిభుజం యొక్క భుజం రాకూడదు. కోణం రావాలి.
 • త్రిభుజ రుమాలుపై కలశాన్ని పెట్టండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు ) కలశాన్ని కూడా గంధ, కుంకుమలతో అలంకరించుకోండి.
 • కలశంలో సగానికంటే తక్కువగా నీటిని పోయండి. ఆ నీటిలో సుగంధమునకై ఓ యలక్కాయను వేయండి. కలశంలో 5 మామిడాకులు  ఉండేలా చేసుకోండి.
 • కలశంపై కొబ్బరి కాయను వుంచండి. కలశం మీదనున్న కొబ్బరి కాయ కొప్పుపై దండవలె  11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి.
 • కలశం ముందున నాణెమును లేక నాణెములను ఉంచుకొనండి.
 • తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని శ్రీ గణపతిని ప్రార్దించండి.
 • ఆపైన ఈ దిగువ నామాన్ని 27 సార్లు లేక 54 లేక 108 సార్లు భక్తీతో, విశ్వాసంతో పఠి౦చండి. 
 • ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగాయై నమః (ఇది లలిత సహస్రనామాలలో 71 వ నామము. )
 • తదుపరి ధూప, దీప, నైవేద్య, కర్పూర, తాంబూలాదులను సమర్పించండి.
 • నైవేద్యమనగా పొంగలిని జగన్మాతకు నివేదించండి. మీకిష్టమైన ఫలాలను, కొబ్బరికాయను కూడా సమర్పించుకోవచ్చును.
 • చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తితో, విశ్వాస, నిర్మల, నిశ్చలత్వంతో పూజ చేసుకొనండి.
 • చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి.
 • పూజ పూర్తి అయిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి.
ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు, షోడశ బిందు సహిత త్రిభుజంతో ఉన్నరుమాలు అనబడే నాలుగు కలశాపూజలు పూర్తి చేసిన వారగుదురు. మార్చ్ 14 నాటి రక్షాకవచాన్ని క్రియాత్మకంగా ఉత్తేజపరచుటకు (activation ) సమయము
 
అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రి వేద్యవర్జితా
యోగినీ యోగదా యోగ్యా యోగనందా యుగంధరా - 129 (లలితాసహస్ర నామ స్తోత్రం)   
లేదా ఈ క్రింది నామాలను పఠిస్తూ రక్షాకవచము లేక కవచాలను దర్సింపచేయండి.

 
ఓం అదృశ్యాయై నమః  
     ఓం దృశ్యరహితాయై నమః
     ఓం విజ్ఞాత్ర్యై నమః     
     ఓం వేద్యవర్జితాయై నమః
     ఓం యోగిన్యై నమః
     ఓం యోగదాయై నమః
     ఓం యోగ్యాయై నమః
     ఓం యోగానందాయై నమః
     ఓం యుగంధరాయై నమః
(లలితా సహస్రనామావళిలోని 649 నుంచి 657 వరకు)

 • పై నామాలను లేక శ్లోకమును 14 వ తేది రాత్రి సమయంలో గురు, శుక్రులను దర్శించినప్పుడు గాని లేక 15 వ తేది శ్రీ సూర్యనారాయణునికి దర్శింపచేసినప్పుడు పఠి౦చాలి.
 • భారత దేశంలో మరియు విదేశాలలో మార్చ్ 14 రాత్రి 6 గంటల నుంచి 8 గంటల లోపల పడమర దిశలో భరణి సంగమంగా వెలుగొందుతున్న గురు, శుక్రులకు 4 వ రక్షాకవచాన్ని దర్సింపచేయండి. దీనితో పాటు మిగిలిన 3 రక్షాకవచాలను కూడా దర్శింపచేయవచ్చు. 
 • అనివార్య కారణాలచే దర్శింప చేయలేనివారు భారతదేశం మరియు విదేశాలలో ఉండే వారు మార్చ్ 15 గురువారం మూల నక్షత్రం రోజున పగటి సమయంలో 10 గంటల లోపల శ్రీ సూర్యనారాయణ స్వామికి దర్శింపచేయండి.
 • ఒకసారి ఉత్తేజపరిచిన రక్షాకవచాలను ఎన్నిపర్యాములైననూ ఉత్తేజపరచుకోవచ్చు, లేదా నూతన కవచాన్ని మాత్రమే ఆక్టివేట్ చేసుకోవచ్చు.
తొమ్మిది రక్షాకవచాలను ఒకేసారి పొందుటకు అతిత్వరలోనే ఒక శుభకరమైన రోజు సిద్ధంగా వుంది. కనుక ఇప్పటివరకు టీవీ ద్వారా 5 రక్షాకవచాలను గురించి చెప్పటం జరిగింది. 5 వ రక్షాకవచాన్ని పొందలేనివారు 2012 ఏప్రిల్ 6 న పొందవచ్చును. ఇంకనూ 6 , 7 రక్షాకవచాలను 2012 ఏప్రిల్ 15 న రెండింటిని పొందబోతున్నాము. అలాగే 8, 9 రక్షాకవచాలను కూడా 2012 మే 5 న పొందబోతున్నాము. 9 రక్షాకవచాలను కూడా పొందుటకు 2012 జూన్ 5 .... సమయము ఆసన్నమవుతున్నది.
గమనిక 1 : కలశంలోని నీటిని కుటుంభ సభ్యుల శిరస్సుపై చల్లుకొని మిగిలిన నీటిని తులసి చెట్టు, లేక ఇతర మొక్కల మొదళ్ళలో పోయాలి. యాలక్కయను ప్రసాదంగా స్వీకరించవచ్చును. కలశం పై కొబ్బరి కాయను కొట్టుకొని వృధా కానివ్వకుండా తీపి వంటకాలలో ఉపయోగించుకోవాలి. కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని తర్వాత రోజులలో భోజన పదార్ధంగా వినియోగించుకోనేది. వృధాగా పోనివ్వవద్దు. బియ్యం క్రింద వ్రుంచిన వస్త్రమును తదుపరి కలశ పూజలలో ఉపయోగించుకోవచ్చు.
గమనిక 2 : గతంలో పొట్టు ఉన్న గోధుమపిండి అవసరము అని చెప్పి ఉన్నాను. ఈ గోధుమపిండి ఒకే సారి తొమ్మిది కలశపూజలు చేసుకొనే సమయములో మాత్రమే అవసరము. ప్రస్తుతము అవసరము లేదు.
గమనిక 3 :తొమ్మిది కలశపూజలు పూర్తి అయ్యే వరకు, పాటకులకు కొంత అయోమయంగా ఉంటున్నట్లు గా వుంటుంది. అందుచేత అయోమయంతో చేసుకోలేనటువంటి వారు ప్రస్తుతం ఆగి ... 2012 జూన్ 5 న ఒకేసారి నా ఆధ్వర్యంలో, నా పర్యవేక్షణలో,  ఆంద్రప్రదేశ్ లో ఓ ప్రత్యేక ప్రాంతంలో ఓంకార మహాశక్తి పీఠం నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొని ఆచరించుకోండి.

కలశపూజ తేదీల వివరాలు

 • ఎంతో అభిమానంతో భక్తి విశ్వాసాలతో ప్రపంచ వ్యాప్తంగా కలశపూజలు ఆచరిస్తున్న వారందరికీ కొన్ని కొన్నిసందేహాలు తేదిలలో వస్తుంటాయి. సందేహ నివృత్తి కొరకై వివరంగా ఈ దిగువన ఉదహరిస్తున్నాను. 2012 మార్చ్ నెలలో నాల్గవ తేదిన 1,2,3 కలశ పూజలు ఆచరించుకున్నారు. గతంలో 2 వరకే ఆచరించి మిగిలినది చేయనివారు కూడా మార్చ్ 4 న చేసుకున్నారు.
 • 2012 మార్చ్ 12 వ తేదిన 1,2,3,4 వరుసగా కలశ పూజలు ఆచరించవచ్చును. గతంలో 2 వరకే ఆచరించి మిగిలిన 3 , 4 ఆచరించని వారు మార్చ్ 12  సోమవారం ఉదయం 10 గంటల లోపల చేసుకోవాలి. విదేశాలలో అయితే 11 వ తేది ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
 • 2012 మార్చ్ 14 బుధవారం కేవలం నాల్గవ కలశపూజ మిగులుగా ఉన్నవారు మాత్రమే భారతదేశంలో మరియు విదేశాలలో మార్చ్ 14 ఉదయం 6  గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
 • 2012 ఏప్రిల్ 6 వ తేది శుక్రవారం కేవలం 5 వ కలశపూజ మిగులుగా ఉన్నవారు భారతదేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 6 ఉదయం 6  గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
 • 2012 ఏప్రిల్ 15 ఆదివారం నాడు 6 మరియు 7 కలశపూజలు ఒకేసారిగా భారతదేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 15 ఉదయం 6  గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
 • 2012 మే 5 శనివారం నాడు 8 మరియు 9 కలశపూజలు ఒకేసారిగా భారతదేశంలో మరియు విదేశాలలో మే 5 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల  లోపల ఆచరించుకోవాలి.
 • 2012 జూన్ 5 మంగళవారం ఒకేసారి తొమ్మిది కలశపూజలు ఆచరించేవారు భారతదేశంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆచరించుకోవాలి. విదేశాలలో జూన్ 5 ఉదయం 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
ఒకరి తరఫున మరొకరు కూడా చక్కగా సంకల్ప సహితంగా భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో ఆచరించుకోవచ్చు.  దయచేసి ఈ పై తేదీలను తెలియనివారందరికీ తెలియచేయగలరని మనవి.

Thursday, March 8, 2012

మార్చ్ 12 నాటి కలశపూజ సంపూర్ణ వివరాలు

2012 మార్చ్ 4 వ తేదిన 1 ,2 , 3 కలశ పూజలను ఒకేసారి ఆచరించారు. అలాగే 2011 అక్టోబర్ 25 న ఆచరించి, ఆ తదుపరి ఎలాంటి పూజలు చేయనివారు కూడా, 3 వ కలశాపూజను మార్చ్ 4 న ఆచరించారు. అంటే వరుసగా 3 రక్షా కవచాలను సిద్దం చేసుకున్నారన్నమాట.
అలాగే మార్చి 12 వ తేదీ సోమవారంనాడు నాల్గవ కలశ పూజ ఆచరించుటకు అవకాశం వుంది.
గతంలో స్వస్తిక్ మార్కు రుమాలును మొదటి రక్షాకవచంగా పొందివున్నారు.
ఆ తరువాత 2011 అక్టోబర్ 25 మంగళవారంనాడు ధనత్రయోదశి, కృష్ణ అంగారక చతుర్దశి పర్వదినాన రెండవ కలశపూజ ఆచరించారు. 


ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 
A . మొదట స్వస్తిక్ రుమాలను పొందినవారు 2011  అక్టోబర్ 25 న కలశపూజ (రుమాలు మరియు సూత్రము) ఆచరించి వుంటే, వారు రెండు రక్షాకవచాలకు చెందిన రెండు కలశపూజలను చేసారని భావించాలి. 
B .  అలాకాక 2011  అక్టోబర్ 25 నాడే పూజ ఆచరించి ఉన్ననూ, వారు కూడా రెండు రక్షాకవచాలకు చెందిన రెండు కలశపూజలను చేసారని భావించాలి.   

మొదట రుమాలును పొందివుండి, 2011 అక్టోబర్ 25 ఎలాంటి పూజ ఆచరించకుండా, 2011 డిసెంబెర్ 21 బుధవారంనాడు పూజ ఆచరించి వుంటే (రుమాలు, సూత్రము మరియు నాణెంతో)... వీరు 3 రక్షాకవచాలకు చెందిన మూడు కలశపూజలను చేసారని భావించాలి. ఇంతవరకూ మూడు రక్షాకవచాలను పొందారని భావము.
 

 3 వ కలశపూజ తదుపరి ప్రతిపూజను ఖచ్చింతంగా పాటిస్తూ 9 రక్షాకవచాలను పొందవచ్చు.
అంతేకాని 3 ఆచరించి, 4 చేయకుండా 5 చేయకూడదు.
ఇప్పటివరకు ఎటువంటి కలశపూజలను ఆచరించని వారందరూ మార్చి 4 ఆదివారంనాడు 3 రక్షాకవచాలను ఒకేసారి పొంది ఉండవచ్చు.
మార్చ్ 4 వ తేదిన కూడా అనివార్య కారణాల వలన చేయని పక్షంలో... మార్చ్ 12 సోమవారం నాడు ఆచరించవచ్చును. 


మార్చ్ 12 సోమవారం ఆచరించవలసిన వారు

A ) ఇంతవరకు ఎలాంటి కలశ పూజలు ఆచరించనివారు, ఇప్పుడు ఒకేసారి 4 పూజలను ఒకే కలశంతో ఆచరించవచ్చు. 
B ) మూడవ, నాల్గవ కలశ పూజలను ఆచరించనివారు మార్చి 12 న ఆచరించవచ్చును. 


 1. భారతదేశంలో మార్చి12 సోమవారం ఉదయం 10 గంటల లోపల, విదేశాలలో మార్చ్ 11 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపల ఆచరించవచ్చును.
 2. ఉదయం నుంచి ఎటువంటి ఆహార నియమములు లేవు.
 3. స్వస్తిక్ మార్కు చిత్రాన్ని, నలుచదరంగా ఉండే తెలుపు లేక పసుపు రంగు వస్త్రంపై ఎరుపు రంగు కుంకుమ కలిపిన ఆవు నేతితో కానీ, పసుపు కలిపిన ఆవు నేతితో కానీ చిత్రీకరించుకోవాలి.
 4. తెలుపు రంగు నలుచదరపు వస్త్రంపై ఎరుపు కుంకుమ లేక పసుపుతో నెయ్యి కలిపి చిత్రీకరించుకోండి.
 5. పసుపు రంగు నలుచదరపు వస్త్రంపై ఎరుపు కుంకుమను నేతితో కలిపి చిత్రీకరించుకోండి.
 6. నలుచదరపు వస్త్రము గరిష్టంగా 12 X 12 అంగుళాల వరకు తీసుకోండి, సైజు కొద్దిగా తగ్గిననూ సమస్య ఏమీ లేదు.
 7. టేబుల్ పైన వస్త్రాన్ని వుంచి నాలుగు మూలాలు త్రిభుజాలుగా మడుచుకోండి.
 8. నాలుగు త్రిబుజాల మధ్యన వున్న చదరంలో స్వస్తిక్ మార్కును వేయండి.
 9. ఇందు జతపరచిన ఫోటోలో వున్న విధంగా చిత్రించుకోండి.
 10. ఎరుపు రంగు దారము లేక పాలిష్టార్ దారము లేక ఎరుపు వూలేన్ దారంతో 11 పోగులతో 12 అంగుళాల సైజు లో తయారు చేసుకోండి.
 11. ఇలా తయారైన 12 అంగుళాల ఎరుపు రంగు సూత్రానికి మధ్యలో ముడి వేయండి.
 12. చిత్రంలో చూపిన విధముగా స్వస్తిక్ మార్క్ రుమాలు కంటే నాలుగు వైపులా స్వల్పంగా తగ్గుదలతో వుండే మరో తెలుపు వస్త్రాన్ని తీసుకొనండి.
 13. పసుపును  నేతితో కలిపి వస్త్రం పై మధ్య భాగంలో త్రిభుజాన్ని వేయండి.
 14. కుంకుమను నేతితో కలిపి త్రిభుజానికి మూడువైపులా 15 బిందువులను, త్రిభుజం మధ్యలో పెద్ద బిందువును వేయండి.
 15. పాతకాలం నాటి నాణేలను లేక ప్రస్తుతం చలామణిలో వున్న నాణేలను లేక బంగారు వెండి నాణేలను ఎన్నింటినైననూ కలశంలోని నీటిలో వేయాలి.
 16. ఈ కలశంలోని నీటిలోనే ఒక ఏలక్కాయను కూడా వేయాలి.
 17. పూజకు ఎరుపు మందార పుష్పాలను లేక ఏవైనా ఎరుపు పుష్పాలను వినియోగించండి. పసుపు , నెయ్యి కలిపిన అక్షతలు సిద్దం చేసుకోండి.
 18. ఎరుపు రంగు పుష్పాలు దొరకనిచో ఏ రంగు పుష్పాలైన తీసుకోండి. ఆ పుష్పాలపై ఎరుపు కుంకుమను చల్లండి. అంతే కాని కుంకుమ కలిపిన తైలాన్ని చల్లవద్దు.
 19. దీపారాధనకు నువ్వులనూనెను వాడవద్దు. కొబ్బరినూనె లేక ఆవు నేతిని వినియోగించండి. వత్తుల సంఖ్య, ప్రమిదల సంఖ్య మీ నిర్ణయమే.
 20. కలశం మీద పీచు తీసిన కొప్పులా ఉండే కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయను కుంకుమతో చక్కగా అలంకరించుకోండి.
 21. నివేదనకు ఓ కొబ్బరికాయ, తొమ్మిది ఎందు కర్జూరాలు మరియు బెల్లం చేసిన బియ్యపు పొంగలి.
 22. ఇక పూజకు ఓ పీట, పీట పైన పరిచే ఎరుపు రంగు నూతన వస్త్రం, దాని పైన అరకిలో మంచి బియ్యం, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరము మొదలగునవి అవసరము.
 23. కలశంలోని కొబ్బరికాయ క్రింద ఉంచుటకు 5 తమలపాకులు , 5 మామిడాకులు అవసరము.
  సహజంగా ప్రతి ఇంటిలో పూజలకు వినియోగించుకొనే గంట మొదలగు సామగ్రిని వినియోగించుకోండి. 
 24. పూజా పద్ధతి
మార్చి 12 వ తేదిన భారతదేశంలో ఉదయం, విదేశాలలో మార్చ్ 11 సాయంత్రం ఆచరించాలి. పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును. పురుడు లేక మరణ అసౌచము వున్నవారు ఆచరించవద్దు ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము. ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు. విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.
 • గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
 • ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
 • దీపారాధన చేసుకోండి. తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని శ్రీ గణపతిని ప్రార్దించండి.
 • బియ్యంపైన స్వస్తిక్ మార్క్ రుమాలును వుంచండి.
 • స్వస్తిక్ మార్క్ రుమాలుపై త్రిభుజాకారంగా ఉండే రుమాలును ఉంచండి.
 • త్రిభుజం లోని ఒక కోణం కలశం ముందుకు ఉండాలి. అనగా కలశానికి ముందు వైపు త్రిభుజం యొక్క భుజం రాకూడదు. కోణం రావాలి.
 • త్రిభుజ రుమాలుపై కలశాన్ని పెట్టండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు ) కలశంలో 5 తమలపాకులు లేక  5 మామిడాకులు  ఉండేలా చేసుకోండి.
 • కలశంలో నీటిని క్రొద్ది క్రొద్దిగా 8 సార్లుగా పోయాలి.  ఈ దిగువ తెల్పిన 8  నామాలను ఒక్కొక్క దానిని చదువుతూ, అక్షతలతో బొమ్మలో నోట్ చేసిన చోట అక్షతలను వేయండి.
 • కలశంలో దిగువ నామాలను పఠిస్తూ (లలిత సహస్రనామం లో 742 నుంచి 749 వరకు వున్న నామాలతో) స్వస్తిక్ రుమాలుకు కలశం ముందు నుంచి గడియారంలో ముళ్ళు తిరిగినట్ట్లుగా సవ్య దిశలో 8 మూలలలో అక్షతలను వేయండి.
ఓం భవదావసుధావృష్ట్యై నమః
ఓం పాపారణ్యదవానలాయై నమః
ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః
ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః
ఓం భాగ్యాబ్ధిచంద్రికాయై నమః
ఓం భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః
ఓం రోగపర్వతదంభోల్యై నమః
ఓం మృత్యుదారుకుఠారికాయై నమః

 • అలా 8 దిక్కులు, విదిక్కులు అయిన తదుపరి, కలశంలో యాలాక్కాయాను వేయండి. కలశంలో ఒకటి కంటే ఎన్ని నాణేలైనను వేయండి. పరిమితి లేదు.
 • కలశంపై కొబ్బరి కాయను వుంచండి. కలశం మీదనున్న కొబ్బరి కాయ కొప్పుపై దండవలె  11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి.
 • పై ప్రకారంగా స్వస్తిక్ మార్క్ రుమాలుపై కలశం ముందు భాగం నుంచి మొదలు పెట్టి సవ్య దిశలోనే (గడియారం లోని ముల్లులా )ఎనిమిది వైపులా అక్షతలను వేసుకున్నారు కదా.
 • ఇప్పుడు లలిత సహస్రనామంలో 475 నుంచి 527 నామం వరకు మొత్తం 53  నామాలు వుంటాయి.
 • ఈ నామాలకు ముందు ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి. అప్పుడు మొత్తం 54  నామాలు అగును.
 • వరుసగా ఈ 54  నామాలను భక్తి తో, విశ్వాసంతో కలశం పై అక్షతలు వేస్తూ పఠి౦చండి. 54 నామాలు కాగానే....
 • తిరిగి మరో మారు 475 నుంచి 527 నామం వరకు చదివి.... చివరలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి.
 • అనగా ఆది అంత్యాలలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామం ఉంటుందన్నమాట.
ఓం లలితాంబికాయై నమః
ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః

ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః
ఓం లలితాంబికాయై నమః

 • పై విధంగా 108 నామాలను పఠి౦చారు కదా, ఇప్పుడు ఒక్కసారి కర్పూర హారతిని ఇవ్వండి.
 • తిరిగి మరల ఈ దిగువ నామాన్ని 27 సార్లు లేక 54 లేక 108 సార్లు పఠి౦చండి. 
 • ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగాయై నమః (ఇది లలిత సహస్రనామాలలో 71 వ నామము. )
 • తదుపరి ధూప, దీప, నైవేద్య, కర్పూర, తాంబూలాదులను సమర్పించండి.
 • నైవేద్యమనగా , కొబ్బరి కాయను కొట్టి, తొమ్మిది ఎండుకర్జూరాలను, పొంగలిని జగన్మాతకు నివేదించండి. మీకిష్టమైన ఫలాలను కూడా సమర్పించుకోవచ్చును.
 • చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తితో, విశ్వాస, నిర్మల, నిశ్చలత్వంతో కోరుకోండి.
 • చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి.
 • కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి. కలశం లోని నాణేలను ఉద్వాసన అనంతరం దీపారాధన వెలుగుతున్నప్పటికి ఈ క్రింది నామాలను చదువుతూ కుడి చేతితో తీసుకొనండి .
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం మత్యై నమః
ఓం మేధాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం స్మృత్యై నమః
ఓం అనుత్తమాయై నమః
ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు, షోడశ బిందు సహిత త్రిభుజంతో ఉన్నరుమాలు అనబడే నాలుగు కలశాపూజలు పూర్తి చేసిన వారగుదురు.

2011 అక్టోబర్ 25 ఆచరించి, ఆపై ఏమి చేయని వారు 3 , 4 కలశపూజలను ఆచరించాల్సిన పద్ధతి
 • పై పద్ధతినే యధావిధిగా పాటించాలి. కాని ఒకే ఒక మార్పు ఉన్నది.
 • అది ఏమంటే కలశంలో నీరు పోస్తూ, ఎనిమిది నామాలను చదివిన తదుపరి ఒక నాణేన్నికలశంలోనూ, మరొక నాణేన్నికలశం ముందు వుంచండి.
 • లేదా  కొన్ని నాణేలను కలశంలోనూ, మరికొన్ని నాణేలను కలశం ముందు వుంచండి. మిగిలిన పద్దతి అంతయూ యధావిధి గానే జరిగిపోతుంది.
 • చివరిలో  కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి.
 • కలశం లోని నాణేలను ఉద్వాసన అనంతరం దీపారాధన వెలుగుతున్నప్పటికి 8 నామాలను చదువుతూ కుడి చేతితో తీసుకొని, కలశం ముందున్న నాణేలకు కలిపి బద్రపరచండి.
 • ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు షోడశ బిందు సహిత త్రిభుజంతో ఉన్నరుమాలు అనబడే నాలుగు కలశపూజలు పూర్తి చేసిన వారగుదురు.                  
ఈ మార్చ్ 12 పూజలను ఆచరించినవారు రక్షాకవచాలను క్రియాత్మకంగా ఉత్తేజపరచుటకు (activation ) సమయము

 • భారత దేశంలో మార్చ్ 14 రాత్రి 6 గంటల నుంచి 8 గంటల లోపల పడమర దిశలో భరణి సంగమంగా వెలుగొందుతున్న గురు, శుక్రులకు 4 రక్షాకవచాలను దర్సింపచేయండి.
 • విదేశాలలో వారు మార్చ్ 13 రాత్రి 8 నుంచి 9 లోపల పడమర దిశలో భరణి సంగమంగా వెలుగొందుతున్న గురు, శుక్రులకు 4 రక్షాకవచాలను దర్సింపచేయండి.
 • అనివార్య కారణాలచే దర్శింప చేయలేనివారు భారతదేశం మరియు విదేశాలలో ఉండే వారు మార్చ్ 15 గురువారం మూల నక్షత్రం రోజున పగటి సమయంలో 10 గంటల లోపల శ్రీ సూర్యనారాయణ స్వామికి దర్శింపచేయండి.
 • ఒకసారి ఉత్తేజపరిచిన రక్షాకవచాలను ఎన్నిపర్యాములైననూ ఉత్తేజపరచుకోవచ్చు, లేదా నూతన కవచాన్ని మాత్రమే ఆక్టివేట్ చేసుకోవచ్చు.
తొమ్మిది రక్షాకవచాలను ఒకేసారి పొందుటకు అతిత్వరలోనే ఒక శుభకరమైన రోజు సిద్ధంగా వుంది. కనుక ఇప్పటివరకు టీవీ ద్వారా 5 రక్షాకవచాలను గురించి చెప్పటం జరిగింది. ఇక 6 , 7 ఒకేరోజు పొందబోతున్నాము. అలాగే 7 , 8 కూడా ఒకేరోజు పొందబోతున్నాము. 9 రక్షాకవచాలను కూడా పొందుటకు ఒకేరోజు సమయము ఆసన్నమవుతున్నది.
గమనిక : కలశంలోని నీటిని కుటుంభ సభ్యుల శిరస్సుపై చల్లుకొని మిగిలిన నీటిని తులసి చెట్టు, లేక ఇతర మొక్కల మొదళ్ళలో పోయాలి. యాలక్కయను ప్రసాదంగా స్వీకరించవచ్చును. కలశం పై కొబ్బరి కాయను కొట్టుకొని వృధా కానివ్వకుండా తీపి వంటకాలలో ఉపయోగించుకోవాలి. కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని తర్వాత రోజులలో బోజన పదార్ధంగా వినియోగించుకోనేది. వృధాగా పోనివ్వవద్దు. బియ్యం క్రింద వ్రుంచిన వస్త్రమును తదుపరి కలశ పూజలలో ఉపయోగించుకోవచ్చు.

Tuesday, March 6, 2012

మార్చ్ 7 రాత్రి వినువీధిలో దర్శనమివ్వనున్న కుజ, చంద్రులు

2012  మార్చ్ 7 వ తేది బుధవారం సింహరాశిలో కుజ గ్రహ, చంద్ర గ్రహములు ఒకే నక్షత్ర, ఒకే బిందువులో ఏక కాల కలయిక జరగనున్నది. ఇటువంటి సమయంలో మనం సాధారణ కన్నులతో అరుణవర్ణములో ఉండే కుజ గ్రహమును వీక్షించవచ్చు. సూర్యాస్తమం కాగానే ఆకాశం మధ్య భాగంలో చంద్రుడు దర్శనమిస్తుంటాడు. ఆ చంద్రునికి చెంతనే అరుణవర్ణములో కుజగ్రహం ఉంటుంది. 

7 వ తేది రాత్రి 9.30 తదుపరి నుంచి కుజ, చంద్రులను వీక్షించవచ్చు. రాత్రి 9.30 నుంచి అర్థరాత్రి 1.00 గంట వరకు మధ్యకాలంలో... 4 వ తేది కలశపూజ చేసుకున్నవారందరూ తమ వద్దనున్న స్వస్తిక్ రుమాలును, ఎరుపు దారంతో వున్నా 11 పోగుల సూత్రమును, నాణెములు (నాణెమును) క్రియాత్మకముగా ఉత్తేజపరుచుకొనుటకు (activate ) అనువైన సమయం. 

కనుక భారతదేశంలో కలశపూజలు ఆచరించనివారు 7 వ తేది రాత్రి పై సమయంలో ఒక పళ్ళెరములో మూడు రక్షా కవచాలను ఉంచి, వాటిని భక్తీ పూర్వకంగా, విశ్వాసంతో చంద్ర కుజులకు దర్శింపచేయండి. విదేశాలలో వున్నవారు 7 వ తేది రాత్రి 7 .00 నుంచి 10.30 గంటల మధ్యకాలంలో దర్శింపచేయండి. ఒకవేళ దర్శింపచేయలేని వారు రెండవ రోజు ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి.

రక్షాకవచాలను ఆక్టివేట్ చేయుటకు ప్రత్యేకమైన గ్రహస్థితులు ఉన్న రోజున, ప్రత్యేక సమయంలో ఆయా గ్రహములకు దర్శింపచేయాలి. అలా దర్శింపచేయుటకు అవకాశం లభ్యం కానిచో రెండవ రోజే ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి. ఇది మొదటి పద్దతి.


ఇక రెండవ పద్ధతి ఏమనగా, ప్రత్యేక గ్రహస్థితులు లేకున్నచో, కొన్ని ప్రత్యేక తిధులలోను, నక్షత్రంలోను దర్శింపచేసుకోవచ్చు.  


A . శుక్ల పక్షంలో సప్తమి తిథి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటే... రక్షాకవచాలను ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి. 

B . శుక్ల పక్షంలో ఏకాదశి  తిథి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటే... రక్షాకవచాలను ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి. 

C . పూర్ణిమ తిథి సూర్యాస్తమయం నుంచి మరునాటి సూర్యోదయం వరకు ఉండినచో రక్షకవచాలను పూర్ణచంద్రునకు దర్శింపచేయాలి.  

D . బహుళ పక్షంలో ఏకాదశి  తిథి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటే... రక్షాకవచాలను ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి. 

E . మూల నక్షత్రం ప్రతి నెలలో వస్తుంటుంది. కనుక ఆ మూల నక్షత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటే రక్షా కవచాలను ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి.

ఒకవేళ పైన చెప్పిన 5 పద్దతులలో... సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తిథి గాని, నక్షత్రం గాని,.. పూర్ణిమ నాడు సూర్యాస్తమయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు పూర్ణిమ తిథి లేకుండా ఉంటే ఏం చేయాలి. ఇట్టి పరిస్థితులలో పూర్ణిమ తిథి పగలు కొద్ది భాగముంటే సూర్యునికి గాని, రాత్రి పూర్ణిమ తిథి కొద్ది భాగముంటే చంద్రునికి గాని దర్శింపచేయాలి.


ప్రత్యేక గ్రహస్థితులు లేకపోతేనే... పైన చెప్పిన తిథి నక్షత్రములపై ఆధారపడి సూర్య, చంద్రులకు రక్షాకవచాలను దర్శింపచేయాలి.  ఈ పద్దతి అన్ని కలశపూజలకు వర్తిస్తుంది. కనుక 7 వ తేది రాత్రి మేష, వృశ్చిక రాశులకు మరియు చిత్ర, ధనిష్ఠ, మృగశిర నక్షత్రములకు అధిపతిగా ఉన్నటువంటి కుజ గ్రహమును భక్తీతో, విశ్వాసంతో దర్శించుకొనండి. 


మీరు దర్సించుకోబోతున్న కుజ గ్రహము 2011 అక్టోబర్ 30 ఆదివారం మధ్యాహ్నం 3 .15 నిముషములకు సింహరాశిలో ప్రవేశించి స్తంభించిపోయాడు. తిరిగి 2012 జూన్ 21 రాత్రి 12 గంటల 6 నిముషములకు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. అంటే ప్రస్తుతం సింహరాశిలో కుజ గ్రహం స్తంభించి ఉన్నాడన్నమాట.

12 వ తేది తిరిగి 14 వ తేది కూడా కలశ పూజలు చేసుకొనవలసి ఉన్నది. అనివార్య కారణాలవలన, television ప్రసారాలలో కార్యక్రమమునకు అంతరాయం కల్గిననూ.... ఇతర ఎటువంటి కారణాల వలనైన చెప్పుటకు సమయం లేక పోయినను... అభిమనులేవరు విచారించవద్దు. ఈ గ్రహభుమి బ్లాగ్ ద్వారా వివరాలను తెలియ చేస్తాను. 


బ్లాగ్ చదివిన వీక్షకులందరూ... తము చదివిన వివరాలన్నింటిని, తెలియని వారికి తప్పకుండా తెలియచేయండి. ఎదుకంటే అసంఖ్యాకులకు బ్లాగ్లు చదివే  అవకాశం ఉండదు. కనుక మన ప్రాచీన వేదవాణి రహస్యాలను మీరందరూ తెలుసుకోనాలనే తపనతో అనేక విషయాలను మీ ముందుంచబోతున్నాను.  

14 వ తేది విశేషమైన రోజుగా గుర్తుండబోతుంది. కనుక మార్చ్ 14 నాటి విశేషాలను, ఆనాడు ఉదయం 8 గంటల తదుపరి గ్రహభూమి బ్లాగ్లో వీక్షించవలసిందిగా కోరుతున్నాను. 

గమనిక: రక్షాకవచాన్ని ఉత్తేజపరచుకోనుటకు , ఆచరించిన నాటి నుంచి 40 రోజుల లోపలే ప్రత్యేక గ్రహస్థితులలో గాని, లేక పైన చెప్పిన తిథి, నక్షత్ర  సమయాలలో గాని ఉత్తేజపరచుకోవాలి. 40 రోజులు దాటితే కలశపూజ వ్యర్థమైనట్లే.  

Sunday, March 4, 2012

2012 మార్చ్ 12,14 తేదీలలో కలశపూజలు ఎవరెవరు ఆచరించవచ్చును ?


ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎంతో అభిమానంతో, భక్తితో , విశ్వాసంతో మార్చ్ 4 నాటి కలశపూజలు చేసుకున్నందుకు చాలా సంతోషం. అయితే ఇప్పటికి అనేక మందికి సందేహాలు వస్తూనే వుంటాయి. ఇక 2012  మార్చ్ 12 వ తేది సోమవారం నాడు తిరిగి మార్చ్ 14 బుధవారం నాడు కలశ పూజలు ఆచరించుటకు అనువైన గ్రహ స్థితులు వున్న రోజులు. అయితే మార్చ్ 12 సోమవారం నాడు ఎవరెవరు ఆచరించుకోవాలి ? మార్చ్ 14 వ తేదిన ఎవరెవరు ఆచరించుకోవాలి అనే వివరాలను ఈ దిగువన తెలియచేస్తున్నాను. 

టీవీ కార్యక్రమంలో ఒక్కోసారి సమయం లేని కారణంగాను, ఇతర సాంకేతిక కారణాలవలన, కార్యక్రమ నిడివి తగ్గుతున్న కారణంగాను, లక్షలాది మంది ప్రేక్షకులందరికీ తగిన సమయంలో నేను చెప్పలేక పోతున్నందుకు చాలా విచారిస్తున్నాను. కనుక అందరికి అర్థమయ్యేలాగా వివరంగా ఇవ్వాలనే సంకల్పంతో, తెలుగు లో అన్ని విషయాలను తెలియచేస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు నా యందు వుండాలని మనసారా కోరుకుంటున్నాను. 

మామూలుగా నిత్యం ఫోన్ ద్వారా టీవిలో సమాధానాలు చెప్పటానికి, విశ్వవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వుండే వారికి రాశిఫలితాలలో స్వల్ప వ్యత్యాసాలతో సహా చెప్పటానికి, ఇటువంటి కలశ పూజల అద్భుత విశేషాలను మీ ముందుకు తేవటానికి, కొన్ని కొన్ని ఉత్తరాలను చదవటానికి, కొన్ని ముఖ్య ముహూర్తాలను, ఇతర అనేక అద్భుత గ్రహ సంచార స్థితులను తెలియచేయాలంటే, అరగంట టీవీ ప్రోగ్రాం సమయం చాలటం లేదు. వాణిజ్య సంభందిత కార్యక్రమాలకు అవకాశం వుంటుంది గాని, ఉచితంగా ప్రేక్షకులకు తెలియచేయటానికి సమయం పెంచలేక పోతున్నారు.

ఇటువంటి పరిస్థితిలో లక్షలాది ప్రేక్షకుల కోరిక మేరకు కొన్ని కొన్ని విశేషాలను ఇట్టి బ్లాగుల ద్వారా చెప్పటానికి అవకాసం వుంది. ఎన్నిసార్లైనా చదివి, ఆకళింపు చేసుకొనే అవకాశం వుంది. వీలైనంతవరకు తెలుసుకున్న వారు, ఇతరులకు తెలియచెప్పటానికి ప్రయత్నించండి. వేదవాణి అందించిన రహస్యాల విశేష అంశాలన్నింటిని మనందరం తెలుసుకుంటుంటే ఆనందం ఏంటో వుంటుంది. ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం.  

టీవీ చూసిన ప్రేక్షకులలో కొన్ని కలశ పూజలు ఆచరించిన తక్షణమే అద్భుతాలను కూడా చవిచూడటం జరిగినది. కానీ ఇంతవరకు చెప్పిన 5 కలశ పూజలలో కొంతమంది కొన్నింటిని ఆచరించారు. మరికొన్నింటిని ఆచరించలేకపోయారు. ఈ పరంపరలో 2012 మార్చి 4  వ తేదీ ఆదివారం అనగా ఈరోజు వరుసగా 3 కలశ పూజలు ఆచరించారు.
 
మార్చి 12 వ తేదీ సోమవారం ఎవరెవరు ఆచరించవచ్చు  :
A .
2011 అక్టోబర్ 25 న 11 దారపు పోగుల సూత్రంతో కలశపూజ చేసి, 3 , 4 కలశపూజలు చేయని వారు ఆచరించవచ్చును.
B . ఇంత వరకు ఎటువంటి పూజలు ఆచరించని వారు 1 , 2 , 3 , 4  కలశ పూజలు ఆచరించవచ్చును.   
అలాగే మార్చి 14 వ తేదీ బుధవారం ఎవరెవరు ఆచరించవచ్చు  :
కేవలం నాల్గవ కలశ పూజ ఆచరించుటకు అవకాశం ఉంది.
 

కనుక త్వరలోనే మార్చ్ 12 న కేవలం మూడు, నాల్గు కలశపూజలు ఎలా చేయాలి వివరంగానూ, అలాగే 1 , 2 , 3 , 4  కలశ పూజలు ఎలా చేయాలి అనే వివరాలు కూడా తెలియచేస్తాను. దయచేసి సావధాన  చిత్తులై చదవగలరని ఆశిస్తున్నాను. ఇతర దేశాలలో ఉన్న వారికి మార్చ్ 12 , 14 తేదిలలో ఏ ఏ సమయాలలో ఆచరించాలి, భారతదేశంలో ఉన్న వారు ఏ సమయంలో ఆచరించాలి తెలియచేస్తాను.  

దీనితో పాటు ఈ రోజు ఆచరించిన కలశ పూజల వారు తమ తమ రక్షాకవచాలను ఏ తేదిన ఏ సమయంలో activate  ( క్రియాత్మకముగా ఉత్తేజపరుచు) చేసుకోవాలో, సమయలన్నింటిని తెలియచేస్తాను. కనుక మార్చ్ 4 నాటి రక్షా కవచాలను భద్రంగా ఓ పెట్టెలో గాని, బీరువాలోగాని వుంచుకోగాలరని, తదుపరి ఇచ్చే activation వివరాల కోసం ఎదురు చూడగలరని ఆశిస్తున్నాను.

- పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Saturday, March 3, 2012

2012 మార్చి 4 న ఆచరించాల్సిన కలశపూజ వివరాలు

గార్గేయ సిద్దాంతి అనబడే నేను చెబుతున్న కలశ పూజ విశేషాలన్నింటిని భక్తిటీవీ ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రేక్షకులు అభిమానంతో, భక్తితో ఆచరించి విశేషమైన ఫలితాలను పొందుతున్నారని వచ్చిన వార్తలను ఎంతో సంతోషిస్తున్నాను. టీవీ కార్యక్రమంలో వున్నా సమయం చాలా తక్కువైన కారణంగాను, కొంతమంది ఆ సమయానికి వినలేని కారణంగాను, అనేక సందేహాలు వస్తే తీర్చే వారు లేనందుకు బాధపడుతున్నాను. అందుకొరకై ఈ గ్రహభూమి బ్లాగులో, ఈ కలశ పూజ విశేషాలను సమయం ఎక్కువ లేని కారణంగా క్లుప్తంగా ఇస్తున్నాను. చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తాను.

ప్రతి స్త్రీ, పురుషుల మాడు (శిరస్సు) క్రింద, మెదడులోని సహస్రారచక్రంలో శ్రీ చక్రం వుంటుంది. ఈ సమస్త సృష్టి శ్రీ చక్రంలోని తొమ్మిది త్రికోణాల ద్వారా ఆవిర్భవిస్తుంది. ఈ తొమ్మిదింటిని మూల ప్రకృతులు లేక నవయోనులు అంటారు. సమస్త మానవుల శరీరాలలో తొమ్మిది ధాతువులు ఉంటాయి.  ఈ తొమ్మిది ధాతువులలో ఐదు ధాతువులు శక్తి త్రికోణాల ద్వారా ఆవిర్భవిస్తాయి. అవి చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు. మిగిలిన నలుగు ధాతువులైన ఎముకలలోని మజ్జ, వీర్యము, ప్రాణం, జీవం (జీవుడు)... ఈ నాలుగు శివ త్రికోణాల ద్వారా ఆవిర్భవిస్తాయి. భగవంతుడు ఎవరు ? భగవంతుడు, జగన్మాత భిన్నమైన వారా ? అనే సందేహం చాలా మందికి వస్తూ వుంటుంది. దీనికి సమాధానం ఏమంటే భగవంతుడు, జగన్మాత ఇద్దరు ఒక్కటే. రెండు భాద్యతలు నిర్వహిస్తున్న ఒక్కరినే, ఇద్దరుగా చాలా మంది భావిస్తువుంటారు.


భగవంతునికి రూపం లేదు. భగవంతుని శక్తి దృశ్యమాన జగత్తుగా ప్రతి స్త్రీ, పురుషులకు కనపడుతుంది. దీని రేఖ చిత్రమే శ్రీ చక్రం. ఈ శ్రీ చక్ర వర్ణన యే ఆది శంకరాచార్యుల వారు అందించిన సౌందర్య లహరి లోని 11 వ శ్లోకం. దేవి ఉపాసనతో సాధన పరిపూర్ణంగా చేసేవారే శ్రీచక్ర స్వరూపులు.
ప్రస్తుత ఆధునిక యుగంలో సమయం వెచ్చించి సాధన పరిపూర్ణంగా చేయలేకపోతున్నారు. అందుకే ఎన్నో సమస్యలకు లోనవుతున్నారు. కనుక సకల సమస్యల నుంచి మనకు మనం సంరక్షింపబడాలంటే ఏం చేయాలి ? అందుకే శ్రీచక్ర యంత్ర సమానమైన నవరక్షాకవచాలను పొందాలి. ఈ రక్షాకవచాలను సరియైన గ్రహ సంచార స్థితిగతులు వున్నప్పుడు మాత్రమే పొందవలసి వుంటుంది. అంతేతప్ప ప్రతి నిత్యం 9 రక్షాకవచాలను పొందుటకు అవకాశం వుండదు. ఒక్కోసారి సంవత్సరానికి ఒక పర్యాయమే నవరక్షాకవచాలను పొందే అవకాశం వుంటుంది. ఒక్కొక్కసారి ఆరేడుసార్లు పొందే అవకాశము వుంటుంది. ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒక్క అవకాశం కూడా రాదు. అందుచేత అవకాశం వున్నప్పుడల్లా ఒక్కొక్క రక్షాకవచాలను పొందటము టీవీ ద్వారా తెలియచేస్తున్నాను. తొమ్మిది రక్షాకవచాలను ఒకేసారి పొందుటకు అతిత్వరలోనే ఒక శుభకరమైన రోజు సిద్ధంగా వుంది. కనుక ఇప్పటివరకు టీవీ ద్వారా 5 రక్షాకవచాలను గురించి చెప్పటం జరిగింది. ఇక 6 , 7 ఒకేరోజు పొందబోతున్నాము. అలాగే 7 , 8 కూడా ఒకేరోజు పొందబోతున్నాము. 9 రక్షాకవచాలను కూడా పొందుటకు ఒకేరోజు సమయము ఆసన్నమవుతున్నది.

అయితే టీవీ చూసిన ప్రేక్షకులలో కొన్ని కలశ పూజలు ఆచరించిన తక్షణమే అద్భుతాలను కూడా చవిచూడటం జరిగినది. కానీ ఇంతవరకు చెప్పిన 5 కలశ పూజలలో కొంతమంది కొన్నింటిని ఆచరించారు. మరికొన్నింటిని ఆచరించలేకపోయారు. ఈ పరంపరలో 2012 మార్చి 4  వ తేదీ ఆదివారం నాడు వరుసగా 3 కలశ పూజలు ఆచరించుటకు అవకాశం వుంది. అలాగే మార్చి 12 వ తేదీ సోమవారంనాడు నాల్గవ కలశ పూజ ఆచరించుటకు అవకాశం వుంది. అలాగే మార్చి 14 వ తేదీ బుధవారం నాడు 1 ,2 , 3 , 4 కలశ పూజలు ఆచరించుటకు అవకాశం వుంది. కనుక టీవీ చూసిన ప్రేక్షకులకు అనేక సందేహాలు వస్తూ వుంటాయి. ఈ సందేహాల నివృత్తికై చేసే చిన్ని ప్రయత్నమే కలశ పూజల శీర్షిక.

గతంలో స్వస్తిక్ మార్కు రుమాలును మొదటి రక్షాకవచంగా పొందివున్నారు. ఆ తరువాత 2011 అక్టోబర్ 25 మంగళవారంనాడు ధనత్రయోదశి, కృష్ణ అంగారక చతుర్దశి పర్వదినాన రెండవ కలశపూజ ఆచరించారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.
మొదట స్వస్తిక్ రుమాలను పొందినవారు 2011  అక్టోబర్ 25 న కలశపూజ (రుమాలు మరియు సూత్రము) ఆచరించి వుంటే, వారు రెండు రక్షాకవచాలకు చెందిన రెండు కలశపూజలను చేసారని భావించాలి.

అలాకాక 2011  అక్టోబర్ 25 నాడే పూజ ఆచరించి ఉన్ననూ, వారు కూడా రెండు రక్షాకవచాలకు చెందిన రెండు కలశపూజలను చేసారని భావించాలి.
మొదట రుమాలును పొందివుండి, 2011 అక్టోబర్ 25 ఎలాంటి పూజ ఆచరించకుండా, 2011 డిసెంబెర్ 21 బుధవారంనాడు పూజ ఆచరించి వుంటే (రుమాలు, సూత్రము మరియు నాణెంతో)... వీరు 3 రక్షాకవచాలకు చెందిన మూడు కలశపూజలను చేసారని భావించాలి.

ఇంతవరకూ మూడు ర అక్షాకవచాలను పొందారని భావము. 3 వ కలశపూజ తదుపరి ప్రతిపూజను ఖచ్చింతంగా పాటిస్తూ 9 రక్షాకవచాలను పొందవచ్చు. అంతేకాని 3 ఆచరించి, 4 చేయకుండా 5 చేయకూడదు. ఇప్పటివరకు ఎటువంటి కలశపూజలను ఆచరించని వారందరూ మార్చి 4 ఆదివారంనాడు 3 రక్షాకవచాలను ఒకేసారి పొందే అవకాశం వుంది. కనుక ఇంతవరకు జాగ్రత్తగా అర్ధం చేసుకొని మార్చి 4 వ తేదీ జరుపుకోనవలసిన కలశపూజ వివరాలను తెలుసుకొనుటకు ప్రయత్నం చేయండి.


ఇంతవరకు ఆచరించనివారు,
రెండవ, మూడవ కలశ పూజలను ఆచరించనివారు మార్చి 4 న ఆచరించాల్సిన పద్ధతి

 1. భారతదేశంలో మార్చి 4 ఆదివారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు, విదేశాలలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆచరించవచ్చును.
 2. ఉదయం నుంచి ఎటువంటి ఆహార నియమములు లేవు.
 3. స్వస్తిక్ మార్కు చిత్రాన్ని, నలుచదరంగా ఉండే తెలుపు లేక పసుపు రంగు వస్త్రంపై ఎరుపు రంగు కుంకుమ కలిపిన ఆవు నేతితో కానీ, పసుపు కలిపిన ఆవు నేతితో కానీ చిత్రీకరించుకోవాలి.
 4. తెలుపు రంగు నలుచదరపు వస్త్రంపై ఎరుపు కుంకుమ లేక పసుపుతో నెయ్యి కలిపి చిత్రీకరించుకోండి.
 5. పసుపు రంగు నలుచదరపు వస్త్రంపై ఎరుపు కుంకుమను నేతితో కలిపి చిత్రీకరించుకోండి.
 6. నలుచదరపు వస్త్రము గరిష్టంగా 12 X 12 అంగుళాల వరకు తీసుకోండి, సైజు కొద్దిగా తగ్గిననూ సమస్య ఏమీ లేదు.
 7. టేబుల్ పైన వస్త్రాన్ని వుంచి నాలుగు మూలాలు త్రిబుజాలుగా మడుచుకోండి.
 8. నాలుగు త్రిబుజాల మధ్యన వున్న చదరంలో స్వస్తిక్ మార్కును వేయండి.
 9. ఇందు జతపరచిన ఫోటోలో వున్న విధంగా చిత్రించుకోండి.
 10. ఎరుపు రంగు దారము లేక పాలిష్టార్ దారము లేక ఎరుపు వూలేన్ దారంతో 11 పోగులతో 12 అంగుళాల సైజు లో తయారు చేసుకోండి.
 11. ఇలా తయారైన 12 అంగుళాల ఎరుపు రంగు సూత్రానికి మధ్యలో ముడి వేయండి.
 12. పాతకాలం నాటి నాణేలను లేక ప్రస్తుతం చలామణిలో వున్న నాణేలను లేక బంగారు వెండి నాణేలను ఎన్నింటినైననూ కలశంలోని నీటిలో వేయాలి.
 13. ఈ కలశంలోని నీటిలోనే ఒక ఏలక్కాయను కూడా వేయాలి.
 14. పూజకు ఎరుపు మందార పుష్పాలను లేక ఏవైనా ఎరుపు పుష్పాలను వినియోగించండి. పసుపు , నెయ్యి కలిపిన అక్షతలు సిద్దం చేసుకోండి.
 15. ఎరుపు రంగు పుష్పాలు దొరకనిచో ఏ రంగు పుష్పాలైన తీసుకోండి. ఆ పుష్పాలపై ఎరుపు కుంకుమను చల్లండి. అంతే కాని కుంకుమ కలిపిన తైలాన్ని చల్లవద్దు.
 16. దీపారాధనకు నువ్వులనూనెను వాడవద్దు. కొబ్బరినూనె లేక ఆవు నేతిని వినియోగించండి. వత్తుల సంఖ్య, ప్రమిదల సంఖ్య మీ నిర్ణయమే.
 17. కలశం మీద పీచు తీసిన కొప్పులా ఉండే కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయను కుంకుమతో చక్కగా అలంకరించుకోండి.
 18. నివేదనకు ఓ కొబ్బరికాయ, తొమ్మిది ఎందు కర్జూరాలు మరియు బెల్లం లేక పంచదారతో చేసిన బియ్యపు పాయసం.
 19. ఇక పూజకు ఓ పీట, పీట పైన పరిచే ఎరుపు రంగు నూతన వస్త్రం, దాని పైన అరకిలో మంచి బియ్యం, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరము మొదలగునవి అవసరము.
 20. కలశంలోని కొబ్బరికాయ క్రింద ఉంచుటకు 5 తమలపాకులు , 5 మామిడాకులు అవసరము. సహజంగా ప్రతి ఇంటిలో పూజలకు వినియోగించుకొనే గంట మొదలగు సామగ్రిని వినియోగించుకోండి.
                                                              పూజా పద్ధతి
మార్చి 4 వ తేదిన భారతదేశంలో సాయంత్రం, విదేశాలలో ఉదయం ఆచరించాలి. పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును. పురుడు లేక మరణ అసౌచము వున్నవారు ఆచరించవద్దు ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము. ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు. విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.
గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి. ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి. దీపారాధన చేసుకోండి. తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని శ్రీ గణపతిని ప్రార్దించండి. బియ్యంపైన స్వస్తిక్ మార్క్ రుమాలును వుంచండి. రుమాలుపై కలశాన్ని పెట్టండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు ) కలశంలో 5 తమలపాకులు లేక  5 మామిడాకులు  ఉండేలా చేసుకోండి. కలశంలో నీటిని క్రొద్ది క్రొద్దిగా 8 సార్లుగా పోయాలి.  ఈ దిగువ తెల్పిన 8  నామాలను ఒక్కొక్క దానిని చదువుతూ, అక్షతలతో బొమ్మలో నోట్ చేసిన చోట అక్షతలను వేయండి. అలా 8 దిక్కులు, విదిక్కులు అయిన తదుపరి, కలశంలో యాలాక్కాయాను వేయండి. కలశంలో ఒకటి కంటే ఎన్ని నాణేలైనను వేయండి. పరిమితి లేదు. కలశంపై కొబ్బరి కాయను వుంచండి. కలశం మీదనున్న కొబ్బరి కాయ కొప్పుపై దండవలె  11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి. లలిత సహస్రనామం లో 742 నుంచి 749 వరకు వున్న నామాలు.
ఓం భవదావసుధావృష్ట్యై నమః
ఓం పాపారణ్యదవానలాయై నమః
ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః
ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః
ఓం భాగ్యాబ్ధిచంద్రికాయై నమః
ఓం భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః
ఓం రోగపర్వతదంభోల్యై నమః
ఓం మృత్యుదారుకుఠారికాయై నమః
( పై ఎనిమిది నామాలకు అర్ధము: జ్యోతిష్య విజ్ఞానంలో జాతక చక్రం వుంటుంది. జననం నుంచి మరణం వరకు 8  కారకత్వాలుగా  ఉండునని బృహత్ జాతక గ్రంధం వివరిస్తుంది. ఈ 8 కారకత్వాల సమిష్టి అనుభవమే జీవితం. ఆ జీవితం సక్రమంగా నడవటానికి ఆయ భాద్యతలు లేదా కోరికలు కుంటుపడకూడదు. 1 . మానవుని చుట్టూ వున్న పరిసరము భవము, అదే సంసారము.జాతక చక్రంలోని 4 వ భావం ఈ భావ కారకత్వంతో వుంటుంది. భవమనే దావాగ్నికి జగన్మాత సుధావృష్టి అనగా అమృత జల్లు. ఆ తల్లి స్మరణయే గృహస్తులకు ఐశ్వర్యము. 2 . ఈ జీవాతార్జనలో పాపలు వుంటూనే వుంటాయి. జాతక చక్రంలో రెండవ భావమే ఈ కారకత్వం. దావానలమనగా కార్చిచ్చు. పాపమనే అరణ్యానికి కార్చిచ్చు లాంటిది జగన్మాత అనుగ్రహం. 3 . దౌర్భాగ్యమనగా దురదృష్టము, ఇది జాతక చక్రంలో మూడవ భావ కారకత్వము. తూలమనగా దూది. భక్తుల దౌర్భాగ్యమనే దూది పింజకు పరమేశ్వరి అనుగ్రహం విసిరి వేయగల వాతూలం. అనగా సుడి గాలి. అంతే ఆశ్రితుల దౌర్భాగ్యాన్ని అతి వేగంగా తొలగించగల అనుగ్రహ మూర్తి. 4 . జాతక చక్రంలో లగ్న స్థానము శరీర కారకత్వం కలది. ధ్వాంతమనగ పెనుచీకటి. రవి ప్రభాయామనగా సూర్య కాంతి. శరీరానికి కలిగే వృద్దప్యమును, గాఢ అంధకారాన్ని పరిహరించగల సూర్య కాంతి వంటిది, జగన్మాత ఉపాసన. 5 . భాగ్యము పంచమ స్థాన కారకత్వము. సముద్రానికి ఆహ్లాద కారకమైన చంద్రకాంతివలె మానవునికి సౌభాగ్యము అనుభవింప యోగ్యత కలుగ చేయునదే జగన్మాత సేవనము. 6 . జాతక చక్రంలో సప్తమ స్థానం దాంపత్యం. కేకి అనగా నెమలి. ఘనా ఘనా అనగా మేఘ సమూహము. నెమలి నాట్యానికి దోహదమైన వాతావరణాన్ని ఇచ్చేది మేఘమాల. ఈ రీతిగా ఆనందమయ దాంపత్య జీవితం ప్రసాదించ కలిగేది జగన్మాత సన్నిధి. 7 . జాతక చక్రంలో ఆరవ స్థానం రోగ కారకత్వం కలది. దంభోలి అనగా వజ్రాయుధము. శారీరక, మానసిక రోగాలనే పర్వతాలవంటి వానికి వజ్రాయుధమే పరమేశ్వరి భావన. 8 . జాతక చక్రంలో 8 వది మృత్యు స్థానము. కుఠారిక అనగా గొడ్డలి. మహా వృక్ష చేధనకు గండ్ర గొడ్డలివలె మృత్యువును కూడా ఖండించగల ఉపాసనే జగన్మాతోపాసన. )
పై ప్రకారంగా రుమాలుపై కలశం ముందు భాగం నుంచి మొదలు పెట్టి సవ్య దిశలోనే (గడియారం లోని ముల్లులా )ఎనిమిది వైపులా అక్షతలను వేసుకున్నారు కదా. ఇప్పుడు లలిత సహస్రనామంలో 475 నుంచి 527 నామం వరకు మొత్తం 53  నామాలు వుంటాయి. ఈ నామాలకు ముందు ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి. అప్పుడు మొత్తం 54  నామాలు అగును. వరుసగా ఈ 54  నామాలను భక్తి తో, విశ్వాసంతో కలశం పై అక్షతలు వేస్తూ పఠి౦చండి. 54 నామాలు కాగానే తిరిగి మరో మారు 475 నుంచి 527 నామం వరకు చదివి చివరలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి. అనగా ఆది అంత్యాలలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామం ఉంటుందన్నమాట.
ఓం లలితాంబికాయై నమః
ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః

ఓం విశుద్ధచక్రనిలయాయై నమః

ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః
ఓం లలితాంబికాయై నమః
పై విధంగా 108 నామాలను పఠి౦చిన తదుపరి ధూప, దీప, నైవేద్య, కర్పూర, తాంబూలాదులను సమర్పించండి. (నైవేద్యమనగా , కొబ్బరి కాయను కొట్టి, తొమ్మిది ఎండుకర్జూరాలను, పాయసాన్ని జగన్మాతకు నివేదించండి. మీకిష్టమైన ఫలాలను కూడా సమర్పించుకోవచ్చును. ) చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తితో, విశ్వాసంతో కోరుకుంటూ చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి. కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి. కలశం లోని నాణేలను ఉద్వాసన అనంతరం దీపారాధన వెలుగుతున్నప్పటికి ఈ క్రింది నామాలను చదువుతూ కుడి చేతితో తీసుకొనండి .
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం మత్యై నమః
ఓం మేధాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం స్మృత్యై నమః
ఓం అనుత్తమాయై నమః
ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు అనబడే మూడు కలశాపూజలు పూర్తి చేసిన వారగుదురు.

2011 అక్టోబర్ 25 ఆచరించి, 2011  డిసెంబర్ 21 న ఆచరించనివారు, మార్చి 4 న ఆచరించాల్సిన పద్ధతి
పై పద్ధతినే యధావిధిగా పాటించాలి. కాని ఒకే ఒక మార్పు ఉన్నది. అది ఏమంటే కలశంలో నీరు పోస్తూ, ఎనిమిది నామాలను చదివిన తదుపరి ఒక నాణేన్నికలశంలోనూ, మరొక నాణేన్నికలశం ముందు వుంచండి. లేదా  కొన్ని నాణేలను కలశంలోనూ, మరికొన్ని నాణేలను కలశం ముందు వుంచండి. మిగిలిన పద్దతి అంతయూ యధావిధి గానే జరిగిపోతుంది. చివరిలో  కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి. కలశం లోని నాణేలను ఉద్వాసన అనంతరం దీపారాధన వెలుగుతున్నప్పటికి 8 నామాలను చదువుతూ కుడి చేతితో తీసుకొని, కలశం ముందున్న నాణేలకు కలిపి బద్రపరచండి. ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు అనబడే మూడు కలశాపూజలు పూర్తి చేసిన వారగుదురు.