Thursday, March 8, 2012

మార్చ్ 12 నాటి కలశపూజ సంపూర్ణ వివరాలు

2012 మార్చ్ 4 వ తేదిన 1 ,2 , 3 కలశ పూజలను ఒకేసారి ఆచరించారు. అలాగే 2011 అక్టోబర్ 25 న ఆచరించి, ఆ తదుపరి ఎలాంటి పూజలు చేయనివారు కూడా, 3 వ కలశాపూజను మార్చ్ 4 న ఆచరించారు. అంటే వరుసగా 3 రక్షా కవచాలను సిద్దం చేసుకున్నారన్నమాట.
అలాగే మార్చి 12 వ తేదీ సోమవారంనాడు నాల్గవ కలశ పూజ ఆచరించుటకు అవకాశం వుంది.
గతంలో స్వస్తిక్ మార్కు రుమాలును మొదటి రక్షాకవచంగా పొందివున్నారు.
ఆ తరువాత 2011 అక్టోబర్ 25 మంగళవారంనాడు ధనత్రయోదశి, కృష్ణ అంగారక చతుర్దశి పర్వదినాన రెండవ కలశపూజ ఆచరించారు. 


ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 
A . మొదట స్వస్తిక్ రుమాలను పొందినవారు 2011  అక్టోబర్ 25 న కలశపూజ (రుమాలు మరియు సూత్రము) ఆచరించి వుంటే, వారు రెండు రక్షాకవచాలకు చెందిన రెండు కలశపూజలను చేసారని భావించాలి. 
B .  అలాకాక 2011  అక్టోబర్ 25 నాడే పూజ ఆచరించి ఉన్ననూ, వారు కూడా రెండు రక్షాకవచాలకు చెందిన రెండు కలశపూజలను చేసారని భావించాలి.   

మొదట రుమాలును పొందివుండి, 2011 అక్టోబర్ 25 ఎలాంటి పూజ ఆచరించకుండా, 2011 డిసెంబెర్ 21 బుధవారంనాడు పూజ ఆచరించి వుంటే (రుమాలు, సూత్రము మరియు నాణెంతో)... వీరు 3 రక్షాకవచాలకు చెందిన మూడు కలశపూజలను చేసారని భావించాలి. ఇంతవరకూ మూడు రక్షాకవచాలను పొందారని భావము.
 

 3 వ కలశపూజ తదుపరి ప్రతిపూజను ఖచ్చింతంగా పాటిస్తూ 9 రక్షాకవచాలను పొందవచ్చు.
అంతేకాని 3 ఆచరించి, 4 చేయకుండా 5 చేయకూడదు.
ఇప్పటివరకు ఎటువంటి కలశపూజలను ఆచరించని వారందరూ మార్చి 4 ఆదివారంనాడు 3 రక్షాకవచాలను ఒకేసారి పొంది ఉండవచ్చు.
మార్చ్ 4 వ తేదిన కూడా అనివార్య కారణాల వలన చేయని పక్షంలో... మార్చ్ 12 సోమవారం నాడు ఆచరించవచ్చును. 


మార్చ్ 12 సోమవారం ఆచరించవలసిన వారు

A ) ఇంతవరకు ఎలాంటి కలశ పూజలు ఆచరించనివారు, ఇప్పుడు ఒకేసారి 4 పూజలను ఒకే కలశంతో ఆచరించవచ్చు. 
B ) మూడవ, నాల్గవ కలశ పూజలను ఆచరించనివారు మార్చి 12 న ఆచరించవచ్చును. 


  1. భారతదేశంలో మార్చి12 సోమవారం ఉదయం 10 గంటల లోపల, విదేశాలలో మార్చ్ 11 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపల ఆచరించవచ్చును.
  2. ఉదయం నుంచి ఎటువంటి ఆహార నియమములు లేవు.
  3. స్వస్తిక్ మార్కు చిత్రాన్ని, నలుచదరంగా ఉండే తెలుపు లేక పసుపు రంగు వస్త్రంపై ఎరుపు రంగు కుంకుమ కలిపిన ఆవు నేతితో కానీ, పసుపు కలిపిన ఆవు నేతితో కానీ చిత్రీకరించుకోవాలి.
  4. తెలుపు రంగు నలుచదరపు వస్త్రంపై ఎరుపు కుంకుమ లేక పసుపుతో నెయ్యి కలిపి చిత్రీకరించుకోండి.
  5. పసుపు రంగు నలుచదరపు వస్త్రంపై ఎరుపు కుంకుమను నేతితో కలిపి చిత్రీకరించుకోండి.
  6. నలుచదరపు వస్త్రము గరిష్టంగా 12 X 12 అంగుళాల వరకు తీసుకోండి, సైజు కొద్దిగా తగ్గిననూ సమస్య ఏమీ లేదు.
  7. టేబుల్ పైన వస్త్రాన్ని వుంచి నాలుగు మూలాలు త్రిభుజాలుగా మడుచుకోండి.
  8. నాలుగు త్రిబుజాల మధ్యన వున్న చదరంలో స్వస్తిక్ మార్కును వేయండి.
  9. ఇందు జతపరచిన ఫోటోలో వున్న విధంగా చిత్రించుకోండి.
  10. ఎరుపు రంగు దారము లేక పాలిష్టార్ దారము లేక ఎరుపు వూలేన్ దారంతో 11 పోగులతో 12 అంగుళాల సైజు లో తయారు చేసుకోండి.
  11. ఇలా తయారైన 12 అంగుళాల ఎరుపు రంగు సూత్రానికి మధ్యలో ముడి వేయండి.
  12. చిత్రంలో చూపిన విధముగా స్వస్తిక్ మార్క్ రుమాలు కంటే నాలుగు వైపులా స్వల్పంగా తగ్గుదలతో వుండే మరో తెలుపు వస్త్రాన్ని తీసుకొనండి.
  13. పసుపును  నేతితో కలిపి వస్త్రం పై మధ్య భాగంలో త్రిభుజాన్ని వేయండి.
  14. కుంకుమను నేతితో కలిపి త్రిభుజానికి మూడువైపులా 15 బిందువులను, త్రిభుజం మధ్యలో పెద్ద బిందువును వేయండి.
  15. పాతకాలం నాటి నాణేలను లేక ప్రస్తుతం చలామణిలో వున్న నాణేలను లేక బంగారు వెండి నాణేలను ఎన్నింటినైననూ కలశంలోని నీటిలో వేయాలి.
  16. ఈ కలశంలోని నీటిలోనే ఒక ఏలక్కాయను కూడా వేయాలి.
  17. పూజకు ఎరుపు మందార పుష్పాలను లేక ఏవైనా ఎరుపు పుష్పాలను వినియోగించండి. పసుపు , నెయ్యి కలిపిన అక్షతలు సిద్దం చేసుకోండి.
  18. ఎరుపు రంగు పుష్పాలు దొరకనిచో ఏ రంగు పుష్పాలైన తీసుకోండి. ఆ పుష్పాలపై ఎరుపు కుంకుమను చల్లండి. అంతే కాని కుంకుమ కలిపిన తైలాన్ని చల్లవద్దు.
  19. దీపారాధనకు నువ్వులనూనెను వాడవద్దు. కొబ్బరినూనె లేక ఆవు నేతిని వినియోగించండి. వత్తుల సంఖ్య, ప్రమిదల సంఖ్య మీ నిర్ణయమే.
  20. కలశం మీద పీచు తీసిన కొప్పులా ఉండే కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయను కుంకుమతో చక్కగా అలంకరించుకోండి.
  21. నివేదనకు ఓ కొబ్బరికాయ, తొమ్మిది ఎందు కర్జూరాలు మరియు బెల్లం చేసిన బియ్యపు పొంగలి.
  22. ఇక పూజకు ఓ పీట, పీట పైన పరిచే ఎరుపు రంగు నూతన వస్త్రం, దాని పైన అరకిలో మంచి బియ్యం, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరము మొదలగునవి అవసరము.
  23. కలశంలోని కొబ్బరికాయ క్రింద ఉంచుటకు 5 తమలపాకులు , 5 మామిడాకులు అవసరము.
    సహజంగా ప్రతి ఇంటిలో పూజలకు వినియోగించుకొనే గంట మొదలగు సామగ్రిని వినియోగించుకోండి. 
  24. పూజా పద్ధతి
మార్చి 12 వ తేదిన భారతదేశంలో ఉదయం, విదేశాలలో మార్చ్ 11 సాయంత్రం ఆచరించాలి. పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును. పురుడు లేక మరణ అసౌచము వున్నవారు ఆచరించవద్దు ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము. ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు. విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.
  • గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
  • ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
  • దీపారాధన చేసుకోండి. తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని శ్రీ గణపతిని ప్రార్దించండి.
  • బియ్యంపైన స్వస్తిక్ మార్క్ రుమాలును వుంచండి.
  • స్వస్తిక్ మార్క్ రుమాలుపై త్రిభుజాకారంగా ఉండే రుమాలును ఉంచండి.
  • త్రిభుజం లోని ఒక కోణం కలశం ముందుకు ఉండాలి. అనగా కలశానికి ముందు వైపు త్రిభుజం యొక్క భుజం రాకూడదు. కోణం రావాలి.
  • త్రిభుజ రుమాలుపై కలశాన్ని పెట్టండి. ( రాగి, వెండి, స్టీలు ఏదైనాను పరవాలేదు ) కలశంలో 5 తమలపాకులు లేక  5 మామిడాకులు  ఉండేలా చేసుకోండి.
  • కలశంలో నీటిని క్రొద్ది క్రొద్దిగా 8 సార్లుగా పోయాలి.  ఈ దిగువ తెల్పిన 8  నామాలను ఒక్కొక్క దానిని చదువుతూ, అక్షతలతో బొమ్మలో నోట్ చేసిన చోట అక్షతలను వేయండి.
  • కలశంలో దిగువ నామాలను పఠిస్తూ (లలిత సహస్రనామం లో 742 నుంచి 749 వరకు వున్న నామాలతో) స్వస్తిక్ రుమాలుకు కలశం ముందు నుంచి గడియారంలో ముళ్ళు తిరిగినట్ట్లుగా సవ్య దిశలో 8 మూలలలో అక్షతలను వేయండి.
ఓం భవదావసుధావృష్ట్యై నమః
ఓం పాపారణ్యదవానలాయై నమః
ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః
ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః
ఓం భాగ్యాబ్ధిచంద్రికాయై నమః
ఓం భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః
ఓం రోగపర్వతదంభోల్యై నమః
ఓం మృత్యుదారుకుఠారికాయై నమః

  • అలా 8 దిక్కులు, విదిక్కులు అయిన తదుపరి, కలశంలో యాలాక్కాయాను వేయండి. కలశంలో ఒకటి కంటే ఎన్ని నాణేలైనను వేయండి. పరిమితి లేదు.
  • కలశంపై కొబ్బరి కాయను వుంచండి. కలశం మీదనున్న కొబ్బరి కాయ కొప్పుపై దండవలె  11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి.
  • పై ప్రకారంగా స్వస్తిక్ మార్క్ రుమాలుపై కలశం ముందు భాగం నుంచి మొదలు పెట్టి సవ్య దిశలోనే (గడియారం లోని ముల్లులా )ఎనిమిది వైపులా అక్షతలను వేసుకున్నారు కదా.
  • ఇప్పుడు లలిత సహస్రనామంలో 475 నుంచి 527 నామం వరకు మొత్తం 53  నామాలు వుంటాయి.
  • ఈ నామాలకు ముందు ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి. అప్పుడు మొత్తం 54  నామాలు అగును.
  • వరుసగా ఈ 54  నామాలను భక్తి తో, విశ్వాసంతో కలశం పై అక్షతలు వేస్తూ పఠి౦చండి. 54 నామాలు కాగానే....
  • తిరిగి మరో మారు 475 నుంచి 527 నామం వరకు చదివి.... చివరలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామాన్ని జోడించండి.
  • అనగా ఆది అంత్యాలలో ఓం శ్రీ లలితాంబికాయై నమః అనే నామం ఉంటుందన్నమాట.
ఓం లలితాంబికాయై నమః
ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః

ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయంకర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదనద్వయాయై నమః
ఓం దంష్ట్రోజ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిరసంస్థితాయై నమః
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేంద్ర వరదాయై నమః
ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం మణిపూరాబ్జనిలయాయై నమః
ఓం వదనత్యయసంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం మాంసనిష్ఠాయై నమః
ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం పీతవర్ణాయై నమః
ఓం అతిగర్వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః
ఓం బందిన్యాదిసమన్వితాయై నమః
ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై నమః
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
ఓం పంచవక్త్రాయై నమః
ఓం అస్తిసంస్థితాయై నమః
ఓం అంకుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః
ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః
ఓం శుక్లవర్ణాయై నమః
ఓం షడాననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినీరూపధారిణ్యై నమః
ఓం లలితాంబికాయై నమః

  • పై విధంగా 108 నామాలను పఠి౦చారు కదా, ఇప్పుడు ఒక్కసారి కర్పూర హారతిని ఇవ్వండి.
  • తిరిగి మరల ఈ దిగువ నామాన్ని 27 సార్లు లేక 54 లేక 108 సార్లు పఠి౦చండి. 
  • ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగాయై నమః (ఇది లలిత సహస్రనామాలలో 71 వ నామము. )
  • తదుపరి ధూప, దీప, నైవేద్య, కర్పూర, తాంబూలాదులను సమర్పించండి.
  • నైవేద్యమనగా , కొబ్బరి కాయను కొట్టి, తొమ్మిది ఎండుకర్జూరాలను, పొంగలిని జగన్మాతకు నివేదించండి. మీకిష్టమైన ఫలాలను కూడా సమర్పించుకోవచ్చును.
  • చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తితో, విశ్వాస, నిర్మల, నిశ్చలత్వంతో కోరుకోండి.
  • చిన్నపాటి తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి.
  • కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి. కలశం లోని నాణేలను ఉద్వాసన అనంతరం దీపారాధన వెలుగుతున్నప్పటికి ఈ క్రింది నామాలను చదువుతూ కుడి చేతితో తీసుకొనండి .
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం మత్యై నమః
ఓం మేధాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం స్మృత్యై నమః
ఓం అనుత్తమాయై నమః
ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు, షోడశ బిందు సహిత త్రిభుజంతో ఉన్నరుమాలు అనబడే నాలుగు కలశాపూజలు పూర్తి చేసిన వారగుదురు.

2011 అక్టోబర్ 25 ఆచరించి, ఆపై ఏమి చేయని వారు 3 , 4 కలశపూజలను ఆచరించాల్సిన పద్ధతి
  • పై పద్ధతినే యధావిధిగా పాటించాలి. కాని ఒకే ఒక మార్పు ఉన్నది.
  • అది ఏమంటే కలశంలో నీరు పోస్తూ, ఎనిమిది నామాలను చదివిన తదుపరి ఒక నాణేన్నికలశంలోనూ, మరొక నాణేన్నికలశం ముందు వుంచండి.
  • లేదా  కొన్ని నాణేలను కలశంలోనూ, మరికొన్ని నాణేలను కలశం ముందు వుంచండి. మిగిలిన పద్దతి అంతయూ యధావిధి గానే జరిగిపోతుంది.
  • చివరిలో  కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి.
  • కలశం లోని నాణేలను ఉద్వాసన అనంతరం దీపారాధన వెలుగుతున్నప్పటికి 8 నామాలను చదువుతూ కుడి చేతితో తీసుకొని, కలశం ముందున్న నాణేలకు కలిపి బద్రపరచండి.
  • ఇంతటితో స్వస్తిక్ మార్క్ రుమాలు, ఎరుపు రంగు సూత్రము, నాణెములు షోడశ బిందు సహిత త్రిభుజంతో ఉన్నరుమాలు అనబడే నాలుగు కలశపూజలు పూర్తి చేసిన వారగుదురు.                  
ఈ మార్చ్ 12 పూజలను ఆచరించినవారు రక్షాకవచాలను క్రియాత్మకంగా ఉత్తేజపరచుటకు (activation ) సమయము

  • భారత దేశంలో మార్చ్ 14 రాత్రి 6 గంటల నుంచి 8 గంటల లోపల పడమర దిశలో భరణి సంగమంగా వెలుగొందుతున్న గురు, శుక్రులకు 4 రక్షాకవచాలను దర్సింపచేయండి.
  • విదేశాలలో వారు మార్చ్ 13 రాత్రి 8 నుంచి 9 లోపల పడమర దిశలో భరణి సంగమంగా వెలుగొందుతున్న గురు, శుక్రులకు 4 రక్షాకవచాలను దర్సింపచేయండి.
  • అనివార్య కారణాలచే దర్శింప చేయలేనివారు భారతదేశం మరియు విదేశాలలో ఉండే వారు మార్చ్ 15 గురువారం మూల నక్షత్రం రోజున పగటి సమయంలో 10 గంటల లోపల శ్రీ సూర్యనారాయణ స్వామికి దర్శింపచేయండి.
  • ఒకసారి ఉత్తేజపరిచిన రక్షాకవచాలను ఎన్నిపర్యాములైననూ ఉత్తేజపరచుకోవచ్చు, లేదా నూతన కవచాన్ని మాత్రమే ఆక్టివేట్ చేసుకోవచ్చు.
తొమ్మిది రక్షాకవచాలను ఒకేసారి పొందుటకు అతిత్వరలోనే ఒక శుభకరమైన రోజు సిద్ధంగా వుంది. కనుక ఇప్పటివరకు టీవీ ద్వారా 5 రక్షాకవచాలను గురించి చెప్పటం జరిగింది. ఇక 6 , 7 ఒకేరోజు పొందబోతున్నాము. అలాగే 7 , 8 కూడా ఒకేరోజు పొందబోతున్నాము. 9 రక్షాకవచాలను కూడా పొందుటకు ఒకేరోజు సమయము ఆసన్నమవుతున్నది.
గమనిక : కలశంలోని నీటిని కుటుంభ సభ్యుల శిరస్సుపై చల్లుకొని మిగిలిన నీటిని తులసి చెట్టు, లేక ఇతర మొక్కల మొదళ్ళలో పోయాలి. యాలక్కయను ప్రసాదంగా స్వీకరించవచ్చును. కలశం పై కొబ్బరి కాయను కొట్టుకొని వృధా కానివ్వకుండా తీపి వంటకాలలో ఉపయోగించుకోవాలి. కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని తర్వాత రోజులలో బోజన పదార్ధంగా వినియోగించుకోనేది. వృధాగా పోనివ్వవద్దు. బియ్యం క్రింద వ్రుంచిన వస్త్రమును తదుపరి కలశ పూజలలో ఉపయోగించుకోవచ్చు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.