Pranati Television Youtube Channel

Thursday, August 30, 2012

అధిక భాద్రపద పూర్ణిమన "హ్రీం" బీజాక్షరంతో కీర్తిముఖుడిని స్వాగతించండి.

శ్రీ నందన నామ సంవత్సరంలో భాద్రపద మాసం అధిక మాసం వచ్చినందున, అధికమాస పూర్ణిమ రోజున మరియు నిజ భాద్రపద మాస పూర్ణిమ రోజున కీర్తిముఖుడిని హ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. అధిక పూర్ణిమ 31 ఆగష్టు 2012 శుక్రవారం, నిజ పూర్ణిమ 29 సెప్టెంబర్ 2012  శనివారం ... రెండు రోజులలోను హ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. ) పార్వతి దేవిని ఆరాధించాలి.

31 ఆగష్టు 2012 శుక్రవారం నాడు రాత్రి లోపల ఈ దిగువ 16 నామాలను భక్తితో, విశ్వాసంతో కీర్తిముఖునిలో... పార్వతి దేవి రూపాన్ని స్మరిస్తూ పఠి౦చండి. ప్రత్యేక నివేదన అవసరం లేదు. ఎన్ని సార్లైనను మానసికంగా పఠి౦చండి.


ఓం హ్రీం మాహేశ్వర్వై నమః
ఓం హ్రీం కౌమార్యై నమః
ఓం హ్రీం చాముండాయై నమః
ఓం హ్రీం శచ్యై నమః
ఓం హ్రీం పుష్ట్యై నమః
ఓం హ్రీం తుష్ట్యై నమః
ఓం హ్రీం స్వధాయై నమః
ఓం హ్రీం స్వాహాయై నమః
ఓం హ్రీం లోకమాత్రే నమః
ఓం హ్రీం దిత్యై నమః
ఓం హ్రీం బ్రాహ్మ్యై నమః
ఓం హ్రీం ఇంద్రాణ్యై నమః
ఓం హ్రీం వారాహ్యై నమః
ఓం హ్రీం సావిత్ర్యై నమః
ఓం హ్రీం జయాయై నమః
ఓం హ్రీం మహాకాళ్యై నమః
పై పదహారు నామాలు పఠి౦చిన తదుపరి తన్మయత్వంగా ఓం కీర్తిముఖేభ్యో నమః అనే నామాన్ని 11 సార్లు పఠి౦చండి. సకల శుభాలకు చేరువకండి. పై ప్రకారంగానే నిజ భాద్రపద పూర్ణిమ రోజున 29 సెప్టెంబర్ 2012  శనివారం రోజున ఆచరించండి.

( కైలాసంలో శివనిలయ ద్వారానికి ఓ మహా దివ్య పురుషుని ముఖం అలంకృతమై వుంటుంది. ఆ దివ్య పురుషుడే కీర్తిముఖుడు. ఈ కీర్తిముఖుడుకి మనమందరం ఈ శ్రావణ పూర్ణిమ నుంచి స్వాగతం పలుకుదాం. కీర్తిముఖుడికి శిరస్సుపై ఓం బీజాక్షరం, కుడిచెవి ప్రక్కన గం బీజాక్షరం, ఎడమచెవి ప్రక్కన ఐం బీజాక్షరం, నాలుక కుడివైపున హ్రీం బీజాక్షరం, నాలుకకు ఎడమవైపున శ్రీం బీజాక్షరంతో కీర్తిముఖుడు చిత్రపటం ఉంటుంది.

కీర్తిముఖుడు శివుని కనుబొమ్మలనుంచి ఆవిర్భవించి శివాజ్ఞ లేకుండా స్వీయ నిర్ణయంతోనే... శివ సన్నిధికి దూతగా వచ్చిన వ్యక్తిని అధర్మ మార్గంలో సంహరించబోయాడు. కాని చివరలో శివుని ఆజ్ఞను శిరసావహించాడు. అందుకే శరీరమంతా అధర్మవర్తనకు.... పరిహారంగా పోయినను... మహా శివభక్తి తత్పరతకు మిగిలింది... ఒక ముఖం మాత్రమే. అదే ముఖం కీర్తిముఖుడుగా అనంతగౌరవాన్ని పొందుతూ.. కైలాసంలో శివుని ముఖద్వారానికి ఉండే మహా అదృష్టాన్ని పొందగలిగాడు. అంతర్లీనంగా ఓ గొప్ప సందేశం ఉన్న కారణంగానే కీర్తిముఖుని ఆవిర్భావ కధ కార్తీకమాసంలో 21 వ రోజున అనగా కార్తిక బహుళ షష్టి రోజున పారాయణా౦శమైనది.

జగన్మాత, జగత్పితలకు నిలయంగా ఉన్న కైలశమనే మన గృహంలో కూడా సకల శుభాలను అనుగ్రహించటానికి కీర్తిముఖుడు కావాలి. ఈ కీర్తిముఖుడిని సకల శుభాలు అనుగ్రహించమని భక్తితో, విశ్వాసంతో పూజించాలి.

సకల శుభాలు కలగటమంటే..... సకలదోషాలు పోవటమేనని భావం. ప్రణవ సహిత గణపతి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తులు అంతర్లీనంగా కీర్తిముఖుడిలో ఉంటారు.

ప్రతివారు నిత్యం కీర్తిముఖుడిని ఆరాధిస్తుంటే... అంతర్లీనంగా ఉన్న దైవ శక్తులను ప్రార్ధిస్తున్నట్లే.

నిత్యం పూజించే అవకాశం లేకున్నప్పటికీ, మనసారా భక్తితో అచంచల విశ్వాసంతో... దేహం లేని శిరస్సుతో ఉన్న కీర్తిముఖుడిని ఎన్ని పర్యాయాలైన వీక్షించండి. ఈ వీక్షనలే పరోక్షంగా సకల శుభాలను స్వాగతిస్తాయి.

కీర్తిముఖుడి చిత్రపటాన్ని గృహ సింహాద్వారమునకు పై భాగాన లేదా సింహాద్వారంలోనించి నేరుగా లోపలి వస్తే సింహాద్వారమున్న గోడ కాకుండా.... మిగిలిన మూడు గోడలలో ఏ గోడకైనను చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు.

ఈ విధంగా పెట్టిన చిత్రపటం వైపు నిత్యం పలుసార్లు వీక్షిస్తూ వుండటం శుభదాయకం. ఇదే చిత్రపటాన్ని పూజ మందిరంలో కూడా ఉంచుకొని పూజించటం శ్రేయోదాయకం. కంప్యూటర్ యుగంలో నిత్యం పూజాదికాలు చేయలేని వారందరికీ నవరక్షాకవచాలు, కీర్తిముఖుని చిత్రపటాలు సకల శుభాలను అనుగ్రహిస్తాయి.

ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల సంపుటంతో కీర్తిముఖుని చిత్రపటముండును. మన కన్నులతో కీర్తిముఖుని వీక్షిస్తున్నప్పుడు... చిత్రపటంలో ఉండే ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల తత్వ మహిమచే.... సకల శుభాలు కల్గునని మహానుభావుల మనోదృష్టికి అందిన అంశం.

ప్రతివారు తమ జీవితంలో శుక్ర మహాదశ రావాలని, రాక్షస రాజు శుక్రుడు అనుగ్రహం పొందాలని, కీర్తి ప్రతిష్టలు విశేషంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని, చక్కని సంసారంతో, సంతానంతో... సుఖవంతంగా విలాసంగా ఉండాలని కోరుకుంటారు. రాక్షస రాజుగా విరాజిల్లే శుక్రాచర్యులనే శుక్ర గ్రహంగా పేర్కొనటం. శుక్రునిది పంచకోణాకార మండలం.... పంచకోణాకార మండలమంటే ఓ నక్షత్ర గుర్తు. ఐదు కోణాలు, ఐదు బీజాక్షరాలతో సమ్మిళితమై ఉంటుంది. ఈ కీర్తిముఖునిలో ఐదు బీజాక్షర స్వరూపాలున్నాయి. కీర్తిముఖుడు అనబడే దివ్య పురుషుని వీక్షణ మన మీద ప్రసరిస్తే .... ఆ దైవీ శక్తుల యొక్క కటాక్షం మనం పొందినట్లేనని భావం.)


శుభం భూయాత్

Friday, August 24, 2012

ఆగండి.. ఆలోచించండి .. ఆపై నిర్ణయం తీసుకోండి.

ప్రతివారి గృహంలో వివాహం కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటుంటారు. వారికి వివాహం చేయటానికి తగిన సంబంధం కోసం వివాహ పరిచయ వేదికలకు వెళ్ళటమూ లేదా మ్యారేజ్ బ్యూరోలలో పేర్లు నమోదు చేసుకోవటం సహజంగా జరుగుతున్న తంతు. ఇది ఇలా వుండగా అమ్మాయి జాతకంతో అబ్బాయి జాతకం పొంతన చూడాలనేది శాస్త్ర నిర్ణయం. కేవలం కంప్యూటర్స్ ను నమ్ముకొని ఇరువురి జాతకాలు ఎంతవరకు కలిసాయా లేదా అనే విషయం కొరకై చాలామంది జ్యోతిష్య సాఫ్ట్వేర్ లపై ఆధారపడుతూ వుంటారు. ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి, లేకపోతే మీరు పొరపడినట్లే.

కేవలం వధూవర గుణమేలన పట్టిక అనే పాయింట్ల పట్టికపై ఆధారపడకండి. 18 పాయిన్ట్లపైన వస్తే వివాహం చేసుకోనవచ్చునని, 18  కన్నా తక్కువ వస్తే వివాహం చేయకూడదని వధూవర గుణమేలన పట్టిక సారాంశం. నిజానికి చెప్పాలంటే ఈ పట్టికను నమ్ముకొని లక్షలాది కుటుంబాలు నాశనం అయిపోయినాయి. 30  పాయిన్ట్లపైన వచ్చి కూడా న్యాయస్థానాల చుట్టూ విడాకుల కోసం తిరుగుతున్న వారెందరో !

ఒక సిద్దాంతి గారు రెండు జాతకాలను చూసి...... శభాష్ ..... భేషుగ్గా వుంది... తక్షణం వివాహం చేయండి అంటుంటే ......... మరో సిద్దాంతి.... వ్యతిరేక తీర్పుని సెలవిస్తారు. ఈ ఇద్దరి సిద్దాంతులలో..... ఎవరిని అనుసరించాలో తెలియక తలలు పట్టుకునేవారెందరో !

పోతేపోనీ... వధూవర గుణమేలన పట్టికలో అధికంగా పాయింట్లు వచ్చాయి కదా...ముందుకు వెళదాం.... అనుకోని... వివాహం చేస్తే.... సంవత్సరం తిరిగేలోపలె అసలీ విషయాలన్నీ తెరమీదకి వస్తాయి.
వరుడు కాని, వధువు కానీ అల్పాయిష్కులని పాయింట్ల పట్టిక తేల్చి చెప్పదు. ఇరువురిలో ఉన్నటువంటి వ్యాదులను పాయింట్ల పట్టిక అసలేమి చెప్పదు. ఆ దోషమని... ఈ దోషమని... కాళ్ళరిగేలా తిరిగే వారికి, నగ్న సత్యాలను తెలియచేస్తూ... ఎవరికి వారు... స్వయంగా పూర్తి స్థాయిలో జాతక పొంతన తెలుసుకొని, మాయ మాటలు చెప్పే వారి బారిన పడకుండా వుండుటకై... ఎప్పటికప్పుడు అసలుసిసలైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొనివచ్చి... మిమ్మల్ని చైతన్యపరిచి..... సమస్యలు వుంటే .... ఏ విధంగా పరిష్కారాలు చేసుకోవాలో తెలియచెప్పాల్సిన అవసరం భక్తిమాల టీవీ కి వుంది. అందుకే వారం వారం మీకోసం... ఎన్నో ఎన్నో విశేషాలను తెలియచెప్పే కార్యక్రమమే... మా కల్యాణమాల.... త్వరలోనే మీ ముందుకు రాబోతోంది. ఆస్వాదించండి.. ఆనందించండి.. ఆలోచించండి.. ఆశీర్వదించండి...... మీ శ్రీనివాస గార్గేయ, (భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగ కర్త).


Monday, August 20, 2012

గ్రహమాల కార్యక్రమం త్వరలో ప్రారంభం.గ్రహభూమి వీక్షక అభిమానులందరికీ శుభవార్త. భక్తిమాల వెబ్ ఛానల్లో పూర్తి స్థాయిలో 24 గంటలు కార్యక్రమాలు ప్రారంభం కావటానికి కొంత సమయం పట్టినప్పటికీ ఈ లోపలే (కొద్ది రోజులలో మాత్రమే) ఉదయం ఒక గంట పాటు మరియు సాయంత్రం ఒక గంటపాటు జాతక సమస్యలకు పరిష్కారాలను ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా తెలియచేప్పటమే కాక, తెలుసుకొనవలసిన అనేక అంశాలను ప్రసారం చేయటం జరుగును. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొనగలరని ఆశిస్తాను..... మీ శ్రీనివాస గార్గేయ

Sunday, August 12, 2012

ప్రపంచ ప్రప్రధమ జ్యోతిర్వేద వెబ్ ఛానల్ భక్తిమాల

దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ సిద్దాంతి గారి సారధ్యంలో... ఓంకార మహాశక్తి పీఠ నిర్వహణలో ప్రపంచ ప్రప్రధమ జ్యోతిర్వేద, ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కార్యక్రమాల సుమమాలే... భక్తిమాల 24 గంటలు నడిచే వెబ్ ఛానల్ ప్రారంభం చేస్తున్నామని తెలియచేయటానికి సంతసిస్తున్నాము. భక్తిమాల టెస్ట్ వీడియో కొరకు www.bhakthimala.tv ని బ్రౌస్ చేయుటకు గాను ఇక్కడ  క్లిక్ చేయండి 

Monday, August 6, 2012

వీక్షకులకు శుభవార్త

నమస్కారం,  ఇంతవరకు నిత్యం నేను టీవీలో చెప్పే కార్యక్రమాలను గ్రహబలం బ్లాగ్ ద్వారా వీడియోక్లిప్పింగ్ లను చూడగలుగుతున్నారు. ప్రస్తుతం భాగ్యనగరంలో మెట్రో రైలు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్న కారణంగా ట్రాఫిక్ కు పలు అంతరాయాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ విషయంలో సకాలంలో స్టూడియోకి వెళ్లి తిరిగి రావటానికి అనేక గంటలు ట్రాఫిక్ లో వృధా అవుతున్నాయి. అంతే కాక ట్రాఫిక్ లో వాహన చోదకం కూడా కష్టంగా ఉన్న కారణంగా శరీరం అలసిపోతున్నది. ఇందుచేత కాలచక్రం, గ్రహభుమి ఇతర ముఖ్య పరిహార గ్రంధాలను రచించటానికి సమయం చాలటం లేదు. అందుచేత అభిమానులకు... నిరాశ కల్గించకుండా... ట్రాఫిక్ బారి నుంచి  తప్పించుకొనుటకు, గ్రహభూమి బ్లాగ్ లోనే చక్కని విషయాలను వీడియో క్లిప్పింగ్స్ ద్వారా నిత్యం అప్లోడ్ చేయబోతున్నాను... ప్రస్తుత రోజులలో దాదాపుగా ఇంటర్నెట్ సౌకర్యం ఎక్కువ మందికి అందుబాటులో ఉండటం చేత, గ్రహభూమి వీక్షకులు... దయచేసి, తాము వీక్షించి తెలుసుకొన్న అంశాలను... ఇంటర్నెట్ సౌకర్యంలేని వారికి అందిచగలరని మనసారా కోరుకుంటున్నాను. మీ సమస్యలు ఎలా ఉన్నాయో.. ఏమేమి ఉన్నాయో వాటన్నిటికి పరిహార మార్గాలు ఏమిటి అనే అంశాలన్నింటిని కలబోసి... ఎప్పటికప్పుడు నూతనంగా వచ్చే గ్రహసంచార స్థితులను కూడా మీ ముందుకు తీసుకురావాలనే ఆలోచనతోనే తెలియచేస్తున్నాను... మీ గార్గేయ సిద్దాంతి

Saturday, August 4, 2012

ఆగష్టు 15 న తులారాశిలో శని, కుజుల సంఘర్షణ, తీసికొనదగిన జాగ్రత్తలు

నవగ్రహాలలో కుజుడు అగ్ని తత్వమైన గ్రహము. శని వాయుతత్వ గ్రహము. ఈ రెండు గ్రహాలు 2012 ఆగష్టు 15 బుధవారం రాత్రి ఖగోళంలో నైరుతి దిశలో ఓ బిందువు వద్ద కలుస్తున్నాయి. శని గ్రహ, కుజ గ్రహాలు రెండూను పరస్పర శత్రుత్వమైనవి. ఈ రెండింటి కలయిక వలన ప్రతికూల ఫలితాలు ఉంటుంటాయి.
 

ఈ పరంపరలో శ్రీ నందన నామ సంవత్సర శ్రావణ బహుళ త్రయోదశి బుధవారం ఆగష్టు 15 న సూర్యాస్తమయం తర్వాత నలభై నిముషాల పాటు శని, కుజుల కలయిక ఉండును. దీని ప్రభావ ఫలితాలు ఆగష్టు 8 బుధవారం నుంచి ఆగష్టు 22 బుధవారం వరకు ప్రతికూలంగా ఉండుటకు అవకాశములున్నవి. వాతావరణం మీద అధిక ప్రభావం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు గాని, అధిక వర్షాలతో నష్టాలు, తుఫాను లాంటివి చెలరేగే అవకాశాలధికం. 

ఆగష్టు 15 స్వాతంత్రదినోత్సవం సహజం గానే దినోత్సవానికి ముందుగానే ఇంటిలిజెన్సు శాఖ అప్రమత్తమై ఉంటారు. ఈ సారి మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది.  ద్వాదశ రాశులలో జన్మించినవారు ఈ క్రింది విధంగా కొన్ని కొన్ని అంశములపై ప్రత్యేక శ్రద్ధ, అవగాహన చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

మేషరాశి : కుటుంబంలో అనవసర కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. దంపతులు సంయమనం పాటించాలి. ఆరోగ్య విషయాలలో కూడా చక్కని నిర్ణయాలు తీసుకోవాలి. రెండవ సంతాన విషయంలో శ్రద్ద, అవగాహన చూపించాలి.
 

వృషభరాశి : ఋణం తీసుకొనుట లేక ఇవ్వటంలో అత్యంత జాగ్రత్తలు తీసుకొనాలి. లేదా పాతబాకీల విషయంలో అవగాహన, శ్రద్ద ఉండాలి. ఎదుటి వారిని గురించి ఇతరులకి చెప్పే విషయంలో... మంచైనా, చెడైన... చెప్పకుండా ఉండటం ఉత్తమం. లేనిచో శత్రుత్వములు రాగలవు. అనుకోకుండా అనారోగ్యమేదైనా వ్యాపిస్తే... సొంత వైద్యం చేయవద్దు. అనవసరంగా శత్రువులను రెచ్చ గొట్టకండి.
 

మిధునరాశి : సంతాన అంశాలలో అధిక శ్రద్ధ చూపాలి. వారికి కావలసినవి లభ్యమవుతున్నాయా లేదా అనే విషయంలో లోతుగా గమనించాలి. వారితో స్నేహ భావంతో ఉండుట ఉత్తమం.
 

కర్కాటకరాశి : వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, వ్యాపార, గృహ, తల్లి సంభందిత అంశాలలో తెలియని సమస్యలు రావచ్చును. అందుచే లోపము కనపడగానే వెంటనే దానిని సమయస్పూర్తితో పరిష్కారం చేసుకునేది.
 

సింహరాశి : సోదర, సోదరీ వర్గీయులతో సంబంధాలు చెడిపోకుండా కాపాడుకోవటానికి ప్రయత్నించండి.
 

కన్యరాశి : ఆర్ధిక, వాగ్దాన, కుటుంబ అంశాలలో జాగ్రత్తలు పాటించండి. తొందరపడి ఎదుటివారిని దూషించకండి. నేత్ర, దంత అంశాలలో లోపమేదైనా ఉన్నచో వైద్యుడిని సంప్రదించండి.
 

తులారాశి : వాహన చోదకంలో జాగ్రత్త పాటించాలి. ప్రయాణాలలో జాగ్రత్తలవసరం. కలహాలకు దూరంగా ఉండండి. మానసిక, శారీరక సంఘర్షణలకు గురి కావద్దు.
 

వృశ్చికరాశి : ఆలోచించే ప్రతి నిర్ణయంలోనూ, ఆచరించే విధి విధానాలలోను లోపాలు తెలియకుండానే ఉంటాయి. కప్పి పుచ్చుకోలేరు. ధనవ్యయానికి వీలైనంత వరకు అడ్డుకట్ట వేయండి. నష్టాలను అరికట్టే ప్రయత్నం చేయండి.
 

ధనూరాశి : ప్రతి అంశంలో జాగ్రత్త, అవగాహన, శ్రద్ధ కల్గి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని గ్రహించండి. హడావుడి నిర్ణయాలు వద్దు. తారుమారు కాగలవు.
 

మకరరాశి : అవకాశవాదులు అధికంగా ఉంటారు. ఆచరించే కార్యాలలో స్తంభనాలు కల్గు సూచన. మెరుగైన ఫలితాలు రావాలంటే.. ఆచి తూచి అడుగులు వేస్తూ వెళ్ళాలి.
 

కుంభరాశి : పిత్రార్జిత ఆస్తులలో సమస్యలు, లోపాలు ఉండు సూచన ఉంది. తండ్రి లేక సమానమైన వారి అభిప్రాయాలను వ్యతిరేకించవద్దు. మూడవ సంతాన విషయంలో శ్రద్ద, అవగాహన చూపించాలి.
 

మీనరాశి : ఆరోగ్య నియమాలు పాటించండి. అనారోగ్యముంటే వైద్యున్ని సంప్రదించండి. ప్రయాణాలలోను, వాహన చోదకంలోను జాగ్రత్తలు పాటించండి. కలహాలకు వెళ్ళకండి.

Wednesday, August 1, 2012

శ్రావణ పూర్ణిమన కీర్తిముఖుడిని స్వాగతం పలుకుదాం


కైలాసంలో శివనిలయ ద్వారానికి ఓ మహా దివ్య పురుషుని ముఖం అలంకృతమై వుంటుంది. ఆ దివ్య పురుషుడే కీర్తిముఖుడు. ఈ కీర్తిముఖుడుకి మనమందరం ఈ శ్రావణ పూర్ణిమ నుంచి స్వాగతం పలుకుదాం. కీర్తిముఖుడికి శిరస్సుపై ఓం బీజాక్షరం, కుడిచెవి ప్రక్కన గం బీజాక్షరం, ఎడమచెవి ప్రక్కన ఐం బీజాక్షరం, నాలుక కుడివైపున హ్రీం బీజాక్షరం, నాలుకకు ఎడమవైపున శ్రీం బీజాక్షరంతో కీర్తిముఖుడు చిత్రపటం ఉంటుంది.

కీర్తిముఖుడు శివుని కనుబొమ్మలనుంచి ఆవిర్భవించి శివాజ్ఞ లేకుండా స్వీయ నిర్ణయంతోనే... శివ సన్నిధికి దూతగా వచ్చిన వ్యక్తిని అధర్మ మార్గంలో సంహరించబోయాడు. కాని చివరలో శివుని ఆజ్ఞను శిరసావహించాడు. అందుకే శరీరమంతా అధర్మవర్తనకు.... పరిహారంగా పోయినను... మహా శివభక్తి తత్పరతకు మిగిలింది... ఒక ముఖం మాత్రమే. అదే ముఖం కీర్తిముఖుడుగా అనంతగౌరవాన్ని పొందుతూ.. కైలాసంలో శివుని ముఖద్వారానికి ఉండే మహా అదృష్టాన్ని పొందగలిగాడు. అంతర్లీనంగా ఓ గొప్ప సందేశం ఉన్న కారణంగానే కీర్తిముఖుని ఆవిర్భావ కధ కార్తీకమాసంలో 21 వ రోజున అనగా కార్తిక బహుళ షష్టి రోజున పారాయణా౦శమైనది.

జగన్మాత, జగత్పితలకు నిలయంగా ఉన్న కైలశమనే మన గృహంలో కూడా సకల శుభాలను అనుగ్రహించటానికి కీర్తిముఖుడు కావాలి. ఈ కీర్తిముఖుడిని సకల శుభాలు అనుగ్రహించమని భక్తితో, విశ్వాసంతో పూజించాలి.

సకల శుభాలు కలగటమంటే..... సకలదోషాలు పోవటమేనని భావం. ప్రణవ సహిత గణపతి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తులు అంతర్లీనంగా కీర్తిముఖుడిలో ఉంటారు.

ప్రతివారు నిత్యం కీర్తిముఖుడిని ఆరాధిస్తుంటే... అంతర్లీనంగా ఉన్న దైవ శక్తులను ప్రార్ధిస్తున్నట్లే.

నిత్యం పూజించే అవకాశం లేకున్నప్పటికీ, మనసారా భక్తితో అచంచల విశ్వాసంతో... దేహం లేని శిరస్సుతో ఉన్న కీర్తిముఖుడిని ఎన్ని పర్యాయాలైన వీక్షించండి. ఈ వీక్షనలే పరోక్షంగా సకల శుభాలను స్వాగతిస్తాయి.

కీర్తిముఖుడి చిత్రపటాన్ని గృహ సింహాద్వారమునకు పై భాగాన లేదా సింహాద్వారంలోనించి నేరుగా లోపలి వస్తే సింహాద్వారమున్న గోడ కాకుండా.... మిగిలిన మూడు గోడలలో ఏ గోడకైనను చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు.

ఈ విధంగా పెట్టిన చిత్రపటం వైపు నిత్యం పలుసార్లు వీక్షిస్తూ వుండటం శుభదాయకం. ఇదే చిత్రపటాన్ని పూజ మందిరంలో కూడా ఉంచుకొని పూజించటం శ్రేయోదాయకం. కంప్యూటర్ యుగంలో నిత్యం పూజాదికాలు చేయలేని వారందరికీ నవరక్షాకవచాలు, కీర్తిముఖుని చిత్రపటాలు సకల శుభాలను అనుగ్రహిస్తాయి.

ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల సంపుటంతో కీర్తిముఖుని చిత్రపటముండును. మన కన్నులతో కీర్తిముఖుని వీక్షిస్తున్నప్పుడు... చిత్రపటంలో ఉండే ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల తత్వ మహిమచే.... సకల శుభాలు కల్గునని మహానుభావుల మనోదృష్టికి అందిన అంశం.

ప్రతివారు తమ జీవితంలో శుక్ర మహాదశ రావాలని, రాక్షస రాజు శుక్రుడు అనుగ్రహం పొందాలని, కీర్తి ప్రతిష్టలు విశేషంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని, చక్కని సంసారంతో, సంతానంతో... సుఖవంతంగా విలాసంగా ఉండాలని కోరుకుంటారు. రాక్షస రాజుగా విరాజిల్లే శుక్రాచర్యులనే శుక్ర గ్రహంగా పేర్కొనటం. శుక్రునిది పంచకోణాకార మండలం.... పంచకోణాకార మండలమంటే ఓ నక్షత్ర గుర్తు. ఐదు కోణాలు, ఐదు బీజాక్షరాలతో సమ్మిళితమై ఉంటుంది. ఈ కీర్తిముఖునిలో ఐదు బీజాక్షర స్వరూపాలున్నాయి. కీర్తిముఖుడు అనబడే దివ్య పురుషుని వీక్షణ మన మీద ప్రసరిస్తే .... ఆ దైవీ శక్తుల యొక్క కటాక్షం మనం పొందినట్లేనని భావం.

02  ఆగష్టు 2012 గురువారం... శ్రావణమాసం పూర్ణిమ తిథి నాడు మనమందరం కీర్తిముఖుడిని శ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. (లక్ష్మి దేవిని ఆరాధించాలి. )

భాద్రపద పూర్ణిమ తిథి నాడు కీర్తిముఖుడిని హ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. ( ఈ సంవత్సరం అధిక మాసం వచ్చినందున... అధిక పూర్ణిమ 31 ఆగష్టు 2012 శుక్రవారం, నిజ పూర్ణిమ 29 సెప్టెంబర్ 2012  శనివారం ... రెండు రోజులలోను హ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. ) పార్వతి దేవిని ఆరాధించాలి

29 అక్టోబర్ 2012 సోమవారం ఆశ్వీయుజ పూర్ణిమ నాడు ఐం బీజాక్షరంతో స్వాగతించాలి. సరస్వతి దేవిని ఆరాధించాలి.

28 నవంబర్ 2012 బుధవారం కార్తిక పూర్ణిమ నాడు గం బీజాక్షరంతో గణపతిని ఆరాధించాలి.

05 డిసెంబర్ 2012 బుధవారం నాడు కార్తిక బహుళ షష్టి నాడు ప్రణవంతో కీర్తిముఖుడిని ఆరాధించాలి.

02 ఆగష్టు 2012 గురువారం నాడు రాత్రి లోపల ఈ దిగువ 16 నామాలను భక్తితో, విశ్వాసంతో కీర్తిముఖునిలో... మహాలక్ష్మి దేవి రూపాన్ని స్మరిస్తూ పఠి౦చండి. ప్రత్యేక నివేదన అవసరం లేదు. ఎన్ని సార్లైనను మానసికంగా పఠి౦చండి.

ఓం శ్రీం సుధాయై నమః
ఓం శ్రీం హిరణ్మయ్యై నమః
ఓం శ్రీం విభావర్యై నమః
ఓం శ్రీం వసుధారిన్యై నమః
ఓం శ్రీం కమలాయై నమః
ఓం శ్రీం అనఘాయై నమః
ఓం శ్రీం పద్మసుందర్యై నమః
ఓం శ్రీం చంద్రవదనాయై నమః
ఓం శ్రీం ఇందిరాయై నమః
ఓం శ్రీం ఇందుశీతలాయై నమః
ఓం శ్రీం శివకర్యై నమః
ఓం శ్రీం హరివల్లభాయై నమః
ఓం శ్రీం యశస్విన్యై నమః
ఓం శ్రీం హరిణ్యై నమః
ఓం శ్రీం హేమమాలిన్యై నమః
ఓం శ్రీం మహాలక్ష్మై నమః
పై పదహారు నామాలు పఠి౦చిన తదుపరి తన్మయత్వంగా ఓం కీర్తిముఖేభ్యో నమః అనే నామాన్ని 11 సార్లు పఠి౦చండి. సకల శుభాలకు చేరువకండి.
శుభం భూయాత్