Pranati Television Youtube Channel

Wednesday, November 16, 2016

ఆర్ధిక సంక్షోభం రాబోతుందని చెప్పిన వార్త రుజువైనది

2016 జనవరి 29న సింహరాశిలోనికి రాహువు ప్రవేశించాడు. అప్పటికే అక్కడ గురు గ్రహ సంచారం ఉన్నది. ఈ రెండు గ్రహాల సంచారాన్ని గురు చండాల యోగంగా భావిస్తారు. ఆ తర్వాత 2016 జూన్ 24న రాహువు, గురువు ఒకే బిందువులోనికి రావటంచే గురువుకు రాహువు  చేత నాగబంధనం ఏర్పడింది. ఇదే సమయంలోనే వైరి గ్రహాలైన కుజుడు, శని ఒకేచోట కలవటం కూడా తటస్థించింది. అంటే శని కుజుల సంఘర్షణ, నాగబంధనం జరిగాయన్నమాట.

వచ్చే సంవత్సరం మర్చి నెలలో వజ్రోత్సవాలు జరుపుకోబోతున్న ఐరోపా సమాఖ్య (ఈ.యూ) కు అక్షరాలా నాగ బంధన ప్రభావం శరాఘాతంగా గుచ్చుకుంది. అగ్రరాజ్యమైన అమెరికా కు ధీటుగా, ఆర్ధిక వ్యవస్థగా ప్రసిద్ధికెక్కిన, 28 దేశాల ఐరోపా సమాఖ్య నుంచి యునైటెడ్ కింగ్డమ్ వైదొలగటం జూన్ 24నే జరిగింది. ఇది చరిత్రలో తొలిసారి. నాలుగు దశాబ్దాల పై చిలుకు అనుబంధం చెదిరిపోయింది.

బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునేందుకు భారతదేశం సంపూర్ణంగా సిద్ధంగా ఉంది అని అమిత్ షా పైకి చెప్పినప్పటికీ, రాబోతున్న ఆర్ధిక సంక్షోభాన్ని మాత్రం ఎదుర్కొంటాం కష్టమవుతుందని, దీని కారణంగా భారత దేశంలో వివిధ రాష్ట్రాలపైనా రాజకీయ అస్థిరతలు చోటుచేసుకొని ఆర్ధిక సంక్షోభాన్ని నాగబంధనం ప్రారంభించునని, తద్వారా భారతదేశంలో నిత్యావసరాలు విపరీతంగా పెరుగునని చాప క్రింద నీరులా సమస్యలు చుట్టుకొనునని 2016 జూన్ 23, 24 తేదీలలోనే పత్రికా ముఖంగా కూడా తెలియచేస్తూ నా ఫేస్బుక్ లో ఉంచటం జరిగింది.

అంతేకాక  గతంలో 1984లో శని, కుజుల సంఘర్షణ ఏర్పడినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అంగరక్షకులచే హతమార్చబడినదని, భోపాల్ లో గ్యాస్ లీకేజీ, పంజాబ్ గోల్డెన్ టెంపుల్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగినవి. అదే శని కుజుల సంఘర్షణ ఇప్పుడు  జరగటం దీని ప్రభావం మరియు, నాగ బంధన ప్రభావం భారతదేశ ఆర్ధిక స్థితిని చిన్నాభిన్నం చేయును.

కనుకనే పైన చెప్పిన వ్యతిరేక గ్రహస్థితులు ప్రభావం 2017 మధ్యవరకు ఉండును. కనుక ప్రజలందరూ ఈ వ్యతిరేక గ్రహసంచారా స్థితుల నుంచి బయట పడటానికి, రాబోతున్న వ్యతిరేక స్థితుల నుంచి కూడా ఉపశమనం  పొందటానికి తదుపరి పోస్టింగ్లను పరిశీలించేది. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ


Tuesday, November 15, 2016

మహతి యోగ పెద్ద జాబిలి తదుపరి నిత్య తిధుల దేవతార్చనలు

మహతి యోగ పరంపరలో భాగంగా నిత్య తిధి దేవతలను ఆరాధిస్తే 75 శాతం వరకు మహతి యోగం దేవతా మూర్తుల అనుగ్రహానికి తోడ్పడును. అయితే దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం సాయంత్ర సమయంలో నిత్య తిధి దేవతలను షోడశ నామావళితో ఆరాధించాలి.

కనుక నిన్నటితో 15 మంది దేవతలు శుక్ల పక్షంతో పూర్తైనారు. ఈరోజునుంచి బహుళ పాడ్యమితో కృష్ణ పక్షము ప్రారంభమైనది. బహుళ పాడ్యమికి నిత్య తిధి దేవత చిత్రా. కనుక నిన్న ఆరాధించిన దేవతనే ఈరోజు కూడా ఆరాధించాలి. 


ఈ దేవతను ఆరాధించిన కారణంగా లబ్ది ఏమిటంటే.. మన కోరికలన్నింటిని తీర్చటానికి అవకాశాలను అందించే విధంగా మార్గాలను ఈ దేవత చూపును. అంతేకాక ఆరోగ్య అంశాలలో కూడా సరియైన నిర్ణయాలను పొందగలుగుదురు. కనుక ఈ సాయంత్రం ఈ దేవతను ఆరాధించేది.
నామాల కొరకుగా ఈ క్రింది వీడియోను చూడండి. గమనిక - 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న గ్రహసంచార స్థితిగతులపై ఓ విశ్లేషణాత్మక వ్యాసం రేపు పోస్టింగ్ చేయబడును.- దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Monday, November 14, 2016

14 నవంబర్ 2016 మహతీ యోగానికి చిత్రా దేవతార్చన


దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 14 నవంబర్ 2016 సోమవారం నాడు పూర్ణిమ తిధి నిత్య దేవత అయిన చిత్రా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. పూర్ణిమ తిధి సాయంత్ర సమయంలో ఉన్ననూ లేకున్ననూ, ఈనాటి ప్రదోష సమయంలో చంద్ర దర్శనంతో చిత్రా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Sunday, November 13, 2016

13 నవంబర్ 2016 మహతీ యోగానికి జ్వాలామాలిని దేవతార్చన

 

దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 13 నవంబర్ 2016 ఆదివారం నాడు శుక్ల చతుర్దశి  తిధి నిత్య దేవత అయిన జ్వాలామాలిని దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 13 సాయంత్ర సమయానికి శుక్ల చతుర్దశి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు జ్వాలామాలిని దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Saturday, November 12, 2016

12 నవంబర్ 2016 మహతీ యోగానికి సర్వమంగళ దేవతార్చన
దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 12 నవంబర్ 2016 శనివారం నాడు శుక్ల త్రయోదశి  తిధి నిత్య దేవత అయిన సర్వమంగళ దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 12 సాయంత్ర సమయానికి శుక్ల త్రయోదశి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు సర్వమంగళ దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయThursday, November 10, 2016

11 నవంబర్ 2016 మహతీ యోగానికి విజయా దేవతార్చనదీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 11 నవంబర్ 2016 శుక్రవారం వారం నాడు శుక్ల ద్వాదశి తిధి నిత్య దేవత అయిన విజయా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 11 సాయంత్ర సమయానికి శుక్ల ద్వాదశి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు విజయా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

Wednesday, November 9, 2016

10 నవంబర్ 2016 మహతీ యోగానికి నీలపతాక దేవతార్చన


దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 10 నవంబర్ 2016 గురువారం వారం నాడు శుక్ల ఏకాదశి తిధి నిత్య దేవత అయిన నీలపతాక దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 10 సాయంత్ర సమయానికి శుక్ల ఏకాదశి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు నీలపతాక దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

Tuesday, November 8, 2016

మరోసారి మహాశాంతి యాగం వాయిదా

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా... నవంబర్ 10వ తేది జరగవలసిన మహా శాంతియాగం వాయిదా వేస్తున్నందుకు ఎంతో చింతిస్తున్నాం. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చిన సామాన్య ప్రజానీకం తిరిగి వెళ్లేంతవరకు ఖర్చుపెట్టవలసిన డబ్బులలో 500 మరియు 1000 రూపాయల కాగితాలు రద్దు అయిన కారణంగా, వారు ఇబ్బందులకు గురికాగలరు.  కాబట్టి ఇంటి నుంచి బయలుదేరింది మొదలు తిరిగి ఇంటికి చేరేంతవరకు ఆర్ధిక లావాదేవీలలో ఇబ్బందులు ఉన్నాయి కనుక, అలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం వాయిదా వేయబడినది. ఈ విషయాన్ని దయచేసి మీ బంధు, మిత్రాదులకు తెలియచేయవలసినది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

9 నవంబర్ 2016 మహతీ యోగానికి నిత్యా దేవతార్చనదీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 9 నవంబర్ 2016 బుధవారం వారం నాడు శుక్ల దశమి తిధి నిత్య దేవత అయిన నిత్యా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 9 సాయంత్ర సమయానికి శుక్ల దశమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు నిత్యా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 
Monday, November 7, 2016

8 నవంబర్ 2016 మహతీ యోగానికి కులసుందరి దేవతార్చన

దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 8 నవంబర్ 2016 మంగళవారం వారం నాడు శుక్ల నవమి తిధి నిత్య దేవత అయిన కులసుందరి దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ ప్రాంతాలన్నింటిలో నవంబర్ 8 సాయంత్ర సమయానికి శుక్ల నవమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు కులసుందరి దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ
Sunday, November 6, 2016

7 నవంబర్ 2016 మహతీ యోగానికి త్వరిత దేవతార్చన

దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 7 నవంబర్ 2016 సోమవారం నాడు శుక్ల అష్టమి తిధి నిత్య దేవత అయిన త్వరిత దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 7  సాయంత్ర సమయానికి శుక్ల అష్టమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు త్వరిత దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ
10 నవంబర్ 2016 విజయవాడలో మహాశాంతి యాగము

2015 జూలై  14 గురుగ్రహము సింహరాశిలోకి ప్రవేశించటంతో గోదావరి  పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ సింహరాశిలోకి  ప్రవేశించిన గురువు శాస్త్ర రీత్యా దోషప్రదుడు. ఇది ఇలా ఉండగా 2016 జనవరి 29న ఈ సింహరాశిలోనికే రాహువు ప్రవేశించటంతో గురువు మరింత దోషప్రదుడయ్యాడు. సింహరాశి అధిపతి సూర్యుడు. ఈ సూర్యునికి ఈ సంవత్సరం గురు నక్షత్రమైన పూర్వాభాద్రలో  సంపూర్ణ గ్రహణం జరిగింది. అలాగే సెప్టెంబర్ 1వ తేదీన తిరిగి సింహరాశిలోనే సూర్యునకు మరో  సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. అంతేకాక శత్రు గ్రహాలైన శని, కుజులు ఇక కాలంలో వక్రం కావటం, ఆగష్టు 24న శని, కుజులు కలవటం జరిగింది.

ఈ రెండు గ్రహణాల మధ్య కాలంలో అనగా జూన్ 24న గురువు, రాహువు ఒకే బిందువులోకి రావటంతో నాగబంధనం ఏర్పడింది. ఈ నాగబంధనమే మరింత దోష ప్రదమైనది. దీని ప్రభావం వలన ముందు మూడు మాసాలు, తదుపరి ఆరు మాసాలు వెరసి 9 మాసాల వరకు దాని ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం భారతదేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా సరిహద్దు దేశాల మధ్య యుద్ధభయ వాతావరణం నెలకొనటం,  రాష్ట్రాల నడుమ కలహప్రద సూచనలు ఉండును. అంతేకాక తరచూ భూకంపాలు, వైమానిక ప్రమాదాలు, జల సంబంధిత ప్రకృతి ఉండటమే కాక, రాష్ట్రాలను పాలించే నాయకులపైనా కూడా దాని ప్రభావం ఉండునని 2016 మార్చి 1న విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పటం జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో నాగ బంధన దోష నివృత్తికై 2016 మార్చి 6 హైద్రాబాద్లోనూ, ఏప్రిల్ 3 విశాఖపట్నంలోనూ, మే 1 ఒంగోలులోను , మే 29 రాజమండ్రిలోను, జూన్ 24 సికింద్రాబాద్లోను, జులై 1 తిరుపతిలోను, జులై 31 గుంటూర్లోనూ విశేష రీతులలో సప్త సూర్య మహాయాగాలు జరిగినవి.

2016 నవంబర్ 7 మధ్యాహ్నం 11 గంటల 58 నిముషాల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల 31 నిముషం వరకు గ్రహ మాలికా యోగము జరుగుచున్నది. ఈ యోగం జరుగనున్న రోజులలోని గురువారం నాడు పరిహారంగా మహా శాంతి యాగం జరగనున్నది. అందుచే సప్త యాగాలలో సేకరించిన భస్మాలను సప్త నదుల నీటితో తడిపి, సప్త కలశాలకు నింపి , ఈ సప్త కలశాలను 2016 నవంబర్ 10 గురువారము గురునక్షత్రమైన పూర్వాభాద్రలో, ప్రజలందరి చేత విశేష రీతిలో నదీ జలంతో, శాంతి మంత్రాలతో అభిషిక్తం కావించబడును. ఇదే మహాశాంతి యాగము.

రుద్ర స్తోత్రంలో చెప్పబడిన శివుని యొక్క అష్టమూర్తిత్వములలో శర్వుడు భూమికి, భవుడు జలానికి, రుద్రుడు అగ్నికి, ఉగ్రుడు వాయువునకు, భీముడు ఆకాశమునకు ఆధిపత్యములు వహించగా మనలోని జీవునకు పశుపతి, సూర్య చంద్రులకు ఈశుడు, మహాదేవుడు ఆధిపత్యం వహిస్తున్నారు. కనుక ఈ కార్తీక మాసంలో శివుని యొక్క అష్టమూర్తిత్వాలలో రెండవ దైన  జలంతో మహాశాంతి యాగం  జరుపబడును.


ఈ మహాశాంతి యాగము విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజ్ కి ప్రక్కన గల ఉండవల్లి కరకట్ట పైన గల శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీ వారి పీఠంలో 10 నవంబర్ 2016 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.


కార్యక్రమం తదుపరి సప్త కలశాలలోని తడిసిన భస్మములన్నింటిని ప్రత్యేక పద్దతిలో కలిపి, డిసెంబర్ మొదటి వారంలో భక్తులకు  అందజేయబడును.  ముఖ్యంగా 2016 నవంబర్ 14 కార్తీక పూర్ణిమ సోమవారం నాడు మహతి యోగ సమయంలో సాధారణ స్థాయి కంటే అత్యధిక స్థాయిలో పున్నమి చంద్రుడు దర్శనం ఇవ్వనున్నాడు. విశాఖ నక్షత్రంలో సూర్యుడు ఉండి, కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్న సమయంలో కార్తీక పూర్ణిమని మహతి యోగం అంటారు. ఈ మహతీ యోగం అనగా దేవతలు అనుగ్రహించుటకు అనువైన సమయమని అర్థము. ఈ యోగము దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు ప్రభావం ఉండును . ఈ సమయము పూర్తిగా స్త్రీ దేవత మూర్తులను ఆరాధించుటకు విశేష అనుకూల సమయముగా భావించాలి. అయితే ఈ యోగం ప్రభావంచేతను, మరో వైపునున్న వ్యతిరేక గ్రహస్థితులు వలనను  భూకంప సూచనలు మరియు సముద్రాలపై దాని ప్రభావం అధికంగా ఉండును. ఇందుచేతనే దీపావళి అమావాస్య నాడే ఇటలీలో భూకంపం తీవ్రస్థాయిలో రావటం జరిగింది. కనుక దీని ప్రభావం నవంబర్ 28వరకు ఉన్నది. కాబట్టి సముద్ర తీరాలలో స్నానాలు ఆచరించేవారు పై రోజులలో జాగ్రత్తలు తీసుకొనవలసినది.

మహతి యోగం ఒకవైపు వ్యతిరేక ప్రభావాన్ని ఇస్తూనే, మరోవైపు పూర్తి అనుకూల స్థితులను కూడా అందించును. అందుచేతనే జాతకులపై నాగబంధన దోష ప్రభావము తగ్గటానికి, మహతీ యోగ అనుకూల ప్రభావము పొందటానికి గాను, నా ఆధ్వర్యంలో పై సూర్య యాగాలు చేసి, నవంబర్ 10న మహాశాంతి యాగానికి సిద్ధం కాబోతున్నాము . ఈ యాగానికి వచ్ఛే వారు తమతో పాటు ఒక చిన్న పాత్రను కూడా తీసుకొని వచ్చేది. (ఎందుకంటే కృష్ణా నదిలో పారుతున్న నీటిని తీసుకొని కలశాలపై పోయుటకు, పాత్ర ఏ లోహంతో చేసినది అయిననూ పర్వాలేదు. ) 27 నక్షత్రములు మరియు నవగ్రహ మూలమంత్రములతో పాటు సంపుటీకరణ విధి విధానంతో జరిగే శాంతి సంబంధ వేద మంత్రోచ్చారణల మధ్య, ఎవరికీ వారు తమంతట తామే సప్త కలశాలపై నదీ జలాన్ని అభిషిక్తం చేసుకునే అవకాశం ఉన్నది. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొనవలసినది.- దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Saturday, November 5, 2016

6 నవంబర్ 2016 మహతీ యోగానికి శివదూతి దేవతార్చనదీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 6 నవంబర్ 2016 ఆదివారం నాడు శుక్ల సప్తమి తిధి నిత్య దేవత అయిన శివదూతి దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 6  సాయంత్ర సమయానికి శుక్ల సప్తమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు శివదూతి దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ Friday, November 4, 2016

5 నవంబర్ 2016 మహతీ యోగానికి మహావజ్రేశ్వరి దేవతార్చన
దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 5 నవంబర్ 2016 శనివారం నాడు శుక్ల షష్ఠి తిధి నిత్య దేవత అయిన మహావజ్రేశ్వరి దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 5  సాయంత్ర సమయానికి శుక్ల షష్ఠి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు షష్ఠి దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

Thursday, November 3, 2016

4 నవంబర్ 2016 మహతీ యోగానికి వహ్నివాసిని దేవతార్చన


దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 4 నవంబర్ 2016 శుక్రవారం నాడు శుక్ల పంచమి తిధి నిత్య దేవత అయిన వహ్నివాసిని దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 4  సాయంత్ర సమయానికి శుక్ల పంచమి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు వహ్నివాసిని దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ


Wednesday, November 2, 2016

3 నవంబర్ 2016 మహతీ యోగానికి భేరుండా దేవతార్చన
దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 3 నవంబర్ 2016 గురువారం నాడు శుక్ల చవితి తిధి నిత్య దేవత అయిన భేరుండా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 3  సాయంత్ర సమయానికి శుక్ల చవితి ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు భేరుండా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ Tuesday, November 1, 2016

2 నవంబర్ 2016 మహతీ యోగానికి నిత్యక్లిన్నా దేవతార్చన

దీపావళి అమావాస్య నుంచి ప్రారంభమైన మహతీ యోగ విజయ పరంపర సాధనలో భాగంగా 2 నవంబర్ 2016 బుధవారం నాడు శుక్ల తదియ తిధి నిత్య దేవత అయిన నిత్యక్లిన్నా దేవతార్చనకు అవసరమైన లలితా సహస్ర నామాలలో షోడశ నామాలను ఈ దిగువ ఇవ్వటమైనది. భారతదేశం, న్యూయార్క్, లండన్ లలో నవంబర్ 2  సాయంత్ర సమయానికి శుక్ల తదియ ఉన్నందున, ఈ మూడు ప్రాంతాల వారు నిత్యక్లిన్నా దేవతను ఆరాధించాలి. వివరములతో పాటు వీడియోను కూడా దిగువ ఇవ్వటమైనది. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ