Pranati Television Youtube Channel

Tuesday, March 31, 2015

సంపూర్ణ చంద్రగ్రహణం - మిధునరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

మిధునరాశి జాతకులకు చంద్రగ్రహణ ప్రభావం విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ అంశాలపై ఉండును. కనుక జూలై 31 వరకు మిధున రాశి జాతకులు తమ తమ నిర్ణయాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ పావులు కదుపుతూ ఉండాలి. విద్య సంబంధిత అంశాలలోకి వస్తే ఈ నాలుగు మాసాలు పరీక్షలు రాయటాలు, ఉత్తీర్ణత కావటాలు, పై కోర్సులకు వెళ్ళటానికి అనువుగా ఉండే సమయం. ఇలాంటి సమయంలో అనవసరమైన వ్యాపకాలు ఒక్కోసారి ఎదురుకావటం గానీ లేదా కొంతమంది తప్పు సంకేతాలుగా అభిప్రాయాలను తెలియచెప్తూ, మనస్సు గాయపరిచేలా ఉంటుంటాయి. కనుక అలాంటి అంశాల మీద అసలు దృష్టి పెట్టవద్దు. కేవలం ప్రతి బుధవారం సరస్వతి దేవిని ప్రార్ధిస్తూ మీ మనస్సుకు తగిన రీతిలోనే నడుచుకుంటూ నిర్భయంగా ముందుకు సాగండి. అయితే గ్రహచార ప్రభావాలచే ఎక్కడైనా చిన్నపాటి వ్యతిరేకతలు చోటు చేసుకుంటే, వెంటనే క్రుంగిపోవద్దు. అపజయాలు అనేవి విజయమనే నిచ్చెనకు మెట్లుగా భావించాలే తప్ప నిరాశా, నిస్పృహలతో మాత్రం ఉండవద్దు. కనుకనే మనో ధైర్యంతో బుధవారాలలో సరస్వతి దేవిని ప్రార్ధించండి.

ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు కానీ తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే... తమకున్న ఏదైనా లోపాన్ని గానీ, లేదా వెలితిని గానీ సహా ఉద్యోగులకు స్పష్టం చేయవద్దు. ఒకవేళ వారు పసిగట్టి ఈ లోపాన్ని ఎత్తి చూపినప్పుడు తక్షణమే వారిమాటను కొట్టిపారేయండి. దీనితో పాటు ఉద్యోగ సరళిలో మీకు తెలిసి.... నిజంగా ఏవైనా లోపాలు ఉండి ఉంటే, వాటిని ముందు జాగ్రత్తగా చక్కదిద్దుకోవటానికి ప్రయత్నమంటూ చేసుకోండి. పూర్తిగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే దానికంటే ముందు చూపుగా గమనించుకొని దిద్దుబాటు చేసుకోవటం చాలా ఉత్తమం. ఈ మాసాలలో పై అధికారులతో వినయంగా ఉండటం ఎంతైనా శ్రేయోదాయకం. ఉద్యోగం చిన్నదైనా, పెద్దదైనా... వినయానికి ప్రాధాన్యత ఇస్తూ పావులు కదపటానికే ప్రయత్నిస్తూ, మీ లోపాలను సహా ఉద్యోగులు గమనించకుండా జాగ్రత్తపడండి.

సహా ఉద్యోగులు అమిత మిత్రులైనప్పటికీ ఈ నాలుగు మాసాలలో మాత్రం వారితో ఎలాంటి శతృత్వ పోకడలకు వెళ్ళవద్దు. అదే విధంగా ఉద్యోగ అన్వేషణలో ఉండే వారు కూడా ఇంటర్వ్యూలకు లేక ఏ ఇతర ముఖ్య వ్యవహారాలకు హాజరయ్యే అవకాశం ఉన్న సందర్భాల రోజులలో పులుపును తినకుండా ఉండటం చాలా మంచిదని గ్రహించండి. ఆరోగ్య అంశాలను విశ్లేషిస్తే.... హడావుడిగా వెళ్ళే ప్రయాణాలలో కానీ, హడావుడిగా చేసే వేగవంతమైన పనులలో కానీ.... నడకను నెమ్మదిగా ఉంచాలే తప్ప వడి వడి అడుగులు వేయవద్దు. గమనంలో ఉన్న బస్సును ఎక్కటానికి ప్రయత్నించవద్దు. బస్సు ఆగిన తర్వాతనే స్థిమితంగా ఎక్కండి. అలాగే కారు నుంచి దిగే సందర్భంలో.... ప్రక్కనుంచి ఏదైనా వాహనం వస్తున్నదేమో తెలుసుకొని, కారు తలుపు తీయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సందర్భాలలోనే సమస్య వచ్చి, ప్రమాదం వాటిల్లి, ఆరోగ్య భంగములు జరుగు సూచన కలదు.

చిన్న పిల్లలను ఎత్తుకొని ముద్దాడే సమయంలో.... వారి చేతిలో పెన్ లాంటి వస్తువులు లేకుండా గమనించాలి. ఎందుకంటే పొరపాటున కన్నుకు తగలవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో అపార్ట్ మెంట్ లలో గ్రిల్ తో పాటు క్లోస్డ్ డోర్ గా ఉండే లిఫ్ట్ పక్కన నిలబడవద్దు. ఎందుకంటే మీరు లిఫ్ట్ లో పైకి వెళ్ళాలి, అదే సమయంలో పైనుంచి హడావుడితో క్రిందకి వస్తాడు. మీరు నిలబడిన స్థితి లోపల వ్యక్తికి కనపడక తలుపును ముందుకు తోసుకొని రావటంతో, తలుపు వెనకాలే ఉన్న మీరు... క్రిందపదటమో... లేదా ముక్కుకు దెబ్బతగలటమో, లేదా కంటికి పెట్టుకున్న జోడు పగిలి గాజు ముక్కలచే కన్ను గాయమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చెబుతుంటే, కొండవీటి చేంతాడు లాగా తయారగును. కాబట్టి గమనించవలసినది ఏమిటంటే నిదానంతో వ్యవహారాలను చేస్తూ... బుద్ధి బలాన్ని ఉపయోగించి నడుచుకోవాలని అర్థము.

వాహన విషయాల కొనుగోలులో ఆలోచించి చక్కని నిర్ణయంతో వాహనాన్ని కొనండి. తొందరపడి ఎవరో ఏదో చెప్పారని ఓ వాహనం కొని తర్వాత నిరాశపడవద్దు. అంతేకాక ప్రస్తుతం మీకున్న వాహనానికి ఏమైనా మరమ్మత్తులు ఉన్నాయేమో గమనించి శ్రద్ధగా వాటిని మరమ్మత్తు చేయించి ఆ పైనే నడపటానికి ప్రయత్నించండి. రాత్రి వేళలలో మీరు కానీ, డ్రైవర్ కానీ వాహనాన్ని నడుపుతున్నప్పుడు... శృతి మించిన వేగం కాకుండా తక్కువ వేగంతోనే వెళుతూ అవసరమైన సమయాలలో విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తతోనే వాహన చోదకం చేయండి.

ప్రస్తుతం సొంత గృహం ఉండవచ్చు, లేకపోవచ్చు లేదా అద్దె ఇంట్లో ఉండవచ్చు. లేదా అద్దె కోసం ప్రయత్నాలు చేయవచ్చు. ఇలాంటి సందర్భాలలో లేని పోని భయాలు చెప్పి భయపెట్టే వారి వలన సమస్యలు వస్తాయేమోనని గ్రహించి చక్కగా వాస్తు రీత్యా ఉన్న ఇంటిని కూడా వదిలేసి వెళ్ళకండి. ఎందుకంటే వాస్తు బలం విశేషంగా ఉన్న గృహాలలో నివసించే వ్యక్తులు కూడా బాధలతో ఉంటుంటారనేది చాలా మందికి తెలియదు. గృహబలం కంటే గ్రహబలం చాలా గొప్పది.

ఇక చివరిగా జన్మనిచ్చిన తల్లి విషయంలో ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా ఈ నాలుగు మాసాలలో మాట్లాడటానికే ప్రయత్నించండి. మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి నటించి మాట్లాడవద్దు. అలా అని ముక్కుసూటిగా విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడవద్దు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్న చందాన అంటీ ముట్టనట్లుగా విషయ సరళిలో ఉండాలే తప్ప అలకలకు, విసుగులకు, క్రోధాలకు, కలహాలకు, విమర్శలకు, దూషణలకు, ఆరోపణలకు తావివ్వవద్దు.

మొత్తం మీద మిధునరాశి జాతకులు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ, చిన్నపాటి జలుబు, జ్వరము వంటివి వస్తే, సొంత వైద్యం చేసుకోకుండా, అనుభవం ఉన్న వైద్యుడినే ఆశ్రయించాలని గమనించండి.

మిధునరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 12 మధ్యాహ్నం 12.56 నుంచి 14 మధ్యాహ్నం 3.51  వరకు
మే 9 సాయంత్రం 6.29 నుంచి 11 రాత్రి 10.17 వరకు
జూన్ 5 రాత్రి 12.18 నుంచి 7 అర్ధరాత్రి 3.41 వరకు
జూలై 3 ఉదయం 7.51 నుంచి 5 ఉదయం 10.01  వరకు
జూలై 30 సాయంత్రం 5.18 నుంచి 31 అర్ధరాత్రి 12.00 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు మృగశిర 3,4 పాద జాతకులు :
ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ఆర్ద్ర జాతకులు :
ఏప్రిల్ 12 ఉదయం 7.11 నుంచి 13 ఉదయం 6.13 వరకు,
ఏప్రిల్ 20 మధ్యాహ్నం 1.18 నుంచి 21 మధ్యాహ్నం 11.57 వరకు,
ఏప్రిల్ 29 రాత్రి 12.47 నుంచి 30 అర్ధరాత్రి తదుపరి 3.46 వరకు,
మే 9 మధ్యాహ్నం 12.40 నుంచి 10 మధ్యాహ్నం 11.57 వరకు,
మే 17 రాత్రి 11.15 నుంచి 18 రాత్రి 9.56 వరకు,
మే 27 ఉదయం 8.25 నుంచి 28 మధ్యాహ్నం 11.27 వరకు,
జూన్ 5 సాయంత్రం 6.34 నుంచి 6 సాయంత్రం 5.32 వరకు,
జూన్ 14 ఉదయం 7.20 నుంచి 15 ఉదయం 6.27 వరకు,
జూన్ 23 సాయంత్రం 4.22 నుంచి 24 రాత్రి 7.28 వరకు,
జూలై 2 అర్థరాత్రి 2.15 నుంచి 3 రాత్రి 12.41 వరకు,
జూలై 11 మధ్యాహ్నం 1.27 నుంచి 12 మధ్యాహ్నం 1.00 వరకు,
జూలై 20 రాత్రి 12.03 నుంచి 21 అర్ధరాత్రి తదుపరి 3.11 వరకు,
జూలై 30 మధ్యాహ్నం 11.46 నుంచి 31 ఉదయం 9.54 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

పునర్వసు 1,2,3 పాద జాతకులు :
ఏప్రిల్ 13 ఉదయం 6.13 నుంచి 14 ఉదయం 4.47 వరకు,
ఏప్రిల్ 21 మధ్యాహ్నం 11.57 నుంచి 22 మధ్యాహ్నం 11.15 వరకు,
ఏప్రిల్ 30 అర్ధరాత్రి తదుపరి 3.46 నుంచి మే 2 ఉదయం 6.28 వరకు,
మే 10 మధ్యాహ్నం 11.57 నుంచి 11 ఉదయం 10.56 వరకు,
మే 18 రాత్రి 9.56 నుంచి 19 రాత్రి 9.04 వరకు,
మే 28 మధ్యాహ్నం 11.27 నుంచి 29 మధ్యాహ్నం 2.13 వరకు,
జూన్ 6 సాయంత్రం 5.32 నుంచి 7 సాయంత్రం 4.20 వరకు,
జూన్ 15 ఉదయం 6.27 నుంచి 16 ఉదయం 5.52 వరకు,
జూన్ 24 రాత్రి 7.28 నుంచి 25 రాత్రి 10.24 వరకు,
జూలై 3 రాత్రి 12.41 నుంచి 4 రాత్రి 10.56 వరకు,
జూలై 12 మధ్యాహ్నం 1.00 నుంచి 13 మధ్యాహ్నం 12.53 వరకు,
జూలై 21 అర్ధరాత్రి తదుపరి 3.11 నుంచి 23 ఉదయం 6.17 వరకు,
జూలై 31 ఉదయం 9.54 నుంచి అర్ధరాత్రి 12.00 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

చివరగా మిధునరాశి వారు గమనించవలసిన అతి ముఖ్యమైన ఘట్టమేమిటంటే.... జూలై 1వ తేది రాత్రి వినువీధిలో శుభగ్రహాలైన గురు, శుక్రుల కలయిక ధన, కుటుంబ స్థానంలో జరుగుతున్నది. కనుక ఆ కలయికను భక్తి విశ్వాసాలతో దర్శించి, శుభ గ్రహాల అనుగ్రహాన్ని పొందండి. ఈ కలయిక అంశాలు మరికొద్ది రోజులలో పోస్టింగ్ చేయబడును.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి మిధునరాశి  జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో కర్కాటక రాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

సంపూర్ణ చంద్రగ్రహణం - వృషభరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

కన్యారాశిలో సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంచే వృషభ రాశిలో జన్మించిన జాతకులు జూలై 31 వరకు సంతాన సంబంధిత విషయాలలోనూ, నిర్ణయాలలోను జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. 18 సంవత్సరములు వయస్సు గానీ, అంతకు లోబడి గానీ ఉన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు ఒక విధంగా తీసుకోవాలి. 18 నుంచి 36 సంవత్సరాల వయసు మధ్య ఉన్న సంతానం విషయంలో జాగ్రత్తలు మరొక రకంగా తీసుకోవాలి. 36 నుంచి 54 సంవత్సరాలు మధ్య గల సంతానానికి ఇంకో రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 54 పైబడిన సంతతికి వేరే విధంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అవసరం ఉన్నది.

ఇక్కడ 54 సంవత్సరాల పైబడిన సంతతికి అన్నప్పుడు, వాళ్ళ తల్లి తండ్రుల వయసు ఎంత ఉండవచ్చునని మనం అర్థం చేసుకోవాలి. అంటే వారు దాదాపుగా వృద్దాప్య స్థితిలో ఉంటారని భావించాలి. అయితే ఈ వయసులో ఉన్న వారికి సహజంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఎలాంటి వత్తిడి లేక ఇతర సంఘర్షణలకు గురి కాకుండా ఉంటుండాలి. ముఖ్యంగా వారికి కావలసిన అవసరాలు సంతతి నుంచి అందుతాయో లేక అందవో లేక తల్లి తండ్రుల కోసం సంతానం లేని పోనీ వ్యయ ప్రయాసల కోర్చి అప్పులు చేస్తూ ఉంటారేమో అనే భావంతో కూడా కొంతమంది ఉంటుంటారు. ఈ వయసులో బ్రతికి ఏం చేయాలి.... ఎప్పటికైనా ఈ శరీరం వెళ్ళవలసిందే కదా.... ఇందుకోసంగా సంతానం చేత అప్పు చేయించి.... తన వైద్య సేవలకు ఎందుకు ఖర్చుపెట్టుకోవాలి అనే మానసిక వ్యధతో ఉండే వృద్దులు చాలా మంది ఉంటుంటారు. ఇలాంటి వారందరూ.... ఎలాంటి భయము, ఆందోళన, వత్తిడి, సంఘర్షణలకు లోను కావద్దు. ఇలాంటి వార్లకి ఒక విశేషమైన ప్రత్యేక పరిహారం ఉన్నది. కనుక దిగులు చెందక వ్యధ నొందక ధైర్యంగా ఉంటూ భగవంతుడిని ప్రార్ధిస్తూ పరిహారం పాటించటానికి ప్రయత్నం చేయండి. ఈ పరిహారం అన్నీ రాశులకు జాగ్రత్తలు చెప్పిన తర్వాత తెలియ చేయగలను. కాబట్టి 54 గానీ, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సంతతి విషయంలో తల్లి తండ్రులు ధైర్యంగా ఉండండి.

36 నుంచి 54 సంవత్సరాల వయసు మధ్య గల సంతతితో ఉన్నటువంటి తల్లి తండ్రులు మాత్రం ( తమ సంతానానికి రుణ సమస్యలు, గృహ సమస్యలు, వృత్తి వ్యాపార సమస్యలు, దాంపత్య సమస్యలు, న్యాయ స్థాన నిర్ణయాల కోసం వేచి వుండే స్థితులు, సంతానానికి సంతానానికి మధ్య సంఘర్షణలు, అనారోగ్యంతో బాధపడే సంతానం కల వారు ) ముఖ్య నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే.... మనసును కట్టడి చేసుకొని జరిగేది ఎలానూ జరుగుతుంది. జరగనిది ఎలానూ జరగదు అనే వేదాంత ధోరణిలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ తల్లి తండ్రులు ఊరక ఉండదు కదా.. తమకు మనుమలు, మనుమరాండ్రు కలగలేదనే భావన ఒక వైపు లాగుతుంటే, మరోవైపు కలిగినా వంశం వృద్ధి చెందలేకుండా ఉంటుందేమో అనే తపన కూడా ఈ నాలుగు మాసాలలో వచ్చే అవకాశం ఉంది. అయితే నాలుగు మాసాలు పూర్తిగా కాకుండా చిట్ట చివరలో చెప్పే సమయాలలోనే వారి మనస్సు కొంత కకావికలమయ్యే అవకాశం ఉంది. కనుక ఈ వయస్సు లో ఉన్న జాతకుల తల్లి తండ్రులు మాత్రం ప్రతి  బుధవారం రాత్రి ఒక  పిడికెడు శనగలను నానబెట్టేది. గురువారం ఉదయం వాటిని భూత దయతో వృక్ష సముదాయాలు లేక పూల చెట్లు ఉన్న మధ్యలో వాటిని చల్లటానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా హైరానా పడవద్దు. మీరు వెళ్ళలేక పోతే ఇతరుల చేత చల్లటానికి పంపించండి. ఇక్కడ మనసు మాత్రమే ముఖ్యమని గమనించండి.

18 సంవత్సరాల నుంచి 36 మధ్య గల వయస్కుల విషయంలో తల్లి తండ్రులు గమనించాల్సినవి అనేకం ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వివాహ, సంతాన, వ్యవహార అంశాలతో పాటు వారు నివసించే గృహ సంబంధిత విషయాలు కూడా దృష్టిలో ఉంచుకొని సరియైన ఆలోచన చేయాలి. అంటే సంతానానికి సరియైన ఉద్యోగం లేకపోతే.... అనవసరంగా వారిని ఈ నాలుగు మాసాలలో నిందించే విధంగా మాటలు రాకూడదు. చాలా తక్కువ మార్కులతో పాస్ అయినందున... ఈ గతి పట్టిందని పదిమందిలో సంతతిని కించ పరిచేలా మాటలాడవద్దు. అలాగే వివాహ విషయాలో కూడా... పెద్దల నిర్ణయానుసారంగానే జరగకుండా... సంతాన ఇష్టానుసారంగా జరిగే అవకాశాలు కొంత మందికి ఉంటుంటాయి. ఇలాంటి సందర్భాలలో ముందు జాగ్రత్తగా గమనిస్తూ... తనదైన సరళిలో నచ్చ చెప్పి... ఎట్టి కోపతాపాలకు తావివ్వకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు సంతానానికి వివాహం చేయాలన్నా ... తగిన వ్యక్తి దొరకని కారణంగా కూడా మానసిక వేదన అనుభవించే వారు ఉంటారు. ఒక వేళ వివాహం జరిగి ఉంటే వారి దాంపత్య బంధం సజావుగా సాగక... కొన్ని కొన్ని సమస్యలతో ఉండే వారు ఉంటారు. అంతేకాక ఆరోగ్య వ్యాపార వ్యవహార గృహ విషయాలలో.... అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటిగా ఉంటుంటుంది.


పైన చెప్పిన ఇలాంటి సమస్యలు సంతానానికి ఉండే తల్లి తండ్రులు సంయమనం పాటిస్తూ... జూలై 1వ తేదిన ఆకాశంలో కనపడే శుభగ్రహాల కలయికను హృదయ పూర్వకంగా దర్శించి ధన్యత నొంది అనుగ్రహం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే సంతాన కారకుడైన శుభగ్రహమే గురువు. ఇట్టి శుభ గురువు ఉచ్చ స్థితిలో ఉండి అరుదైన పరిస్థితులలో మరో శుభగ్రహమైన శుక్రుడుతో కలిసి దర్శనం ఇవ్వబోతున్నారు.  ఇది ఈ నాలుగు మాసాలలో చివరి మాసమైనప్పటికీ... ముందు జరిగే మూడు మాసాలలో తెలియ చేసే సమయాలలో మనసును స్థిమితం చేసుకుంటూ సంయమనం పాటిస్తూ ఆగ్రహాలకు తావివ్వక జాగ్రత్తగా ముందుకు సాగవచ్చు. నాల్గవ మాసంలో కనపడే గురు శుక్రుల దర్శనాన్ని దర్శించండి. ప్రత్యేక పరిహారములు అవసరం లేదు.

ఒకటి నుంచి 18 సంవత్సరాల సంతతి గల తల్లి తండ్రులు దూరాలోచనతో ఈ నాలుగు మాసాలు గడపాలి. ఎందుకంటే.... సహజంగానే ఈ నాలుగు మాసాలలో విద్య నిలయాలకు సెలవులతో పాటు నూతనంగా పాఠశాలలు ప్రారంభించటము, పై తరగతులలో చేరటము జరుగుతుంటుంటాయి. స్నేహితులు, స్నేహితురాండ్లు కలవటాలు, ఆలోచనలను పంచుకోవటాలు సహజంగా జరుగుతాయి. గ్రహచార ప్రభావం వలన వృషభరాశి జాతకుల సంతతికి మాత్రం... ఆలోచనలు అనుకూలం కాకుండా వ్యతిరేకంగా తీసుకొనే అవకాశం ఉంది. లేని పోని అలవాట్ల వైపు మొగ్గు చూపటము, డబ్బును తృణ ప్రాయంగా ఖర్చు చేయటము, ఇది ఎండల కాలం... ఎండలు మండుతుంటాయి. తల్లి తండ్రులకు తెలియకుండా స్నేహితులతో కలిసి షికార్లకి వెళ్లి.... వడదెబ్బ లేదా ఇతర సమస్యలకు లోనై  ఆరోగ్యాలు చెడగోట్టుకొనే అవకాశం ఉంటుంటుంది. అలాగే చంటి బిడ్డలు ఉన్నవారైతే... సమయానికి వారి ఆరోగ్య విషయాలను పరిరక్షిస్తూ ఉంటూ ఉండాలి. ఇలా కాక ఈ నాలుగు మాసాలలో భార్య గర్భవతి ఉన్న సందర్భాలలోని వారు.... సమయానికి వైద్యులు ఇచ్చిన నిర్ణయాలను పాటిస్తూ... తినదగిన పదార్ధాలనే తింటూ ఎండలలో తిరగకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొనవలసిన అవసరం ఉందని వృషభ రాశి జాతకులు గమనించాలి.

వృషభరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 10 ఉదయం 7.30 నుంచి 12 మధ్యాహ్నం 12.56 వరకు
మే 7 మధ్యాహ్నం 1.04 నుంచి 9 సాయంత్రం 6.29 వరకు
జూన్  3 రాత్రి 7.50 నుంచి 5 రాత్రి 12.18 వరకు
జూలై 1 ఉదయం 4.19 నుంచి 3 ఉదయం 7.50 వరకు
జూలై 28 మధ్యాహ్నం 1.52 నుంచి 30 సాయంత్రం 5.18 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు కృత్తిక 2,3,4 జాతకులు :
ఏప్రిల్ 9 ఉదయం 6.52 నుంచి 10 ఉదయం 7.30  వరకు,
ఏప్రిల్ 17 రాత్రి 7.49 నుంచి 18 సాయంత్రం 5.23 వరకు,
ఏప్రిల్ 26 మధ్యాహ్నం 3.54 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు,
మే 6 మధ్యాహ్నం 12.41 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు,
మే 15 ఉదయం 4.35 నుంచి అర్థరాత్రి తదుపరి 5.42 వరకు,
మే 23 రాత్రి 12.03 నుంచి 24 అర్థరాత్రి తదుపరి 2.28 వరకు,
జూన్ 2 రాత్రి 7.51 నుంచి 3 రాత్రి 7.50 వరకు,
జూన్ 11 ఉదయం 10.59 నుంచి 12 ఉదయం 9.40  వరకు,
జూన్ 20 ఉదయం 8.31 నుంచి 21 ఉదయం 10.41 వరకు,
జూన్ 30 ఉదయం 4.31 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు,
జూలై 8 సాయంత్రం 4.20 నుంచి 9 మధ్యాహ్నం 3.08 వరకు,
జూలై 17 సాయంత్రం 4.25 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు,
జూలై 27 మధ్యాహ్నం 1.51 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

రోహిణి జాతకులు :
ఏప్రిల్ 10 ఉదయం 7.30 నుంచి 11 ఉదయం 7.36  వరకు,
ఏప్రిల్ 18 సాయంత్రం 5.23 నుంచి 19 మధ్యాహ్నం 3.09 వరకు,
ఏప్రిల్  27 సాయంత్రం 6.38 నుంచి 28 రాత్రి 9.40 వరకు,
మే 7 మధ్యాహ్నం 1.04 నుంచి 8 మధ్యాహ్నం 1.03 వరకు,
మే 15 అర్థరాత్రి తదుపరి 5.42 నుంచి 16 అర్థరాత్రి 12.53 వరకు,
మే 24 అర్థరాత్రి తదుపరి 2.28 నుంచి 26 ఉదయం 5.20 వరకు,
జూన్ 3 రాత్రి 7.50 నుంచి 4 రాత్రి 7.22 వరకు,
జూన్ 12 ఉదయం 9.40 నుంచి 13 ఉదయం 8.26  వరకు,
జూన్ 21 ఉదయం 10.41 నుంచి 22 మధ్యాహ్నం 1.22 వరకు,
జూలై 1 ఉదయం 4.19 నుంచి అర్థరాత్రి తదుపరి 3.31  వరకు,
జూలై 9 మధ్యాహ్నం 3.08 నుంచి 10 మధ్యాహ్నం 2.09 వరకు,
జూలై 18 సాయంత్రం 6.32 నుంచి 19 రాత్రి 9.07 వరకు,
జూలై 28 మధ్యాహ్నం 1.52 నుంచి 29 మధ్యాహ్నం 1.09 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

మృగశిర 1,2 పాద జాతకులు :

ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 


ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి వృషభరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో మిధునరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

సంపూర్ణ చంద్రగ్రహణం - మేషరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

4 ఏప్రిల్ 2015 శనివారం శ్రీ మన్మధ నామ సంవత్సర చైత్ర పూర్ణిమ నాడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో రాహుగ్రస్తంగా సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం దాదాపుగా 4 మాసాలపాటు ద్వాదశ రాశులపై పరోక్ష ప్రభావాన్ని చూపుతుండును. కాని ద్వాదశ రాశులవారు ఎటువంటి భయం, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కొన్ని కొన్ని అంశాలలో ముఖ్య జాగ్రత్తలు తీసుకుంటుంటే సకలం సానుకూలంగానే జరుగుతుండును. ఈ నాల్గు మాసాలలో ఈ జాగ్రత్తలను పాటిస్తూ.... జూలై 1వ తేదిన కనువిందు చేసే అద్భుత శుభ గ్రహాలను దర్శించుకొని, ప్రార్ధించాల్సిన అవసరం ఉందని గ్రహించాలి.

మేషరాశి (అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం):
రావాల్సిన బాకీలు గాని, ఇవ్వవలసిన బాకీలలో గాని కొంత అప్రమత్తత అవసరం. తొందరపడి ఋణం ఇచ్చి పుచ్చు కోవటాలలో హాడావుడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక్కోసారి మిమ్మల్ని తప్పుదారి పట్టించుటకై గిట్టని వారు కుటిల ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వీటిని గమనిస్తూ ఉంటుండాలి. ఒక్కోసారి గతంలో చేసిన ఋణము చెల్లించినప్పటికీ, చెల్లించినట్ట్లుగా తగిన ఆధారం మీ దగ్గర లేకపోవచ్చును. దీనిని ఆసరాగా చేసుకొని, ఇతరులు మరోసారి ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటుంటాయి. అంతేకాకుండా కొన్ని కొన్ని పనులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ఉంటే వాటి వివరాలను, తేదీలను గుర్తుంచుకొని తగిన రీతిలో మసలుకోవాలి. లేదా సమయానికి హామీగా ఉంటుందనే భావనతో సంతకం చేసిన చెక్కు ఇచ్చి డబ్బు తీసుకుంటుంటారు. కొంతకాలం తర్వాత డబ్బు చెల్లిస్తారు. కాని చెక్ రిటర్న్ తీసుకోరు. అవతలి వారు దానిని సమీప బ్యాంకు లో ఇచ్చి డబ్బు డ్రా చేయవచ్చును, లేదా చెక్ బౌన్సు అయ్యేలా  చేసి, తర్వాతి రోజులలో ఇబ్బంది పెట్టవచ్చును. అంతేకాక ఇతరులకు డబ్బు చెల్లించే సమయాలలో, మీరు మాత్రమే వెళ్లి చెల్లించి తగు రశీదును తీసుకోండి. ఇలా కాక ఓ నమ్మకమైన వ్యక్తి అని ఒకరిని భావించి, అతని ద్వారా డబ్బు చెల్లించమని ఇచ్చారనుకుందాం. అతను చాల నమ్మకస్తుడు, కాని గ్రహచారం వలన, తాను ఆ సొమ్మును పోగొట్టవచ్చును... లేదా తన నుంచి చోరి జరగవచ్చును. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వాటిని గమనిస్తూ ముందుకు వెళ్ళాలి.

ప్రస్తుతం మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుందాం. అయినప్పటికీ ఈ నాలుగు మాసాలలో ఆహారం తీసుకొనే సమయాలలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఒక్కోసారి మనకు గిట్టని ఆహారం... తెలియక తిన్న కారణంగా సమస్యలు రావచ్చును. మల, మూత్ర విసర్జనశాలకి వెళ్లి వచ్చే సమయంలో పాదాలను, చేతులను చాలా శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఉందని, హెచ్చరికగా తెలియచేయటమైనది. అంతేకాక చేతి మరియు కాలి వ్రేళ్ళ గోళ్ళు పెరగకుండా కత్తిరించుకోవాలి. ఇలా కాకుండా మీకు ఏదైనా ఓ అనారోగ్య సమస్య ఉండి ఉంటే.... తాత్సారం చేయకుండా  ముఖ్య నిర్ణయాలను సమీప వైద్యుల నుంచి తెలుసుకోవటానికి ప్రయత్నించండి. సొంత వైద్యం వద్దు. అలాకాక గతంలో ఎప్పుడైనా అనారోగ్య సమస్య ఏర్పడి... శస్త్ర చికిత్స గాని, ఇతర సంబంధిత వైద్య సేవలు తీసుకొని, ప్రస్తుతం మీరు ఆరోగ్యవంతులుగా  ఉన్నప్పటికీ మరో మారు ఆ శాఖకి సంబంధించిన వైద్యుని యొక్క నిర్ణయాలను తీసుకొనటం (జనరల్ చెకప్) ఎంతైనా మంచిది.

మీకు ఎవరైనా ప్రత్యక్ష శత్రువులు కాని, అంతర్గత శత్రువులు కాని ఉన్నారేమో ఓ సారి ఆలోచించుకోండి. అలా ఉండి ఉంటే వారిని గురించి ఇతరులతో విమర్శలు చేయటం తగ్గించండి. లేదా వారి మీద మరింత శతృత్వ పోకడలతో విజ్రుంభించాలనే ఆలోచన చేయవద్దు. అంతేకాక ఈ నాల్గు మాసాలలో మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో అనుకోకుండా... ఏ చిన్నపాటి వ్యతిరేకత ఏదైనా మీకు ఎదురైతే వెంటనే మీరు ఆగ్రహావేశాలకు వెళ్ళవద్దు. సంయమనం పాటించండి. సమయస్పూర్తితో నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకుండే నిర్ణయాలను మీలోనే ఉంచుకోండి. మీ నీడను కూడా మీరు నమ్మకూడదని భావము. వెన్నపూసిన కత్తిలాంటి లేదా మేకవన్నె పులులు..... మిమ్మల్ని కలిసి, ఏవేవో మంచి మాటలు చెబుతూ నిదానంగా ఎవరినైనా ఓ వ్యక్తిని విమర్శిస్తూ మీతో మాట్లాడుతుంటే,  మీరు తన మాటలకు తందానా అంటూ మద్దతు చెప్పవద్దు. ఇటు వినటం, అటు వదిలేయటం ఉండాలి. అలాగే పరిష్కారం కాకుండా ఉన్న తగవులు కాని లేక ఇతర బంధువుల, కుటుంబ సభ్యుల మధ్య తగవులు ఉండి ఉంటే సంయమనమే పాటించండి, ఆవేశ పడవద్దు. మాములుగా మీరు ఫోన్ లో సంభాషిస్తుంటే, అవతలి వారు మీ మాటలను రికార్డు చేసే అవకాశముంది కనుక, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. లేదా ఎదురుగా ఉన్నవారు, తమ సెల్ ఫోన్ ను కెమెరా మీ వైపు ఉండే విధంగా ఆన్ చేసి.... తమ పాకెట్ లో పెట్టుకుంటారు. ఇది గమనించక మీరు వారితో ఏమేమో మాట్లాడి... ప్రత్యక్ష సాక్షంగా మిగిలిపోతారు. కనుక ఏప్రిల్ 4 నుంచి జూలై 31 వరకు జాగ్రత్తలు తీసుకొంటూ, ఈ క్రింది తెలియచేసిన తేదీలలో కూడా మరింత జాగ్రత్తలు తీసుకొనేది. ఈ నాల్గు మాసాలలో చేసే ప్రయాణాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని భావం.

మేషరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 7 రాత్రి 11.18 నుంచి 10 ఉదయం 7.30 వరకు
మే 5 ఉదయం 5.31 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు
జూన్ 1 మధ్యాహ్నం 1.04 నుంచి 3 రాత్రి 7.50 వరకు
జూన్ 28 రాత్రి 9.44 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు
జూలై 26 ఉదయం 6.37 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు అశ్విని జాతకులు:
ఏప్రిల్ 15 అర్థరాత్రి 12.44 నుంచి 16 రా10.19 వరకు,
ఏప్రిల్ 24 12.06 నుంచి 25 మధ్యాహ్నం 1.40 వరకు, 
మే 4 ఉదయం 10.32 నుంచి 5 మధ్యాహ్నం 11.51 వరకు,
మే 13 ఉదయం 8.07 నుంచి 14 ఉదయం 6.25 వరకు,
మే 21 రాత్రి 9.08 నుంచి 22 రాత్రి 10.15 వరకు,
మే 31 సాయంత్రం 6.14 నుంచి జూన్ 1 రా 7.21 వరకు,
జూన్ 9 మధ్యాహ్నం 1.41 నుంచి 10 మ12.20 వరకు,
జూన్ 18 ఉదయం 6.02 నుంచి 19 ఉదయం 6.58 వరకు,
జూన్ 27 అర్థరాత్రి తదుపరి 2.50 నుంచి 29 ఉదయం 4.02 వరకు,
జూలై 6 రాత్రి 7.22 నుంచి 7 సాయంత్రం 5.46 వరకు,
జూలై 15 మధ్యాహ్నం 1.44 నుంచి 16 మధ్యాహ్నం 2.49 వరకు,
జూలై 25 మధ్యాహ్నం 11.25 నుంచి 26 మధ్యాహ్నం 1.02 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

భరణి జాతకులు:
ఏప్రిల్ 8 ఉదయం 5.43 నుంచి 9 ఉదయం 6.52 వరకు
ఏప్రిల్ 16 రా10.19 నుంచి 17 రాత్రి 7.49 వరకు,
ఏప్రిల్ 25 మధ్యాహ్నం 1.40 నుంచి 26 మధ్యాహ్నం 3.54 వరకు, 
మే 5 మధ్యాహ్నం 11.51 నుంచి 6 మధ్యాహ్నం 12.41 వరకు,
మే 14 ఉదయం 6.25 నుంచి 15 ఉదయం 4.35 వరకు,
మే 22 రాత్రి 10.15 నుంచి 23 రాత్రి 12.03 వరకు,
జూన్ 1 రా 7.21 నుంచి 2 రాత్రి 7.51  వరకు,
జూన్ 10 మ12.20 నుంచి 11 ఉదయం 10.59  వరకు,
జూన్  19 ఉదయం 6.58 నుంచి 20 ఉదయం 8.31 వరకు,
జూన్ 29 ఉదయం 4.02 నుంచి 30 ఉదయం 4.31  వరకు,
జూలై  7 సాయంత్రం 5.46 నుంచి 8 సాయంత్రం 4.20 వరకు,
జూలై 16 మధ్యాహ్నం 2.49 నుంచి 17 సాయంత్రం 4.25 వరకు,
జూలై 26 మధ్యాహ్నం 1.02 నుంచి 27 మధ్యాహ్నం 1.51  వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

కృత్తిక 1వ పాదం జాతకులు :
ఏప్రిల్ 9 ఉదయం 6.52 నుంచి 10 ఉదయం 7.30  వరకు,
ఏప్రిల్ 17 రాత్రి 7.49 నుంచి 18 సాయంత్రం 5.23 వరకు,
ఏప్రిల్ 26 మధ్యాహ్నం 3.54 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు, 
మే 6 మధ్యాహ్నం 12.41 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు,
మే 15 ఉదయం 4.35 నుంచి అర్థరాత్రి తదుపరి 5.42 వరకు,
మే 23 రాత్రి 12.03 నుంచి 24 అర్థరాత్రి తదుపరి 2.28 వరకు,
జూన్ 2 రాత్రి 7.51 నుంచి 3 రాత్రి 7.50 వరకు,
జూన్ 11 ఉదయం 10.59 నుంచి 12 ఉదయం 9.40  వరకు,
జూన్ 20 ఉదయం 8.31 నుంచి 21 ఉదయం 10.41 వరకు,
జూన్ 30 ఉదయం 4.31 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు,
జూలై 8 సాయంత్రం 4.20 నుంచి 9 మధ్యాహ్నం 3.08 వరకు,
జూలై 17 సాయంత్రం 4.25 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు,
జూలై 27 మధ్యాహ్నం 1.51 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో వృషభరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

Monday, March 30, 2015

చైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్ర గ్రహణం

శ్రీ మన్మథ నామ సంవత్సర చైత్ర పూర్ణిమ శనివారం 4 ఏప్రిల్ 2015 హస్త నక్షత్ర కన్యా రాశిలో సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించును. భారతదేశంలో మాత్రం సంపూర్ణం కనపడదు. గ్రహణం సంపూర్ణం జరిగిన తర్వాత చివరి విడుపు భాగం మాత్రమే పాక్షికంగా భారతదేశంలో కనపడును. 5 నిముషాలపాటు నిలకడగా సంపూర్ణ చంద్రగ్రహణ బింబము నిలబడును. ఆస్ట్రేలియా, అమెరికాలలో సంపూర్ణ గ్రహణము గోచరించును.

భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణ సమయాలు
పాక్షికంతో చంద్రగ్రహణ స్పర్శ                                         - మ 3.46 నిముషాలు
సంపూర్ణ స్థితికి గ్రహణము రాక (ఉన్మీలనము)                   - సా 5.28 నిముషాలు
సంపూర్ణ స్థితి నుంచి విడుపు ప్రారంభం (నిమీలనము)         - సా 5.33 నిముషాలు
పాక్షికంతో గ్రహణం ముగింపు (మోక్షం)                             - రా 7.15 నిముషాలు
పూర్తి గ్రహణ కాలము                                                   - 3గం. 29నిముషాలు
సంపూర్ణ గ్రహణ బింబ సమయము                                  - 5 నిముషాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో పాక్షిక గ్రహణం వివిధ ప్రాంతాలలో కనపడే సమయాలు
ఇచ్చాపురం                        - సా 6.07 నుంచి 7.15 వరకు  68 నిముషాలు
శ్రీకాకుళం                           - సా 6.10 నుంచి 7.15 వరకు  65 నిముషాలు
విజయనగరం, వైజాగ్           - సా 6.12 నుంచి 7.15 వరకు  63 నిముషాలు
కాకినాడ                            - సా 6.16 నుంచి 7.15 వరకు  59 నిముషాలు
అమలాపురం                      - సా 6.17 నుంచి 7.15 వరకు  58 నిముషాలు
రాజమండ్రి                          - సా 6.18 నుంచి 7.15 వరకు  57 నిముషాలు
ఏలూరు                             - సా 6.21 నుంచి 7.15 వరకు  54 నిముషాలు
తిరుపతి, చిత్తూరు               - సా 6.27 నుంచి 7.15 వరకు  53 నిముషాలు
అనంతపురం                      - సా 6.35 నుంచి 7.15 వరకు  50 నిముషాలు
కడప                                - సా 6.29 నుంచి 7.15 వరకు  46 నిముషాలు
కర్నూలు, శ్రీశైలం                 - సా 6.31 నుంచి 7.15 వరకు  44 నిముషాలు
హైదరాబాదు                       - సా 6.32 నుంచి 7.15 వరకు  43 నిముషాలు
వరంగల్                             - సా 6.28 నుంచి 7.15 వరకు  47 నిముషాలు
కరీంనగర్                            - సా 6.30 నుంచి 7.15 వరకు  45 నిముషాలు
మెదక్                                - సా 6.33 నుంచి 7.15 వరకు  42 నిముషాలు
ఖమ్మం, తిరుత్తణి                 - సా 6.25 నుంచి 7.15 వరకు  50 నిముషాలు
నెల్లూరు, ఒంగోలు                 - సా 6.25 నుంచి 7.15 వరకు  50 నిముషాలు
ఆదిలాబాద్, నిజామాబాద్      - సా 6.33 నుంచి 7.15 వరకు  42 నిముషాలు
మహబూబ్ నగర్                  - సా 6.34 నుంచి 7.15 వరకు  41 నిముషాలు
 

ఇతర ముఖ్య ప్రాంతాలలో గోచరించు సమయాలు
షిర్డీ                                    - సా 6.50 నుంచి 7.15 వరకు  25 నిముషాలు
పూరి                                  - సా 6.03 నుంచి 7.15 వరకు  72 నిముషాలు
కలకత్తా                               - సా 5.54 నుంచి 7.15 వరకు  81 నిముషాలు
అహ్మదాబాద్                        - సా 6.59 నుంచి 7.15 వరకు  16 నిముషాలు
మదురై                                - సా 6.30 నుంచి 7.15 వరకు  45 నిముషాలు
త్రివేండ్రం                              - సా 6.35 నుంచి 7.15 వరకు  40 నిముషాలు
మైసూరు                             - సా 6.37 నుంచి 7.15 వరకు  38 నిముషాలు
మద్రాస్, గుంటూరు                - సా 6.22 నుంచి 7.15 వరకు  53 నిముషాలు
విజయవాడ, భద్రాచలం           - సా 6.22 నుంచి 7.15 వరకు  53 నిముషాలు
బెంగళూరు                           - సా 6.34 నుంచి 7.15 వరకు  41 నిముషాలు
ఢిల్లీ                                     - సా 6.43 నుంచి 7.15 వరకు  32 నిముషాలు


భారతదేశంలో కనపడే ఈ పాక్షిక గ్రహణము గర్భవతులు చూడవద్దు. తమ తమ పనులను చక్కగా ఆచరించవచ్చు. మల, మూత్ర విసర్జనములకు వెళ్ళవచ్చును. గ్రహణ కిరణములు సోకకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈ గ్రహణ ప్రభావము వలన ద్వాదశ రాశుల వారు ఏ ఏ అంశాల పైన దృష్టి వుంచి జాగ్రత్తలు తీసుకోవలెనో తదుపరి పోస్టింగ్ లో గమనించేది.