గమనిక : 2018 జూన్ 26 రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు 121 రోజులు కుజగ్రహం వక్రంతో సంచారం చేయనున్నది. కనుక కుజ దోషం అనేది లేకున్ననూ, ఉన్నదని భయపడేవారు, ఋణ శత్రు శరీర పీడల నుంచి ఉపశమనానికి ప్రత్యేక అరుదైన విశేష రోజులలో కుజ గ్రహ దోష నివారణకు అద్భుత పరిహారములను ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి.- శ్రీనివాస గార్గేయ

Tuesday, March 31, 2015

సంపూర్ణ చంద్రగ్రహణం - వృషభరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

కన్యారాశిలో సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంచే వృషభ రాశిలో జన్మించిన జాతకులు జూలై 31 వరకు సంతాన సంబంధిత విషయాలలోనూ, నిర్ణయాలలోను జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. 18 సంవత్సరములు వయస్సు గానీ, అంతకు లోబడి గానీ ఉన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు ఒక విధంగా తీసుకోవాలి. 18 నుంచి 36 సంవత్సరాల వయసు మధ్య ఉన్న సంతానం విషయంలో జాగ్రత్తలు మరొక రకంగా తీసుకోవాలి. 36 నుంచి 54 సంవత్సరాలు మధ్య గల సంతానానికి ఇంకో రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 54 పైబడిన సంతతికి వేరే విధంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అవసరం ఉన్నది.

ఇక్కడ 54 సంవత్సరాల పైబడిన సంతతికి అన్నప్పుడు, వాళ్ళ తల్లి తండ్రుల వయసు ఎంత ఉండవచ్చునని మనం అర్థం చేసుకోవాలి. అంటే వారు దాదాపుగా వృద్దాప్య స్థితిలో ఉంటారని భావించాలి. అయితే ఈ వయసులో ఉన్న వారికి సహజంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఎలాంటి వత్తిడి లేక ఇతర సంఘర్షణలకు గురి కాకుండా ఉంటుండాలి. ముఖ్యంగా వారికి కావలసిన అవసరాలు సంతతి నుంచి అందుతాయో లేక అందవో లేక తల్లి తండ్రుల కోసం సంతానం లేని పోనీ వ్యయ ప్రయాసల కోర్చి అప్పులు చేస్తూ ఉంటారేమో అనే భావంతో కూడా కొంతమంది ఉంటుంటారు. ఈ వయసులో బ్రతికి ఏం చేయాలి.... ఎప్పటికైనా ఈ శరీరం వెళ్ళవలసిందే కదా.... ఇందుకోసంగా సంతానం చేత అప్పు చేయించి.... తన వైద్య సేవలకు ఎందుకు ఖర్చుపెట్టుకోవాలి అనే మానసిక వ్యధతో ఉండే వృద్దులు చాలా మంది ఉంటుంటారు. ఇలాంటి వారందరూ.... ఎలాంటి భయము, ఆందోళన, వత్తిడి, సంఘర్షణలకు లోను కావద్దు. ఇలాంటి వార్లకి ఒక విశేషమైన ప్రత్యేక పరిహారం ఉన్నది. కనుక దిగులు చెందక వ్యధ నొందక ధైర్యంగా ఉంటూ భగవంతుడిని ప్రార్ధిస్తూ పరిహారం పాటించటానికి ప్రయత్నం చేయండి. ఈ పరిహారం అన్నీ రాశులకు జాగ్రత్తలు చెప్పిన తర్వాత తెలియ చేయగలను. కాబట్టి 54 గానీ, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సంతతి విషయంలో తల్లి తండ్రులు ధైర్యంగా ఉండండి.

36 నుంచి 54 సంవత్సరాల వయసు మధ్య గల సంతతితో ఉన్నటువంటి తల్లి తండ్రులు మాత్రం ( తమ సంతానానికి రుణ సమస్యలు, గృహ సమస్యలు, వృత్తి వ్యాపార సమస్యలు, దాంపత్య సమస్యలు, న్యాయ స్థాన నిర్ణయాల కోసం వేచి వుండే స్థితులు, సంతానానికి సంతానానికి మధ్య సంఘర్షణలు, అనారోగ్యంతో బాధపడే సంతానం కల వారు ) ముఖ్య నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే.... మనసును కట్టడి చేసుకొని జరిగేది ఎలానూ జరుగుతుంది. జరగనిది ఎలానూ జరగదు అనే వేదాంత ధోరణిలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ తల్లి తండ్రులు ఊరక ఉండదు కదా.. తమకు మనుమలు, మనుమరాండ్రు కలగలేదనే భావన ఒక వైపు లాగుతుంటే, మరోవైపు కలిగినా వంశం వృద్ధి చెందలేకుండా ఉంటుందేమో అనే తపన కూడా ఈ నాలుగు మాసాలలో వచ్చే అవకాశం ఉంది. అయితే నాలుగు మాసాలు పూర్తిగా కాకుండా చిట్ట చివరలో చెప్పే సమయాలలోనే వారి మనస్సు కొంత కకావికలమయ్యే అవకాశం ఉంది. కనుక ఈ వయస్సు లో ఉన్న జాతకుల తల్లి తండ్రులు మాత్రం ప్రతి  బుధవారం రాత్రి ఒక  పిడికెడు శనగలను నానబెట్టేది. గురువారం ఉదయం వాటిని భూత దయతో వృక్ష సముదాయాలు లేక పూల చెట్లు ఉన్న మధ్యలో వాటిని చల్లటానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా హైరానా పడవద్దు. మీరు వెళ్ళలేక పోతే ఇతరుల చేత చల్లటానికి పంపించండి. ఇక్కడ మనసు మాత్రమే ముఖ్యమని గమనించండి.

18 సంవత్సరాల నుంచి 36 మధ్య గల వయస్కుల విషయంలో తల్లి తండ్రులు గమనించాల్సినవి అనేకం ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వివాహ, సంతాన, వ్యవహార అంశాలతో పాటు వారు నివసించే గృహ సంబంధిత విషయాలు కూడా దృష్టిలో ఉంచుకొని సరియైన ఆలోచన చేయాలి. అంటే సంతానానికి సరియైన ఉద్యోగం లేకపోతే.... అనవసరంగా వారిని ఈ నాలుగు మాసాలలో నిందించే విధంగా మాటలు రాకూడదు. చాలా తక్కువ మార్కులతో పాస్ అయినందున... ఈ గతి పట్టిందని పదిమందిలో సంతతిని కించ పరిచేలా మాటలాడవద్దు. అలాగే వివాహ విషయాలో కూడా... పెద్దల నిర్ణయానుసారంగానే జరగకుండా... సంతాన ఇష్టానుసారంగా జరిగే అవకాశాలు కొంత మందికి ఉంటుంటాయి. ఇలాంటి సందర్భాలలో ముందు జాగ్రత్తగా గమనిస్తూ... తనదైన సరళిలో నచ్చ చెప్పి... ఎట్టి కోపతాపాలకు తావివ్వకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు సంతానానికి వివాహం చేయాలన్నా ... తగిన వ్యక్తి దొరకని కారణంగా కూడా మానసిక వేదన అనుభవించే వారు ఉంటారు. ఒక వేళ వివాహం జరిగి ఉంటే వారి దాంపత్య బంధం సజావుగా సాగక... కొన్ని కొన్ని సమస్యలతో ఉండే వారు ఉంటారు. అంతేకాక ఆరోగ్య వ్యాపార వ్యవహార గృహ విషయాలలో.... అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటిగా ఉంటుంటుంది.


పైన చెప్పిన ఇలాంటి సమస్యలు సంతానానికి ఉండే తల్లి తండ్రులు సంయమనం పాటిస్తూ... జూలై 1వ తేదిన ఆకాశంలో కనపడే శుభగ్రహాల కలయికను హృదయ పూర్వకంగా దర్శించి ధన్యత నొంది అనుగ్రహం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే సంతాన కారకుడైన శుభగ్రహమే గురువు. ఇట్టి శుభ గురువు ఉచ్చ స్థితిలో ఉండి అరుదైన పరిస్థితులలో మరో శుభగ్రహమైన శుక్రుడుతో కలిసి దర్శనం ఇవ్వబోతున్నారు.  ఇది ఈ నాలుగు మాసాలలో చివరి మాసమైనప్పటికీ... ముందు జరిగే మూడు మాసాలలో తెలియ చేసే సమయాలలో మనసును స్థిమితం చేసుకుంటూ సంయమనం పాటిస్తూ ఆగ్రహాలకు తావివ్వక జాగ్రత్తగా ముందుకు సాగవచ్చు. నాల్గవ మాసంలో కనపడే గురు శుక్రుల దర్శనాన్ని దర్శించండి. ప్రత్యేక పరిహారములు అవసరం లేదు.

ఒకటి నుంచి 18 సంవత్సరాల సంతతి గల తల్లి తండ్రులు దూరాలోచనతో ఈ నాలుగు మాసాలు గడపాలి. ఎందుకంటే.... సహజంగానే ఈ నాలుగు మాసాలలో విద్య నిలయాలకు సెలవులతో పాటు నూతనంగా పాఠశాలలు ప్రారంభించటము, పై తరగతులలో చేరటము జరుగుతుంటుంటాయి. స్నేహితులు, స్నేహితురాండ్లు కలవటాలు, ఆలోచనలను పంచుకోవటాలు సహజంగా జరుగుతాయి. గ్రహచార ప్రభావం వలన వృషభరాశి జాతకుల సంతతికి మాత్రం... ఆలోచనలు అనుకూలం కాకుండా వ్యతిరేకంగా తీసుకొనే అవకాశం ఉంది. లేని పోని అలవాట్ల వైపు మొగ్గు చూపటము, డబ్బును తృణ ప్రాయంగా ఖర్చు చేయటము, ఇది ఎండల కాలం... ఎండలు మండుతుంటాయి. తల్లి తండ్రులకు తెలియకుండా స్నేహితులతో కలిసి షికార్లకి వెళ్లి.... వడదెబ్బ లేదా ఇతర సమస్యలకు లోనై  ఆరోగ్యాలు చెడగోట్టుకొనే అవకాశం ఉంటుంటుంది. అలాగే చంటి బిడ్డలు ఉన్నవారైతే... సమయానికి వారి ఆరోగ్య విషయాలను పరిరక్షిస్తూ ఉంటూ ఉండాలి. ఇలా కాక ఈ నాలుగు మాసాలలో భార్య గర్భవతి ఉన్న సందర్భాలలోని వారు.... సమయానికి వైద్యులు ఇచ్చిన నిర్ణయాలను పాటిస్తూ... తినదగిన పదార్ధాలనే తింటూ ఎండలలో తిరగకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొనవలసిన అవసరం ఉందని వృషభ రాశి జాతకులు గమనించాలి.

వృషభరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 10 ఉదయం 7.30 నుంచి 12 మధ్యాహ్నం 12.56 వరకు
మే 7 మధ్యాహ్నం 1.04 నుంచి 9 సాయంత్రం 6.29 వరకు
జూన్  3 రాత్రి 7.50 నుంచి 5 రాత్రి 12.18 వరకు
జూలై 1 ఉదయం 4.19 నుంచి 3 ఉదయం 7.50 వరకు
జూలై 28 మధ్యాహ్నం 1.52 నుంచి 30 సాయంత్రం 5.18 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు కృత్తిక 2,3,4 జాతకులు :
ఏప్రిల్ 9 ఉదయం 6.52 నుంచి 10 ఉదయం 7.30  వరకు,
ఏప్రిల్ 17 రాత్రి 7.49 నుంచి 18 సాయంత్రం 5.23 వరకు,
ఏప్రిల్ 26 మధ్యాహ్నం 3.54 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు,
మే 6 మధ్యాహ్నం 12.41 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు,
మే 15 ఉదయం 4.35 నుంచి అర్థరాత్రి తదుపరి 5.42 వరకు,
మే 23 రాత్రి 12.03 నుంచి 24 అర్థరాత్రి తదుపరి 2.28 వరకు,
జూన్ 2 రాత్రి 7.51 నుంచి 3 రాత్రి 7.50 వరకు,
జూన్ 11 ఉదయం 10.59 నుంచి 12 ఉదయం 9.40  వరకు,
జూన్ 20 ఉదయం 8.31 నుంచి 21 ఉదయం 10.41 వరకు,
జూన్ 30 ఉదయం 4.31 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు,
జూలై 8 సాయంత్రం 4.20 నుంచి 9 మధ్యాహ్నం 3.08 వరకు,
జూలై 17 సాయంత్రం 4.25 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు,
జూలై 27 మధ్యాహ్నం 1.51 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

రోహిణి జాతకులు :
ఏప్రిల్ 10 ఉదయం 7.30 నుంచి 11 ఉదయం 7.36  వరకు,
ఏప్రిల్ 18 సాయంత్రం 5.23 నుంచి 19 మధ్యాహ్నం 3.09 వరకు,
ఏప్రిల్  27 సాయంత్రం 6.38 నుంచి 28 రాత్రి 9.40 వరకు,
మే 7 మధ్యాహ్నం 1.04 నుంచి 8 మధ్యాహ్నం 1.03 వరకు,
మే 15 అర్థరాత్రి తదుపరి 5.42 నుంచి 16 అర్థరాత్రి 12.53 వరకు,
మే 24 అర్థరాత్రి తదుపరి 2.28 నుంచి 26 ఉదయం 5.20 వరకు,
జూన్ 3 రాత్రి 7.50 నుంచి 4 రాత్రి 7.22 వరకు,
జూన్ 12 ఉదయం 9.40 నుంచి 13 ఉదయం 8.26  వరకు,
జూన్ 21 ఉదయం 10.41 నుంచి 22 మధ్యాహ్నం 1.22 వరకు,
జూలై 1 ఉదయం 4.19 నుంచి అర్థరాత్రి తదుపరి 3.31  వరకు,
జూలై 9 మధ్యాహ్నం 3.08 నుంచి 10 మధ్యాహ్నం 2.09 వరకు,
జూలై 18 సాయంత్రం 6.32 నుంచి 19 రాత్రి 9.07 వరకు,
జూలై 28 మధ్యాహ్నం 1.52 నుంచి 29 మధ్యాహ్నం 1.09 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

మృగశిర 1,2 పాద జాతకులు :

ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 


ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి వృషభరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో మిధునరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.