గమనిక : 2018 జూన్ 26 రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు 121 రోజులు కుజగ్రహం వక్రంతో సంచారం చేయనున్నది. కనుక కుజ దోషం అనేది లేకున్ననూ, ఉన్నదని భయపడేవారు, ఋణ శత్రు శరీర పీడల నుంచి ఉపశమనానికి ప్రత్యేక అరుదైన విశేష రోజులలో కుజ గ్రహ దోష నివారణకు అద్భుత పరిహారములను ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి.- శ్రీనివాస గార్గేయ

Tuesday, March 31, 2015

సంపూర్ణ చంద్రగ్రహణం - మిధునరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

మిధునరాశి జాతకులకు చంద్రగ్రహణ ప్రభావం విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ అంశాలపై ఉండును. కనుక జూలై 31 వరకు మిధున రాశి జాతకులు తమ తమ నిర్ణయాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ పావులు కదుపుతూ ఉండాలి. విద్య సంబంధిత అంశాలలోకి వస్తే ఈ నాలుగు మాసాలు పరీక్షలు రాయటాలు, ఉత్తీర్ణత కావటాలు, పై కోర్సులకు వెళ్ళటానికి అనువుగా ఉండే సమయం. ఇలాంటి సమయంలో అనవసరమైన వ్యాపకాలు ఒక్కోసారి ఎదురుకావటం గానీ లేదా కొంతమంది తప్పు సంకేతాలుగా అభిప్రాయాలను తెలియచెప్తూ, మనస్సు గాయపరిచేలా ఉంటుంటాయి. కనుక అలాంటి అంశాల మీద అసలు దృష్టి పెట్టవద్దు. కేవలం ప్రతి బుధవారం సరస్వతి దేవిని ప్రార్ధిస్తూ మీ మనస్సుకు తగిన రీతిలోనే నడుచుకుంటూ నిర్భయంగా ముందుకు సాగండి. అయితే గ్రహచార ప్రభావాలచే ఎక్కడైనా చిన్నపాటి వ్యతిరేకతలు చోటు చేసుకుంటే, వెంటనే క్రుంగిపోవద్దు. అపజయాలు అనేవి విజయమనే నిచ్చెనకు మెట్లుగా భావించాలే తప్ప నిరాశా, నిస్పృహలతో మాత్రం ఉండవద్దు. కనుకనే మనో ధైర్యంతో బుధవారాలలో సరస్వతి దేవిని ప్రార్ధించండి.

ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు కానీ తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే... తమకున్న ఏదైనా లోపాన్ని గానీ, లేదా వెలితిని గానీ సహా ఉద్యోగులకు స్పష్టం చేయవద్దు. ఒకవేళ వారు పసిగట్టి ఈ లోపాన్ని ఎత్తి చూపినప్పుడు తక్షణమే వారిమాటను కొట్టిపారేయండి. దీనితో పాటు ఉద్యోగ సరళిలో మీకు తెలిసి.... నిజంగా ఏవైనా లోపాలు ఉండి ఉంటే, వాటిని ముందు జాగ్రత్తగా చక్కదిద్దుకోవటానికి ప్రయత్నమంటూ చేసుకోండి. పూర్తిగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే దానికంటే ముందు చూపుగా గమనించుకొని దిద్దుబాటు చేసుకోవటం చాలా ఉత్తమం. ఈ మాసాలలో పై అధికారులతో వినయంగా ఉండటం ఎంతైనా శ్రేయోదాయకం. ఉద్యోగం చిన్నదైనా, పెద్దదైనా... వినయానికి ప్రాధాన్యత ఇస్తూ పావులు కదపటానికే ప్రయత్నిస్తూ, మీ లోపాలను సహా ఉద్యోగులు గమనించకుండా జాగ్రత్తపడండి.

సహా ఉద్యోగులు అమిత మిత్రులైనప్పటికీ ఈ నాలుగు మాసాలలో మాత్రం వారితో ఎలాంటి శతృత్వ పోకడలకు వెళ్ళవద్దు. అదే విధంగా ఉద్యోగ అన్వేషణలో ఉండే వారు కూడా ఇంటర్వ్యూలకు లేక ఏ ఇతర ముఖ్య వ్యవహారాలకు హాజరయ్యే అవకాశం ఉన్న సందర్భాల రోజులలో పులుపును తినకుండా ఉండటం చాలా మంచిదని గ్రహించండి. ఆరోగ్య అంశాలను విశ్లేషిస్తే.... హడావుడిగా వెళ్ళే ప్రయాణాలలో కానీ, హడావుడిగా చేసే వేగవంతమైన పనులలో కానీ.... నడకను నెమ్మదిగా ఉంచాలే తప్ప వడి వడి అడుగులు వేయవద్దు. గమనంలో ఉన్న బస్సును ఎక్కటానికి ప్రయత్నించవద్దు. బస్సు ఆగిన తర్వాతనే స్థిమితంగా ఎక్కండి. అలాగే కారు నుంచి దిగే సందర్భంలో.... ప్రక్కనుంచి ఏదైనా వాహనం వస్తున్నదేమో తెలుసుకొని, కారు తలుపు తీయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సందర్భాలలోనే సమస్య వచ్చి, ప్రమాదం వాటిల్లి, ఆరోగ్య భంగములు జరుగు సూచన కలదు.

చిన్న పిల్లలను ఎత్తుకొని ముద్దాడే సమయంలో.... వారి చేతిలో పెన్ లాంటి వస్తువులు లేకుండా గమనించాలి. ఎందుకంటే పొరపాటున కన్నుకు తగలవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో అపార్ట్ మెంట్ లలో గ్రిల్ తో పాటు క్లోస్డ్ డోర్ గా ఉండే లిఫ్ట్ పక్కన నిలబడవద్దు. ఎందుకంటే మీరు లిఫ్ట్ లో పైకి వెళ్ళాలి, అదే సమయంలో పైనుంచి హడావుడితో క్రిందకి వస్తాడు. మీరు నిలబడిన స్థితి లోపల వ్యక్తికి కనపడక తలుపును ముందుకు తోసుకొని రావటంతో, తలుపు వెనకాలే ఉన్న మీరు... క్రిందపదటమో... లేదా ముక్కుకు దెబ్బతగలటమో, లేదా కంటికి పెట్టుకున్న జోడు పగిలి గాజు ముక్కలచే కన్ను గాయమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చెబుతుంటే, కొండవీటి చేంతాడు లాగా తయారగును. కాబట్టి గమనించవలసినది ఏమిటంటే నిదానంతో వ్యవహారాలను చేస్తూ... బుద్ధి బలాన్ని ఉపయోగించి నడుచుకోవాలని అర్థము.

వాహన విషయాల కొనుగోలులో ఆలోచించి చక్కని నిర్ణయంతో వాహనాన్ని కొనండి. తొందరపడి ఎవరో ఏదో చెప్పారని ఓ వాహనం కొని తర్వాత నిరాశపడవద్దు. అంతేకాక ప్రస్తుతం మీకున్న వాహనానికి ఏమైనా మరమ్మత్తులు ఉన్నాయేమో గమనించి శ్రద్ధగా వాటిని మరమ్మత్తు చేయించి ఆ పైనే నడపటానికి ప్రయత్నించండి. రాత్రి వేళలలో మీరు కానీ, డ్రైవర్ కానీ వాహనాన్ని నడుపుతున్నప్పుడు... శృతి మించిన వేగం కాకుండా తక్కువ వేగంతోనే వెళుతూ అవసరమైన సమయాలలో విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తతోనే వాహన చోదకం చేయండి.

ప్రస్తుతం సొంత గృహం ఉండవచ్చు, లేకపోవచ్చు లేదా అద్దె ఇంట్లో ఉండవచ్చు. లేదా అద్దె కోసం ప్రయత్నాలు చేయవచ్చు. ఇలాంటి సందర్భాలలో లేని పోని భయాలు చెప్పి భయపెట్టే వారి వలన సమస్యలు వస్తాయేమోనని గ్రహించి చక్కగా వాస్తు రీత్యా ఉన్న ఇంటిని కూడా వదిలేసి వెళ్ళకండి. ఎందుకంటే వాస్తు బలం విశేషంగా ఉన్న గృహాలలో నివసించే వ్యక్తులు కూడా బాధలతో ఉంటుంటారనేది చాలా మందికి తెలియదు. గృహబలం కంటే గ్రహబలం చాలా గొప్పది.

ఇక చివరిగా జన్మనిచ్చిన తల్లి విషయంలో ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా ఈ నాలుగు మాసాలలో మాట్లాడటానికే ప్రయత్నించండి. మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి నటించి మాట్లాడవద్దు. అలా అని ముక్కుసూటిగా విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడవద్దు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్న చందాన అంటీ ముట్టనట్లుగా విషయ సరళిలో ఉండాలే తప్ప అలకలకు, విసుగులకు, క్రోధాలకు, కలహాలకు, విమర్శలకు, దూషణలకు, ఆరోపణలకు తావివ్వవద్దు.

మొత్తం మీద మిధునరాశి జాతకులు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ, చిన్నపాటి జలుబు, జ్వరము వంటివి వస్తే, సొంత వైద్యం చేసుకోకుండా, అనుభవం ఉన్న వైద్యుడినే ఆశ్రయించాలని గమనించండి.

మిధునరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 12 మధ్యాహ్నం 12.56 నుంచి 14 మధ్యాహ్నం 3.51  వరకు
మే 9 సాయంత్రం 6.29 నుంచి 11 రాత్రి 10.17 వరకు
జూన్ 5 రాత్రి 12.18 నుంచి 7 అర్ధరాత్రి 3.41 వరకు
జూలై 3 ఉదయం 7.51 నుంచి 5 ఉదయం 10.01  వరకు
జూలై 30 సాయంత్రం 5.18 నుంచి 31 అర్ధరాత్రి 12.00 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు మృగశిర 3,4 పాద జాతకులు :
ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ఆర్ద్ర జాతకులు :
ఏప్రిల్ 12 ఉదయం 7.11 నుంచి 13 ఉదయం 6.13 వరకు,
ఏప్రిల్ 20 మధ్యాహ్నం 1.18 నుంచి 21 మధ్యాహ్నం 11.57 వరకు,
ఏప్రిల్ 29 రాత్రి 12.47 నుంచి 30 అర్ధరాత్రి తదుపరి 3.46 వరకు,
మే 9 మధ్యాహ్నం 12.40 నుంచి 10 మధ్యాహ్నం 11.57 వరకు,
మే 17 రాత్రి 11.15 నుంచి 18 రాత్రి 9.56 వరకు,
మే 27 ఉదయం 8.25 నుంచి 28 మధ్యాహ్నం 11.27 వరకు,
జూన్ 5 సాయంత్రం 6.34 నుంచి 6 సాయంత్రం 5.32 వరకు,
జూన్ 14 ఉదయం 7.20 నుంచి 15 ఉదయం 6.27 వరకు,
జూన్ 23 సాయంత్రం 4.22 నుంచి 24 రాత్రి 7.28 వరకు,
జూలై 2 అర్థరాత్రి 2.15 నుంచి 3 రాత్రి 12.41 వరకు,
జూలై 11 మధ్యాహ్నం 1.27 నుంచి 12 మధ్యాహ్నం 1.00 వరకు,
జూలై 20 రాత్రి 12.03 నుంచి 21 అర్ధరాత్రి తదుపరి 3.11 వరకు,
జూలై 30 మధ్యాహ్నం 11.46 నుంచి 31 ఉదయం 9.54 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

పునర్వసు 1,2,3 పాద జాతకులు :
ఏప్రిల్ 13 ఉదయం 6.13 నుంచి 14 ఉదయం 4.47 వరకు,
ఏప్రిల్ 21 మధ్యాహ్నం 11.57 నుంచి 22 మధ్యాహ్నం 11.15 వరకు,
ఏప్రిల్ 30 అర్ధరాత్రి తదుపరి 3.46 నుంచి మే 2 ఉదయం 6.28 వరకు,
మే 10 మధ్యాహ్నం 11.57 నుంచి 11 ఉదయం 10.56 వరకు,
మే 18 రాత్రి 9.56 నుంచి 19 రాత్రి 9.04 వరకు,
మే 28 మధ్యాహ్నం 11.27 నుంచి 29 మధ్యాహ్నం 2.13 వరకు,
జూన్ 6 సాయంత్రం 5.32 నుంచి 7 సాయంత్రం 4.20 వరకు,
జూన్ 15 ఉదయం 6.27 నుంచి 16 ఉదయం 5.52 వరకు,
జూన్ 24 రాత్రి 7.28 నుంచి 25 రాత్రి 10.24 వరకు,
జూలై 3 రాత్రి 12.41 నుంచి 4 రాత్రి 10.56 వరకు,
జూలై 12 మధ్యాహ్నం 1.00 నుంచి 13 మధ్యాహ్నం 12.53 వరకు,
జూలై 21 అర్ధరాత్రి తదుపరి 3.11 నుంచి 23 ఉదయం 6.17 వరకు,
జూలై 31 ఉదయం 9.54 నుంచి అర్ధరాత్రి 12.00 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

చివరగా మిధునరాశి వారు గమనించవలసిన అతి ముఖ్యమైన ఘట్టమేమిటంటే.... జూలై 1వ తేది రాత్రి వినువీధిలో శుభగ్రహాలైన గురు, శుక్రుల కలయిక ధన, కుటుంబ స్థానంలో జరుగుతున్నది. కనుక ఆ కలయికను భక్తి విశ్వాసాలతో దర్శించి, శుభ గ్రహాల అనుగ్రహాన్ని పొందండి. ఈ కలయిక అంశాలు మరికొద్ది రోజులలో పోస్టింగ్ చేయబడును.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి మిధునరాశి  జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో కర్కాటక రాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.