శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Saturday, August 4, 2012

ఆగష్టు 15 న తులారాశిలో శని, కుజుల సంఘర్షణ, తీసికొనదగిన జాగ్రత్తలు

నవగ్రహాలలో కుజుడు అగ్ని తత్వమైన గ్రహము. శని వాయుతత్వ గ్రహము. ఈ రెండు గ్రహాలు 2012 ఆగష్టు 15 బుధవారం రాత్రి ఖగోళంలో నైరుతి దిశలో ఓ బిందువు వద్ద కలుస్తున్నాయి. శని గ్రహ, కుజ గ్రహాలు రెండూను పరస్పర శత్రుత్వమైనవి. ఈ రెండింటి కలయిక వలన ప్రతికూల ఫలితాలు ఉంటుంటాయి.
 

ఈ పరంపరలో శ్రీ నందన నామ సంవత్సర శ్రావణ బహుళ త్రయోదశి బుధవారం ఆగష్టు 15 న సూర్యాస్తమయం తర్వాత నలభై నిముషాల పాటు శని, కుజుల కలయిక ఉండును. దీని ప్రభావ ఫలితాలు ఆగష్టు 8 బుధవారం నుంచి ఆగష్టు 22 బుధవారం వరకు ప్రతికూలంగా ఉండుటకు అవకాశములున్నవి. వాతావరణం మీద అధిక ప్రభావం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు గాని, అధిక వర్షాలతో నష్టాలు, తుఫాను లాంటివి చెలరేగే అవకాశాలధికం. 

ఆగష్టు 15 స్వాతంత్రదినోత్సవం సహజం గానే దినోత్సవానికి ముందుగానే ఇంటిలిజెన్సు శాఖ అప్రమత్తమై ఉంటారు. ఈ సారి మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది.  ద్వాదశ రాశులలో జన్మించినవారు ఈ క్రింది విధంగా కొన్ని కొన్ని అంశములపై ప్రత్యేక శ్రద్ధ, అవగాహన చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

మేషరాశి : కుటుంబంలో అనవసర కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. దంపతులు సంయమనం పాటించాలి. ఆరోగ్య విషయాలలో కూడా చక్కని నిర్ణయాలు తీసుకోవాలి. రెండవ సంతాన విషయంలో శ్రద్ద, అవగాహన చూపించాలి.
 

వృషభరాశి : ఋణం తీసుకొనుట లేక ఇవ్వటంలో అత్యంత జాగ్రత్తలు తీసుకొనాలి. లేదా పాతబాకీల విషయంలో అవగాహన, శ్రద్ద ఉండాలి. ఎదుటి వారిని గురించి ఇతరులకి చెప్పే విషయంలో... మంచైనా, చెడైన... చెప్పకుండా ఉండటం ఉత్తమం. లేనిచో శత్రుత్వములు రాగలవు. అనుకోకుండా అనారోగ్యమేదైనా వ్యాపిస్తే... సొంత వైద్యం చేయవద్దు. అనవసరంగా శత్రువులను రెచ్చ గొట్టకండి.
 

మిధునరాశి : సంతాన అంశాలలో అధిక శ్రద్ధ చూపాలి. వారికి కావలసినవి లభ్యమవుతున్నాయా లేదా అనే విషయంలో లోతుగా గమనించాలి. వారితో స్నేహ భావంతో ఉండుట ఉత్తమం.
 

కర్కాటకరాశి : వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, వ్యాపార, గృహ, తల్లి సంభందిత అంశాలలో తెలియని సమస్యలు రావచ్చును. అందుచే లోపము కనపడగానే వెంటనే దానిని సమయస్పూర్తితో పరిష్కారం చేసుకునేది.
 

సింహరాశి : సోదర, సోదరీ వర్గీయులతో సంబంధాలు చెడిపోకుండా కాపాడుకోవటానికి ప్రయత్నించండి.
 

కన్యరాశి : ఆర్ధిక, వాగ్దాన, కుటుంబ అంశాలలో జాగ్రత్తలు పాటించండి. తొందరపడి ఎదుటివారిని దూషించకండి. నేత్ర, దంత అంశాలలో లోపమేదైనా ఉన్నచో వైద్యుడిని సంప్రదించండి.
 

తులారాశి : వాహన చోదకంలో జాగ్రత్త పాటించాలి. ప్రయాణాలలో జాగ్రత్తలవసరం. కలహాలకు దూరంగా ఉండండి. మానసిక, శారీరక సంఘర్షణలకు గురి కావద్దు.
 

వృశ్చికరాశి : ఆలోచించే ప్రతి నిర్ణయంలోనూ, ఆచరించే విధి విధానాలలోను లోపాలు తెలియకుండానే ఉంటాయి. కప్పి పుచ్చుకోలేరు. ధనవ్యయానికి వీలైనంత వరకు అడ్డుకట్ట వేయండి. నష్టాలను అరికట్టే ప్రయత్నం చేయండి.
 

ధనూరాశి : ప్రతి అంశంలో జాగ్రత్త, అవగాహన, శ్రద్ధ కల్గి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని గ్రహించండి. హడావుడి నిర్ణయాలు వద్దు. తారుమారు కాగలవు.
 

మకరరాశి : అవకాశవాదులు అధికంగా ఉంటారు. ఆచరించే కార్యాలలో స్తంభనాలు కల్గు సూచన. మెరుగైన ఫలితాలు రావాలంటే.. ఆచి తూచి అడుగులు వేస్తూ వెళ్ళాలి.
 

కుంభరాశి : పిత్రార్జిత ఆస్తులలో సమస్యలు, లోపాలు ఉండు సూచన ఉంది. తండ్రి లేక సమానమైన వారి అభిప్రాయాలను వ్యతిరేకించవద్దు. మూడవ సంతాన విషయంలో శ్రద్ద, అవగాహన చూపించాలి.
 

మీనరాశి : ఆరోగ్య నియమాలు పాటించండి. అనారోగ్యముంటే వైద్యున్ని సంప్రదించండి. ప్రయాణాలలోను, వాహన చోదకంలోను జాగ్రత్తలు పాటించండి. కలహాలకు వెళ్ళకండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.