శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Monday, August 6, 2012

వీక్షకులకు శుభవార్త

నమస్కారం,  ఇంతవరకు నిత్యం నేను టీవీలో చెప్పే కార్యక్రమాలను గ్రహబలం బ్లాగ్ ద్వారా వీడియోక్లిప్పింగ్ లను చూడగలుగుతున్నారు. ప్రస్తుతం భాగ్యనగరంలో మెట్రో రైలు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్న కారణంగా ట్రాఫిక్ కు పలు అంతరాయాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ విషయంలో సకాలంలో స్టూడియోకి వెళ్లి తిరిగి రావటానికి అనేక గంటలు ట్రాఫిక్ లో వృధా అవుతున్నాయి. అంతే కాక ట్రాఫిక్ లో వాహన చోదకం కూడా కష్టంగా ఉన్న కారణంగా శరీరం అలసిపోతున్నది. ఇందుచేత కాలచక్రం, గ్రహభుమి ఇతర ముఖ్య పరిహార గ్రంధాలను రచించటానికి సమయం చాలటం లేదు. అందుచేత అభిమానులకు... నిరాశ కల్గించకుండా... ట్రాఫిక్ బారి నుంచి  తప్పించుకొనుటకు, గ్రహభూమి బ్లాగ్ లోనే చక్కని విషయాలను వీడియో క్లిప్పింగ్స్ ద్వారా నిత్యం అప్లోడ్ చేయబోతున్నాను... ప్రస్తుత రోజులలో దాదాపుగా ఇంటర్నెట్ సౌకర్యం ఎక్కువ మందికి అందుబాటులో ఉండటం చేత, గ్రహభూమి వీక్షకులు... దయచేసి, తాము వీక్షించి తెలుసుకొన్న అంశాలను... ఇంటర్నెట్ సౌకర్యంలేని వారికి అందిచగలరని మనసారా కోరుకుంటున్నాను. మీ సమస్యలు ఎలా ఉన్నాయో.. ఏమేమి ఉన్నాయో వాటన్నిటికి పరిహార మార్గాలు ఏమిటి అనే అంశాలన్నింటిని కలబోసి... ఎప్పటికప్పుడు నూతనంగా వచ్చే గ్రహసంచార స్థితులను కూడా మీ ముందుకు తీసుకురావాలనే ఆలోచనతోనే తెలియచేస్తున్నాను... మీ గార్గేయ సిద్దాంతి

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.