శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Tuesday, March 6, 2012

మార్చ్ 7 రాత్రి వినువీధిలో దర్శనమివ్వనున్న కుజ, చంద్రులు

2012  మార్చ్ 7 వ తేది బుధవారం సింహరాశిలో కుజ గ్రహ, చంద్ర గ్రహములు ఒకే నక్షత్ర, ఒకే బిందువులో ఏక కాల కలయిక జరగనున్నది. ఇటువంటి సమయంలో మనం సాధారణ కన్నులతో అరుణవర్ణములో ఉండే కుజ గ్రహమును వీక్షించవచ్చు. సూర్యాస్తమం కాగానే ఆకాశం మధ్య భాగంలో చంద్రుడు దర్శనమిస్తుంటాడు. ఆ చంద్రునికి చెంతనే అరుణవర్ణములో కుజగ్రహం ఉంటుంది. 

7 వ తేది రాత్రి 9.30 తదుపరి నుంచి కుజ, చంద్రులను వీక్షించవచ్చు. రాత్రి 9.30 నుంచి అర్థరాత్రి 1.00 గంట వరకు మధ్యకాలంలో... 4 వ తేది కలశపూజ చేసుకున్నవారందరూ తమ వద్దనున్న స్వస్తిక్ రుమాలును, ఎరుపు దారంతో వున్నా 11 పోగుల సూత్రమును, నాణెములు (నాణెమును) క్రియాత్మకముగా ఉత్తేజపరుచుకొనుటకు (activate ) అనువైన సమయం. 

కనుక భారతదేశంలో కలశపూజలు ఆచరించనివారు 7 వ తేది రాత్రి పై సమయంలో ఒక పళ్ళెరములో మూడు రక్షా కవచాలను ఉంచి, వాటిని భక్తీ పూర్వకంగా, విశ్వాసంతో చంద్ర కుజులకు దర్శింపచేయండి. విదేశాలలో వున్నవారు 7 వ తేది రాత్రి 7 .00 నుంచి 10.30 గంటల మధ్యకాలంలో దర్శింపచేయండి. ఒకవేళ దర్శింపచేయలేని వారు రెండవ రోజు ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి.

రక్షాకవచాలను ఆక్టివేట్ చేయుటకు ప్రత్యేకమైన గ్రహస్థితులు ఉన్న రోజున, ప్రత్యేక సమయంలో ఆయా గ్రహములకు దర్శింపచేయాలి. అలా దర్శింపచేయుటకు అవకాశం లభ్యం కానిచో రెండవ రోజే ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి. ఇది మొదటి పద్దతి.


ఇక రెండవ పద్ధతి ఏమనగా, ప్రత్యేక గ్రహస్థితులు లేకున్నచో, కొన్ని ప్రత్యేక తిధులలోను, నక్షత్రంలోను దర్శింపచేసుకోవచ్చు.  


A . శుక్ల పక్షంలో సప్తమి తిథి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటే... రక్షాకవచాలను ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి. 

B . శుక్ల పక్షంలో ఏకాదశి  తిథి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటే... రక్షాకవచాలను ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి. 

C . పూర్ణిమ తిథి సూర్యాస్తమయం నుంచి మరునాటి సూర్యోదయం వరకు ఉండినచో రక్షకవచాలను పూర్ణచంద్రునకు దర్శింపచేయాలి.  

D . బహుళ పక్షంలో ఏకాదశి  తిథి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటే... రక్షాకవచాలను ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి. 

E . మూల నక్షత్రం ప్రతి నెలలో వస్తుంటుంది. కనుక ఆ మూల నక్షత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటే రక్షా కవచాలను ఉదయం 10.00 గంటల లోపల శ్రీ సూర్యనారాయణస్వామికి దర్శింపచేయండి.

ఒకవేళ పైన చెప్పిన 5 పద్దతులలో... సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తిథి గాని, నక్షత్రం గాని,.. పూర్ణిమ నాడు సూర్యాస్తమయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు పూర్ణిమ తిథి లేకుండా ఉంటే ఏం చేయాలి. ఇట్టి పరిస్థితులలో పూర్ణిమ తిథి పగలు కొద్ది భాగముంటే సూర్యునికి గాని, రాత్రి పూర్ణిమ తిథి కొద్ది భాగముంటే చంద్రునికి గాని దర్శింపచేయాలి.


ప్రత్యేక గ్రహస్థితులు లేకపోతేనే... పైన చెప్పిన తిథి నక్షత్రములపై ఆధారపడి సూర్య, చంద్రులకు రక్షాకవచాలను దర్శింపచేయాలి.  ఈ పద్దతి అన్ని కలశపూజలకు వర్తిస్తుంది. కనుక 7 వ తేది రాత్రి మేష, వృశ్చిక రాశులకు మరియు చిత్ర, ధనిష్ఠ, మృగశిర నక్షత్రములకు అధిపతిగా ఉన్నటువంటి కుజ గ్రహమును భక్తీతో, విశ్వాసంతో దర్శించుకొనండి. 


మీరు దర్సించుకోబోతున్న కుజ గ్రహము 2011 అక్టోబర్ 30 ఆదివారం మధ్యాహ్నం 3 .15 నిముషములకు సింహరాశిలో ప్రవేశించి స్తంభించిపోయాడు. తిరిగి 2012 జూన్ 21 రాత్రి 12 గంటల 6 నిముషములకు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. అంటే ప్రస్తుతం సింహరాశిలో కుజ గ్రహం స్తంభించి ఉన్నాడన్నమాట.

12 వ తేది తిరిగి 14 వ తేది కూడా కలశ పూజలు చేసుకొనవలసి ఉన్నది. అనివార్య కారణాలవలన, television ప్రసారాలలో కార్యక్రమమునకు అంతరాయం కల్గిననూ.... ఇతర ఎటువంటి కారణాల వలనైన చెప్పుటకు సమయం లేక పోయినను... అభిమనులేవరు విచారించవద్దు. ఈ గ్రహభుమి బ్లాగ్ ద్వారా వివరాలను తెలియ చేస్తాను. 


బ్లాగ్ చదివిన వీక్షకులందరూ... తము చదివిన వివరాలన్నింటిని, తెలియని వారికి తప్పకుండా తెలియచేయండి. ఎదుకంటే అసంఖ్యాకులకు బ్లాగ్లు చదివే  అవకాశం ఉండదు. కనుక మన ప్రాచీన వేదవాణి రహస్యాలను మీరందరూ తెలుసుకోనాలనే తపనతో అనేక విషయాలను మీ ముందుంచబోతున్నాను.  

14 వ తేది విశేషమైన రోజుగా గుర్తుండబోతుంది. కనుక మార్చ్ 14 నాటి విశేషాలను, ఆనాడు ఉదయం 8 గంటల తదుపరి గ్రహభూమి బ్లాగ్లో వీక్షించవలసిందిగా కోరుతున్నాను. 

గమనిక: రక్షాకవచాన్ని ఉత్తేజపరచుకోనుటకు , ఆచరించిన నాటి నుంచి 40 రోజుల లోపలే ప్రత్యేక గ్రహస్థితులలో గాని, లేక పైన చెప్పిన తిథి, నక్షత్ర  సమయాలలో గాని ఉత్తేజపరచుకోవాలి. 40 రోజులు దాటితే కలశపూజ వ్యర్థమైనట్లే.  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.