గమనిక : 2018 జూన్ 26 రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు 121 రోజులు కుజగ్రహం వక్రంతో సంచారం చేయనున్నది. కనుక కుజ దోషం అనేది లేకున్ననూ, ఉన్నదని భయపడేవారు, ఋణ శత్రు శరీర పీడల నుంచి ఉపశమనానికి ప్రత్యేక అరుదైన విశేష రోజులలో కుజ గ్రహ దోష నివారణకు అద్భుత పరిహారములను ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి.- శ్రీనివాస గార్గేయ

Thursday, July 23, 2009

నాగపంచమిన నాగవల్లీ పత్రంతో నాగారాధన

ఈ విరోధి నామ సంవత్సరంలో 16 జూలై 2009 గురువారం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాలకు........... శ్రీ సూర్యభగవానుడు పునర్వసు నక్షత్ర నాల్గవ పాదప్రవేశంతో కర్కాటక సంక్రమణం జరిగింది. అంటే..... అదే దక్షిణాయన ప్రారంభమన్నమాట.... ఈ రోజునే కర్కాటక సంక్రాంతి అంటారు. అలాగే 14 జనవరి 2010 గురువారం మద్యాహ్నం 12 గంటల 49 నిమిషాలకు........ శ్రీ సూర్యభగవానుడు ఉత్తరాషాడ నక్షత్ర రెండవ పాదప్రవేశంతో మకర సంక్రమణం జరుగుతుంది. .... అంటే ఆ రోజు ఉత్తరాయణ ప్రారంభం... మకర సంక్రాంతి అన్నమాట....

ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే దక్షిణాయనం ప్రారంభమైన వారం రోజులకే ఆషాడ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశిలో 22 జూలై 2009 న జరిగిన విశేషం మనకు తెలిసినదే.......... ఈ సంపూర్ణ గ్రహణం ఉత్తర భారతదేశంలో పుణ్యక్షేత్రమైన గయా, వారణాసి, ఉజ్జయినీ లలో సంపూర్ణంగా గోచరించినది...... అలాగే ఉత్తరాయణం ప్రారంభమైన రెండవ రోజే, అనగా పుష్య అమావాస్య 14 జనవరి 2010 న మకర రాశిలో రాహుగ్రస్తంగా సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రామేశ్వరం, తిరుచందూర్ లాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో కంకణంతో దర్శనం కాబోతున్నది.

ప్రతి సంవత్సరం ఆషాడ అమావాస్య, పుష్య అమావాస్య దినములలో పుణ్య నదులలో స్నానాలు ఆచరిస్తూ.... పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేయటం సనాతన భారతీయ సాంప్రదాయం. అయితే ఈ రెండు అయనాలు ప్రారంభమైన వెంటనే గ్రహణాలు రావటంచేత, హిందువులకు ఆధ్యాత్మికంగా స్నానాలు ఆచరించే, పై అమావాస్య రోజులు గ్రహణ రోజులు కావటం ఒక పుణ్యంగా భావించాలి.

మకర సంక్రాంతి పర్వదిన తదుపరి వచ్చే పుష్య అమావాస్య సూర్యగ్రహణ స్నానానికి మరో ప్రత్యేకం కూడా వుంది.... ఏమిటంటే 14.04.2010 మహా కుంభమేళ సప్త పవిత్ర స్నానాలలో....... ఈ పుష్య అమావాస్య గ్రహణ స్నానం ఒకటి కావటం మహా అదృష్టం. గనుక శ్రీ విరోధి నామ సంవత్సరం లో ఆషాఢ, పుష్య అమావాస్యలలో జగద్రక్షకుడైన శ్రీసూర్యభగవానుడికి రాహు కేతు గ్రస్తంగా గ్రహణాలు సంభవించిన కారణంగా...... మనమంతా లోక కల్యాణం కోసమే కాక మన మన వ్యక్తిగత సంరక్షణార్ధం కూడా భగవంతుడిని ఆరాధించవలసి వుంది....... ఎన్నో... ఎన్నెనో... ఆరాధనలు వున్నాయి. వాటితోపాటు చాలా సులువుగా వుండే ఓ చక్కని నాగారాధన ఈ విరోధి నామ సంవత్సరంలో మనం ఆచరించవలసి వుంది. ఏమిటంటే..

శ్రీ విరోదిలో దక్షిణాయనం ప్రారంభంకాగానే...... 19 జూలై 2009 చంద్ర నక్షత్రమైన రోహిణి ఆదివారం నుంచి 26 జూలై 2009 సూర్య నక్షత్రమైన ఉత్తర ఆదివారం మధ్యలో ......... 22వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం జరిగింది. 2 సూర్యవారాల మధ్యలో సూర్యగ్రహణం జరిగింది. ఇందుకుగానూ 26 జూలై 2009ఆదివారం నాడు ..... అంటే నాగపంచమి పర్వదినాన ......... నాగవల్లీ పత్రంతో నాగదేవతను ఆరాధించాలి .... నాగవల్లీ పత్రం అంటే....... క్రొత్తగా వుందని అనుకోవద్దండి..... నాగవల్లీ పత్రం అంటే నాగదేవత పేరుతో వున్నఓ పవిత్రమైన ఆకు. సకల శుభాకార్యాలలోనూ, భగవతారాధనలోనూ ఈ ఆకుకి ప్రముఖ స్థానం వుంది..... అదే తమలపాకు. ఆకు రూపం కూడా నాగ పడగలాగానే వుంటుంది.

గనుక, 26 ఆదివారం నాడు ఎనిమిది తమలపాకులను తీసుకొని, దానిపై మంచి తేనెను రాసి ... నాగదేవతను ఆరాధించే పుట్ట దగ్గరగానీ, నాగ ప్రతిమల వద్ద గానీ పై చిత్రంలో చూపిన విధంగా..... మధ్యలో పసుపు కుంకుమలను వుంచి, దానికి ఎనిమిది వైపులా తేనె రాసిన తమలపాకులను పెట్టి..... సూర్య భగవానుడి వైపు చూస్తూ మనసులోని కోర్కెను తెలియచేస్తూ నాగ దేవతకు ఈ ఎనిమిది ఆకులను నివేదించండి... అంతే ఆరాధన పూర్తి అయినది . ఇవిగాక ఇంకా ఇంకా మీరు నైవేద్యాలు సమర్పించాలంటే ...సమర్పించండి వానిలో ఎటువంటి మార్పు లేదు.... ఈ ఎనిమిది తేనె పూసిన ఆకులు మాత్రమే ఈ నాగపంచమికి ప్రత్యేకం.

ఎనిమిది ఆకులే ఎందుకు? తొమ్మిది వుంచవచ్చు కదా !!... అష్ట దిక్కులకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఎనిమిది ఆకులను వుంచుతున్నాం. ఓ సర్పదేవతకు తల భాగాన్ని రాహువుగానూ. తోక భాగాన్ని కేతువు గానూ పురాణ, జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా, పిలుచుకుంటాం. ఈ రాహు కేతు గ్రస్తాలతో ఏర్పడిన ఈ గ్రహణాలలో ప్రారంభంలోనే నాగపంచమి పర్వదినాన నాగవల్లీ పత్రంతో రాహు కేతువుల ప్రీతికి ఆరాధన చేసి, నాగదేవత కృపకు పాత్రులుకండి....... శ్రీనివాస గార్గేయNo comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.