Tuesday, July 7, 2009

కోటి రూపాయల బహుమతి


" గ్రహభూమి" పాఠకులకు నమస్కారములు.

కోటి రూపాయల బహుమతి ఏమిటని ఆశ్యర్యపోతున్నారా? ఈ రోజు జూలై 7 వ తేదీ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో TV9 స్టూడియోలో ఒక లైవ్ కార్యక్రమం లో ప్రకటించాను.
వివరాలలోకి వెళదాం.... వరుస మూడు గ్రహణాల వలన అరిష్టాలు వుంటాయా ? అనే కార్యక్రమం కోసం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు TV9 లో ప్రత్యక్ష కార్యక్రమంలో నేను, ప్లానేటరీ సొసైటీ కార్యదర్శి శ్రీ రఘునందన కుమార్ పాల్గొన్నాము.
నేను ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ................. మూడు రోజుల క్రిందట ప్రముఖ దినపత్రికలలో ఆగష్టు 7 న ప్రచ్చాయా చంద్రగ్రహణం సంభవిస్తుందని రఘునందన గారు పత్రికా ప్రకటన చేసారు. ఖగోళ శాస్త్ర సంబంధ విషయాలలో నిత్యం కుస్తీ పట్టే రఘునందన గారు చెప్పేది తప్పని... ప్రచ్చయా చంద్రగ్రహణం ఆగష్టు 7 కాదని, ఆగష్టు ఆరు గురువారం సూర్యోదయానికి పూర్వము 4 గంటల 34 నిమిషాలకు ప్రారంభమవుతుందని, జ్యోతిష్య శాస్త్ర రీత్యా తెలియచేస్తున్నానని, రఘునందన్ గారు తప్పుగా మాట్లాడుతున్నారని, లైవ్ కార్యక్రమంలో మాట్లాడాను.......
దీనికి రఘునందన్ గారు... ఆరు కానే కాదని, ముమ్మాటికీ ఆగష్టు 7 నే ప్రచ్చాయా చంద్ర గ్రహణం అని వాదిస్తున్నారు. ఆరునే గ్రహణం వుందని, కోటి రూపాయలు ఛాలెంజ్ అని చేసాను.... 7 వ తేదీ గ్రహణం పడితే ఒక కోటి రూపాయలు నేను ఇవ్వాలి. ఆరవ తేదీన గ్రహణం పడితే తాను నాకు కోటి రూపాయలు ఇచ్చే స్థితిలో లేదట. కేవలం ఓడిపోయిన వ్యక్తిగా ముద్రించుకుంటాడు. కానీ కోటి రూపాలతో నన్ను సిద్ధంగా వుండమని రఘునందన్ గారు చెప్పారు.అంటే తాను 7 వ తేదే గ్రహణం వున్నదని కోటి రూపాయలు నన్ను సిద్ధం చేసుకోనమని పలు సార్లు అన్నారు. నేను కార్యక్రమం చివరి వరకు ఆగష్టు ఆరునే గ్రహణం... ఏడు కాదని వాదిస్తున్నాను.

ఒక నెల రోజులు ఆగండి.... శాస్త్రం గెలుస్తుందో సైన్స్ గెలుస్తుందో అంటూ TV9 సమన్వయ కర్తగా వ్యవహరించిన బద్రి ముగింపు పలికాడు.
ఇది కాగానే... వెంటనే బంజారాహిల్స్ లోని మరొక టెలివిజన్ ఛానల్ I NEWS లో ఈ రోజు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు, మరొక గంటసేపు, నాకు రఘునందన్ గారికి మధ్య ప్రత్యక్ష ప్రసారంలో చర్చ జరిగినది. ఈ ఛానల్ లో నేను గంట సేపు మాట్లాడిన సారాంశం ఏమిటంటే .... ఆగష్టు ఆరు సూర్యోదయానికి పూర్వమే గ్రహణమున్నదని, 7 కాదని, ఏడున సంభవిస్తే.... దేశప్రజలందరికీ నేను లెంపలేసుకుంటూ క్షమాపణ చెబుతూ, రఘునందన్ కుమార్ గార్కి కోటి రూపాయలు ఇవ్వబోతున్నాను. అలాగాక ఆరునే గ్రహణం జరిగితే, తాను నాకు కోటి ఇవ్వలేని పరిస్థితి వుంటే.... దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పుకొమ్మని తెలియచేసాను.

గనుక పాఠకులందరికీ తెలియజేయునది ఏమనగా ఈ అగ్నిపరిక్షలో నేనే గెలవబోతున్నాను. రఘునందన్ కుమార్ ఓడిపోవటానికి సిద్ధంగా వున్నాడని మరోసారి తెలియచేస్తున్నాను....

నమస్కారములతో,
శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.