12 అక్టోబర్ 2017 గురువారం ఉదయం 7గంటల నుంచి 8 గంటల వరకు యోగి శాటిలైట్ టెలివిజన్ లో గార్గేయం కార్యక్రమంలో 'అష్టభుజి' అనే జ్యోతిష ఆధ్యాత్మిక ధారావాహికలు అందించనున్నాను.ఇందులో భాగంగా రేపే మొదటిభాగం ప్రసారం కాబోతున్నది....శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అతిరహస్య నామాలతోనే ఈ 'అష్టభుజి' కార్యక్రమం ఉంటుంది. కనుక అందరూ వీక్షించవలసినది.- దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

Saturday, August 30, 2014

2014 ఆగష్టు 31 ఆదివారం రాత్రి ఆకాశంలో శని, కుజ, చంద్రుల దర్శనం

ఆగష్టు 31 ఆదివారం షష్టి తిథి వచ్చినందున దీనిని భానుషష్టి అంటారు. ఇదే రోజున తులారాశిలో శని గ్రహం, కుజ గ్రహాలతో పాటు చంద్రుడు కూడా వున్నారు. ఈ మూడు గ్రహాలు ఓ ముక్కోణాకారంగా ఆదివారం సాయంత్రం సూర్యాస్తమం తరువాత ఆకాశంలో నైరుతి దిశలో కనపడతారు. ఈ మూడు గ్రహాలలో శని గ్రహం మాత్రం బంగారు రంగులో దర్శనమిస్తాడు. కుజుడు అరుణ వర్ణంతో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర రీత్యా భాను షష్టి పర్వదినాన ప్రదోష కాలంలో త్రిగ్రహ దర్శనం కలగటం, దానిని వీక్షించటము శుభ ప్రదం. ముక్కోణాకారంగా కనపడతాయి అంటే.... శని కుజ చంద్రుల నుంచి ఓ రేఖను గీచినట్ట్లుగా భావిస్తే, ఈ మూడు గ్రహాలూ ఒక త్రికోణానికి మూడు బిందువులుగా ఉంటాయి.
 

శని ఈ తులా రాశినుంచి 2014 నవంబర్ 2 వ తేదిన వృశ్చిక రాశిలోనికి పయనిస్తాడు. శని గ్రహానికి ఇది ఉచ్చ స్థానము. తిరిగి ఈ స్థానంలోకి శని రావాలంటే మరో 30 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పుడు శనితో కుజుడు కలవాలి, చంద్రుడు కలావాలి.... భాను షష్టి అయివుండాలి, దీనికి తోడు గణపతి నవరాత్రులు కలిసి రావాలి. ఇలాంటి అవకాశం రావటం కొంత కష్టమే మరి.
 

కనుక ఈ సమయంలో ద్వాదశ రాశులవారు అవకాశం ఉన్నంతవరకు ఈ మూడు గ్రహాలను వీక్షించటానికి ప్రయత్నించటమే కాకుండా.... ఆ సమయంలో దేవి ఖడ్గమాలా స్తోత్ర పఠనమ్ చేయటం ఎంతో శ్రేయోదాయకం. ఇక్కడ కుజుడు, చంద్రుడు మిత్రులు. కుజుడు, శని శత్రువులు. చంద్రుడు శనికి అంతర్గత శత్రువు. అయితే ప్రస్తుతం జరిగే గ్రహ స్థితుల ప్రకారం ద్వాదశ రాశుల వారు ఆరోగ్య అంశాలపై ఈ ఆదివారం నుంచి 5 రోజుల పాటు కొంత అధిక శ్రద్ధ చూపించటం ఎంతైనా మంచిది. కనుక ప్రతి వారు ఈ త్రిగ్రహ దర్శనాన్ని చేసుకొనవలసినది. ఈ సమయంలో ఆకాశం మేఘావృతం కాకుండా వుంటే విశేష స్థితిని వీక్షించగల అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.