శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Monday, January 11, 2010

గురు కుజుల రెండవ షష్టాష్టక ప్రభావము

షష్టాష్టక చతుష్టయములో రెండవ షష్టాష్టకం గురుగ్రహము కుజగ్రహము మధ్య ఏర్పడినది. ఈ రెండు గ్రహాలూ -5 అక్టోబర్ 2009 నుంచి 20 డిశంబర్ 2009 వరకు, వాటి వాటి నీచ స్థానాల నుంచి ఎదురెదురు వీక్షణలు కల్గి వున్నాయి. ఇలా ఎదురెదురు వీక్షనలనే సమసప్తక స్థితి అంటారు. ప్రస్తుతం ఈ సమసప్తక స్థితి షష్టాష్టకస్థితి కానున్నది.

మేష వృశ్చిక రాశులకు, చిత్త, ధనిష్ఠ, మృగశిర నక్షత్రాల అధిపతి కుజుడు 2009 అక్టోబర్ 5 న తన నీచ స్థానమైన కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం జరుగుతుంది. అలాగే ధనూ మీనా రాశులకు , పునర్వషు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు అధిపతి గురువు 20 డిశంబర్ 2009 న కుంభ రాశిలోనికి ప్రవేశం జరుగుతుంది.

ఈ రెండవ షష్టాష్టకం కుజ గురుల మధ్య 156 రోజుల పాటు కొనసాగుచున్నది. ఈ 156 రోజులలో జంట గ్రహణాలు ఆయాస్థానాలకు వ్యయ ( 12 ) స్థానంలో రావటం విశేషం. డిశంబర్ 20 నుంచి షష్టాష్టకం ప్రారంభం కాగానే, డిశంబర్ 22 నుంచి మార్చి 9 వరకు వక్ర స్థితిలో కుజుడు ఉండటము, వక్ర ప్రారంభపు రోజు, వక్ర త్యాగమైన రోజు, రెండు కూడా మంగళవారాలే రావటము గమనించతగిన అంశము.

ఈ కుజ గురు షష్టాష్టక ప్రభావము మృగశిర, చిత్త, ధనిష్ఠ, పునర్వషు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులపైననూ, ప్రస్తుతం కుజ మహర్దశ, గురు మహర్దశ జరిగే జాతకులపై ప్రభావం పరోక్షంగా ఉండుటకు అవకాశం వున్నది.

మృగశిర 1,2 పాదాల వృషభ రాశి జాతకులు సోదర సోదరి విషయాలపై శ్రద్ధ తీసుకోవాలి. భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్తలు వుండాలి. నిత్యం వున్న దినచర్యలో జాగ్రత్తగా మార్పులు చేసుకుంటూ వుండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

మృగశిర 3,4 పాదాలు, పునర్వశు 1,2,3 పాదాల మిధున రాశి జాతకులు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు వకాశామున్నది. ఎదుటి వారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించుకోవాలి. పితృ సంబంధ విషయాలపై ఆలోచనలను అధికం చేయండి.

పునర్వసు నక్షత్ర 4 వ పాద కర్కాటక రాశి జాతకులు వ్యక్తిగత విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోనవద్దు. మీ వ్యక్తిగత విషయాలపై ఇతరులతో చర్చించవద్దు. ప్రాణ భయం వెంటాడే అవకాశం ఉండును. దిగులు చెందవద్దు.

చిత్త నక్షత్ర 1,2 పాదాల కన్యారాశి జాతకులు రుణ విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి. శత్రు భయం పెరిగే అవకాశం వుంది. కొన్ని రుగ్మతలచే అనారోగ్య వ్యాప్తి నొందవచ్చు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది. లాభ సంబంధ లావాదేవీలు నష్టాల బాటన నడిచే అవకాశముంది.

చిత్తా నక్షత్ర 3,4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాల తులా రాశి జాతకులు సంతాన విషయాలలో ఆలోచనలను కట్టుదిట్టం చేయాలి. దినచర్యలో మార్పులను గమనించాలి. వ్యత్రేకంగా వుండే పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోనవద్దు. విశాఖ నక్షత్ర 4 వ పాద వృశ్చిక రాశి జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాహన, ఆరోగ్య విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ, లాభ సంబంధ లావాదేవీలపై ఓ దృష్టి ఉంచుతూ మాతృమూర్తి విషయాన్ని కూడా ఆలోచిస్తూ శ్రద్ధ తీసుకోనాలి.పితృ నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

ధనిష్టా నక్షత్ర 1,2 పాదాల మకర రాశి జాతకులకు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు అవకాశమున్నది. ఎదుటివారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించాలి. కళత్ర విషయాలలో ప్రతికూలతలు ఉండగలవు, బేధాబిప్రాయములు ఉండగలవు. వ్యక్తిగత విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోనవద్దు. మీ వ్యక్తిగత విషయాలపై ఇతరులతో చర్చించవద్దు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది.
పూర్వాబాద్రా నక్షత్ర 4 వ పాద మీనా రాశి జాతకులకు సంతాన విషయాలలో ఆలోచనలు చేయాలి.ముఖ్య నిర్ణయాలు కట్టుదిట్టం చేయాలి. అనవసర ఖర్చు పెరిగే అవకాశం వుంది. పొదుపును పాటించండి. లోభత్వాన్ని అలవాటు చేసుకోండి.

ఈ షష్టాష్టక ప్రభావము వలన ఫలితాలు తెలుసుకోనటమే గాక, కొన్ని జాగ్రత్తలు తీసుకోనాల్సి వుంటుంది. గ్రహ సంబంధమైన శాంతి పరిహారములను కూడా ఆచరించేది. ఈ శాంతి పరిహారములు తగిన రీతిలో తగిన సమయములో మా ఓంకార మహాశక్తి పీఠంలో వేద క్రియల ద్వారా శాంతి పరిహారములు జరుపబడును. వేద క్రియలు జనవరి 25 తదుపరి మాత్రమే జరుపుకోనాలి. అలాంటి వివరాలు కూడా తదుపరి పోస్టింగ్ లలో చెప్పగలము.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.