2009 నవంబర్ 2 న ధనూరాశిలోకి రాహుప్రవేశం జరిగింది. దీనికి ముందు నుంచే 5 అక్టోబర్ 2009 న కుజగ్రహము తన నీచ స్థానమైన కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం జరిగింది. నవంబర్ 2 నుంచి రాహు ధనూప్రవేశంతో కుజ రాహువుల మధ్య షష్టాష్టక స్థితి ఏర్పడినది. అంటే అంతకు ముందు 2009 ఆగస్టు 16 ఆదివారం నుంచి 5 అక్టోబర్ వరకు 51 రోజుల పాటు రాహు కుజుల షస్టాష్టక స్థితి ఏర్పడినది. ఈ సమయములోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఘోర ప్రమాదంలో మరణించటం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడటానికి 51 రోజుల షష్టాష్టక స్థితి ప్రధాన కారణమైంది.
కేవలం పై ఒక్క షష్టాష్టక స్థితి మాత్రమే గాక, దీనికితోడు 22 జూలై కర్కాటక రాశిలో జరిగిన సంపూర్ణ సూర్య గ్రహణం రాజశేఖరరెడ్డి జన్మ రాశి ధనస్సుకు, అష్టమ స్థానం కావటం కూడా గమనార్హం. ఈ విషంపై హైదరాబాద్ నుంచి మహా టీవీలో గ్రహణం పై చర్చ జరిగినప్పుడు, రాజశేఖరరెడ్డికి అష్టమ స్థానంలో ( ప్రాణ స్థానం ) గ్రహణం జరగనుంది. గనుక వాహన సంబంధంగా అనేక జాగ్రత్తలు తీసుకోనవలసి ఉంటుందని లైవ్ లో చెప్పటం జరిగింది.
ప్రస్తుతం షష్టాష్టక చతుష్టయంలో మొదటిదైన కుజ రాహువుల ప్రధమ షష్టాష్టకం 2009 నవంబర్ 2 నుంచి 2010 మే 26 వరకు 206 కొనసాగుతుంది. ఈ 206 రోజులలో జంట గ్రహణాలు రావటము జరిగినది. కర్కాటక రాశి కుజ గ్రహానికి నీచ స్థితి. ఈ కర్కాటకంలో కుజుడు డిసెంబర్ 22 నుంచి మార్చి 2 వరకు వక్ర స్థితిలో వుండటం విశేషం. వక్ర ప్రారంభపు రోజైన డిసెంబర్ 22, వక్ర త్యాగమైనా రోజు మార్చి 9 , రెండూను మంగళ వారాలే కావటం గమనించతగిన అంశం. కుజ రాహువుల షష్టాష్టక ప్రభావం వలన చిత్ర, ధనిష్ఠ, మృగశిర, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులపై పరోక్షంగా వుంటుంది. ఎందుచేతనంటే కుజగ్రహ నక్షత్రాలు చిత్ర, ధనిష్ఠ, మృగశిర. రాహు గ్రహ నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. పై ఆరు నక్షత జాతకులే గాక, ప్రస్తుతం కుజ మహర్దశ, రాహు మహర్దశ జరిగే జాతకులపై ప్రభావం పరోక్షంగా వుంటుంది.
మృగశిర నక్షత 1,2 పాదాల వృషభ రాశి జాతకులు సోదర సోదరి విషయాలపై శ్రద్ధ తీసుకోనాలి. భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్తలు వుండాలి. ప్రాణ సంబంధ భయం వెంటాడే అవకాశం ఉండును.
మృగశిర నక్షత్ర 3,4 పాదాలు మరియు ఆరుద్రా నక్షత్ర జాతకులు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు అవకాశమున్నది. ఎదుటివారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించాలి. కళత్ర విషయాలలో ప్రతికూలతలు ఉండగలవు, బెదాబిప్రాయములు ఉండగలవు.
చిత్ర నక్షత్ర 1,2 పాదాల కన్యా రాశి జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాహన, ఆరోగ్య విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ, లాభ సంబంధ లావాదేవీలపై ఓ దృష్టి ఉంచుతూ మాతృమూర్తి విషయాన్ని కూడా ఆలోచిస్తూ శ్రద్ధ తీసుకోనాలి. లాభ విషయాలలో పదే పదే ఆలోచనలు చేయాలి.
చిత్ర నక్షత్ర 3,4 పాదాలు, స్వాతి నక్షత్ర తులారాశి జాతకులు భూ లావాదేవీలలో జాగ్రత్తగా వుండాలి. భూమి కొనుగోలు అమ్మకాలలో కొంత సమయం ఆగాల్సి వుంటుంది. సోదర, సోదరిలతో తొందరపాటు వద్దు. మీ దినచర్యలో అనుకోకుండా అవాంతరాలు ఏర్పడటానికి అవకాశాలు వుంటాయి. మనసును అదుపులో వుంచుకొని గుండె దిటవు చేసుకోవాలి. తోదరపాటు నిర్ణయాలు వద్దు.
ధనిష్టా నక్షత్ర 1,2 పాదాల మకర రాశి జాతకులు దాంపత్య విషయాలలో తొందరపాటు చర్యలు వద్దు. ప్రేమికుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండగలవు. అనవసర ఖర్చు పెరిగే అవకాశం వుంది. వివాహ నిర్ణయ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కళత్ర వర్గం ద్వారా సమస్యలు జటిలమయ్యే అవకాశాలున్నవి.
ధనిష్టా నక్షత్ర 3,4 పాదాలు, శతభిషా నక్షత్ర కుంభ రాశి జాతకులు ఋణ విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి. శత్రు భయం పెరిగే అవకాశం వుంది. కొన్ని రుగ్మతలచే అనారోగ్య వ్యాప్తి నొందవచ్చు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది. లాభ సంబంధ లావాదేవీలు నష్టాల బాటన నడిచే అవకాశముంది.
మృగశిర, ధనిష్ఠ, చిత్ర నక్షత్ర జాతకులకు రెండవ షష్టాష్టకమైన గురు కుజుల వలన కూడా సమస్యలు రాగల సూచనలున్నవి. గనుక గురు కుజుల రెండవ షష్టాష్టక ప్రభావము అని మరో శీర్షిక త్వరలో పోస్టింగ్ కానున్నది. అంచేత దానిలోని ఫలితాలు కూడా చదవగలరు.
ఈ షష్టాష్టక ప్రభావము వలన ఫలితాలు తెలుసుకోనటమే గాక, కొన్ని జాగ్రత్తలు తీసుకోనాల్సి వుంటుంది. గ్రహ సంబంధమైన శాంతి పరిహారములను కూడా ఆచరించేది. ఈ శాంతి పరిహారములు తగిన రీతిలో తగిన సమయములో మా ఓంకార మహాశక్తి పీఠంలో వేద క్రియల ద్వారా శాంతి పరిహారములు జరుపబడును. వేద క్రియలు జనవరి 25 తదుపరి మాత్రమే జరుపుకోనాలి. అలాంటి వివరాలు కూడా తదుపరి పోస్టింగ్ లలో చెప్పగలము.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.