Monday, January 4, 2010

సప్త అమాసంక్రాంతుల మాలిక

ప్రతినెలా ఓ అమావాస్య వస్తుంటుంది. అలాగే ప్రతినెలా ఓ సంక్రమణం జరుగుతూ వుంటుంది. సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించటం. దీనినే సంక్రాంతి అని కూడా పిలుస్తారు. మకర రాశిలోనికి సూర్య ప్రవేశాన్ని మకర సంక్రమణం లేక మకర సంక్రాంతి అంటాము. మరి ఈ సంక్రమణం ఏదో ఒక తిధి లో జరుగుతూ వుంటుంది.

మరి సంక్రమణం అమావాశ్య తిధిలో జరిగితే ఎలా వుంటుంది ? ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. వరుసగా ఏడు నెలలపాటు అమావాశ్య తిదిలోనే రవి రాశిప్రవేశాలు చేయటం జరిగినది. మరి ఇలా ఏడు సార్లు రాశిప్రవేశాలు అమావాస్యన జరిగితే అరిష్టమా? అదృష్టమా?

వివరాలలోకి వెళితే గత 2009 సంవత్సరంలో ఆశ్వీయుజ అమావాశ్య శనివారం తే 17.10.2009 దిన దీపావళి పర్వదినం జరుపుకున్నాము. ఆరోజే రవి తన నీచ స్థానమైన తులారాశిలోకి సంక్రమించాడు. దీనిని తులా సంక్రాంతి అంటారు. అమావాస్య తిధిలో సంక్రమణం జరిగిన మాలికలో ఇది మొదటిది.

తదుపరి కార్తిక అమావాశ్య సోమవారం తే 16.11.2009 దిన రవి వృశ్చిక రాశిలోనికి సంక్రమించాడు. దీనిని వృశ్చిక సంక్రాంతి అంటారు. దీనిని రెండవ అమాసంక్రాంతి దినముగా పరిగణించాలి. ఆ తరువాత మూడవదైన మార్గశిర అమావాస్య తే 15.12.2009 దిన మంగళవారం రాత్రి రవి ధనస్సులోనికి ప్రవేశించుటచే ధనుర్మాసం ఏర్పడినది. ఈ ధనుర్మాసం కూడా అమావాశ్య తిధిలో వచ్చినది. దీనినే ధనుస్సంక్రాంతి అంటారు. ఇక నాల్గవదైన పుష్య అమావాస్య తే 14.01.2010 గురువారం మకరరాశిలోకి రవి సంక్రమణం చెందాడు. దీనితో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైనట్లు. ఇది కూడా అమావాస్య తిదిలోనే జరిగినది.

పిదప రాబోవు ఫిబ్రవరిలో మాఘ అమావాస్య తే 13.2.2010 ది రోజున కుంభ సంక్రాంతి జరుపుకొనబోతున్నాము. ఇది 5 వ అమావాస్య తో కూడిన సంక్రాంతి అన్నమాట. ఆ తదుపరి తే 15.3.2010 దిన పాల్గుణ అమావాస్య రోజున మీనా సంక్రాంతి జరుపుకోవాలి. ఇది ఆరవ అమావాస్య తిదితో కూడిన సంక్రాంతి. ఇక మాలికలో చివరిదైన ఎదవా అమావాస్య. స్వస్తిశ్రీ వికృతి సంవత్సర చైత్ర అమావాస్య తే 14.4.2010 రానుంది. ఆరోజే మేష సంక్రమణం జరుగుచూ మహా కుంభ మేలా హరిద్వార్ లో జరగనున్నది.

వరుసగా ఏడు అమావాస్య తిధులలో సంక్రమణాలు జరగాతము మహా అరుదుగా వచ్చీ ఘట్టం. ఇంత అరుదుగా వచ్చే ఘట్టానికి మధ్య బిందువు అంటే 4 వ అమావాస్య తిధిలో సంక్రమణం. మకర సంక్రమణం జరిగిన ఈ పుష్య అమావాశ్య తిధిలో కనకన సూర్య గ్రహణం జరగటం అత్యంత అరుదైన మహోన్నత ఘట్టం.

ఇక ఈ జనవరి 15 కనుమ పండుగ రోజున మకర సంక్రమణం వచ్చిన అమావాస్య, దానికి తోడు గ్రహణం జరగనున్నవి. అమావాశ్య తిధిలో పితృదేవతలకు తర్పణాదులు ఇస్తాము. దీనికి సంక్రమణం కలిసి, గ్రహణం కలిస్తే, ఎంతటి అదృష్టమో ఆలోచించండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదే రోజు మహా కుంభ మేలా రెండవ పవిత్ర స్నానం కావటం మహద్భాగ్యం. మహాద్భాగ్యమైన మహోన్నత రోజున పితృదేవతలకు పిండ ప్రదానాదులను, తర్పణాదులను ఇవ్వాల్సి వుంటుంది. అవకాశం వున్నవారు సముద్రస్నానం ఆచరించవచ్చు. మకర రాశిలో జరిగే గ్రహణం ఒక అరిష్ట యోగంలో భాగామైనప్పటికీ, దాని ప్రభావం గూర్చి ప్రస్తుతం మనం ఆలోచించటం లేదు. గ్రహణం జరిగే రోజును మహా పవిత్రదినంగా హైందవ జాతి అంతా కొనియాడి తీరాలి.

మహా కుంభ మేళా పవిత్రస్నాన వివరాలు :

శ్రీ విరోధి నామ సంవత్సరంలో గురు గ్రహము 19 డిశంబర్ 2009 రాత్రి 1 గం. 08 ని.లకు కుంభరాశి ప్రవేశం చేయును. అలాగే శ్రీ సూర్య భగవానుడు రాబోవు వికృతి నామ సంవత్సరంలో 14 ఏప్రిల్ 2010 న మేష రాశిలోకి ప్రవేశించును. ఈ కారణంగా హరిద్వార్ లోని గంగానదిలో పవిత్ర స్నానాలతో మహా కుంభ మేళా జరుగును.

ఈ పవిత్ర స్నానాలకు దేశ విదేశాల నుంచి యోగిణులు, యోగులు, సాధువులు, ఇతరులు, కలిసి దాదాపు 60 మిలియన్ల మంది స్నానమాచారిన్చేదారు. ఈ పరంపరలో 2010లో జనవరి 14 మకర సంక్రాంతి రోజున ప్రధమ పవిత్ర సంక్రమణ స్నానముండును. ఈరోజే పుష్య అమావాశ్య పవిత్ర స్నానం కూడా. (స్నానానికి అమావాశ్య నిశీధిలో వుండాలి. ) జనవరి 15 సంపూర్ణ సూర్య గ్రహణం రోజున ద్వితీయ పవిత్ర స్నానముండును. జనవరి 20 వసంత పంచమి రోజున తృతీయ పవిత్ర స్నానముండును. జనవరి 30 మాఘ పూర్ణిమ రోజున చతుర్ధ పవిత్ర స్నానముండును. ఫిబ్రవరి 12 మహా శివరాత్రి రోజున పంచమ పవిత్ర స్నానముండును. ఫిబ్రవరి 13 మాఘ అమావాశ్య రోజున షష్టమ పవిత్ర స్నానముండును. ఏప్రిల్ 14 మేష సంక్రమణం రోజున చిట్టచివరిదైన మహా కుంభ మేలా పవిత్ర సంక్రమణ స్నానంతో హరిద్వార్ మహా కుంభ మేళా ముగియును.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.