7 ఆగష్టు 2017 శ్రావణపూర్ణిమ సోమవారం నాడు పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా నూతన యజ్ఞోపవీత ధారణ మాత్రం ఉండదు. కానీ యధావిధిగా రక్షా బంధన కార్యక్రమములు నిరభ్యంతరంగా ఆచరించవచ్చును. శాస్త్రీయంగా పంచాంగగణిత రీత్యా రక్షాబంధనమునకు శుభసమయము మధ్యాహ్నము 11గంటల 4నిముషాల నుంచి సాయంత్రం 4గంటల 1నిముషం వరకు ఉన్నది. అయితే ఉదయకాలంలో రక్షాబంధనాలు చేయువారలకు అది నిషిద్ధ సమయమేమి కాదు. శాస్త్రీయతను కోరుకునేవారు పై సమయాన్ని స్వీకరించండి. - శ్రీనివాస గార్గేయ

Tuesday, July 30, 2013

తెలంగాణా నిర్ణయ ముహూర్తము

30 జూలై 2013 మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై లాంచన ప్రాయ నిర్ణయం ప్రకటించిన సమయానికున్న స్థితిగతులను పరిశీలించినచో అనేక దోషాలు కనపడుతున్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నక్షత్రం చిత్ర అనగా కన్యా రాశి. ఈ చిత్ర నక్షత్రానికి... ప్రకటించిన సమయానికి ఉన్న భరణి నక్షత్రానికి తారాబలం  గమనిస్తే నైధన  తార అవుతుంది. నైధనతార అంటే చాలా ప్రమాదకరమైన తార అని భావము. అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన్మరాశి కన్యకు చంద్ర స్థితి అష్టమంలో ఉండటంకూడా దోషం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించిన సమయం మకరలగ్నం కావటం, ఈ లగ్నానికి కుజుని యొక్క తీవ్రమైన అష్టమ దృష్టి ఉండటం శుభకరం కాదు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు మకర లగ్నానికి అష్టమ స్థానంలో ఉండటం కూడా దోషపూరితం. అంతేకాక ఈ ప్రకటన ప్రకటించిన సమయంలో ఉన్న యోగము గండ యోగం కావటం కూడా శుభకరం కాదు. పై లక్షణాల కారణంచే ఈ లాంచన ప్రాయ నిర్ణయ ప్రకటన కార్యరూపం దాల్చటం కష్టసాధ్యము. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయానికి ఉన్న గ్రహస్థితి కంటే ఈ ప్రకటన వెలువడిన గ్రహస్థితి మరింత దారుణం. సమైక్యాంధ్రను కోరుకొనే తెలుగు ప్రజలందరూ సంయమనం పాటించండి. 
- గార్గేయ సిద్దాంతి

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.