- ఎంతో అభిమానంతో భక్తి విశ్వాసాలతో ప్రపంచ వ్యాప్తంగా కలశపూజలు ఆచరిస్తున్న వారందరికీ కొన్ని కొన్నిసందేహాలు తేదిలలో వస్తుంటాయి. సందేహ నివృత్తి కొరకై వివరంగా ఈ దిగువన ఉదహరిస్తున్నాను. 2012 మార్చ్ నెలలో నాల్గవ తేదిన 1,2,3 కలశ పూజలు ఆచరించుకున్నారు. గతంలో 2 వరకే ఆచరించి మిగిలినది చేయనివారు కూడా మార్చ్ 4 న చేసుకున్నారు.
- 2012 మార్చ్ 12 వ తేదిన 1,2,3,4 వరుసగా కలశ పూజలు ఆచరించవచ్చును. గతంలో 2 వరకే ఆచరించి మిగిలిన 3 , 4 ఆచరించని వారు మార్చ్ 12 సోమవారం ఉదయం 10 గంటల లోపల చేసుకోవాలి. విదేశాలలో అయితే 11 వ తేది ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
- 2012 మార్చ్ 14 బుధవారం కేవలం నాల్గవ కలశపూజ మిగులుగా ఉన్నవారు మాత్రమే భారతదేశంలో మరియు విదేశాలలో మార్చ్ 14 ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
- 2012 ఏప్రిల్ 6 వ తేది శుక్రవారం కేవలం 5 వ కలశపూజ మిగులుగా ఉన్నవారు భారతదేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 6 ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
- 2012 ఏప్రిల్ 15 ఆదివారం నాడు 6 మరియు 7 కలశపూజలు ఒకేసారిగా భారతదేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 15 ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
- 2012 మే 5 శనివారం నాడు 8 మరియు 9 కలశపూజలు ఒకేసారిగా భారతదేశంలో మరియు విదేశాలలో మే 5 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపల ఆచరించుకోవాలి.
- 2012 జూన్ 5 మంగళవారం ఒకేసారి తొమ్మిది కలశపూజలు ఆచరించేవారు భారతదేశంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆచరించుకోవాలి. విదేశాలలో జూన్ 5 ఉదయం 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
Sunday, March 11, 2012
కలశపూజ తేదీల వివరాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.