ఏప్రిల్ 6 శుక్రవారం 5 వ కలశపూజ మాత్రమే
- ఇంతవరకు 5 రక్షాకవచాలకు చెందిన 5 కలశపూజలను చెప్పటం జరిగింది.
- వరుసగా 1 నుంచి 5 వరకు క్రమం తప్పకుండా చేసుకున్నవారు ఎందరో వున్నారు.
- కొంతమంది అనివార్య కారణాలవలన మధ్య మధ్యలో చేస్తున్నవారు ఉన్నారు.
- ఈ పరంపరలో 5 వ కలశపూజ చేయనివారు ఏప్రిల్ 6 వ తేదిన ఆచరించుకోవచ్చు.
- 2012 ఏప్రిల్ 6 శుక్రవారం కేవలం ఐదవ కలశపూజ మిగులుగా ఉన్నవారు మాత్రమే భారతదేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 6 వ తేది ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపల ఆచరించుకోవాలి.
- 5 వ కలశపూజను ఆచరించాలనుకున్నవారు, ఏప్రిల్ 5 వ తేదీ గురువారం రాత్రి సమయంలో చంద్రుడిని భక్తితో దర్శించి కలశపూజను, 2 వ రోజు ఆచరిస్తున్నామని మనసులోని సంకల్పాన్ని శ్రీ చంద్రగ్రహ సందర్శనం చేస్తూ మనసులోనే ప్రార్దించుకోండి.
- ఒకవేళ ముందురోజు రాత్రి చంద్రుడిని దర్శించుకోలేనివారు, 6 వ తేదీ శుక్రవారంనాడే కలశపూజ ప్రారంభానికి ముందు శ్రీ సూర్య భగవానుణ్ణి భక్తితో దర్శించి కలశపూజను ఆచరిస్తున్నామని మనసులోని సంకల్పాన్ని శ్రీ సూర్యగ్రహ సందర్శనం చేస్తూ మనసులోనే ప్రార్దించుకోండి.
- ఉదయం నుంచి ఎటువంటి ఆహార నియమములు లేవు.
- ఇంతవరకు
మీ వద్ద స్వస్తిక్ మార్క్ రుమాలు, 11 పోగుల ఎరుపు దారంతో చేసిన సూత్రము,
నాణెములు, 16 బిందువులతో కూడిన త్రిభుజ చిత్ర రుమాలు ఉన్నవి.
- ఇప్పుడు 5 వ రక్షాకవచాన్ని సిద్దం చేసుకోవాలి.
- 16 బిందువులతో కూడిన త్రిభుజ చిత్ర రుమాలు కంటే నాలుగు వైపులా స్వల్పంగా అర అంగుళం తగ్గుదలతో వుండే మరో తెలుపు వస్త్రాన్ని తీసుకొనండి.
- ఎరుపు కుంకుమను ఆవునేతితో కలిపి రుమాలు మధ్య భాగంలో 'శ్రీం' అనే బీజాక్షరాన్నివేసుకోవాలి.
- పూజకు తెలుపు రంగు పుష్పాలను వినియోగించండి. లేనిచో ఏరంగు పుష్పాలైనను వినియోగించండి. ప్రాధాన్యత తెలుపు రంగు.
- పసుపు , నెయ్యి కలిపిన అక్షతలు సిద్దం చేసుకోండి.
- దీపారాధనకు వాడే తైలము మీ నిర్ణయము. వత్తుల సంఖ్య, ప్రమిదల సంఖ్య మీ నిర్ణయమే.
- కలశం మీద పీచు తీసిన కొప్పులా ఉండే కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయను కుంకుమతో చక్కగా అలంకరించుకోండి.
- నివేదనకు బెల్లం లేక పంచదారతో చేసిన పాయసం. (బియ్యము లేక సేమ్యా లేక బియ్యపురవ్వ, పాలు) కొబ్బరికాయ ఇతర ఫలములు మొదలైనవి నివేదించటము మీ ఇష్టానుసారం.
- ఇక పూజకు ఓ పీట, పీట పైన పరిచే ఎరుపు రంగు నూతన వస్త్రము లేక అంతకు ముందు కలశపూజలకు వాడిన వస్త్రమైనను వినియోగించవచ్చు.
- వస్త్రం పైన మంచి బియ్యం, పూజకు అగరు బత్తీలు , కర్పూరము మొదలగునవి అవసరము.
- కలశంలోని కొబ్బరికాయ క్రింద ఉంచుటకు 5 మామిడాకులు లేక 5 తమలపాకులు అవసరము.
- సహజంగా ప్రతి ఇంటిలో పూజలకు
వినియోగించుకొనే గంట మొదలగు సామగ్రిని వినియోగించుకోండి.
పూజా పద్ధతి
పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును.
పురుడు లేక మరణ అసౌచము వున్నవారు ఆచరించవద్దు ఒకరి తరఫున మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము.
ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు. విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు.
- గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
- ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
- దీపారాధన చేసుకోండి.
- బియ్యంపైన స్వస్తిక్
మార్క్ రుమాలును వుంచండి.
- స్వస్తిక్ మార్క్ రుమాలుపై త్రిభుజాకారంగా ఉండే రుమాలును ఉంచండి. స్వస్తిక్ దిగువన ఉన్న వస్త్రపు కోణము మీ వైపుకు ఉండేలా పెట్టుకోండి.
- అలాగే త్రిభుజం
వేసిన వస్త్రంలోని త్రిభుజ కోణము మీ వైపుకు ఉండేలా, స్వస్తిక్ రుమాలు పై
వేయండి. అనగా కలశానికి ముందు వైపు త్రిభుజం యొక్క భుజం రాకూడదు. కోణం
రావాలి.
- త్రిభుజ రుమాలుపై, 'శ్రీం' అనే బీజాక్షరం వేసిన రుమాలును ఉంచండి.
- 'శ్రీం' రుమాలుపై కలశాన్ని పెట్టండి. ( రాగి, వెండి,
స్టీలు ఏదైనాను పరవాలేదు ) కలశాన్ని కూడా గంధ, కుంకుమలతో అలంకరించుకోండి.
- కలశంలో సగానికంటే తక్కువగా నీటిని పోయండి. ఆ నీటిలో సుగంధమునకై ఓ యలక్కాయను వేయండి. కలశంలో 5 మామిడాకులు లేక 5 తమలపాకులు ఉండేలా చేసుకోండి.
- కలశంపై కొబ్బరి కాయను వుంచండి. కలశం మీదనున్న కొబ్బరి కాయ కొప్పుపై దండవలె 11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని వేయండి.
- కలశం ముందున నాణెమును లేక నాణెములను ఉంచుకొనండి.
- తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని శ్రీ గణపతిని ప్రార్దించండి. ( పసుపుతో చేసిన గణపతిని చేయవద్దు )
- ఈ దిగువ ఇచ్చిన 11 నామాలను నిశితంగా పరిశీలించండి.
1. ఓం శ్రీమాత్రే నమః ఇది లలిత సహస్ర నామాలలో 1 వ నామం
2. ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 2 వ నామం
3. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 3 వ నామం
4. ఓం శ్రీమన్నగరనాయికాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 56 వ నామం
5. ఓం శ్రీకర్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 127 వ నామం
6. ఓం శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 392 వ నామం
7. ఓం శ్రీవిద్యాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 585 వ నామం
8. ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 587 వ నామం
9 ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 996 వ నామం
10. ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 997 వ నామం
11. ఓం శ్రీశివాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 998 వ నామం
2. ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 2 వ నామం
3. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 3 వ నామం
4. ఓం శ్రీమన్నగరనాయికాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 56 వ నామం
5. ఓం శ్రీకర్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 127 వ నామం
6. ఓం శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 392 వ నామం
7. ఓం శ్రీవిద్యాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 585 వ నామం
8. ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 587 వ నామం
9 ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 996 వ నామం
10. ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః ఇది లలిత సహస్ర నామాలలో 997 వ నామం
11. ఓం శ్రీశివాయై నమః ఇది లలిత సహస్ర నామాలలో 998 వ నామం
- ఈ నామాలను మొదటిసారి పై నుంచి దిగువ వరకు పఠి౦చండి. రెండవ సారి క్రింద నుంచి పైకి పఠి౦చండి. మూడవసారి పై నుంచి క్రిందకి పఠి౦చండి. ఈ విధంగా మొత్తం 9 పఠి౦చాలి.
- అనగా పైన నుంచి క్రిందకు 5 సార్లు గాను, క్రింద నుంచి పైకి 4 సార్లు గాను అయినది.
- 11 నామాలను 9 సార్లు ఎలా పఠి౦చాలో
వివరంగా ఈ దిగువన ఇవ్వబడినది. దీనిని వెంకట్ అనువారలు చక్కగా అర్థమయ్యే
రీతిలో డిజైన్ చేసారు. వారికి మా ధన్యవాదాలు. ఆ లింక్ ను ఈ దిగువన
ఇస్తున్నాము. 99 నామావళి కొరకుగా క్లిక్ చేయండి. HERE
- 99 నామాలను పఠి౦చే సమయంలో అక్షతలను గాని, పుష్పాలను గాని కలశంపై వేయండి.
- అనగా
99 నామాలను పఠి౦చినట్లు అగును. పై నుంచి చదివేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః
అంటూ మొదలు పెడతాం. ఒకసారి 11 నామాలను చదివితే ఒక శక్తి కోణం అగును.
- క్రింద నుంచి పైకి చదివేటప్పుడు ఓం శ్రీ శివాయై నమః అంటూ మొదలు పెడతాం. ఒకసారి 11 నామాలను చదివితే ఒక శివకోణం అగును.
- ఆ విధంగా పై నుంచి క్రిందకి 5 సార్లు అనగా 5 శక్తి కోణాలు..... క్రింద నుంచి పైకి 4 సార్లు అనగా 4 శివ కోణాలు అగును.
- శ్రీ చక్రంలో మధ్యభాగం లో ఉన్నబిందువుకు దిగువన 5 ముక్కోణాలు ఉండును. వీటిని శక్తి కోణాలు అంటారు.
- శ్రీ చక్రంలో మధ్యభాగం లో ఉన్నబిందువుకు ఎగువున 4 ముక్కోణాలు ఉండును. వీటిని శివ కోణాలు అంటారు.
- కనుక మొత్తం 99 నామాలలో..... 9 + 9 =18 ......... 1+ 8 = 9. ఈ తొమ్మిదే శివ శక్తుల కలయిక.
- తదుపరి ధూప, దీప, నైవేద్య, కర్పూర,
తాంబూలాదులను సమర్పించండి.
- నైవేద్యమనగా పాయసాన్ని జగన్మాతకు నివేదించండి. మీకిష్టమైన ఫలాలను, కొబ్బరికాయను కూడా
సమర్పించుకోవచ్చును.
- చివరగా సకల సమస్యల నుంచి గట్టేక్కుతూ ఈ జీవన గమనం
సాఫీగా సాగిపోవాలని మనసార భక్తితో, విశ్వాస, నిర్మల, నిశ్చలత్వంతో పూజ చేసుకొనండి.
- చిన్నపాటి
తప్పులేమైన వుంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజా కార్యక్రమం పూర్తైన
తదుపరి తీర్థ, ప్రసాదాలు స్వీకరించండి.
- పూజ పూర్తి అయిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా
కుడి చేతితో స్వల్పంగా కదపండి.
- ఈ పూజా కార్యక్రమంలో కుంకుమార్చన చేయవద్దు.
- 9 కలశపూజలు పూర్తైన తదుపరే ప్రత్యేక పద్దతిలో కుంకుమార్చన చేయాలి.
- ఈ పూజ చేసే సమయంలో మీ బంధు, మిత్రాదులను పిలుచుకొనవచ్చు.
ఏప్రిల్ 6 నాటి రక్షాకవచాన్ని క్రియాత్మకంగా ఉత్తేజపరచుటకు (activation ) సమయము
గమనిక 1 : కలశంలోని నీటిని కుటుంభ సభ్యుల శిరస్సుపై చల్లుకొని మిగిలిన నీటిని తులసి చెట్టు, లేక ఇతర మొక్కల మొదళ్ళలో పోయాలి. యాలక్కయను ప్రసాదంగా స్వీకరించవచ్చును. కలశం పై కొబ్బరి కాయను కొట్టుకొని వృధా కానివ్వకుండా తీపి వంటకాలలో ఉపయోగించుకోవాలి. కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని తర్వాత రోజులలో భోజన పదార్ధంగా వినియోగించుకోనేది. వృధాగా పోనివ్వవద్దు. బియ్యం క్రింద వ్రుంచిన వస్త్రమును తదుపరి కలశ పూజలలో ఉపయోగించుకోవచ్చు.
- భారత దేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 6 వ తేది రాత్రి 7 గంటల నుంచి 12 గంటల లోపల చైత్ర పూర్ణిమ పూర్ణ చంద్రునికి 5 వ రక్షాకవచాన్ని దర్సింపచేయండి. దీనితో పాటు మిగిలిన 4 రక్షాకవచాలను కూడా దర్శింపచేయవచ్చు.
- అనివార్య కారణాలచే దర్శింప
చేయలేనివారు భారతదేశం మరియు విదేశాలలో ఉండే వారు ఏప్రిల్ 7 శనివారం రోజున పగటి సమయంలో 10 గంటల లోపల శ్రీ సూర్యనారాయణ స్వామికి
దర్శింపచేయండి.
- ఒకసారి ఉత్తేజపరిచిన రక్షాకవచాలను ఎన్నిపర్యాములైననూ ఉత్తేజపరచుకోవచ్చు, లేదా నూతన కవచాన్ని మాత్రమే ఆక్టివేట్ చేసుకోవచ్చు.
తొమ్మిది రక్షాకవచాలను ఒకేసారి పొందుటకు
అతిత్వరలోనే ఒక
శుభకరమైన రోజు సిద్ధంగా వుంది.
కనుక ఇప్పటివరకు టీవీ ద్వారా 5 రక్షాకవచాలను గురించి చెప్పటం జరిగింది.
కనుక ఇప్పటివరకు టీవీ ద్వారా 5 రక్షాకవచాలను గురించి చెప్పటం జరిగింది.
ఇంకనూ 6 , 7 రక్షాకవచాలను 2012 ఏప్రిల్ 15 న
భారతదేశంలో మరియు విదేశాలలో ఏప్రిల్ 15 ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపల
ఆచరించి, రెండింటిని పొందబోతున్నాము.
అలాగే 8, 9 రక్షాకవచాలను కూడా 2012 మే 5 న భారతదేశంలో
మరియు విదేశాలలో మే 5 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపల ఆచరించి, పొందబోతున్నాము.
ఈ రోజు కూడా 5 వ దానిని చేసుకోలేని వారు నిరుత్సాహపడవద్దు. ఏప్రిల్ 15 వ
తేదిన 6 , 7 పూజలతో కలిపి చేసుకొనవచ్చును. అయితే చాలా శ్రమ పడాలి. అందుచేత
వీలైనంత వరకు ఏప్రిల్ 6 ను మిస్ కావద్దు.
9 రక్షాకవచాలను
కూడా పొందుటకు 2012 జూన్ 5
భారతదేశంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆచరించుకోవాలి.
విదేశాలలో జూన్ 5 ఉదయం 10 గంటల లోపల ఆచరించుకోవాలి.
గమనిక 1 : కలశంలోని నీటిని కుటుంభ సభ్యుల శిరస్సుపై చల్లుకొని మిగిలిన నీటిని తులసి చెట్టు, లేక ఇతర మొక్కల మొదళ్ళలో పోయాలి. యాలక్కయను ప్రసాదంగా స్వీకరించవచ్చును. కలశం పై కొబ్బరి కాయను కొట్టుకొని వృధా కానివ్వకుండా తీపి వంటకాలలో ఉపయోగించుకోవాలి. కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని తర్వాత రోజులలో భోజన పదార్ధంగా వినియోగించుకోనేది. వృధాగా పోనివ్వవద్దు. బియ్యం క్రింద వ్రుంచిన వస్త్రమును తదుపరి కలశ పూజలలో ఉపయోగించుకోవచ్చు.
గమనిక 2
: గతంలో పొట్టు ఉన్న గోధుమపిండి అవసరము అని చెప్పి ఉన్నాను. ఈ గోధుమపిండి
ఒకే సారి తొమ్మిది కలశపూజలు చేసుకొనే సమయములో మాత్రమే అవసరము. ప్రస్తుతము
అవసరము లేదు.
గమనిక 3 :తొమ్మిది కలశపూజలు పూర్తి అయ్యే వరకు, పాఠకులకు కొంత అయోమయంగా
ఉంటున్నట్లు గా వుంటుంది. అందుచేత అయోమయంతో చేసుకోలేనటువంటి వారు ప్రస్తుతం
ఆగి ... 2012 జూన్ 5 న ఒకేసారి నా ఆధ్వర్యంలో, నా పర్యవేక్షణలో,
ఆంద్రప్రదేశ్ లో ఓ ప్రత్యేక ప్రాంతంలో ఓంకార మహాశక్తి పీఠం నిర్వహించబోయే
కార్యక్రమంలో పాల్గొని ఆచరించుకోండి.
ఒకరి తరఫున మరొకరు కూడా చక్కగా సంకల్ప సహితంగా భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో ఆచరించుకోవచ్చు. దయచేసి ఈ పై తేదీలను తెలియనివారందరికీ తెలియచేయగలరని మనవి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.