Sunday, November 29, 2015

రవి, శనుల సంఘర్షణలో బుధ గ్రహం చేతనే చంద్రునికి అడ్డుకట్ట

ఆయుర్దాయము అంటే ఆయుష్యు. దీనినే ఆంగ్లంలో లైఫ్ స్పాన్ అంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాలు జీవిస్తాడు. అని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్తారు. అయితే ఆయుష్యును నిర్ధారించే స్థానము జ్యోతిష శాస్త్రంలో అష్టమ స్థానము. ఇక్కడ ఒక విషయాన్నీ బాగా గమనించాలి. ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయము కేవలం 8వ స్థానం గురించి మాత్రమే చెప్పటం అతి కష్టము. ఎందుకంటే వ్యక్తి యొక్క మానసిక, శారీరక స్థితి గతులను చెప్పే లగ్న స్థానము, ఆరోగ్యాన్ని విశ్లేషించే చతుర్థ స్థానము, ప్రమాదాలు, అనారోగ్యము తెల్పే ఆరవ స్థానముల గురించి పూర్తిగా పరిశీలించి ఆతర్వాతనే జాతకుని యొక్క ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలో చెప్పాలి. ఇది నా పరిశోధనలో తెలుసుకున్న నగ్న సత్యం.

ఆయుష్కారకుడు శనిగ్రహం. ప్రతి వారికి శని గ్రహం అనగానే విపరీతమైన భయాలు, ఆందోళనలు ఉంటుంటాయి. ఇది కేవలం వారి భ్రమ మాత్రమే. ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయం గాని లేక ఒక వస్తువు యొక్క జీవిత స్థితి గాని లేక ఓ వాహనం యొక్క జీవన కాల పరిమితి గాని నిర్ణయించాలంటే... మన మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అప్పులు చేసి, తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనే వారు చాలా మంది ఉంటారు. అంటే ఇక్కడ ఆయుర్దాయమనేది మనిషి ఆలోచన పైన ఆధారపడి ఉంది.

ఆయుర్దాయం రెండు భాగాలతో నడుస్తుంది. ఎలాగంటే ఆయుర్దాయంలోని మొదటి సగభాగంలో, మనిషి నేర్చుకొనే దురలవాట్లే మిగిలిన 50 శాతం ఆయుర్దాయాన్ని కబళిస్తాయి. మంచి అలవాట్లు ఉంటే ఆయుర్దాయం పెరుగుతుంది. దురలవాట్లు ఉంటే ఆయు క్షీణమవుతుంది. కాని మంచి అలవాట్లు ఉండి కూడా ప్రమాదాలలో మరణించే వారు ఎందరెందరో ఉంటారు. మరి ఈ ప్రమాదం ఎక్కడ నుంచి వచ్చింది... అదే ఆరవస్థానం నుంచి తెలుసుకోవాలి. ఈ ఆరవ స్థానమే ప్రమాదాలు, దురలవాట్లు, రుగ్మతలు, శత్రుత్వాలు, శతృత్వ పోకడలు మొదలైనవి.  మొదటి దశలో మంచి అలవాట్లు నేర్చుకుంటే ఆయుష్యు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

చాలా మంది వ్యసనాలకు లోబడి ఆయుష్యును కోల్పోతుంటారు. వ్యసనమన్నది మనిషిని గతం తాలూకూ ఊబిలోనే సమాధి చేసే ఓ మార్గం లాంటిది. చాలా మంది జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకోలేక, అతిగా తినటం వలన ఊబకాయం వచ్చి కదలలేని పరిస్థితిలో ఉంటుంటారు. దీనినే స్వయంకృతాపరాధం అంటారు. అంటే తమ నాలుకను అదుపులో ఉంచుకోలేని కారణంగానే ఊబకాయం వచ్చింది. జాతకంలో షష్ఠ స్థానంలో అనారోగ్య స్థితి ఉంటే కూడా అలవాట్లు లేకున్నా ఊబకాయం వస్తుంది. అంటే ఆయుర్దాయం అనేది షష్ఠ స్థాన ఫలితాల మీద కూడా ఉండి తీరుతుందన్నమాట. ఆల్కాహాల్, మాదక ద్రవ్యాలు, దుష్ప్రవర్తన,జూదం వంటి పలు స్వీయ విధ్వంసకర అలవాట్లకు చిక్కి, వాటి నుంచి బయట పడలేక పోతున్న అభాగ్యులు ఎందరెందరో.

వ్యక్తిగతమైన అలవాట్లన్నీ చెడ్డవి కానక్కర్లేదు. అలవాటును వదులుకోవటం అన్నది, చెడు నడవడికను మార్చాలన్నదానిపై దృష్టి ఉంచటం ద్వారా జరగదు. తగిన ప్రత్యామ్నాయ ప్రవర్తన గురించి స్పష్టమైన అవగాహన పెంచుకున్న ద్వారానే సాధ్యపడుతుంది.

పొగ త్రాగటం మానాలని నిర్ణయించుకొని, చుట్ట, బీడీ, సిగిరేట్లను కాలికింద నలపటం ద్వారా ప్రయోజనం ఉండదు. కాని స్వచ్చమైన గాలిని శ్వాసించటం ద్వారా మాత్రమే అది వీలవుతుంది. అనివార్యమైన అలవాట్లను ఆదిలోనే కనిపెట్టి నివారించకపోతే, అవి జీవితంలో పెను విధ్వంసాలకే దారి తీస్తాయి. అలవాట్లను మార్చుకోవటం మీదే దృష్టి అంతటిని కేంద్రీకరించే బదులుగా, ముఖ్య అవసరమైన క్రొత్త అలవాట్ల జాబితాను తయారు చేసుకొని త్వరిత గతిన నిర్ణయాలని తీసుకోవటమనే విధానాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే, నిశ్చయంగా వ్యక్తులు అదృష్టవంతులవుతారు.

దురలవాట్లను మానుకోవట మన్నది బాహ్యపరమైన సంస్కరణల కన్నా, అంతః పరమైన పరిణితి ద్వారానే మొదలవుతుంది. ప్రతి వ్యక్తి యొక్క శారీరక, భౌతిక, మానసిక, భావోద్వేగ స్థితిగతులు ఆరోగ్యానికి అద్దం పడతాయని పేర్కొంటారు. వ్యక్తి ఎన్నో ఆదర్శ లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, ఒకే ఒక దురలవాటుకు లోబడితే అది వైరస్ లాగా మిగిలిన మంచి లక్షణాలను హరించి వేసి.. వ్యక్తి యొక్క శారీరక, మానసిక వ్యవస్థలపై దుష్ప్రభావాన్ని చూపి సమతుల్యంలేని జీవితానికి దారి తీస్తుంది.

కనుక ప్రేమ, ఔదర్యా లే ఆరోగ్యకర భౌతిక జీవనానికి విత్తనాలు. ఏ అంశాలు స్వచ్చమైనవో, ఏవి కావో, ఏవి ప్రేమానురాగమైనవో, ఏవి కావో.. ఏవి అనుకూలమో, ఏవి  ప్రతికూలమో మొదలైన అంశాలన్నింటిని క్షుణ్ణంగా చెప్పగలిగే శక్తి బుద్ధి కారకుడైన బుధ గ్రహానికి మాత్రమే ఉంటాయి. చంద్రుడు మనసుకు కారకుడు. బుధుడు బుద్ధికి కారకుడు. అనుకూలంగా లేక వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి చంద్రుడికి మాత్రమే ఉంది. కాని ఖచ్చిత నిర్ణయాలని తీసుకోలేడు. అందుకోసమే బుద్ధిబలంతో మానసిక స్థితి గతులను అంచనా వేసుకుంటూ చక్కని నిర్ణయాలను తీసుకోవాలి. ప్రస్తుతం వృశ్చిక రాశిలో రవి గ్రహ, శని గ్రహ కలయిక సందర్భంగా ప్రతివారు బుద్ది బలంతో నిర్ణయాలు తీసుకుంటే, వ్యక్తే కాకుండా సమాజమే కాకుండా దేశం యావత్తూ శాంతి ఏర్పడటానికి అవకాశం తప్పక ఉంటుంది. కనుక మనస్సు చేసే వ్యతిరేక నిర్ణయాలను బుద్ధిబలంతో కట్టడి చేయటానికి ప్రయత్నం చేయండి.

రాబోయే 2016లో ఇంతకంటే అధికంగా వ్యతిరేక గ్రహసంచార స్థితిగతులు రానున్నవి. కనుక సంయమనం పాటిస్తూ నేను చెప్పే విశ్లేషణలకు పెద్ద పీట వేస్తూ ముందుకు వెళ్ళగలిగితే, ప్రతివారికి శుభత్వమ్ ఆపాదిస్తుంది. - పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Friday, November 20, 2015

రవి, శనుల కలయికతో మానస సరోవరం మహా సాగరం కానున్నదా?

ఆధ్యాత్మికపరంగా వ్యక్తికున్న సప్త శరీరాలలో చతుర్థ శరీరమే మానసిక శరీరం. ఈ మనస్సును ఎల్లప్పుడూ ప్రసన్నంగానే ఉంచాలి. రాగ ద్వేషాలను పోషించకుండా  సంహరిస్తుండాలి. చిత్తం యొక్క మలినమే మనస్సు యొక్క దోషం. చిత్తముకు గల ప్రసన్నతే సద్గుణము. ఈ సద్గుణమును హడావిడిగా ప్రతివారు పొందలేకపోవచ్చు. కాని నవవిధ వ్యక్తులతో సన్నిహితంగా ఉండేవారు ప్రప్రధమంగా ఈ దిగువ చెప్పిన అంశాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి.

1. ఆయుధాలు కల్గి ఉన్నవారితో ఆయుధాలు లేని వారు శత్రుత్వాన్ని కల్గి ఉండరాదు.
2. తన రహస్యాలను వారితో తప్పు చేసిన వ్యక్తి (దోషి) పగ, ప్రతీకారాలతో మెలగరాదు.
3. ఓ యజమాని దగ్గర పని చేసే నౌకరు శత్రుత్వంతో అసలు ఉండకూడదు.
4. దుష్ట  స్వభావులతో... సాత్విక స్వభావ సిద్ధి గల మంచివారు శత్రుత్వం లేకుండానే మెలగాలి.
5. సంపన్న వర్గీయుడితో పేదరికం ఉన్న వ్యక్తి శత్రుత్వం కలిగి ఉండరాదు.
6. శూర, వీరులతో స్తుతించే వారు శత్రు లక్షణాలకు దూరంగా ఉండాలి.
7. ఓ కవి శత్రు పోకడలతో ఉన్న కవిత్వాన్ని మహారాజుకు వినిపించకూడదు.
8. వైద్యులతో రోగులు మిత్రత్వాన్నే కోరుకోవాలి.
9. నిత్యం కడుపు నింపే అన్నదాతతో శత్రుత్వంతో సంభాషించరాదు.

పై నవవిధ వ్యక్తులతో ఎవరైతే శత్రు విరోధ లక్షణాలు లేకుండా ఉంటారో వారు సుఖంగా ఉంటారు. ఈ శత్రు విరోధ లక్షణాలను అనుకోకుండా తెరపైకి తెచ్చే గ్రహ స్థితులు ఉన్నప్పుడు ప్రతివారు అతి జాగరూకులై అప్రమత్తతతో వ్యవహరించాలి. కనుక భావోద్రేకాలు సంయమనం పాటిస్తూ... సమయస్పూర్తితో, సమయానుకూలంగా మనస్సనే వానరాన్ని అధిక అప్రమత్తతతో నడిపించాల్సిన అవసరం ప్రతి వారి విషయంలో ఎంతైనా ఉన్నది. హడావుడి పడితే మొదటికే మోసం వస్తుంది. కేవలం తమకు తాముగా పరిధిని దాటకుండా ప్రేక్షకులుగా వ్యవహరిస్తూ జీవన సమరంలో విధి నిర్వహణ చేయాలి.

పట్టుదల, శ్రమ, మేధస్సు వల్లనే అద్భుతాలు జరుగుతాయి. ఈ మూడింటి సమాహారమే పురాణం, ఇతిహాసాలలో మనం చెప్పుకొనే మహిమలు, మహత్తులు. ఓ సరియైన జ్ఞానాన్ని మానవాళికి అందించేందుకు ఋషులు, యోగులు శ్రమించారు. సృష్టి రహస్యాలను అద్భుత రచనల ద్వారా మనకందించారు. అటు ఆధ్యాత్మికము, ఇటు విజ్ఞానము కలబోతగా ఉండి యుగాలు మారినా, జగాలు మారినా దివ్య ప్రభోదాలుగా, మార్గదర్శకాలుగా నిలిచాయి. మానవుడిని మాధవుడిగా చేసేవిగా పవిత్రంగా పురాణ ఇతిహాసాలు భాసిల్లుతున్నాయి. దేవతలను బలోపేతుడుగా చేసేందుకు అమృతాన్ని సాధించేటందుకు, మంథర పర్వతాన్ని కవ్వంగా మలుచుకొని, వాసుకిని తాడుగా చేసుకొని పాలకడలిని మధించమని దేవ దానవులతో చెప్తాడు శ్రీ మహావిష్ణువు. స్థితి, గతి స్వరూపమే ఆయన. స్థితిని బట్టే, గతి ఉంటుంది, గతిని బట్టే స్థితి ఉంటుంది. ఈ స్థితి గతులను నిర్ణయించేదే మహా సాగరమనే మనస్సు. కనుక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు. కారణమేమిటంటే ఆ కృషి వెనుక సరియైన సారధ్యం వహించేది మనస్సు మాత్రమే.

మరి రవి శనుల కలయిక వలన నవంబర్ 30 నుంచి ప్రతి వారి విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటుపోట్లు, అస్థిరతలు, ఆటంకాలు ఎలా ఉంటాయో, దానికి తగ్గ కృషి ఎలా చేస్తే గ్రహస్థితి వ్యతిరేక పంథా నుంచి విజయం చేకూరుతూ మన మనో సాగరం రాజహంసలు  విహరించే మానససరోవరం కావాలంటే తదుపరి పోస్టింగ్లో తెలుసుకుందాం. - శ్రీనివాస గార్గేయ

నవంబర్ 30 రవి, శనుల కలయికతో తీవ్ర పరిణామాలా?

ఆధ్యాత్మికపరంగా ఓ వ్యక్తి సప్తవిధ శరీరాలతో ఉంటాడు. ఇందులో మొదటిది భౌతికమైనది. బాహాటంగా అందరికీ కనపడేది. రెండవది భావ శరీరము. ఇక మూడవది సూక్ష్మ శరీరము. నాల్గవది మానసిక శరీరము. పంచమ శరీరమే ఆధ్యాత్మిక శరీరం. విశ్వ శరీరమనేది ఆరవభాగంగా ఉంటుంది. చిట్ట చివరిది నిర్వాణ (మరణం) శరీరం.

పై సప్త శరీరాలలో నాల్గవదైన మానసిక శరీరానికి ఈ నెలలో ఓ సమస్య రావటానికి అవకాశాలను అందిస్తున్నాయి గ్రహస్థితులు. భారత కాలమాన ప్రకారం 2015 నవంబర్ 30 ఉదయం 5 గం.49 నిముషాల నుంచి ప్రతి వ్యక్తీ ఆలోచించే ప్రతి అంశంలోనూ ఓ వ్యతిరేకత ఉండి తీరుతుంది. శతాబ్దాల తర్వాత వస్తున్న ఓ గ్రహస్థితి ప్రతి వ్యక్తీ ఆలోచనా తరంగాలపై సమ్మెట పోటు వేయనున్నది.

ప్రతి మనిషిలో ఓ ఆలోచన ధోరణి ఉంటుంది. అది అనుకూలం కావచ్చు. ప్రతికూలం కావచ్చు. కానీ గ్రహచార స్థితిగతుల ప్రకారం 2015 నవంబర్ 30 సోమవారం నాడు వృశ్చిక రాశిలో ఉదయం 5 గం.49నిముషాలకు ఖగోళంలో రవి గ్రహ, శని గ్రహ కలయికలు జరుగుతున్నాయి.

మనః కారకుడైన చంద్రుని యొక్క వారమైన సోమవారం నాడు పుష్యమి నక్షత్రంలో ఈ అరిష్ట గ్రహస్థితి చోటు చేసుకోబోతున్నది. వ్యక్తి బడుగు జీవి కావచ్చు, లేదా ప్రధాని కావచ్చు. ఎవరు ఎవరైనప్పటికీ భారతదేశంతో పాటు, భారతదేశంతో పాటు పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్డమ్ మరియు తూర్పు మధ్య దేశాలపై ప్రభావం వ్యతిరేకంగా ఉండనుంది. 

సెప్టెంబర్ మాసం నుంచి ప్రారంభమైన  106 రోజుల వ్యతిరేక అరిష్ట గ్రహస్థితుల ప్రభావం వాతావరణ, ప్రాకృతిక (భూకంప ఇత్యాదులు), రాజకీయ, వాణిజ్య, ఆధ్యాత్మిక, సంగీత, సినిమా, రోడ్డు రైలు విమానయానములతో పాటు ద్వాదశ రాశులపై ప్రభావము ఉండునని గతంలోనే చెప్పటం జరిగింది. అయితే ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్య రంగములపైన ప్రభావముండునని చెప్పటం జరిగింది. సెప్టెంబర్ నుంచి ఇంతవరకు భూకంప అంశాలను తీసుకుంటే దిన పత్రికలు, టీవీలలో తెల్పినవి కూడా పరిశీలిస్తే, మొన్నటి నెల్లూరులో జరిగిన ప్రకంపనలు, నిన్న 5.3 గా నేపాల్ లో వచ్చిన భూకంపము,ఈరోజు జపాన్లో 6.3గా వచ్చిన భూకంపం వరకు విశ్లేసిస్తే ఈ పోస్టింగ్ పెట్టే సమయానికి  106 రోజుల వ్యతిరేక స్థితులలో ప్రాకృతిక భూకంప తీవ్రతలు ఇంతవరకు 6.3 కంటే అధికంగా 23 ప్రాంతాలలోను, 5.0 కంటే తక్కువగా అనేక ప్రాంతాలలోను (ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది) వచ్చినవి.  అలాగే ఘోర విమాన ప్రమాదాలు, జల ప్రమాదాలతో పాటు అనేక వ్యతిరేకతలు కూడా ద్వాదశ రాశులలో ఉన్న వ్యక్తులకు ఆపాదిస్తున్నాయి.

ఈ 106 రోజుల వ్యతిరేక అరిష్ట గ్రహస్థితులలో భాగంగా నవంబర్ 30 న భారత కాలమాన ప్రకారం 5గం.49 నిముషాలకు ఖగోళంలో శని గ్రహం మరియు సూర్యుడు ఒకే బిందువులో కలవనున్నారు. ఆనాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ గ్రహ సంచారాలను విశ్లేషిస్తే దీని ప్రభావాలు ముఖ్యంగా రాజకీయ రంగంపైన, పరిపాలనా రంగాలపైన వ్యతిరేక ప్రభావాలు ఉంటుంటాయి. ప్రతివారి మనస్సు వ్యతిరేకంగా ఆలోచన చేయటము, నిర్ణయాలు తీసుకొనటానికి ప్రయత్నించటం జరుగును.

ప్రతి రాశిలోను మధ్య నక్షత్రంపై 50 శాతం ప్రభావం చూపును. మధ్య నక్షత్రానికి అటువైపు ఇటువైపు ఉండే నక్షత్రాలపై 25 శాతం వ్యతిరేక ప్రభావాలను చూపును. ఉదాహరణకు మేష రాశిలో మధ్య నక్షత్రమైన భరణి జాతకులకు 50 శాతం వ్యతిరేకంగాను, అశ్విని కృత్తిక జాతకులకు 25 శాతం చొప్పున వ్యతిరేకంగా మనోభావాలు ఉండును.  ఈ ప్రకారంగా భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, పూర్వాషాడ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర జాతకులకు రవి, శనుల కలయిక ప్రభావంచే మనస్సు 50 శాతం అధికంగా వ్యతిరేక భావాలవైపు లాగుచుండును. అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్ర, విశాఖ, జ్యేష్ట, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వాభాద్ర, రేవతి జాతకులకు 25 శాతం అధికంగా వ్యతిరేక నిర్ణయాలవైపు, ఆలోచనలవైపు మనస్సు మొగ్గుచూపుచుండును.

సెప్టెంబర్ 10 నుంచి ఇంతవరకు ప్రాకృతిక భూకంపాలు  వచ్చిన తీవ్రతను, ప్రాంతాలను, గ్రహస్తితులను దృష్టి లో ఉంచుకొని విశ్లేషిస్తే వృశ్చిక రాశిలో జరిగే రవి, శని గ్రహాల కలయిక ప్రభావం ఒక్క రోజు మాత్రమే ఉండదు. కనీసం 11 మాసాలపాటు వ్యతిరేకంగా ఉండును. రవి, శనుల ప్రభావంచే మనస్సు వివిధములైన వ్యతిరేక నిర్ణయాలను చేయును. కనుక పాఠకులు కొంత అప్రమత్తతతో ఆలోచనలు చేయాలి. ముఖ్యంగా తొమ్మిది విధములైన వ్యక్తులతో శతృత్వము, విరోధము కలిగి ఉండరాదు. ఈ నవవిధ వ్యక్తుల వివరాలు మరియు రవి శనుల కలయిక తీవ్ర ప్రభావాలు తదుపరి పోస్టింగ్లో. 

- శ్రీనివాస గార్గేయ

Thursday, November 12, 2015

2016 కాలచక్రం క్యాలెండర్ యాప్ మరియు పంచాంగం ఉచిత డౌన్లోడ్

నాచే రచింపబడిన రాబోయే 2016 కాలచక్రం క్యాలెండర్ యాప్ మరియు రాబోయే 2016-2017 శ్రీ దుర్ముఖి నామ సంవత్సర కాలచక్రం సంపూర్ణ పంచాంగం ఫ్రీ డౌన్లోడ్ చేసుకొనుటకు సిద్ధంగా ఉన్నవి.   

కాలచక్రం క్యాలెండర్లో 24 పేజీలతో ఉండి తిధి, నక్షత్ర సమయాలతో పాటు శుభముహుర్త సమయాలు, ద్వాదశ రాశులకు క్లుప్తంగా ఫలితాలు మరియు అనేక నూతన పరిహారాల వివరాలతో... యాప్ సిద్దంగా ఉన్నది. 2016 జనవరి 9న శని శుక్రుల దివ్య దర్శనం, మార్చి 9న సంపూర్ణ సూర్య గ్రహణ వివరాలతో పాటు ఉసిరిక భస్మ ధారణతో అన్యోన్య దాంపత్యము,రాహు నక్షత్రాల మధ్య వచ్చే పూర్ణిమన సంతానభివృద్ది పరిహారము, ప్రేమానుబంధం పరిఢవిల్లుటకు, విద్యలో వెనుకంజలో ఉన్నవారికి, అష్టమ అర్దాష్టమ ఏలినాటి శని దోష పరిహారము, నక్షత్రం ప్రకారం నామ నిర్ణయాలు, 20 సంవత్సరాల లోపు వయసు వారికి బుద్ది బలం పెరుగుటకు, కృష్ణా పుష్కరాలపై సోదాహరణ వివరణ, గృహ వాస్తు దోష నివృత్తికి ఓ పరిహారము, మొదలైన అనేక అంశాలతో పాటు ద్వాదశ రాశులకు క్లుప్త రాశిఫలితాలు, ఇతర శుభ ముహూర్త నిర్ణయాలు ఎన్నెన్నో ఉన్నాయి.  కనుక ఆసక్తి ఉన్నవారు యాప్ ను డౌన్లోడ్ చేసుకొని క్యాలెండర్ను వీక్షించవచ్చును. 
క్యాలెండర్ యాప్ లింక్ :
https://play.google.com/store/apps/details?id=com.mohan.kalachakram



కాలచక్రం పంచాంగం లింక్ :
http://kinige.com/book/Sri+Durmukhi+Nama+Samvatsara+Kalachakram+Panchangam






భారత ప్రభుత్వ ఆమోదిత గణితమైన దృగ్గణితమ్ ప్రకారమే తిధి, నక్షత్ర సమయాలు ఉండును. ఇవి ఖచ్చితమైనవి, ప్రామాణికమైనవి, శాస్త్రీయమైనవి. నాసా వారి అంతరిక్ష కేంద్రంతో మా గణిత సమయాలు సరిపోవును. మీరు ఆచరించే ముఖ్య కార్యాలకు, ఇతర విశేష శుభ కార్యాలకు దృగ్గణిత పంచాంగాన్నే వినియోగించండి. పూర్వగణిత పంచాంగాలతో చెప్పే జాతక, ముహూర్తాలు తేడాలు వచ్చునని గమనించండి. ఈ క్యాలెండర్ యాప్ మరియు పంచాంగ ఫ్రీ డౌన్లోడ్ వివరాలను గురించి మీ బంధు, మిత్రాదులందరికి తెలియచేయండి. - శ్రీనివాస గార్గేయ

Wednesday, November 11, 2015

దీపావళి రోజున స్తోత్రాలు పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా ? - 2వ భాగం

 భారతీయుల పర్వదినాలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆచార వ్యవహారాల కలబోతగా ఉంటాయి. పండుగలలో భక్తి భావం వెళ్లి విరుస్తుంది. ఆనందోత్సవాలు ప్రతి ఇంటా తాండవిస్తాయి. ఘనమైన మన సంప్రదాయాలకు ప్రతీక దీపావళి వేడుక. పంచమ వేదమైన శ్రీ మహా భారతం అను శాసనిక పర్వంలో "దీపప్రదః స్వర్గలోకే దీపమాలేవ రాజతే" అనే శ్లోకాన్ని బట్టి మహా భారత కాలానికే దీపావళి విశేష ప్రాచుర్యం పొందినట్లుగా తెలుస్తున్నది. ధర్మ శాస్త్రాలలో పురాణ ఇతిహాసాలలో, ప్రాచీన గ్రంధాలలో దీపావళి పర్వదిన విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. 
 
అమావాస్య తిధి ఎప్పుడు వచ్చినా అది, పితృ సంబంధమైన తిధి. ఒక దీపావళి అమవాస్యకే వేదాంత పరిభాషలో ప్రేత అమావాస్య అంటారు. ఈ ప్రేత అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి పితృ దేవతలంతా ఆకాశ మార్గంలో వచ్చి నిలబడుతుంటారు. తమ సంతతి ఎలా ఉన్నారో చూడటానికే వారు వస్తారని పురాణాల కథనం. దీపావళి నాటి సాయంత్రం ప్రదోష వేళన అన్నీ పూజల కన్నా ముందుగా ఆచరించాల్సింది దివిటీలు కొట్టటం. దివిటీలు స్త్రీలు కొట్టరు. కుటుంబంలో ఉన్న మగవారిలో పెద్దవారు అనగా తండ్రి లేనటువంటి వారు గోవు కర్ర (ఎండిన గోంగూర చెట్టు కొమ్మలు) మీద వెలుగుతున్న కాగడాన్ని ఉంచి దక్షిణపు దిక్కుగా ఎత్తి చూపించాలి. ఇలా చూపిస్తూ ఆ వ్యక్తి ఏమని తలచాలంటే "నేను వేద ధర్మాన్ని తెలుసుకున్నాను. ఈ రోజు మధ్యాహ్నం భోజన సమయానికి ముందు పితృ దేవతలను స్మరించుకున్నాను. అవకాశమున్నవారు తిధి జరుపుకుంటారు లేదా ఓ ముద్ద కాకికి పెడతారు." ప్రస్తుతం చీకటిగా ఉంది. ఆకాశ మార్గం నుంచి మీరు బయల్దేరి కిందకి రండి. నేను వెలుతురు చూపిస్తున్నాను అని దివిటీ ఎత్తి చూపించాలి. దివిటీ ఎత్తి పితృ దేవతలకు చూపించే పర్వదినమే దీపావళి అమావాస్య. మనకు శరీరాన్నిచ్చి, తమ శరీరాలను విడిచిపెట్టిన పితృ దేవతలు ఆశ్వీజ మాస చిట్ట చివరి రోజున జ్యోతి స్వరూపులై అంతరిక్షంలో ప్రయాణం చేస్తుంటారు. వారిని గౌరవించాల్సిన అవసరం వారి వారి సంతతికి ఉంటుంది. ఇది చేయలేక పోయినా కనీసం తండ్రి లేని మగవారు ఇంటిలో దక్షిణపు దిక్కుగా రెండు వత్తులతో సాయంత్ర సమయంలో జ్యోతి ప్రజ్వలన చేయటం కనీస సంప్రదాయం. ఆ తర్వాతనే పితృ దేవతలకు దివిటీలతో స్వాగతాంజలి పలికిన తర్వాత దైవీ దేవతలకు పూజలు ఆచరిస్తాం.

ఈ పరంపరలోనే జ్ఞానానికి చిహ్నంగా, సమస్యలనే చీకట్లలో వెలుగు చూపించటానికి దేవతా మూర్తులకు ప్రార్ధనా పూర్వకంగా వెలిగించేవి దీపాలు. మనచుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగానే అజ్ఞానాన్ని తరిమికొట్టే జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. ఈ జ్ఞాన దీపమే అసలు సిసలైన లక్ష్మీ ఆరాధనగా పేర్కొనాలి. సాయంత్రం నుంచి ఎన్నో దీపాలను వెలిగించినప్పటికీ, జ్ఞాన దీపాన్ని మాత్రం అమావాస్య తిధి నాటి అర్ధరాత్రి (నిశీధి) సమయంలోనే వెలిగించాలి. ఈ 2015లో నిశీధిలో అమావాస్య తిధి లేదు . అందుకోసం భారత దేశంలో సాయంత్రం 5గం.49నిముషాల నుంచి 7గం.49 నిముషాల మధ్య కాలంలో నువ్వుల నూనెతోనే 8 వత్తులు లేక 5 వత్తులు లేక 2 వత్తులతో దీప ప్రజ్వలన చేయాలి.

పంచేంద్రియాలలో మొదటిదైన మన నేత్రాలతో జ్ఞాన దీప జ్యోతులను తదేకంగా కొద్దిసేపు చూస్తూ, మానసికంగా భక్తి భావంతో లక్ష్మి దేవిని స్మరించాలి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందీ ఆ జ్యోతి దర్శనాన్ని చేయాల్సిందే. నువ్వుల నూనెతో వెలిగే జ్యోతినుంచి వెలువడే కాంతి కిరణాలు, గుర్తించటానికి వీలులేని విధంగా వచ్చే వాయువు, మన నేత్రాలకు సోకటంతో... ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి బుద్ది సక్రమంగా పని చేయటంతో కొన్ని కొన్ని సౌశీల్య లక్షణాలు ఏర్పడుతుంటాయి. ఈ విధంగా సౌశీల్య లక్షణాలు (ద్రోహబుద్ది లేకుండటం, క్షమా గుణాన్ని కలిగి ఉండటం, దురభిమానాన్ని విడనాడటం మొదలైనవి) ఒక అమావాస్య తోనే పొందలేము. ప్రతి అమావాస్య రోజున ఇలా ఆచరిస్తూ దీపావళి అమావాస్యన విశేషంగా జ్ఞాన జ్యోతులను వీక్షిస్తుంటే అసలైన దైవీ సంపదను పొందవచ్చు. ఇట్టి దైవీ సంపదను ఎవరైతే పొంది ఉంటారో వారికి మాత్రమే మహాలక్ష్మి అనుగ్రహం, కటాక్షం లభిస్తుందని శాస్త్ర వచనం.

అంతేతప్ప సౌశీల్య లక్షణాలు లేకుండా లక్ష్మీ స్తోత్రాలన్నింటినీ పఠిస్తు ఇంటి నిండా దీపాలను వెలిగించి అనేకానేక నివేదనలు సమర్పించినప్పటికీ అనుగ్రహం ఉండనే ఉండదు. ఇది అక్షర సత్యము. అటు భగద్గీత, ఇటు మహా భారతం ఈ అంశాలను స్పష్టం చేస్తున్నాయి.

కనుకనే సౌశీల్య లక్షణాలను ఒక్క రోజులో పొందటం అసాధ్యమైన విషయం. అందుకోసం ప్రతి అమావాస్య తిధిని ఆధారంగా చేసుకుంటూ భక్తి విస్వాశాలతో పూజ మందిరంలో లక్ష్మీ దేవి చెంతన జ్ఞాన దీపాన్ని వెలిగించి... జ్యోతి పైననే దృష్టి ఉంచి, మనసును ప్రక్క దార్లకు మళ్ళించ కుండా చేతనైన రీతిలో లక్ష్మీ దేవిని ప్రార్ధించండి. (ఇలానే ప్రార్ధించాలి అనే నియమం ఏమి లేదు) మీకు నచ్చిన, మీకు మెచ్చిన ఓ తీపి పదార్ధాన్ని లక్ష్మి దేవి ముందున్న జ్ఞాన జ్యోతికి నివేదించండి. ఇంటిల్లపాది... ఒక్కొక్కరు కనీసం ఒక్కో నిముషమైనా తదేకంగా జ్ఞాన జ్యోతిని దర్శిస్తే, అనుగ్రహం  లభిస్తుంది. తెలుగు నిఘంటువులో లక్ష్మీ అనే పదానికి ఒక్కసారి అర్ధం ఏముందో గమనించారనుకోండి, బుద్ది అనేది గంధ ద్రవ్యము అని ఉంటుంది. అంటే మన బుద్ధిని సరియైన రీతిలో తీసుకొని వెళ్లి సౌశీల్య లక్షణాలను పొందుటకు తగు రీతిలో బుద్ధిని ప్రేరేపించే విధి విధానమే ఈ జ్ఞాన జ్యోతి వీక్షణ. అంతే తప్ప ఏదో పూజ మందిరంలో, ఓ పటం పెట్టి, పూలు పెట్టి నాలుగు స్తోత్రాలు చదివినంత మాత్రాన అనుగ్రహం కలగదని పాఠకులు తెలుసుకోవాలి.

చివరగా... అమావాస్య తిధికి, ఆ తర్వాత వచ్చే శుక్ల పాడ్యమి తిధులకు నిత్య తిధి దేవత పేరే కామేశ్వరి. మొత్తం 15 మంది నిత్య తిధి దేవతలు ఉంటారు. అట్టి దేవతలలో ఈ రెండు తిధుల దేవి కళగా కామేశ్వరి ఉంటుంది. కోటి సూర్యులు ఉదయించే సమయంలో ఎంత అరుణ కాంతి భాసిల్లునో అంత కాంతితో ఈ తల్లి వెలుగొందుతుంటుంది. దేవి ఖడ్గమాలలో ఈ నామాలు చెప్పబడతాయి. ఏతా వాతా పాఠకులకు తెలియచేసేది ఏమిటంటే కేవలం టపాసులు విపరీతంగా కాల్చి, వాటి ద్వారా వచ్చే విషవాయువులచే ఇతరులు ఎంతో మంది భాదపడతారేమో అనే విషయాన్ని గ్రహించి భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు సరియైన రీతిలోనే పర్వదినాన్ని ఆచరిస్తారని మనసార కోరుకుంటూ... ఓపికగా చదివి ఆకళింపు చేసుకున్న ప్రియ పాఠకులందరికి హృదయ పూర్వక దీపావళి పర్వదిన శుభాకాంక్షలతో.... మీ శ్రీనివాస గార్గేయ

Tuesday, November 10, 2015

దీపావళి రోజున స్తోత్రాలు పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా ?

మానవుని జోతిర్మయ జీవనానికి సంకేతం దీపావళి. జ్యోతిస్సాక్షాత్కారం కోసం ఇహ పర సౌఖ్యాలు పొందటానికి మానవుడు జరుపుకొనే పర్వదినమే దీపావళి. మరి నరకాసుర వధకు సంతోష ప్రయత్నంగా బాణసంచా కాల్చారని పురాణం కథనం. మహా విష్ణువు వామన రూపంలో బలి చక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కినందునే దీపాలను వెలిగించి ఉత్సవం జరుపుకున్నారని మరో పురాణం కథనం. శ్రీ రాముడు రావణ సంహారం చేసి, చతుర్దశి రోజున పట్టాభిషేకం జరుపుకున్నాడని, అందుకే దేవతలు, మునులు మానవులు దీపాలను వెలిగించి సంతోషంతో పండగ చేసుకున్నారని, అదే దీపావళి అని మరో పురాణ కథనం. కాళికా మాత దీపావళి నాడే రాక్షస సంహారం చేసి ప్రళయ భావావేశంలో జీవరాశులన్నిటినీ నాశనం చేయటానికి ఉపక్రమించగా.. పరమేశ్వరుడు ఆ శక్తి ఎదుట నిలబడి ఆమె కోపోద్రేకాన్ని తగ్గించి, ఆమెని శాంతపరిచెనని మరో పురాణ గాధ. ఈ గాధ శత్రు సంహార కాలమున భయంకరమైన వారిపై సంహారం చేయాలని విశ్వశాంతికి భంగం వాటిల్లకూడదని ఓ సందేశాన్ని బోధిస్తుంది.

పై పురాణ గాధలు ఎన్ని ఉన్నప్పటికీ మనలోని అజ్ఞామనే అంధకారాన్ని జ్ఞానకాంతులు పెంపొందేలా  దీపాలను వెలిగించాలని మనం చెప్పుకుంటున్నాం. ఇంతవరకు బావుంది. బాణసంచా కాలుస్తున్నాం. దీపాలను వెలిగిస్తున్నాం. మరి లక్ష్మీ పూజ ఎందుకు?

దీపావళి పండుగకి, లక్ష్మీ పూజకు అసలు సంబంధం ఏమిటి? అసలు దీపావళి రోజున దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చటానికి వైజ్ఞానిక పరంగా ఓ అంతరార్ధం ఉంది. అదేమంటే ఆశ్వీజ, కార్తిక మాసాలు శరదృతువులో వస్తాయి. దీనికి ముందు వచ్చే శ్రావణ, భాద్రపదాలు వర్షఋతువుకి  చెందినవి. భారీ వర్షాల వలన క్రిమి, కీటకాదులు, దోమలు అధికమవుతుంటాయి. శరదృతువులో సూర్యుడు తులా రాశిలోకి వచ్చి భూమికి దూరమవుతుంటాడు. ఈ కారణంగా అంటువ్యాధులు, ఇతర సంబంధిత రుగ్మతలు నిర్మూలించటానికై పూర్వపు రోజులలో బాణసంచా కాల్చినందు వలన వెలువడే విష వాయువులచే క్రిములు నశిస్తాయని, దీపావళి నుంచి కార్తీకం చివరివరకు నిత్యం దీపాలు వెలిగించినందున... ఆ దీప కాంతులకు కొన్ని కీటకాలు ఆకర్షింపబడి... అగ్ని ప్రభావంచే చనిపోతుంటాయి. ఇది పూర్వీకుల ఆలోచన.

కాలం మారింది, ఋతు ధర్మాలే మారిపోతున్నాయి. ప్రతి ఇంతా దోమలు రాకుండానే కట్టుదిట్టంగా దోమతెరలతో పాటు రాత్రి సమయాలలో దోమలను సంహరించే మస్కిటో లిక్విడ్స్ విపరీతంగా వాడుతున్నారు. కేవలం నరకాసుర వధ జరిగిందనే ఆనందోత్సవాలతో బాణసంచా కాల్చాలనే ఓ ఆచారం ప్రస్తుతం వెర్రితలలు వేయటం విచారకరం. 70 అడుగుల నరకాసుర బొమ్మలను తయారుచేసి లక్షల రూపాయల ఖరీదుతో ఉన్న బాణసంచా కాల్చటం చేత వాటినుంచి వెలువడే విష వాయువులు ప్రజలకు, చిన్నారులకు, వృద్ధులకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయో  ఎవరూ ఊహించటం లేదు. అసలే పొల్యుషన్ పిశాచి నగరాలలో స్వైర విహారం చేస్తుంటే దీనికి తోడు మూకుమ్మడిగా చేసే నరకాసుర వధ అనే కోలాహలంతో వెలువడే విష వాయువులు, ఇంటింటా వేలాదిగా డబ్బు ఖర్చుపెడుతూ రణగన ధ్వనులు వచ్చే బాణసంచాలను కాల్చటం ఎంత వరకు సమంజసం.

విజ్ఞాన శాస్త్రాన్ని మానవ కల్యాణానికి దోహదపడేలా చూసుకోవాలె తప్ప మానవ వినాశనానికి నాంది కాకూడదు. భారీ నగరాలలో ఈ పర్వదినాన కాల్చిన బాణసంచా వ్యర్ధాలను వేలాది లారీలలో తరలించి, తిరిగి వాటిని ప్రభుత్వాల వారు కాలుస్తారు. వాటినుంచి వచ్చే పొగ, విషవాయువులు ఎంతటి ప్రమాదకరమైనవో ఎవరూ ఊహించరు.

అసలు ఎవడీ నరకాసురుడు ? ఈరోజుకి, లక్ష్మీ పూజకు సంబంధం ఏమిటి అనే అంశాలను కొంత తెలియచేయటానికి ప్రయత్నిస్తాను. సూర్యుడు, చంద్రుడు ఎదురెదురుగా అంటే 180 డిగ్రీల కోణంలో ఉంటే పూర్ణిమ తిధి వస్తుంది. అలా కాక ఈరెండూ గ్రహాలూ కలిసిపోతే అమావాస్య వస్తుంది. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. అమావాస్య తిధిన సూర్యుడు నుంచి వచ్చే కాంతి కిరణాల స్థితి మరియు అమావాస్య నాటి రాత్రి అంధకార స్థితిని సమన్వయము చేసుకుంటూ వెలిగించే జ్యోతులను పంచేద్రియాలలో ఒకటైన మన కనుల ద్వారా తదేక దృష్టితో వీక్షించటమే నిజమైన లక్ష్మీ పూజ.

అలాకాకుండా లక్ష్మీ దేవికి చెందిన అష్టోత్తరాలు, సహస్రనామాలు, శ్రీసూక్తము ఇత్యాదులు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని పఠించిన వారికే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందా ? ఎలాంటి పాండిత్యం లేని విద్యాబుద్ధులు లేని పూజ ఎలా చేయాలో తెలియని వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభించదా? అసలు ఈ పర్వదినాన లక్ష్మీ అంటే అర్థం ఏమిటి ? కేవలం డబ్బే ప్రధానంగా భావించి చేసే పూజనా ? కాదు.. కాదు.. కాదు... కానే కాదు. మరి ఏమిటి ?

ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి అనే పంచ భూతాలతో ఏర్పడినదే ప్రపంచం. ఈ పంచభూత ప్రకృతే సూక్ష్మాంశంగా మారి 25 తత్వాలతో స్థూలదేహం ఏర్పాటు కాబడింది. పంచ భూతాలలోని ఆకాశం వల్ల కలిగిన జ్ఞానం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 5 తత్వాలను అంతఃకరణాలు అంటారు. వీటికి భిన్నమైన కార్యాచరణ ఉంది. ఇవి గుణ ప్రకృతులు. వాయువు, అగ్ని, జలం, పృథ్వి అనే నాలుగు భూతాలలోని సూక్ష్మాంశాలను జడ ప్రకృతులు అంటారు.

ఈ 25 తత్వాలతో పంచ భూతల సమిష్టితో స్థూలదేహం... సూక్ష్మ దేహంగా మారి దేహాన్ని, దేహిని నడిపిస్తుంటాయి. అందులో అంతర్గతంగా ఉన్న దివ్యమైన శక్తే ఆత్మ. అంతఃకరణాల కార్యాచరణ పరిశీలిస్తే జ్ఞానం సర్వాన్ని గుర్తిస్తుంది. మనసు దానిని సంగ్రహిస్తుంది. బుద్ధి అనేది అందులోని మంచి చెడులను నిర్ణయించి చిత్తానికి అప్పగిస్తుంది. చిత్తంలో ఏర్పడిన ధృడ భావం స్థిర సంకల్పంగా ఉండి... ఎన్నటికీ చెదిరిపోదు.

మనలో ఉన్న జ్ఞాన శక్తి ఒక విషయాన్ని గుర్తిస్తుందే తప్ప దానిలో ఉండే వాస్తవాన్ని గ్రహించలేదు. అందుకోసం ఆ విషయాన్నీ మనసుకు అందిస్తుంది. ఈ మనసు విషయానికి వస్తే ఇదో చంచలమైనది. దీనికో రెండు దోషాలున్నాయి. ఒక్కోసారి మంచివైపు, ఒక్కోసారి చెడువైపు లాగుతుంటుంది. నిర్ణయించే శక్తి మనసుకు లేనే లేదు. అలాంటప్పుడే బుద్ధికి పని తగులుతుంది. ఆ విషయాన్ని సక్రమంగా విశ్లేషణ చేసి మంచి ఏది ? చెడు ఏది ? సమ్మతమా ? అసమ్మతమా ? అంగీకరించాలా? త్రోసిపుచ్చాలా? ఈ విధంగా బుద్ది ఆలోచన చేసి ఓ చక్కని నిర్ణయాధికారంతో చిత్తానికి తేల్చి చెబుతుంది. చిత్తంలో ఏర్పడిన ధృడమైనటువంటి భావమే నేను అనేటువంటి వ్యక్తి నిర్వహించి కార్యరూపం చేస్తాడు. కనుక అంతఃకరణాల మధనంలో బుద్ది పాత్ర చాలా కీలకమైనది. బుద్ధిని సానబట్టి మెరుగులు దిద్దితేనే బుద్దిమంతుడవుతాడు.

మంచి చెడులకు బుద్దే కారణమని గీతాచార్యులు చెబుతారు. కర్ణుడు విశేషమైన శక్తి సంపన్నుడైనప్పటికీ చెడ్డ బుద్దులవారితో సహవాసం చేసి చెడిపోయాడు. కైకేయి మంధర చెప్పిన మాటలు విని తన స్వబుద్ధిని కోల్పోయి రామ పట్టాభిషేకాన్ని చెడగొట్టింది. రావణుడు దుర్భుద్ది  వల్లే నేలకొరిగాడు. కనుక బుద్ధిని నియంత్రించుకుంటూ సంస్కారమనే కొలమానికలను రాబట్టాలి.

ప్రతి మనిషి సంపాదించాల్సిన అసలైన సంస్కారమనే సంపద ఒకటి ఉంది. ఆ సంపదే లక్ష్మీ దేవి. ఇక్కడ లక్ష్మీ అంటే డబ్బు అని అర్ధం కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ సంపద పేరు శీలం. మనిషిని జ్ఞాన పథం వైపు నడిపిస్తూ జ్ఞాన కాంతులు నింపే  శీలం చేతనే శోభిస్తుంది. ఇటువంటి ఉత్తమ సంపదను పొందటానికి కొన్ని అర్హతలు ఉన్నాయని భగవద్గీతలోని 'దైవాసుర సంపద్విభాగ యోగమనే' 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు ఓ శ్లోకం చెప్పాడు... ఏమంటే... తేజస్సు, క్షమా, ధైర్యం, బాహ్య, ఆంతరంగిక శుద్ది, ద్రోహబుద్ది లేకుండా ఉండటం, దురభిమానాన్ని విడిచిపెట్టటం అనే గుణాలు దైవీ సంపదగా పేర్కొన్నాడు. ఉత్తమమైన శీలవంతుడు ఈ శ్లోకంలో చెప్పిన సంపదలన్నింటినీ (లక్ష్మీ) సంపాదించుకుంటే సమాజంలో అందరి చేత శభాష్ అనిపించుకోవటంలో సందేహం ఉండబోదు.

అందుకే మహాభారతంలోని శాంతి పర్వం మూడవ అధ్యాయంలో మనకి ఒక  కథ కనపడుతుంది. ధర్మరాజు సంపాదించిన సంపదలతో సమానమైన సంపద పొందాలంటే... మొట్ట మొదట సౌశీల్యాన్నీ సంపాదించాలని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడకు ఆ కథ వివరిస్తాడు. పూర్వం ప్రహ్లాదుడు సౌశీల్యంతోనే ఇంద్రుడి  రాజ్యాన్ని జయించాడు. పదవి పోయిన ఇంద్రుడు దేవ గురువు దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పి ఉపాయం చెప్పమంటాడు. తన దగ్గర ఉపాయం లేదని శుక్రాచార్యుల దగ్గరకు వెళ్ళమని దేవ గురువు సలహా ఇస్తాడు. శుక్రుడు కూడా తన వాళ్ళ కానే కాదని ప్రహ్లాదుడి దగ్గరకే పొమ్మని ఇంద్రునికి సూచిస్తాడు. ఈ సూచన మేరకు ఇంద్రుడు ఓ సాధారణ వేద పండితుడి రూపంలో ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ సాధారణ పండితుని చూసి ప్రహ్లాదుడు భక్తితో నమస్కరించి ప్రస్తుతం తనకు తీరిక లేదని చెప్పాడు. అయినప్పటికీ పండితుని రూపంలో ఉన్న ఇంద్రుడు నిరీక్షిస్తూ ప్రహ్లాదుడి ముందే నిల్చున్నాడు. ఆ పండితుని సహనానికి మెచ్చుకొన్న ప్రహ్లాదుడు... వరం కోరుకోమన్నాడు. నీ శీలాన్ని నాకు అనుగ్రహించమని మారు వేషంలో ఉన్న ఇంద్రుడు అడిగాడు. ప్రహ్లాదుడు మొదట సందేహించినా, వేద పండితుని రూపంలో ఉన్న ఇంద్రుడి అసమాన తేజస్సును చూసి మాట తప్పితే మంచిది కాదని అనుకొని... వెంటనే తన శీలాన్ని ధారాదత్తం చేశాడు. మారువేషంలో ఉన్న ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ప్రహ్లాదుడు శీలాన్ని ఇంద్రుడు గ్రహించిన వెనువెంటనే... ప్రహ్లాదుడి శరీరం నుంచి ఓ ఛాయ రూపంలో ఓ ఆకారం వెలుపలికి వచ్చింది. దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న  ఆ ఆకృతిని (ఛాయా) చూసి  ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. నేను నీ శీలాన్ని.. ఆ పండితునికి దానం చేశావు. కనుక అతని దగ్గరకు వెళ్తున్నాని చెప్పి వెళ్ళిపోయింది. మరుక్షణంలోనే లక్ష్మీ దేవి ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమై.. ఓ రాజా ఇంతకాలం నీవు శీలం కలిగి ఉన్నందునే  నిన్ను ఆశ్రయించి ఉన్నాను. ప్రస్తుతం నీవు శీల రహితుడివి. నీ దగ్గర నేనిక నిలవలేను అంటూ లక్ష్మీ దేవి వెళ్ళిపోయింది.

కనుక ఈ ఆధునిక సమాజంలో ప్రతి వ్యక్తి  అజ్ఞానాన్ని వీడి  జ్ఞానకాంతులు నింపే శీలం అనే లక్ష్మీ సంపదను పొందినప్పుడే  కీర్తి ప్రతిష్టలతో తులతూగుతారు. మరి ఈ దీపావళి పర్వదినాన జ్ఞాన కాంతులు నింపే శీల సంపదను పొందటానికే లక్ష్మీ పూజను ఆచరించాలని పెద్దల మాట. ఇట్టి శీల సంపదను పొందటానికి లక్ష్మీ దేవి ఫోటో ముందు కూర్చొని స్తోత్రాలు చదివినంత మాత్రాన ఈ దైవీ సంపదను పొందగలమా? ఎలా పొందాలో తదుపరి పోస్టింగ్లో చూడండి.

Wednesday, November 4, 2015

నవంబర్ 7 మహా వజ్రేశ్వరి దేవి చెంతన గురుగ్రహం

దేవి ఖడ్గమాలలో కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నా, భేరుండా, వహ్నివాసిని, మహా వజ్రేశ్వరి, శివదూతి, త్వరితా, కులసుందరి, నిత్య, నీలపతాకా, విజయా, సర్వమంగళా, జ్వాలమాలిని, విచిత్రా అను 15 మంది నిత్య దేవతలు ఉంటారు. వీరు శుక్ల పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ప్రతి రోజు కనపడే చంద్రుని యొక్క దేవి కళగా ఉందురు. బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న తిదులకు ఈ దేవతలే వెనుక నుంచి ముందుకు లెక్కించాలి. ఈ పరంపరలో 8వ తిధి దేవత త్వరితా. ఈమె శుక్ల పక్షంలోను, కృష్ణ పక్షంలోను ఒకరే. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అష్టమిచంద్రవిభ్రాజా అని ఉండును.
 

అయితే మహా వజ్రేశ్వరి అను దేవతా నామము  లలితా సహస్రనామ స్త్రోత్రంలో 468 గా ఉండును. ఈ దేవత శ్రీమన్నగరంలో 12వ ప్రాకారంపై జలంధర పీఠంపై పరివేష్టితురాలై ఉంటుంది. ఈ దేవత శుక్లపక్ష షష్టికి, బహుళ దశమికి దేవి కళగా విరాజిల్లుతుంటుంది. 

నవంబర్ 6 శుక్రవారం నాడు గురుగ్రహం చెంతకు ఆశ్వీజ బహుళ దశమి చంద్రుడు వస్తాడు. ఈ చంద్రుడిని మహా వజ్రేశ్వరి దేవికళ అని పిలుస్తారు. 6 శుక్రవారం ఉదయం సూర్యోదయాని కంటే ముందు తూర్పు దిశన గురుగ్రహం పక్కనే దశమి చంద్రుడు కనపడతాడు. చంద్రున్ని దర్శిస్తూ, చంద్రునిలో మహా వజ్రేస్వరీ దేవి రూపాన్ని దర్శించుకొనండి. ఈమె కెంపులతో పొదిగిన కిరీటాన్ని ధరించి రక్తవర్ణంగా ఉంటూ ఎర్రని వస్త్రాలను ధరించి 4 భుజాలతో ఉంటుంది. కుడివైపున ఒక చేతిలో దానిమ్మ పండు, ఎడమవైపు ఒక చేతిలో చెరకు గడలు ఉంటాయి. మిగిలిన చేతులలో పాశము, అంకుశాలు ఉండును. ప్రత్యేకంగా ఆనాడు  సూర్యోదయం కంటే ముందే మీరు కూడా అవకాశం ఉంటే భక్తితో దానిమ్మ పండును చేత పట్టుకొని గురుగ్రహం చెంతనున్న మహావజ్రేశ్వరి దేవిని వీక్షించండి. ఆ పండును కుటుంబ సభ్యులందరూ విశ్వాసంతో ప్రసాదంగా స్వీకరించండి. వాస్తవానికి గురు గ్రహం చెంతకు తరచుగా చంద్రుడు వస్తున్నప్పటికీ దశమి నాటి చంద్రుడు సూర్యోదయ శుభవేళలో ఆశ్వీజ మాసంలో కనపడటం అరుదైన సంఘటన. కనుక మహా వజ్రేశ్వరి దేవి అనుగ్రహానికి పాత్రులు కండి. కనపడేది చంద్రుడైనప్పటికీ ఆ చంద్రునిలో పైన చెప్పిన దేవి రూపకళను ఊహిస్తూ ధ్యానించండి, ప్రార్ధించండి, కీర్తించండి.

నవంబర్ 7 శనివారం రమా ఏకాదశి పర్వదినాన శుభగ్రహమైన శుక్రుని చెంతకు ఏకాదశి చంద్రుడు (వహ్నివాసిని దేవికళ) ఉండటం చూడగలం. కనుక ఈ అద్భుత గ్రహదర్శనాలని సూర్యోదయం కంటే ముందే మనం వీక్షించే అవకాశం కల్గనుంది.  - శ్రీనివాస గార్గేయ 

Wednesday, October 28, 2015

26వ తేది వస్తే భూకంపాలు వస్తాయా ?

ప్రపంచ చరిత్ర పేజీలలో కన్నీటి సిరాతో విషాదాక్షరాలను కొన్ని కొన్ని రోజులు లిఖిస్తుంటాయి. ఇప్పటి వరకు సంభవించిన కొన్ని భయానిక ప్రకృతి ఉత్పాతాలు పరిశీలిస్తుంటే కొంతమంది... క్యాలెండర్ తేదిలలో 26 వరల్డ్ వరస్ట్ డే గా గుర్తించాలి అంటుంటారు. ఇక వివరాలలోకి వస్తే 26 జూన్ 1926న ఆసియన్ టర్కీగా పిలుచుకొనే ఆంటోలియాలోని రోడ్స్ నగరంలో భూకంపం విలయ తాండవం చేసింది. 26 డిసెంబర్ 1939 టర్కీలో పెను భూకంపం సంభవించింది. 26 జూలై 1963లో యుగోస్లేవియా భూకంపం వచ్చి ఆరువేల మంది మరణిస్తే, 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 26 జూలై 1976న చైనాలో అత్యంత దారుణ భూకంపం సంభవించి రెండున్నర లక్షల మంది మరణించారు. 26 డిసెంబర్ 1996లో హిందూ మహా సముద్రంలో పుట్టిన సునామి దెబ్బకు నాల్గుదేశాలలో రెండులక్షల మంది మరణించారు. 26 జనవరి 2001న గణతంత్ర దినోత్సవాన గుజరాత్ భూకంపంతో పాతికవేల మందికి పైగా మరణించారు. 26 డిసెంబర్ 2003 ఇరాన్ భూకంపంలో ముప్పై వేలమంది పైన చనిపోయి బూమ్  నగరాన్నే భూకంపం భూమిలో కలిపేసింది. 26 డిసెంబర్ 2004 ఇండోనేషియాలోని సుమత్రా దేవీలలో సునామి ఎగిసిపడి దాదాపు మూడులక్షల మందిని పొట్టన పెట్టుకుంది. 26 జూలై 2005న ప్రకృతి వైపరీత్యాలతో ముంబైలో భారీ వరదలు సంభవించాయి. 26 ఫిబ్రవరి 2010 లో కూడా జపాన్లో భూకంపం సంభవించి ఆస్తి నష్టం జరిగింది. 26 జూలై 2010 తైవాన్ భూకంపంతో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 26 ఏప్రిల్ 2015 నేపాల్ భూకంపం షుమారు పదివేలమందిని చంపింది. నిన్న కాక మొన్న 26 అక్టోబర్ 2015న  హిందూ కుష్ పర్వత ప్రాంతాలలో సంభవించిన భూకంపం దెబ్బకు ఆఫ్ఘన్, పాకిస్తాన్లు వణికిపోయాయి.

పైన చెప్పిన భూకంపాలన్నీ 26వ తేదీనే వచ్చినటువంటివి. ఇవి కాక ఇతర తేదిలలో కూడా పెను భూకంపాలు వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది. కేవలం 26వ తేది మాత్రమే భయపెట్టే సంఖ్యగా భావించేవారు ఎందరెందరో ఉంటారు. యాదృచ్చికంగా ఈ తేది సంభవించింది. గ్రహచార స్థితిగతులు, ఇతర అరిష్ట యోగాలు ఉన్నప్పుడే ప్రకృతి సంబంధిత ఉత్పాతాలు వస్తుంటాయి. కనుక 26వ తేది దోషమని, ఈ అంకె కలిపితే 8 సంఖ్య వస్తుందని, 8 అంటే శని గ్రహ సంకేతమని, 8 సంబంధిత తేదీలు,సమస్యలు వస్తాయని భయపడే వారు చాలా మంది ఉంటుంటారు. కనుక భవిష్య కాలంలో వచ్చే 26వ  తేదిను గురించి భయం చెందవద్దు. - శ్రీనివాస గార్గేయ

Saturday, October 24, 2015

ఏక బిందువుపై గురు, శుక్రుల శుభ దర్శనం

సింహరాశిలో గురు ప్రవేశంతో గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమై 79 రోజులపాటు దేవ గురువు బృహస్పతి నిందితుడైనందున శుభకార్య పరంపర ఆగిపోయింది. అత్యంత అరుదుగా సింహరాశిలో ఒకే బిందువుపై శుభగ్రహ దర్శనం కలుగుతున్నది. అట్టి గురు, శుక్రుల శుభ దర్శనాన్ని అక్టోబర్ 26 సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందు 120 నిముషాల ముందు నుంచి వీక్షించవచ్చు. ఇట్టి ఏక బిందు స్థితిలో గురువుతో కలసిన శుక్ర జంట గ్రహ శుభదర్శనమ్ పలు దశాబ్దాల తదుపరి ఆసన్నమగును.

26 అక్టోబర్ సోమవారం ఉదయం తూర్పు దిశలో శుక్రుడు తేజోవంతమైన కాంతి నక్షత్రంతోను, ప్రక్కనే శుభగ్రహమైన గురువు మరో నక్షత్రంగా దర్శనం ఇవ్వనున్నారు. కనుక గురు గ్రహ కవచాన్ని భక్తి విశ్వాసాలతో 5 పర్యాయములకు తగ్గకుండా పఠించండి. గురు, శుక్రులు జంట గ్రహాలూ కనపడుతున్నందున... గత పోస్టింగ్లోని  శుక్ర కవచాన్ని ఐదు మార్లు, ఈ పోస్టింగ్ లోని గురు కవచాన్ని 5 మార్లు చక్కగా మనఃస్పూర్తితో పఠించండి.

గురు గ్రహ ధ్యానమ్
అభీష్టఫలదం వందే సర్వఙ్ఞం సురపూజితమ్ |
అక్షమాలాధరం శాంతం ప్రణమామి బృహస్పతిమ్ ||


గురు గ్రహ కవచమ్
బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః |
కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేభీష్టదాయకః || 1 ||

జిహ్వాం పాతు సురాచార్యః నాసం మే వేదపారగః |
ముఖం మే పాతు సర్వఙ్ఞః కంఠం మే దేవతాగురుః || 2 ||

భుజా వంగీరసః పాతు కరౌ పాతు శుభప్రదః |
స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః || 3 ||

నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః |
కటిం పాతు జగద్వంద్యః ఊరూ మే పాతు వాక్పతిః || 4 ||

జానుజంఘే సురాచార్యః పాదౌ విశ్వాత్మకః సదా |
అన్యాని యాని చాంగాని రక్షేన్మే సర్వతో గురుః || 5 ||


ఫలశృతిః
ఇత్యేతత్కవచం దివ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వాన్ కామానవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ ॥


పైన పేర్కొనబడిన ధ్యానమును మరియు కవచాన్ని పఠించలేనివారు ... దిగులు చెందవలసిన అవసరం లేదు. శరీర శుద్ధితో శుభ గ్రహాలను వీక్షిస్తూ, భక్తి, విశ్వాసాలతో.. తమపై చక్కని అనుగ్రహం చూపమని హృదయ పూర్వకంగా ప్రార్ధించండి. కవచ స్తోత్రాలను పఠిస్తు ప్రార్ధించిననూ లేక మీకు ఇష్టమైన రీతిలో ప్రార్ధించిననూ ఎటువంటి నివేదనలు అవసరం లేదు. మనఃశుద్ధితో చేసే ప్రార్దనే అన్నింటికంటే ముఖ్యమని భావించాలి.

శుక్ర నక్షత్రంలో అరుదైన శుక్ర గ్రహ దర్శనం

గోదావరి పుష్కరాలు ప్రారంభం నుంచి మొదటి 79 రోజులలో శుభగ్రహమైన గురువు వర్జితుడని శాస్త్ర వచనం. మఖ నక్షత్ర 4 పాదాలు, పుబ్బ నక్షత్ర ఒక పాదము వెరసి మఘాది పంచ పాదాలు దాటి పుబ్బ నక్షత్ర రెండవ పాదంలో శుభ గ్రహ దర్శనాలు జరుగుతున్నాయి.

పుబ్బ నక్షత్రం అంటే శుభగ్రహమైన శుక్రుని యొక్క స్వనక్షత్రము. ఈ శుక్ర నక్షత్రంలో ఓ ప్రత్యేక బిందువు వద్ద శుక్రుడు తేజో కాంతితో విరాజిల్లుతున్నాడు. ఇట్టి స్థితి తిరిగి రావాలంటే (ఏక బిందువు దగ్గర గురువుతో కలసిన స్థితి) పలు దశాబ్దాల సమయం  పట్టును. 


25 అక్టోబర్ ఆదివారం ఉదయం తూర్పు దిశలో శుభగ్రహమైన శుక్రుడు తేజోవంతమైన కాంతి నక్షత్రంతో దర్శనం ఇవ్వనున్నాడు. కనుక  బ్రహ్మాండ పురాణంలో అందించిన శుక్ర గ్రహ కవచాన్ని... శుక్రున్ని వీక్షించి ఈ ధ్యానంతో శుక్ర కవచాన్ని భక్తి విశ్వాసాలతో 5 పర్యాయములకు తగ్గకుండా పఠించండి.

శుక్ర గ్రహ ధ్యానమ్
మృణాలకుందేందుపయోజసుప్రభం
పీతాంబరం ప్రసృతమక్షమాలినమ్ |
సమస్తశాస్త్రార్థవిధిం మహాంతం
ధ్యాయేత్కవిం వాఞ్ఛితమర్థసిద్ధయే || 1 ||


శుక్ర గ్రహ కవచమ్
శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః |
నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చందనద్యుతిః || 2 ||


పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవందితః |
వచనం చోశనాః పాతు కంఠం శ్రీకంఠభక్తిమాన్ || 3 ||


భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః |
నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః || 4 ||


కటిం మే పాతు విశ్వాత్మా ఉరూ మే సురపూజితః |
జానుం జాడ్యహరః పాతు జంఘే ఙ్ఞానవతాం వరః || 5 ||


గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరాంబరః |
సర్వాణ్యంగాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః || 6 ||


ఫలశ్రుతిః
య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః |
న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః || 7 ॥


ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినది. 

పైన పేర్కొనబడిన శుక్ర గ్రహ ధ్యానమును మరియు కవచాన్ని పఠించుటకు సమస్యలున్నవారు... దిగులు చెందవలసిన అవసరం లేదు. శరీర శుద్ధితో శుభ గ్రహమైన శుక్రగ్రహాన్ని వీక్షిస్తూ, భక్తి, విశ్వాసాలతో.. తమపై చక్కని అనుగ్రహం చూపమని హృదయ పూర్వకంగా ప్రార్ధించండి. పై శ్లోకాలు పఠించి ప్రార్ధించిననూ లేక మీకు ఇష్టమైన రీతిలో ప్రార్ధించిననూ ఎటువంటి నివేదనలు అవసరం లేదు. మనఃశుద్ధితో చేసే ప్రార్దనే అన్నింటికంటే ముఖ్యమని భావించాలి. తదుపరి పోస్టింగ్ లో గురు గ్రహ ధ్యానం కూడా అందిస్తాను.

Thursday, October 22, 2015

14 రోజుల పాటు శుభగ్రహ దర్శనాలు

అక్టోబర్ 25 ఆదివారం నుంచి నవంబర్ 7 శనివారం వరకు 14 రోజుల పాటు... ప్రతి నిత్యం తూర్పు దిశలో సూర్యోదయానికి 2గంటల ముందు నుంచి శుభ గ్రహాలను దర్శించి.... అనుగ్రహాన్ని పొందండి. ఇక వివరాలలోకి వస్తే సింహరాశిలోకి గురు ప్రవేశం జరిగిన తర్వాత 79రోజుల పాటు గురు గ్రహము పుష్కర సందర్భంగా సర్వత్రా వర్జితమయ్యే విధంగా ఉండిపోయింది. అంతేకాక ఈ 79 రోజులలోనే గురు గ్రహానికి మరియు శుక్ర గ్రహానికి కూడా మౌడ్యములు ఆపాదించినవి. 2015 సెప్టెంబర్ 30 సాయంత్రం 6.13 లకు గురువు మఘాది పంచ పాదాలు దాటటం పూర్తి చేసుకొని శుభకరమైన స్థితిలోనికి రావటం జరిగినది.

సింహరాశిలోనే శుభులైన గురు గ్రహము, శుక్ర గ్రహము ప్రస్తుతం సంచారం చేస్తున్నారు. వీరిరువురు సింహరాశిలోనే ఒక విశిష్ట బిందువు వద్దకు త్వరలో రాబోతున్నారు. 25 ఆదివారం నాడు శుక్ర గ్రహాన్ని, 26 సోమవారం నాడు గురు, శుక్ర గ్రహాలను, 28 బుధవారం నాడు శుభ గ్రహాలైన గురు, శుక్రులతో పాటు మంగళకర గ్రహమైన అరుణవర్ణ అంగారకుడిని(కుజుడు) తూర్పు దిశలోనే సూర్యోదయం కంటే ముందు రెండు గంటల నుంచి భక్తి విశ్వాసాలతో దర్శించుకోనండి. ఈ అపురూపమైన గ్రహ దర్శనం అదే సింహరాశిలో అదే బిందువు వద్ద కలవటమనేది మరికొన్ని దశాబ్దాల తర్వాతనే జరగనుంది.

ప్రస్తుతం తూర్పు దిశలో సూర్యోదయం కంటే ముందు నుంచే సహజంగానే శుక్రుడు కాంతివంతంగా ఉండే నక్షత్ర ఆకారంలోనూ, దానికి కొద్దిగా దిగువగా మరికొంత కాంతి తక్కువ నక్షత్రంగా గురుగ్రహము, దానికి దిగువగా స్వల్ప అరుణవర్ణంతో మిణుకు మిణుకులాడే కుజ గ్రహం కనపడుతుంటాయి. కాని విశిష్ట బిందువు వద్దకు చేరటం మాత్రం ఈ నెల 25 సోమవారం కానున్నది. కనుక పాఠకులు సూర్యోదయం ముందే లేచి శుచిగా శుభ గ్రహ దర్శనాన్ని చేసుకొనగలరు.

అంతేకాకుండా నవంబర్ 6 శుక్రవారం నాడు గురు గ్రహం చెంతకు ఆశ్వీజ బహుళ దశమి ( మహా వజ్రేశ్వరి దేవికళతో ఉన్న) చంద్రుడు వస్తాడు. నవంబర్ 7 శనివారం రమా ఏకాదశి పర్వదినాన శుభగ్రహమైన శుక్రుని చెంతకు ఏకాదశి చంద్రుడు (వహ్నివాసిని దేవికళ) ఉండటం చూడగలం. కనుక ఈ అద్భుత గ్రహదర్శనాలని సూర్యోదయం కంటే ముందే మనం వీక్షించే అవకాశం కల్గనుంది. కనుక ద్వాదశ రాశులవారు ఆయా రోజులలో దర్శనం తదుపరి ఆచరించాల్సిన విధి విధానాలను తదుపరి పోస్టింగ్లో చూడండి. - శ్రీనివాస గార్గేయ

Sunday, September 27, 2015

భారతంలో చంద్ర గ్రహణం లేదు, అరిష్టానికి పరిహారం

భారత కాలమాన ప్రకారం 28 సెప్టెంబర్ 2015 సోమవారం ఉదయం 6 గంటల 37 నిముషాలకు ఖగోళంలో మీనరాశిలో చంద్రునికి గ్రహణం ప్రారంభమగును. ఉదయం 7గంటల 41 నిముషాలకు సంపూర్ణ గ్రహణ స్థాయి లోనికి చంద్రుడు వెళ్ళును. 72 నిముషాల పాటు సంపూర్ణ గ్రహణ బింబము నిలబడును. ఉదయం 8 గంటల 53 నిముషాలకు సంపూర్ణ గ్రహణము నుంచి విడుపు ప్రారంభమగును. ఉదయం 9 గంటల 57 నిముషాలకు చంద్ర గ్రహణం ముగియును. ఈ సమయములు భారత దేశములో పగటి యందు ఉన్నందున చంద్ర గ్రహణము భారతదేశములో కనపడదు.

ఇతర దేశాలలోనే కనపడును. 106 రోజుల అరిష్ట గ్రహ సంచారాలలో ఈ గ్రహణము కూడా ఉన్నది. దీని ప్రభావము, భూకంపాలపైననూ, జల సంబందిత సముద్ర అలలపైననూ, ద్వాదశ రాశులపైననూ ఉండును. అయితే ద్వాదశ రాశుల వారు ఆచరించవలసిన పరిహారములలొ భాగంగా 10 ముద్రలతో మంగళ, గురు, ఆదివారాలలో గ్రహణం తదుపరి నుంచి పరిహారాలు పాటిస్తే అనుకూలతలు ఉండును.

కనుక పఠించవలసిన శ్లోకాన్ని దిగువ ఇమేజ్ లో ఇవ్వబడినది. జగన్మాతను ప్రార్ధించుకుంటూ శ్లోకాలను ముద్రలు వేస్తూ పఠించేది. గత పోస్టింగ్ లలో ముద్రల వివరాలు ఇవ్వటం జరిగింది. కనుక ఆచరించేది.



Tuesday, September 22, 2015

గర్భవతులకు సూచనలు

ఇతర దేశాలలో ఉన్న గర్భవతులు,  గ్రహణ సమయంలో వారి వారి పనులను గృహంలోనే ఉండి చక్కగా చేసుకొనవచ్చును. మల మూత్ర విసర్జనలకు కూడా వెళ్ళకూడదు అని కొందరు అనుకుంటుంటారు. ఇది సరియైనది కాదు. చక్కగా అన్నీ పనులు ఇంటిలోనే ఉండి చేసుకొనేది. గ్రహణం మాత్రం చూడకుండా ఉంటే చాలు. టీవీ లలో గ్రహణ దృశ్యాలను కూడా చూడవచ్చును. తప్పులేదు. అటు ఇటు కదలకుండా ఒకే స్థానంలోనే పడుకొని ఉండాలి అని చెప్పే విషయాలను దయచేసి నమ్మకండి.

106 రోజుల అరిష్ట గ్రహస్థితుల వలన ద్వాదశ రాశుల వారికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అనుకూల పరిస్థితులు రావటానికి వారు ఆచరించాల్సిన విధి, విధానములు వారానికి మూడు రోజులే అని చెప్పటం జరిగింది. ఇందుకోసం పఠించవలసిన మంత్రం వీడియోను అప్లోడ్ చేయగలను. దానిని చూసి తెలుసుకొనేది. అలాగే 10వ ముద్రను కూడా తెలియచేస్తాను.

ముద్రల విషయంలో అనేక సంప్రదాయములు ఉన్నవి. ఉదాహరణకు వేద సంబంధ పురుష సూక్తము, శ్రీ సూక్తము, మన్యు సూక్తము మొదలైనవి దక్షిణ భారత దేశములో పఠించే స్వరానికి, ఉత్తరభారతంలో పఠించే స్వరానికి ఎంతో వ్యత్యాసమున్నది. అదే విధంగా ముద్రల విషయంలో కూడా అనేక ప్రాంతీయతలు చోటు చేసుకొని పలు మార్పులతో ముద్రలు కనపడుతుంటాయి.

ఈ పరంపరలో పురాతన గ్రంధాలు మరియు తాళపత్ర గ్రంధాల నుంచి సారాంశాన్ని క్రోడీకరించి ఇచ్చిన ముద్రలే మీకు తెలియచేస్తున్నవి. కనుక కొంతమందికి ఈ ముద్రలలో మార్పులు ఉన్నాయేమో అనే భావన రావచ్చు. అందుకొరకై ఈ వివరం ఇస్తున్నాను.   - శ్రీనివాస గార్గేయ

Friday, September 18, 2015

అరిష్ట గ్రహస్థితులకు పరిహార క్రమము



పరిహారక్రమ వివరాన్నంతటినీ పూర్తిగా విశదీకరిస్తున్నాను. వీనితో పాటు నేను చూపే ఒక వీడియోను కూడా లింక్ చేస్తున్నాను. 


ఇందులో 9 ముద్రలే ఉంటాయి. పదవ ముద్ర పరిహారక్రమ చివరలో తెలియచేస్తాను. జూలై 24వ తేదిన తిరుపతిలో ఈ ముద్రలకు సంబంధించిన సమాచారాన్నంతా ఓ యజ్ఞ రూపంలో అందరికీ తెలియచేసాను. మీరు కూడా మూడు రోజుల లోపలే పరిపూర్ణంగా వివరాలను తెలుసుకుంటారు. వీడియోని గమనించి ప్రాక్టీసు చేయండి. తదుపరి పోస్టింగ్లో మిగిలిన వివరాలు అందచేస్తాను. మీ బంధు, మిత్రులందరికీ ఫేస్బుక్ లింక్ లను, గ్రహభూమి లింక్ లను పంపగలరని ఆశిస్తాను.  - శ్రీనివాస గార్గేయ 


Wednesday, September 16, 2015

శ్రీ గణేశ చతుర్థి పూజా సమయాలు

స్వస్తిశ్రీ మన్మధ నామ సంవత్సర భాద్రపద శుక్ల చవితి శ్రీ గణేశ చతుర్థి పర్వదినాన శ్రీ మహాగణపతిని పూజించవలసిన శాస్త్రీయ సమయాలు ఈ క్రింది విధముగా ఉండును.

భారతదేశంలో వారందరూ శ్రీ గణేశ చతుర్థి పర్వదినాన ఉదయం 10 గంటల 49నిముషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 14నిముషాల మధ్య కాలంలో భక్తి, విశ్వాసాలతో గణపతి పూజ ఆచరించండి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లతో పాటు ఇతర దేశాలలో ఉన్నవారందరూ శ్రీ మహా గణపతిని ఉదయం 11గంటల 36నిముషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యకాలంలో పూజించి ఆరాధించండి.

ఇతర దేశాలలో ఈ పర్వదినాన వృత్తి రీత్యా, ఉద్యోగ నిర్వహణలో ఉన్న వారందరూ సూర్యోదయం తదుపరి తొలి 1గంట 36 నిముషాలలో పూజ కార్యక్రమాన్ని ప్రారంభించండి. అయితే మధ్యాహ్నం 11.36 నిముషాల నుంచి 2గంటల వరకు ఉన్న సమయంలో... వారు విధి నిర్వహణలో ఉన్నప్పటికీ మనఃస్పూర్తిగా శ్రీ మహా గణపతిని మనసులోనే మరొక్కసారి ధ్యానించుకోండి.


106 రోజులలో ఉన్న వ్యతిరేక అరిష్ట గ్రహస్థితుల ప్రభావం వాతావరణ, ప్రాకృతిక (భూకంప ఇత్యాదులు), రాజకీయ, వాణిజ్య, ఆధ్యాత్మిక, సంగీత, సినిమా, రోడ్డు రైలు విమానయానములతో పాటు ద్వాదశ రాశులపై ప్రభావము ఉండును. అయితే ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్య రంగములపైన ప్రభావముండును. ఇందుకు గాను ద్వాదశ రాశులవారు ఆచరించాల్సిన పరిహార వివరాలను సెప్టెంబర్ 18 శుక్రవారం ఋషిపంచమి పర్వదినాన పోస్టింగ్ చేయబడును. 

కనుక పరిహారములు చాలా సరళంగా ఉండటమే కాక అనవసర వ్యయముతో ఉండనే ఉండవు. ఈ పరిహారములలో భాగంగా కొంత భాగాన్ని ఎవరిపాటికి వారు ఆచరించుకుంటారు. కొంత భాగాన్ని మాత్రం ఎటువంటి రుసుము లేకుండానే మీ అందరి తరఫున మా పీఠంలో నేనే సంథాన కర్తగా ఉంటూ ప్రజాశ్రేయస్సుకై ఆచరించాల్సిన వైదిక క్రియను నిర్వహిస్తాను. 

ఇందు నిమిత్తమై మీ అందరి జన్మ నక్షత్ర వివరాలతో పాటు, పేరు, గోత్ర వివరాలను కూడా తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. పూర్తి వీడియోను మీరు చక్కగా చూడగలరు. అభిమానులందరి పూర్తి వివరాలను తెలుసుకొనుటకై 18వ తేదిన ఈమెయిలు ఐడిని ఇవ్వగలను. దానికి మీ వివరాలను మెయిల్ చేయవచ్చు. 

ముఖ్య గమనిక ఏమిటంటే ఈ కార్యక్రమం నిర్వహణ కొరకై ఎవ్వరూ ఎలాంటి రుసుములు చెల్లించనవసరం లేదని మరీ మరీ తెలియచేస్తున్నాను. - గార్గేయ సిద్ధాంతి

Sunday, September 13, 2015

ద్వాదశ రాశులపై అరిష్ట గ్రహస్థితుల ప్రభావాలు

2015 సెప్టెంబర్ లో వచ్చే భాద్రపదమాస పూర్ణిమకు కనపడే పెద్ద జాబిలి చూపరులకు ఎంతో మానసిక ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా కనపడినప్పటికీ...
అదే రోజున 72  నిముషాల పాటు కనపడే సంపూర్ణ చంద్రగ్రహణ బింబము 106 రోజుల గ్రహ స్థితిలో ప్రధాన కేంద్ర బిందువు కానున్నది.

ఇక భారత కాలమాన ప్రకారం సెప్టెంబర్ 15 మంగళవారం రాత్రి 9.29 ని.ల నుంచి కుజ గ్రహము సింహరాశి ప్రవేశం జరుగును. కుజుడు సింహరాశి ప్రవేశంతో సమస్యలకు మూలాధారమవుతాడు.

మూలాధార చక్రానికి అధిపతిగా ఉన్న గణపతి యొక్క జన్మదినం రోజే ప్రకృతి రాశిలోనికి సూర్య ప్రవేశం జరగటం, ఆపైన ఇటు సింహరాశిలో మూడు గ్రహాల కలయిక, తదుపరి నవంబర్ 3 నుంచి కన్యారాశిలో రాహువుతో కుజుడు, నీచ శుక్రుడు కలయిక జరుగును.

సింహ, కన్యా రాశులలో కుజ గ్రహ సంచారంతో త్రిగ్రహ కూటములు జరగనున్నవి. వీటి ప్రభావం ప్రకృతి రీత్యానే కాక వివిధ రాష్ట్రాల దేశ రాజకీయ స్థితి గతులమీద, క్రీడా, వాణిజ్య, సంగీత, సినీ, న్యాయ, మరియు మరికొన్ని ఇతర రంగాలపైననే కాక.. ద్వాదశ రాశుల వారి వ్యక్తిగత, మానసిక, ఆర్ధిక, శారీరక, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వైవాహిక, సంతాన సంబంధిత అంశాలన్నిటిపై పరి పరి విధాలుగా వ్యతిరేక ఫలితాలు రాగల సూచనలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మనసును అదుపు చేసుకుంటూ... ఈ 106 రోజులలో ఏర్పడే అరిష్ట గ్రహస్థితికి చెప్పే పరిహారాలను పాటిస్తూ ఉంటే కొంత ఉపశాంతి మార్గం తప్పక కల్గును.

భారతదేశంలో చంద్రగ్రహణం కనపడకపోయినప్పటికీ దీర్ఘ కాల గ్రహణ బింబ ప్రభావము ప్రపంచ వ్యాప్తంగా ద్వాదశ రాశులపై అరిష్ట గ్రహ స్థితులకు తోడుగా ఉండును. కనుక మేషరాశి నుంచి మీన రాశి వరకు గల 12 రాశుల వారికి ఏయే అంశాలలో వ్యతిరేకతలు వస్తాయో నా ఫేస్ బుక్ పేజి లింక్ ను  క్లిక్ చేసి తెలుసుకొనగలరు. 


https://www.facebook.com/Sreenivasa-Gargeya-Ponnaluri-293928097457427/

Wednesday, September 9, 2015

పెద్ద జాబిలికి 72 నిముషాల సంపూర్ణ గ్రహణం అరిష్టం కానున్నదా?

ఖగోళంలో చంద్రుడికి 72 నిముషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. దీనిని అమెరికా రాష్ట్రాలలో చూస్తారు. అదే రోజున పూర్ణ చంద్రుడు మామూలు పరిమాణం కంటే అధిక పరిమాణంలో పూర్ణిమ నాటి చంద్రుడు కనపడతాడు.

సెప్టెంబర్ 27 ఆదివారం రాత్రికి ఖగోళంలో ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. ఈ సంపూర్ణ గ్రహణం 72 నిముషాల పాటు దీర్ఘకాలం ఉంటుంది. భారతదేశంలో ఇది కనపడదు. భారతంలో కనపడక పోయినప్పటికీ ద్వాదశ రాశులపై దాని ప్రభావం పరోక్షంగా ఉంటూనే ఉంటుంది. అమెరికా, యూరప్, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా ఖండాలలో కనపడును.

అమెరికాలోని 9 నగరాలలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనపడును.
అట్లాంటా, బోస్టన్, డెట్రాయిట్, ఫిలడెల్ఫియా, పిట్స్ బర్గ్, జాక్సన్ విల్లె, రిచ్మండ్, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్ నగరాలలో సెప్టెంబర్ 27 రాత్రి 8.07 లకి చంద్రగ్రహణ స్పర్శ మొదలగును. సంపూర్ణ స్థితికి గ్రహణ రాక రా 9గం.11ని.లు, సంపూర్ణ స్థితి నుంచి విడుపు ప్రారంభం రా 10గం.23ని.లు, మోక్షం (గ్రహణ పూర్తి విడుపు) రా 11గం.27ని.లు.


సెప్టెంబర్ 13 శ్రావణ అమావాస్య ఆదివారం సింహరాశిలో పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది.  దక్షిణ హిందూ మహా సముద్రం పైననూ, దక్షిణాఫ్రికా, అంటార్కిటికా ఖండాలలో గోచరించును. ఇది భారత్ అమెరికాలలో కనపడదు. కాని దీని అధిక ప్రభావం హిందూ మహాసముద్రంపై ఉంటుంది.


చూపరులకు ఎంతో మానసిక ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా కనపడినప్పటికీ... సెప్టెంబర్ 10 నుంచి డిసెంబర్ 24 వరకు ఉన్న 106 రోజుల వ్యతిరేక స్థితిగతులకు 72 నిముషాల గ్రహణం నాటి పెద్ద జాబిలి హేతువవుతున్నది.

వివరాలు తదుపరి పోస్టింగ్ లో ...

Monday, September 7, 2015

మూల నక్షత్రంలో వర వర్షిని 3, 4

ఈ భూమి మీద ఏ వస్తువు కైనా చలనం కావాలంటే శక్తి అంటూ అవసరం. సకలమైన జీవరాశులకు ఇట్టి శక్తిని సూర్య భగవానుడే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అందిస్తున్నాడు. ఈ సమస్త ప్రకృతి అంటా శక్తిమయమే. పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం... ఇవన్నీ వివిధ శక్తి స్వరూపాలే.

ఓ చిన్న విత్తనం భూమిలోనుంచి మొలకెత్తాలంటే దానికి పృథ్వి శక్తి అవసరము. జల శక్తిని తోడుగా చేసుకొని భూమిలోనుంచి మొలకెత్తుతుంది. ఆపైన రెపరెపలాడాలంటే వాయు శక్తి అవసరం. తదుపరి నుంచి మొక్క ఎదుగుదలకు తోడ్పడేది అగ్ని, ఆకాశములు. అంటే సూర్యరశ్మి మరియు ఆకాశ తత్వము. అదే విధంగానే ఈ మనుడికి కూడా అద్భుతమైన మేధాశక్తి ఉన్నప్పటికీ అది సక్రమంగా పని చేయాలంటే... తన శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలన్నీ సహకారం అందించాలి. అందుకే మానవ శరీరంలో కొన్ని సున్నితమైన కేంద్రాలు ఉన్నాయి. శరీరములోని ఈ కేంద్రాలన్నీ ఉత్తేజితమైతే, శరీరంలో అవిరామంగా మహా శక్తి ఉత్పన్నమవుతుందని పతంజలి మహర్షే యోగ సూత్రాలలో తెలియచేశాడు.

అదే విషయాన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మానవ శక్తి కేంద్రాలైన షట్చక్రాల రూపంలో, మానవ శరీరంలో ఆవరించి ఉన్న పరాశక్తి  స్వరూపాన్నే అనేక శ్లోకాలలో స్తుతించటం జరిగింది. ఈ ఆరు చక్రాలకు మహా సామ్రాజ్ఞిగా పరిపాలించే ఏడవ చక్రమే సహస్రారము. కనుక మన శరీరంలో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము ఉంటాయి. ఈ చక్రాలు భౌతికంగా మానవ శరీరంలో అనేక జీవ ప్రక్రియలను నిర్దేశిస్తాయి. శరీరంలోని పలు అవయవాల విధులను ఈ షట్చక్రాలు నియంత్రిస్తుంటాయి.

ఈ పరంపరలో ప్రతి శక్తి కేంద్రము మెదడులోని ప్రత్యేక అవయవాలకు సంబంధించిన భాగాలతో అనుసంధానం గావించబడుతుంది. ఈ విధంగా ప్రతి చక్రంలో స్రవాలు ద్రవిస్తుంటాయి. కొందరికి సక్రమంగాను, ఇంకొందరికి అధికంగాను, మరికొందరికి అల్పంగాను ద్రవిస్తుంటాయి. ఈ స్రవించే ద్రవాల క్రమ పద్ధతి ద్వారా ఆరోగ్యకర వాతావరణం కనపడుతుంది. అల్పంగా స్రవించినందున పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అలాగే అధికంగా ద్రవాలు స్రవించినందున విపరీత వ్యతిరేకంగా ఫలితాలు వస్తుంటాయి. కనుక మనలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ, అవి ఏ శక్తి కేంద్రానికి సంబంధించినవో గమనిస్తూ, ఆ శక్తి కేంద్రాన్ని సక్రమమైన రీతిలో ఉత్తేజం చేయగల్గినప్పుడు విశేషమైన వస్తుంటాయి. కనుకనే ఆ శక్తి కేంద్రాల కథా కమామీషుతో పాటు, మానవ జీవనక్రమంలో సరియైన సమయంలో ఎలాంటి ఆహారాలను దైవీ, దేవతలకు నివేదించి, ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలో చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే ఈ దిగువ ఉన్న వీడియోలు.

కనుక లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ చక్రాలకు సంబంధించిన దేవతలకు ఏ నివేదన అందించాలి స్పష్టంగా ఉంది. ఈ చక్రాల ఆదిస్థాన గ్రహ వారాలలో... ఆ నివేదించిన ప్రసాదాలను మనం స్వీకరిస్తే పరోక్షంగా విశేష లబ్ధి కల్గుతుంది. అంతే కాదు ఒక్కో నక్షత్రం రోజున ఎలాంటి ఆహారం తీసుకోవాలి... నక్షత్ర  అధిపతి, వారాధిపతి, ఆనాడు ఏర్పడిన తిథిని బట్టి మానవాళి ఆస్వాదించాల్సిన ఆహార విహార వివరాలను పురాతన జ్యోతిష శాస్త్రం స్పష్టం చేసింది. కనుక రాబోయే రోజులలో తిథి, నక్షత్ర, వారాలతో పాటు భుజించవలసిన వివరాలను తెలుసుకుంటే రుగ్మతలకు దూరంగా ఉండటమే కాకుండా, ఉపయుక్తమైన విజ్ఞాన పరంపరను పొందగలమని చెప్పుటలో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు. - శ్రీనివాస గార్గేయ 




Saturday, August 29, 2015

మూల నక్షత్రంలో వర వర్షిని 2

నవగ్రహాలలోని చంద్రుడు, కుజుడు, రవి, బుధుడు అనబడే నాలుగు గ్రహాలు ప్రతి వ్యక్తిని అనుకూల స్థితుల లోనికి లేదా ప్రతికూల అంశాల లోనికి తీసుకుని వెళ్ళుటకు ఉపయుక్తమవుతుంటాయి. మనః కారకుడు చంద్రుడు. బుద్ది కారకుడు బుధుడు. ఆత్మ కారకుడు రవి. శరీరంలోని రక్త మాంసాలకు ప్రాతినిధ్యం వహించే గ్రహం కుజుడు.

సరియైన అవగాహనతో ప్రతి విషయాన్ని ఆలోచించి ఆకళింపు చేసుకుని సద్భావనతో ముందుకు వెళ్తుంటే విజయం వెన్నంటే ఉంటుంది. అలా కాక పూర్తి వ్యతిరేక ధోరణితో దుర్మార్గంలో పయనిస్తే.... ప్రారంభంలో ఏదో విజయం సాధించామనే నమ్మకం కల్గిననూ, దీర్ఘ కాలంలో సమస్యలకు హేతువై అపజయంతో కృంగిపోయి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినును. కనుక ప్రతి వ్యక్తికి అవగాహనతోటి ఆలోచనను అందించే చంద్రుని కట్టడి చేయాలంటే.... సామాన్యమైన పని కాదు. కనుక మనిషి జయాపజయాలకు ప్రధాన కారకుడు చంద్రుడే. ఈ చంద్రుడి స్వక్షేత్రమే కర్కాటక రాశి.

అలాగే బుద్ధి కారకత్వాన్ని ఇచ్చే గ్రహము బుధుడు. ఒక వ్యక్తి ఓ తప్పు చేస్తే బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను అంటాడు తప్ప మనసు గడ్డి తిని తప్పు చేశాను అనడు. ఇక్కడ బుద్ధికి మనసుకి వ్యత్యాసముంది. ఈ బుధుని యొక్క క్షేత్రాలే కన్య, మిథున రాశులు.

ఇక ఆత్మ కారకుడు రవి. మనసుకి ఆత్మకి కూడా చాలా వ్యత్యాసముంది. ఆత్మ మనసు బుద్ది కలయికలతో వ్యక్తి స్థితిగతులు మారుతుంటాయి. ఈ మారే ప్రభావాన్ని బట్టి వ్యక్తిలో రక్త ప్రసరణలో కూడా హెచ్చు తగ్గులు వస్తుంటాయి. ఈ రక్త ప్రసరణకు చేయూతనిచ్చే గ్రహం కుజుడు. గౌరవ ప్రదంగా మాట్లాడటానికి కుజుడు ఎంత దోహదపడతాడో... అహంకార పూరితంగా, ద్వేషంతో రగిలిపోవటానికి కూడా కుజుడు అంతే దోహదపడతాడు.

కనుక మనస్సు, బుద్ధి, చిత్తము, గౌరవ, అహంకారాలకు ప్రతీకలుగా ఉన్న చంద్రుడు, బుధుడు, రవి, కుజ గ్రహాల హెచ్చు తగ్గులను ఆహారపు అలవాట్లతో మార్చుకోవచ్చునని పురాతన శాస్త్రాలు ఉద్భోదిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ నాల్గు గ్రహాలను కట్టడి చేసే శక్తి యుక్తులు పొందగలరో .... ఆనాడే నిజ జీవితంలో విశేష విజయాలతో పాటు దీర్ఘాయువుని పొందుతూ ఆర్ధిక స్థితిని అందించే మూల నక్షత్ర వర వర్షిని శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహాన్ని కూడా పొందగలరు. మరి ఆహారపు నియమాలతోనే నాల్గు గ్రహాల కట్టడిని ఏ విధంగా పొందాలో తెలుసుకుంటే... ఆర్ధికంగా పరిపుష్టి నొందగలరు, సమాజంలో అభివృద్దిని సాధించగలరు. మూల నక్షత్ర వర వర్షిని రెండవ వీడియో ను కూడా కొద్ది సేపు వీక్షించటానికి ప్రయత్నించండి. - శ్రీనివాస గార్గేయ 

Friday, August 28, 2015

మూల నక్షత్రంలో వర వర్షిని

మూల నక్షత్రం అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఆశ్వీజ మాసంలోని సరస్వతీ పూజ.
మూలేషు స్థాపనం దేవ్యా పూర్వాషాఢా సుపూజనం|
ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్|| అను ధర్మసిందు గ్రంధానుసారం మూలా నక్షత్రంలో సరస్వతి దేవిని ఆవాహన చేసి పూర్వాషాడ నక్షత్రంలో విశిష్ట పూజలు గావించి శ్రవణా నక్షత్రంలో సరస్వతీ దేవిని విసర్జించాలి అని అర్థం.

అయితే శ్రవణా నక్షత్రంతో పూర్ణిమ కూడి ఉండే మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్ర సహోదరే శ్రీ మహాలక్ష్మి దేవి. ఈ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అనగా రెండవ శుక్రవారం ఆచరిస్తారు.

వాస్తవానికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మూల నక్షత్రం రోజే ఆచరించాలని పురాతన తాళపత్ర గ్రంధాలు పేర్కొన్నప్పటికీ... మూల నక్షత్రం వచ్చిన రోజున కొన్ని సార్లు శుక్రవారం వస్తుంటుంది. మరికొన్ని సార్లు ఇతర వారాలు వస్తుంటాయి. శ్రావణ మంగళ గౌరికి శ్రావణ మంగళవారాలు ప్రీతికరం కాగా... శ్రావణలక్ష్మి దేవికి శుక్రవారాలు పూజా కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. అందుచేత వారానికే ప్రాధాన్యత ఇచ్చి, పూర్ణిమ లోపల వచ్చే రెండవ శుక్రవారమే వరలక్ష్మి వ్రతంగా కేటాయిస్తారు.

రెండవ శుక్రవారం కాకుండా మూడవ శుక్రవారం కానీ, 1వ శుక్రవారం కాని, 4వ శుక్రవారం కాని, వరలక్ష్మి వ్రతం శాస్త్రీయంగా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన కూడా కొంతమందికి రావచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే దక్షిణాయనం లోని ఆరు మాసాలలో మూల నక్షత్రం పూర్ణిమకు ముందుగా వస్తుంటుంది. ఉత్తరాయనంలోని ఆరు మాసాలలో మూల నక్షత్రం పూర్ణిమ తదుపరి వస్తుంటుంది. ఉత్తరాయణాన్ని శక్తి (స్త్రీ దేవతా) సంబంధిత పూజాదులకు, దక్షిణాయనాన్ని శివ (పురుష దేవత) సంబంధ పూజాదులకు యోగ్యతగా ఉంటాయి.

ఇక రెండవ శుక్రవారాన్నే వరలక్ష్మి వ్రతానికి ఎందుకు తీసుకుంటున్నామంటే.... మూల నక్షత్రం రెండవ శుక్రవారం గాని... లేదా అటు ఇటు వస్తుందే తప్ప మిగిలిన మూడు శుక్రవారాలలో రానే రాదు. అందుచేతనే మూల నక్షత్ర వర వర్షిని వరలక్ష్మి తల్లిని... కేవలం శ్రావణ మాసంలోనే కాక ఇతర మాసాలలో వచ్చే మూల నక్షత్ర సుదినాలలో కూడా ఏయే నైవేద్యాలతో ఆరాధిస్తే, లక్ష్మి సహోదరుడైన చంద్ర స్థితి మానవాళికి ఏ విధంగా ఉపయోగపడునో.... పరోక్షంగా షట్చక్ర తత్వాలు, షట్చక్ర దేవతల నామాలు వారి నివేదనలు... శ్రీ లలిత సహస్రనామాలలో 98వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు అరవై నామాలలో 25 లైన్లలో 7 నివేదనలతో స్పష్టం చేయబడినవి.

కనుక శ్రీ మహాలక్ష్మి దేవి సహోదరుడైన చంద్రుడు... మనకు మామ, అదే చందమామ స్థితిగతులను బట్టే మానవాళి ప్రవర్తనా సరళి, ఆరోగ్య స్థితిగతులు, ఆర్ధిక బలాబలాలు, అంతరంగ రహస్యాలు మొదలైన ఎన్నో ఎన్నెన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఈ పరంపరలో అందరికీ ముఖ్యంగా కావాల్సింది ధనమూలం ఇదం జగత్. కనుక చంద్ర సహోదరి అయిన శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం సంపాదించాలి. అనేక రకాలైన లక్ష్మి అనుగ్రహ మార్గాలు ఉన్నప్పటికీ, లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పిన సప్త చక్ర దేవతలకు సప్త నివేదనలు ఇస్తూ.... ఆహారంతోనే చందమామను వశ పర్చుకొని ఆపైన చంద్ర సహోదరి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు.

చంద్రమాసమైన శ్రావణ పూర్ణిమ రోజే సోదరి సోదరునకు కట్టిన రక్షా బంధనంతో... సోదరి సోదరుల విడదీయరాని బంధం దిన దిన ప్రవర్ధమానమవుతూ... సూర్య మాసంగా ఉన్న కార్తిక (పూర్ణిమ సూర్య నక్షత్రమైన కృత్తిక కనుక) మాసంలో ఇదే సోదరి చేతితో చేసిన వంటతోనే సోదరుడు ప్రీతిగా భోజనం చేసే భగినీహస్తభోజనం గురించి మనకు తెలుసు. ఏతా వాత చెప్పొచ్చేది ఏమిటంటే మహాలక్ష్మి దేవి అనుగ్రహం కావాలంటే ప్రప్రధమంగా సోదరుడైన చంద్రుడి స్థితి బాగుండాలి. ఈ చంద్ర స్థితి మెరుగు కావాలంటే మూల నక్షత్రంలో తల్లికి నివేదించే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.

ఇట్టి మూల నక్షత్ర నైవేద్యాలు కథా, కమామీషు అంశాలకు సంబంధించిన ప్రవచనాన్ని 2015 ఆగష్టు 25 మంగళవారం మూల నక్షత్రం రోజున హైదరాబాద్ లోని స్కందగిరి దేవాలయానికి చేరువలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామీ సన్నిధిలో నాచే రెండుగంటల పాటు శ్రావణ లక్ష్మి వైభవం- మూల నక్షత్రంలో వర వర్షిని అనే శీర్షికన జరిగిన కార్యక్రమ వీడియో నాల్గు భాగాలలో ఉన్నది. కనుక తప్పక వీడియో ను దర్శించి మీ సన్నిహితులకు సమాచారం అందించగలరని మనః స్పూర్తిగా ఆశిస్తున్నాను. - శ్రీనివాస గార్గేయ 


Monday, June 29, 2015

శతాబ్దాల తదుపరి అరుదైన శుభగ్రహ దర్శనం

దాదాపు 800 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుత ఖగోళ గ్రహస్థితి 2015 జూలై 1 నుంచి జూలై 18 మధ్య రానున్నది. శ్రీ మన్మధ నామ సంవత్సర అధిక ఆషాఢమాస పూర్ణిమ బుధవారం 1 జూలై 2015 మూల నక్షత్రంతో గ్రహస్థితి ప్రారంభమై 18 జూలై శనివారం నిజ అధికమాసంతో గ్రహస్థితి పూర్తి కాబోతున్నది.

సూర్యుడు రాశి మారకుండా ఉన్న మాసాన్నే అధికమాసము అంటారు. ఈ అధికమాస పూర్ణిమ రోజున మూల నక్షత్రం వచ్చింది. ఇదేరోజు సాయంత్రం సూర్యాస్తమయం నుంచి రాత్రి 8 గంటల వరకు శుభగ్రహాలైన గురుగ్రహము, శుక్రగ్రహము కర్కాటకరాశిలో ఒకే బిందువు వద్ద ఉండి సాధారణ కన్నులతో వీక్షించటానికి అవకాశం ఉండేలా దర్శనమివ్వబోతున్నారు.  తిరిగి 18వ రోజున గురు, శుక్రులిద్దరూ మఘ నక్షత్రంలో నెలవంకతో కలిసి దర్శనమివ్వబోతున్నారు. 2015 జూలై 14 నుంచి సింహరాశిలోనికి గురు గ్రహప్రవేశం  చేయటంతో పవిత్ర గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. పుష్కరాలు ప్రారంభమైన అయిదవరోజునే సింహరాశిలో శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, చంద్రుడనే మూడు గ్రహాలూ సూర్యాస్తమయం నుంచి కేవలం ఒక రెండు గంటలపాటు ఒకే బిందు స్థానంలో దర్శనమిస్తారు.

మూల నక్షత్రంలో గ్రహస్థితి ప్రారంభమై మఘ నక్షత్రంతో గ్రహస్థితి ముగియనున్నది. ఈ 2 నక్షత్రాలు కేతు గ్రహ నక్షత్రాలు. కేతువు మోక్షకారకుడు. ధనుస్సు రాశి మూల నక్షత్రంతో ప్రారంభమగును. ధనుస్సు అనగా మూలాధారమునకు సంకేతము. కేతు నక్షత్రమైన మఘలోకి గురుగ్రహము రావటంతో శాస్త్రరీత్యా 'మఘాది పంచపాదేషు గురుసర్వత్ర నిందితః' అన్నందున వివాహాది శుభకార్యములు చేయకూడదు.

అయితే మూలతో ప్రారంభమై, మఘతో ముగిసే ఈ 18 రోజుల కాలము శతాబ్దాల తర్వాత వస్తున్న అద్భుత విశేష శుభగ్రహ వీక్షణ ఉన్న రోజులుగా భావించాలి. అందుచే ఈ 18 రోజులలో నిత్యం మూలాధార  చక్రానికి అధిపతిగా ఉన్న గణపతిని ప్రార్దిస్తూ, ఒక్కోరోజు ఒక్కో దేవతను ప్రార్ధించేలా.... 18 రోజులలో అష్టాదశ శక్తి పీఠాలలోని దేవతలందరినీ ప్రార్ధించినట్లయితే సకల శుభాలు కల్గుతాయని పురాతన తాళపత్ర గ్రంధాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా శతాబ్దాల తదుపరి పుష్కర సమయంలో జూలై 18వ తేది జరిగే అరుదైన విశేష అద్భుత గ్రహస్థితిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని జగన్మాత అనుగ్రహానికి పాత్రులు కాగలరని, ఈ నేపధ్యంలోనే 30 జూన్ 2015 మంగళవారం తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో నేను (శ్రీనివాస గార్గేయ) ఈ అద్భుత గ్రహస్థితిపై విశ్లేషనాత్మక వివరాలను అందిస్తున్నాను.

Sunday, April 5, 2015

72 నిముషాల సంపూర్ణ చంద్రగ్రహణ బింబం ఆశావాదానికి బాసట అవుతుందా?

ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది పలు మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. ఈ రోజున అందరూ ఏదో ఒక విషయంలో గానీ, అనేక విషయాలలో అసంతృప్తిని పొందుతూ, మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. ఈ మానసిక రుగ్మతలను ఆధునిక శాస్త్రజ్ఞులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. వీటన్నింటిలో అతి ముఖ్యమైన క్లిష్టమైన మానసిక రుగ్మత పేరే " యునిపోలార్ డిప్రెషన్". దీనినే ఎండోజీనియస్ డిప్రెషన్ అని కూడా అంటారు. భవిష్యకాలంలో దీని ప్రభావం ప్రజలందరి మీదా చాలా అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

అందరికీ జీవితం అంటే మహా తీపి. సుఖ సంతోషాలతో వీలైనంత ఎక్కువకాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ ఎన్నో నిరాశలు, మానసిక వ్యధలు, ఊహకందని పరిణామాలు, పరిస్థితులు తలెత్తటం, తద్వారా భయము, ఆందోళన పెరగటం.... దీనితో మానసిక వత్తిడి అధికం కావటం ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశం. చాలా మంది తమకు జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఏ విషయం కూడా సమయానికి గుర్తురావటం లేదని క్రుంగిపోతుంటారు. మరికొంత మంది తలచిన పనులు వ్యతిరేకంగా ఉంటున్నాయని, అనుకూల వాతావరణం కనుచూపు మేరలో కనపడటం లేదని భావిస్తుంటారు.

కాల గమనంలో అందరిలో అనేక గుర్తులు మరుగున పడిపోతున్నాయి. ఒక్కోసారి శాశ్వతంగా మాసిపోతుంటాయి. పాత అనుభవాలను ఎప్పుడైనా గుర్తు చేసుకొని సంతోషిద్దాం అనుకుంటే, అలాంటి సమయాలలో కూడా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.

నిత్య జీవితంలో రకరకాల పనులతో వత్తిడి, ఆందోళనలు అధికమై మానసికంగా క్రుంగి, జీవితంలో కష్టాలను, నష్టాలను, బాధలను, చిరాకులను అనుభవించే వారు ఎందరెందరో. నేర్పు, ఓర్పు, నిర్దుష్ట ప్రణాళిక, వ్యూహాత్మక పధకం మొదలైనవి.... మనిషి అలవాటు చేసుకొన్నప్పుడే, జీవితం ఎంతో సుసంపన్నంగా... ఆరోగ్యప్రదంగా... ఆనందంగా ఉంటుందని చెప్పటంలో సందేహం లేదు.

ఈ జీవనయానంలో మనిషి మనుగడకు మనసే ప్రధానమైనది. మనసనేది అతి క్లిష్టమైన ఓ వ్యవస్థ. ఈ మనస్సును.... ఈ మనిషి ఎప్పుడైతే నియంత్రించగలుగుతాడో, అప్పుడు సాధించలేనిదంటూ ఏదీ లేదు. మనస్సును ప్రశాంతంగా, తేలికగా ఉంచుకుంటూ, తాత్కాలిక మానసిక వత్తిడిని తగ్గించుకున్నప్పటికీ, వ్యక్తిత్వ వికాసానికి, మానసిక బలహీనతల నుండి శాశ్వత విముక్తిని సాధించటానికి ప్రతి వారికి... ఓ అవగాహన, సంసిద్ధత, పట్టుదల, కృషి ఎంతో అవసరం.

జ్యోతిషశాస్త్రంలో మనస్సుకు కారకత్వం వహించే గ్రహం చంద్రుడు. ఈ చంద్రుడు చంచలత్వంతో ఉంటాడు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలోకి వెళ్లి, విశేష స్థితులను అనుభవించినట్లుగా భ్రమపడి, ఓ మానసిక ఆనందాన్ని కొద్దిసేపు పొందవచ్చునేమో... కానీ వాస్తవ జగత్తులోనికి వచ్చినప్పుడు సమస్యలు, మానసిక వత్తిడి ఆందోళన అధికం కావటం, వాటి వలన శక్తి హీనులు కావటం, అనారోగ్యాన్ని ఆహ్వానించటం, వెంటవెంటనే తెలియకుండానే జరిగిపోతాయి.

మనలోని ఆలోచనలు ఎల్లప్పుడూ ఒకలా ఉండవు. కాసేపు ఆశావాదం వైపు పయనిస్తాయి. మరికొంతసేపు నిరాశావాదం వైపు ఆలోచనలు ప్రయాణం చేస్తాయి. ఏకకాలంలో ఈ రెండు రకాలైన ధోరణులు మన ఆలోచనలను ప్రభావితం చేయలేవు. ఈ రెండు ధోరణులలో ఒకటి మాత్రమే మనస్సులో మిగిలి ఉంటుంది. ఒకవేళ ఆశావాదం మిగిలింది అనుకుంటే... పిరికితనం లేకుండా, ధైర్యంగా వ్యవహరిస్తూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూ, సరికొత్త పధకాలను రూపొందించుకుంటూ, వైఫల్యాలను తట్టుకొని వాటిని అధిగమించే రీతిలో ముందుకు వెళ్ళటంతో అద్భుతమైన మానసిక శక్తి... చక్కని ఆరోగ్యం కల్గి, అనేక అంశాలలో విజయం సాధిస్తూ ఉంటుంటారు.

అలా కాకుండా ఈ మనస్సు నిరాశావాదం వైపు లాగితే... విచారము, భయము, ఆందోళన, నిరుత్సాహము, ఏదో తెలియని అనిశ్చితి, కాలు కదపకుండా అడ్డు తగిలే ఎన్నో వైఫల్యాలు మనోఫలకం మీద చిత్రీకరించబడుతుంటాయి. ఇట్టి నిరాశ, నిస్పృహలతో నడుస్తూ... నిర్ణీత కాలంలో కార్యాచరణ పధకాలను రూపుదిద్దుకోలేక అపజయాల నిచ్చెన పైన ఊగిసలాడుతూ ఉంటుంటారు.

ఈ ఆశావాదం, నిరాశావాదం మధ్యన మిగిలే సగటు మనిషి జీవితం కేవలం గ్రహసంచార స్థితిగతుల వలనే వస్తున్నాయా ? సూర్య చంద్ర గ్రహణాల ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నడా అని ఆలోచించి విశ్లేషిస్తే... కేవలం గ్రహ సంచారాలు మరియు గ్రహణాల ప్రభావాలే జీవకోటిని అట్టి స్థితిలోకి తీసుకువస్తున్నాయి అనేది నగ్న సత్యం. మరి మనః కారకుడైన చంద్రుడికి ఏప్రిల్ 4 నాటి సంపూర్ణ చంద్రగ్రహణ స్థితిలో... 5 నిముషాల పాటు సంపూర్ణ గ్రహణ బింబము ఏర్పడగా, రాబోయే భాద్రపద పూర్ణిమకు (2015 సెప్టెంబర్ 28) సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణ బింబము ఇప్పటికంటే 15 రెట్లు అధికంగా అనగా 72 నిముషాల పాటు మసక బారిన గ్రహణ బింబము దర్శనమిస్తుంది.


అత్యంత అరుదుగా వస్తున్న ఈ మన్మధ నామ సంవత్సర గ్రహ స్థితులను తట్టుకొని ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడే సగటు మనుషులకు పూర్తి స్థాయిలో ఊరటనొందే విధంగానే కాకుండా వాస్తవ జగత్తులో కూడా ఓ సరియైన, సముచితమైన, సహేతుకమైన, సదాచార, సంస్కృతి సంప్రదాయాన్ని సావధానంగా, సద్బుధ్ధితో, సత్ప్రవర్తనతో, సద్భావనతో సంస్కరించే సరళమైన పరిహార క్రమాన్ని సర్వులూ ఆచరిస్తుంటే... ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో నిలకడగా ఉంటూ, విజయబావుటాను ఎగరవేయగలడు. ముఖ్యంగా దీనికి కావాల్సింది విశ్వాసంతో కూడిన భక్తి, భక్తితో కూడిన శ్రద్ధ, శ్రద్ధతో కూడిన ఆచరణ అవసరం. ఇలాంటివి అన్నీ మీ సొంతం చేసుకోవాలి అంటే.... నేను చెప్పే ప్రతి విషయాలను సావధానంగా ఆకళింపు చేసుకోండి.

 సర్వేజనా సుఖినోభవంతు..... సమస్త సన్మంగళాని భవంతు

Saturday, April 4, 2015

సంపూర్ణ చంద్రగ్రహణం -మీనరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం ఈ రాశి జాతకులకు సప్తమ స్థానంలో సంభవిస్తున్నది. ఈ చంద్రగ్రహణ ప్రభావం జూలై 31 వరకు ఉండును. అయితే ఇదే మీనరాశిలో 2015 సెప్టెంబర్ 28న మరొక సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా సంభవించనున్నది. చైత్రపూర్ణిమ నాటి ఈ గ్రహణము (ఏప్రిల్ 4) కేవలం 5 నిముషాల పాటే గ్రహణ బింబము కనపడుతుండగా రాబోయే భాద్రపద పూర్ణిమ (సెప్టెంబర్ 28) నాటి సంపూర్ణ చంద్రగ్రహణము 72 నిముషాల పాటు గ్రహణ బింబము కనపడును. ఈ రెండు గ్రహణాల మధ్య అనగా జూలై 1న మీనరాశికి అధిపతిగా ఉన్న గురువు ఉచ్చ స్థితిలో ఉండి మరో శుభ గ్రహమైన శుక్రుడుతో కలిసి ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వబోతున్నారు.

కాబట్టి ప్రస్తుత గ్రహచార స్థితి గతులను బట్టి గ్రహణ ప్రభావం వివాహం అయిన వారికి త్వరలో వివాహం కాబోతున్నవారికి ఉండును. మీనరాశి జాతకులు ఎక్కువ సంయమనం పాటిస్తూ సమయస్పూర్తితో మాట్లాడుతూ ఆగ్రహావేశాలకు తావివ్వకుండా ఉండాలి. కొన్ని సందర్భాలలో కట్టలు తెంచుకొనే ఆవేశం పోర్లుతుంటుంది. కానీ అదుపుచేసుకొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదుపు చేసుకోకపోతే, ఆపైన భంగపడవలసివచ్చును. అడుసు తొక్కనేలా... కాలు కడగనేలా... అంటారు కొందరు. అక్కడ బురద తొక్కినప్పటికీ ఏదో ప్రకారంగా కాలిని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. అయితే నీరు అనవసరంగా వ్యర్ధం అవుతుంది. ఈ జల కారకుడే చంద్రుడు. ఈ చంద్రుడే మనస్సుకు కారకుడు.

బురద తొక్కినప్పుడు నీరు వృధా పోయినప్పటికీ కాలు శుభ్రపడింది. కానీ ఇక్కడ విపరీత ఆవేశాలకు వెళ్లినందున పరిస్థితి వ్యతిరేకంగానే ఉంటుందే తప్ప అనుకూల స్థాయిలోకి తిరిగి రావటం చాలా కష్టం. ఆవేశాన్ని ఇచ్చేవాడు కుజుడు. ఈ కుజుడిని ప్రేరేపించేవాడు మనః కారకుడు చంద్రుడు. కనుక చంద్రుడి ద్వారా శాంతి మాత్రమే నెలకొనేలా ఆలోచిస్తూ ఉంటుంటే  సమస్యలు రాకుండా చక్కని అనుకూల ఫలితాలు వస్తుంటాయి.  ఇలాంటి అనుకూల ఫలితాలను పొందాలంటే మీనరాశి జాతకులకి బుద్ధి కూడా సహకరించాలి.

ఇప్పుడు.... ఆ బుద్ధి కారకుడైన బుధుడే, మీనరాశిలో వక్రత్వంతో నీచపడిపోయాడు. కనుక తమంతట తాముగా కొని తెచ్చి పెట్టుకున్నట్లుగా ఎదుటివారిపై అభిమానంతో, ప్రేమతో, అచంచల భక్తితో ఉండేలా మసలుకొంటుంటే, ఈ జాతకులు విజయపంథాలో నడుచుటకు అవకాశం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఆవేశాన్ని దూరంగా ఉంచటమనేది ఈ నిమిషం నుంచే గమనించాలి.

కొన్ని కొన్ని సందర్భాలలో భార్యా, భర్తల మధ్య గతం నుంచి తగవులాటలు కాని, కోర్టులలో వ్యవహారాలూ జరగటం కానీ ఉంటూ ఉంటే.... ఇప్పటికైనా తేరుకొని బుద్ధి బలంతో, మనోబలంతో మంచి నిర్ణయాలు (తప్పు తమది అయినప్పటికీ, కానప్పటికీ) మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, వారి జీవితాలలో నవ వసంత శోభ వెళ్లి విరియగలదు.

మీనరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 5వ తేది మధ్యాహ్నం 12.49 నుంచి 7 రాత్రి 11.18 వరకు
మే 2 రాత్రి 7.36 నుంచి 5 ఉదయం 5.31 వరకు
మే 29 అర్ధరాత్రి 3.22 నుంచి జూన్ 1 మధ్యాహ్నం 1.04 వరకు
జూన్ 26 మధ్యాహ్నం 11.39  నుంచి 28 రాత్రి 9.44 వరకు
జూలై 23 రాత్రి 7.41 నుంచి 26 ఉదయం 6.37 వరకు అనుకూల సమయం కాదు.

వీటితో పాటు పూర్వాభాద్ర నక్షత్ర 4 వ పాద జాతకులు :
ఏప్రిల్ 13 ఉదయం 6.13 నుంచి 14 ఉదయం 4.47 వరకు,
ఏప్రిల్ 21 మధ్యాహ్నం 11.57 నుంచి 22 మధ్యాహ్నం 11.15 వరకు,
ఏప్రిల్ 30 అర్ధరాత్రి తదుపరి 3.46 నుంచి మే 2 ఉదయం 6.28 వరకు,
మే 10 మధ్యాహ్నం 11.57 నుంచి 11 ఉదయం 10.56 వరకు,
మే 18 రాత్రి 9.56 నుంచి 19 రాత్రి 9.04 వరకు,
మే 28 మధ్యాహ్నం 11.27 నుంచి 29 మధ్యాహ్నం 2.13 వరకు,
జూన్ 6 సాయంత్రం 5.32 నుంచి 7 సాయంత్రం 4.20 వరకు,
జూన్ 15 ఉదయం 6.27 నుంచి 16 ఉదయం 5.52 వరకు,
జూన్ 24 రాత్రి 7.28 నుంచి 25 రాత్రి 10.24 వరకు,
జూలై 3 రాత్రి 12.41 నుంచి 4 రాత్రి 10.56 వరకు,
జూలై 12 మధ్యాహ్నం 1.00 నుంచి 13 మధ్యాహ్నం 12.53 వరకు,
జూలై 21 అర్ధరాత్రి తదుపరి 3.11 నుంచి 23 ఉదయం 6.17 వరకు,
జూలై 31 ఉదయం 9.54 నుంచి అర్ధరాత్రి 12.00 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు :
ఏప్రిల్ 4 అర్ధరాత్రి 11.36 నుంచి 5 అర్ధరాత్రి తదుపరి 2.02 వరకు,
ఏప్రిల్ 14 ఉదయం 4.47 నుంచి అర్ధరాత్రి తదుపరి 2.55 వరకు,
ఏప్రిల్ 22 మధ్యాహ్నం 11.15 నుంచి 23 మధ్యాహ్నం 11.17 వరకు,
మే 2 ఉదయం 6.28 నుంచి 3 ఉదయం 8.44 వరకు,
మే 11 ఉదయం 10.56 నుంచి 12 ఉదయం 9.39 వరకు,
మే 19 రాత్రి 9.04 నుంచి 20 రాత్రి 8.46 వరకు,
మే  29 మధ్యాహ్నం 2.13 నుంచి 30 సాయంత్రం 4.31 వరకు,
జూన్ 7 సాయంత్రం 4.20 నుంచి 8 మధ్యాహ్నం 3.02 వరకు,
జూన్ 16 ఉదయం 5.52 నుంచి 17 ఉదయం 5.41 వరకు,
జూన్ 25 రాత్రి 10.24 నుంచి 26 రాత్రి 12.55 వరకు,
జూలై 4 రాత్రి 10.56 నుంచి 5 రాత్రి 9.07 వరకు,
జూలై 13 మధ్యాహ్నం 12.53 నుంచి 14 మధ్యాహ్నం 1.06 వరకు,
జూలై  23 ఉదయం 6.17 నుంచి 24 ఉదయం 9.06 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

రేవతి నక్షత్ర జాతకులు :
ఏప్రిల్ 5 అర్ధరాత్రి తదుపరి 2.02 నుంచి 7 ఉదయం 4.05 వరకు,
ఏప్రిల్ 14 అర్ధరాత్రి తదుపరి 2.55 నుంచి 15 రాత్రి 12.44 వరకు,
ఏప్రిల్ 23 మధ్యాహ్నం 11.17 నుంచి 24 మధ్యాహ్నం 12.0 వరకు,
మే 3 ఉదయం 8.44 నుంచి 4 ఉదయం 10.32 వరకు,
మే 12 ఉదయం 9.39 నుంచి 13 ఉదయం 8.07 వరకు,
మే 20 రాత్రి 8.46 నుంచి 21 రాత్రి 9.08 వరకు,
మే 30 సాయంత్రం 4.31 నుంచి 31 సాయంత్రం 6.14 వరకు,
జూన్ 8 మధ్యాహ్నం 3.02 నుంచి 9 మధ్యాహ్నం 1.41 వరకు,
జూన్ 17 ఉదయం 5.41 నుంచి 18 ఉదయం 6.02 వరకు,
జూన్ 26 రాత్రి 12.55 నుంచి 27 అర్థరాత్రి తదుపరి 2.50 వరకు,
జూలై 5 రాత్రి 9.07 నుంచి 6 రాత్రి 7.22 వరకు,
జూలై 14 మధ్యాహ్నం 1.06 నుంచి 15 మధ్యాహ్నం 1.44 వరకు,
జూలై  24 ఉదయం 9.06 నుంచి 25 మధ్యాహ్నం 11.25 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.


మరో నూతన అంశం తదుపరి పోస్టింగ్ లో

సంపూర్ణ చంద్రగ్రహణం - కుంభరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ చైత్రపూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం జూలై 31 వరకు కుంభరాశి జాతకులపై ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఈ సెప్టెంబర్ 28 నాటి మరో సంపూర్ణ చంద్రగ్రహణం ధన స్థానంలో సంభవించనుంది. ఆ గ్రహణము భారతదేశంలో కనపడకపోయినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఉంటూనే ఉంటుంది. ఆ గ్రహణం 72 నిముషాల పాటు సంపూర్ణ బింబముగా గోచరించును. నేటి గ్రహణము కేవలం 5 నిముషాలు మాత్రమే. ఈ రెండు గ్రహణాల మధ్య అనగా జూలై 1న ఆకాశంలో శుభ గ్రహాలైన గురు, శుక్రుల శుభ కలయిక జరగనుంది. కనుక ఇప్పటినుంచి కొన్ని కొన్ని ముఖ్య అంశాలలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటే పరోక్షంగా మంచి అనుకూల పరిస్థితులు రావటానికి అవకాశాలు ఉంటాయి.

ప్రస్తుత గ్రహణం అష్టమస్థానంలో అనగా అష్టమ చంద్రసంచార దోషం ఉండే సమయంలో సంభవిస్తున్నది. కాబట్టి మీ మనసులో ఉన్న అంశాలు ఇతరులకు చెప్పలేని కారణంగా సమస్యలు వస్తుంటాయి. అడగనిది అమ్మ అయినా పెట్టదు అంటారు. ఓ ఖచ్చిత నిర్ణయాలకు రావటం గానీ లేక ఖచ్చిత అంశాలపైన దృష్టి పెట్టటం కానీ లేదా వృత్తి, వ్యాపార, ఉద్యోగ, గృహ, వాహన, కుటుంబ విషయాలలో సరియైన ఖచ్చితత్వాన్ని తీసుకోలేని కారణంగా కూడా సమస్య రావచ్చును.

సహజంగానే కొంతమంది అనుకుంటుంటారు... ఖచ్చితంగా మాట్లాడితే సమస్య జటిలమవుతుందేమో అనే భయం ఉంటుంది. ఇక్కడ ఖచ్చితము అనే మాటకు అర్ధం వేరుగా తీసుకోవాలి. చంద్రగ్రహణం సంభవించేది అష్టమస్థానంలో చంద్రుని యొక్క నక్షత్రమైన హస్తలో. చంద్రుడు మనస్సుకు కారకుడు. కనుక మీ మనసులో ఉన్న విషయాన్ని దాపరికం లేకుండా బంధువులతో గానీ, కుటుంబ సభ్యులతో గానీ, మిత్రులతో కానీ, హితులతో కానీ విడమర్చి చెప్పినప్పుడు మాత్రమే.... మీకు కొంతభాగం న్యాయం విజయం చేకూరటానికి అవకాశాలు వస్తాయి. అలా కాక మనసులో ఒక అంశాన్ని పెట్టుకొని.... బుద్ధి పూర్వకంగా మరొక అంశాన్ని ఇతరులకు చెబితే పూర్తి నష్టాన్ని చవి చూస్తారు. ఎందుకంటే కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు మీకు ప్రస్తుతం ధన, కుటుంబ స్థానంలో వక్రంతో నీచపడి ఉన్నాడు. ఈ బుధుడే బుద్ధి కారకుడు. కనుక మనస్సు, బుద్ది అనే రెండింటిని నడిపించే బుధ, చంద్రులను మీరు పూర్తిగా అవగాహన చేసుకొని నడవాల్సిన అవసరం ఉన్నది.

సహజంగానే ప్రతి రాశికి అష్టమస్థానంలో చంద్రుడు సంచార సమయం ప్రతినెలా ఉంటుంది. ఈ అష్టమ చంద్రదోష సమయంలోనే... చంద్రుడికి సంపూర్ణ గ్రహణం సంభవిస్తున్నందున, సమస్యలు కేవలం మనస్సు, బుద్ది వల్లనే వస్తుంటాయి. కాబట్టి అనుకూల విషయాలో కావచ్చు, ప్రతికూల అంశాలలో కావచ్చు మనసులో ఉన్న మర్మాన్ని దాచిపెట్టి బుద్ధి పూర్వకంగా దాచిపెట్టి నడిచినందున సమస్యలు పెరుగుతాయే తప్ప తరగవు. 


ఈ పరంపరలో కుంభరాశి జాతకులు అన్నీ అంశాలలో (విద్య, ఉద్యోగ, ఆరోగ్య, గృహ, ధన, మాతృ, సంతాన, కుటుంబ, వాహన, భాతృ, పితృ) వెనకంజ వేయకుండా సరియైన మనస్సుతో సక్రమమైన బుద్ధితో ఉంటుంటే ఆ బుధ, చంద్రుల పరోక్ష విజయాలను పొందవచ్చు. ప్రస్తుతం ఉండే అష్టమ చంద్రుడు, వక్రంలోని నీచ బుధుడు ఇరువురు ఏమి చేయలేరు... కాబట్టి మీకు మీరుగా అలిసి సొలిసి ఉన్న నీచ బుధుడిని (బుద్ధిని) గట్టెక్కించి, అష్టమంలో గ్రహణం పట్టిన చంద్రునికి  (మనస్సుకి) సేద తీరేలా ప్రయత్నపూర్వకంగా ఆలోచనలు చేస్తూ పావులు కదుపుతూ ఉంటే విజయబాటలో పయనించగలరు.

కుంభరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ ఈ నిముషం నుంచి 5వ తేది మధ్యాహ్నం 2.02 వరకు తిరిగి
ఏప్రిల్ 30 ఉదయం 7.31 నుంచి మే 2 రాత్రి 7.36 వరకు
మే 27 మధ్యాహ్నం 3.10 నుంచి 29 అర్ధరాత్రి 3.22 వరకు
జూన్ 23 రాత్రి 11.08 నుంచి 26 మధ్యాహ్నం 11.39 వరకు
జూలై 21 ఉదయం 6.50 నుంచి 23 రాత్రి 7.41 వరకు అనుకూల సమయం కాదు.  


వీటితో పాటు ధనిష్ఠ నక్షత్ర 3,4 పాద జాతకులు :
ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

శతభిషా నక్షత్ర జాతకులు  :
ఏప్రిల్ 12 ఉదయం 7.11 నుంచి 13 ఉదయం 6.13 వరకు,
ఏప్రిల్ 20 మధ్యాహ్నం 1.18 నుంచి 21 మధ్యాహ్నం 11.57 వరకు,
ఏప్రిల్ 29 రాత్రి 12.47 నుంచి 30 అర్ధరాత్రి తదుపరి 3.46 వరకు,
మే 9 మధ్యాహ్నం 12.40 నుంచి 10 మధ్యాహ్నం 11.57 వరకు,
మే 17 రాత్రి 11.15 నుంచి 18 రాత్రి 9.56 వరకు,
మే 27 ఉదయం 8.25 నుంచి 28 మధ్యాహ్నం 11.27 వరకు,
జూన్ 5 సాయంత్రం 6.34 నుంచి 6 సాయంత్రం 5.32 వరకు,
జూన్ 14 ఉదయం 7.20 నుంచి 15 ఉదయం 6.27 వరకు,
జూన్ 23 సాయంత్రం 4.22 నుంచి 24 రాత్రి 7.28 వరకు,
జూలై 2 అర్థరాత్రి 2.15 నుంచి 3 రాత్రి 12.41 వరకు,
జూలై 11 మధ్యాహ్నం 1.27 నుంచి 12 మధ్యాహ్నం 1.00 వరకు,
జూలై 20 రాత్రి 12.03 నుంచి 21 అర్ధరాత్రి తదుపరి 3.11 వరకు,
జూలై 30 మధ్యాహ్నం 11.46 నుంచి 31 ఉదయం 9.54 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

పూర్వాభాద్ర నక్షత్ర 1,2,3 పాద జాతకులు :

ఏప్రిల్ 13 ఉదయం 6.13 నుంచి 14 ఉదయం 4.47 వరకు,
ఏప్రిల్ 21 మధ్యాహ్నం 11.57 నుంచి 22 మధ్యాహ్నం 11.15 వరకు,
ఏప్రిల్ 30 అర్ధరాత్రి తదుపరి 3.46 నుంచి మే 2 ఉదయం 6.28 వరకు,
మే 10 మధ్యాహ్నం 11.57 నుంచి 11 ఉదయం 10.56 వరకు,
మే 18 రాత్రి 9.56 నుంచి 19 రాత్రి 9.04 వరకు,
మే 28 మధ్యాహ్నం 11.27 నుంచి 29 మధ్యాహ్నం 2.13 వరకు,
జూన్ 6 సాయంత్రం 5.32 నుంచి 7 సాయంత్రం 4.20 వరకు,
జూన్ 15 ఉదయం 6.27 నుంచి 16 ఉదయం 5.52 వరకు,
జూన్ 24 రాత్రి 7.28 నుంచి 25 రాత్రి 10.24 వరకు,
జూలై 3 రాత్రి 12.41 నుంచి 4 రాత్రి 10.56 వరకు,
జూలై 12 మధ్యాహ్నం 1.00 నుంచి 13 మధ్యాహ్నం 12.53 వరకు,
జూలై 21 అర్ధరాత్రి తదుపరి 3.11 నుంచి 23 ఉదయం 6.17 వరకు,
జూలై 31 ఉదయం 9.54 నుంచి అర్ధరాత్రి 12.00 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో మీనరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

సంపూర్ణ చంద్రగ్రహణం - మకరరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ చైత్రపూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం 2015 జూలై 31 వరకు మకరరాశి జాతకులపై పరోక్షంగా ప్రభావం చూపుతుండును. ముఖ్యంగా ఈ రాశి జాతకులు తండ్రితో ఎలాంటి పేచీలు, కలహాలు ఇతర దుర్భాషలు మొదలైనవి లేకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్నిసార్లు పితృ నిర్ణయాలను తూ.చా తప్పకుండా పాటించేలా కూడా ఉండాలి. గ్రహణ ప్రభావంచే పలుమార్లు తండ్రికి, సంతానానికి మధ్య కొన్ని కొన్ని విషయాలలో బేధాభిప్రాయాలు రావచ్చును. లేదా మాట పట్టింపులు ఉండవచ్చును. ఆస్తి నిర్ణయాలలో ఏమైనా పొరపాట్లు జరగవచ్చును. లేదా ఋణ లావాదేవీల మధ్య కొన్ని సమస్యలు వచ్చి పూర్తి స్థాయిలో వ్యతిరేకతలు వచ్చేలా కూడా ఉండు సూచన కలదు.

సంతానం వయస్సు మరీ తక్కువగా ఉంటే అనగా 15 సంవత్సరాల లోపు ఉండి ఉంటే, ఒక్కోసారి వారు తమ తండ్రి మాటను ధిక్కరించి ఇతరుల నిర్ణయాలకే మొగ్గుచూపే అవకాశం ఉండవచ్చు. వయస్సు చిన్నదైనప్పటికీ గ్రహణ ప్రభావంచే తండ్రి చెప్పే మంచి మాటలు తలకెక్కవు. 15 నుంచి 35 వరకు ఉన్న వయస్సు వారు పితృ నిర్ణయాలను పూర్తిగా అన్నీ అంశాలలో (విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వివాహ, గృహ, సంతాన) విబేధిస్తూ ఉంటారు. కనుక దీనిని గమనించి జాతకులు మసలుకోవాలి. పూర్తిగా తండ్రితో విభేదించిన కారణంగా కూడా, జాతకులకు తండ్రి నుంచి సంప్రాప్తించే వనరులకు కొంత విఘాతం కల్గవచ్చు. కనుక ఆలోచన చేస్తూ నడవాల్సిన అవసరం ఉన్నది. 35 సంవత్సరాల పైబడిన ప్రతివారి విషయంలో మాత్రం కేవలం ఆస్తులు, అంతస్తులు.... నగ నట్రా విషయాలలోనే బేదాభిప్రాయాలు దొర్లు సూచన కలదు. ఇది గమనించి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి.

మరికొన్ని సందర్భాలలో తండ్రితో సమానముగా ఉన్న పినతండ్రి, పెదతండ్రి వారలతో కూడా మాట పట్టింపులు, బేధాభిప్రాయాలు, ధన సంబంధిత ఇచ్చి పుచ్చుకోవటాలపై ఆవేశాలు మొదలైనవి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి, చిన్నన్న, పెదనాన్న లేదా తల్లి యొక్క చెల్లెలి భర్త లేదా తల్లి యొక్క అక్క భర్తలతో కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి.

వృద్దులుగా ఉన్న తండ్రికి బిడ్డలకు మధ్య కూడా విషయం ఏదైనప్పటికీ, వ్యవహారం మాత్రం సామరస్యంగా ఉండకుండా ఆవేశాలతో ఉండే అవకాశం కలదు. కాబట్టి ఈ క్రింది తెలియచేసిన ప్రతికూల తేదీలలో మరింత జాగరూకతతో ఉంటుంటే పరిస్థితి అదుపు తప్పకుండా ఉండే అవకాశం ఉంది.

కనుక జాతకులు సామరస్య ధోరణికి అలవాటు పడాలి. సమస్య వస్తే రాజీ పడుతూ నడవాలి. ఆవేశాలకు వెళ్ళకుండా సమయస్పూర్తితో పావులు కదుపుతూ ఉంటుంటే గ్రహణ ప్రభావాన్ని అరికట్టవచ్చును. ముఖ్యంగా 2015 సెప్టెంబర్ 28న మరొక సంపూర్ణ చంద్రగ్రహణం జరగనున్నది. ఇది భారతదేశంలో కనపడకపోయినప్పటికీ, ఖగోళంలో మాత్రం 72 నిముషాల పాటు సంపూర్ణ బింబము ఉన్నందున ఈ రాశి జాతకులు తదుపరి పోస్టింగ్ లలో చెప్పే కొన్ని ముఖ్య పరిహారములను పాటిస్తూ ఉంటే మరింత ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈ చంద్రగ్రహణానికి, సెప్టెంబర్ 28 నాటి చంద్రగ్రహణానికి మధ్యలో అనగా జూలై 1న కనపడే గురు శుక్రుల శుభగ్రహ అనుగ్రహాన్ని పొందటానికి మకరరాశి జాతకులు ప్రయత్నించాలి. గ్రహభూమిలో త్వరలో చెప్పే పరిహారములను పాటిస్తూ ఉంటే గ్రహణ ప్రభావాలు దరికి చేరవు.

మకరరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :

ఏప్రిల్ 27 సాయంత్రం 6.38 నుంచి 30 ఉదయం 7.31 వరకు
మే 24 అర్ధరాత్రి తదుపరి 2.28 నుంచి 27 మధ్యాహ్నం 3.10 వరకు
జూన్ 21 ఉదయం 10.41 నుంచి 23 రాత్రి 11.08 వరకు
జూలై 18 సాయంత్రం 6.32 నుంచి 21 ఉదయం 6.50 వరకు వ్యతిరేక సమయము.

వీటితో పాటు ఉత్తరాషాఢ 2,3,4 జాతకులు :

ఏప్రిల్ 9 ఉదయం 6.52 నుంచి 10 ఉదయం 7.30  వరకు,
ఏప్రిల్ 17 రాత్రి 7.49 నుంచి 18 సాయంత్రం 5.23 వరకు,
ఏప్రిల్ 26 మధ్యాహ్నం 3.54 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు,
మే 6 మధ్యాహ్నం 12.41 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు,
మే 15 ఉదయం 4.35 నుంచి అర్థరాత్రి తదుపరి 5.42 వరకు,
మే 23 రాత్రి 12.03 నుంచి 24 అర్థరాత్రి తదుపరి 2.28 వరకు,
జూన్ 2 రాత్రి 7.51 నుంచి 3 రాత్రి 7.50 వరకు,
జూన్ 11 ఉదయం 10.59 నుంచి 12 ఉదయం 9.40  వరకు,
జూన్ 20 ఉదయం 8.31 నుంచి 21 ఉదయం 10.41 వరకు,
జూన్ 30 ఉదయం 4.31 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు,
జూలై 8 సాయంత్రం 4.20 నుంచి 9 మధ్యాహ్నం 3.08 వరకు,
జూలై 17 సాయంత్రం 4.25 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు,
జూలై 27 మధ్యాహ్నం 1.51 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

శ్రవణా నక్షత్ర జాతకులు :
ఏప్రిల్ 10 ఉదయం 7.30 నుంచి 11 ఉదయం 7.36  వరకు,
ఏప్రిల్ 18 సాయంత్రం 5.23 నుంచి 19 మధ్యాహ్నం 3.09 వరకు,
ఏప్రిల్  27 సాయంత్రం 6.38 నుంచి 28 రాత్రి 9.40 వరకు,
మే 7 మధ్యాహ్నం 1.04 నుంచి 8 మధ్యాహ్నం 1.03 వరకు,
మే 15 అర్థరాత్రి తదుపరి 5.42 నుంచి 16 అర్థరాత్రి 12.53 వరకు,
మే 24 అర్థరాత్రి తదుపరి 2.28 నుంచి 26 ఉదయం 5.20 వరకు,
జూన్ 3 రాత్రి 7.50 నుంచి 4 రాత్రి 7.22 వరకు,
జూన్ 12 ఉదయం 9.40 నుంచి 13 ఉదయం 8.26  వరకు,
జూన్ 21 ఉదయం 10.41 నుంచి 22 మధ్యాహ్నం 1.22 వరకు,
జూలై 1 ఉదయం 4.19 నుంచి అర్థరాత్రి తదుపరి 3.31  వరకు,
జూలై 9 మధ్యాహ్నం 3.08 నుంచి 10 మధ్యాహ్నం 2.09 వరకు,
జూలై 18 సాయంత్రం 6.32 నుంచి 19 రాత్రి 9.07 వరకు,
జూలై 28 మధ్యాహ్నం 1.52 నుంచి 29 మధ్యాహ్నం 1.09 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ధనిష్ఠ నక్షత్ర 1,2 పాద జాతకులు :
ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి  మకరరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో కుంభరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

సంపూర్ణ చంద్రగ్రహణం - ధనుస్సురాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ సంవత్సర చైత్రపూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంచే ధనూరాశి జాతకులు పూర్తి స్థాయిలో దైనందిన వ్యవహారాల మీద ఓ ఖచ్చితమైన ప్రణాళికా బద్ధంగా ఉండాలే తప్ప ఆశామాషీగా ఉండకూడదు. సూర్యోదయం లగాయితు రాత్రి పడుకొనే సమయం వరకు చేసే అన్నీ దైనందిన వ్యవహారాలూ.... ఆలోచనలకు తగ్గట్లుగా ఉంటుంటాయి అనుకోవటం పొరపాటు. తాము ఒకటి తలచిన, దైవం ఒకటి తలుచును అన్న చందాన తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, ఆరోగ్య, సంతాన, గృహ, ఋణ, శత్రు, ఆదాయ, వ్యయ, వాహన, బంధు మొదలైన అంశాలపై సరియైన శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. ఒక్కోసారి తమకు సంబంధం కాని వ్యవహారాల వైపు మక్కువ చూపుతూ, ఆరాటంతో తెలుసుకోవాలనే తపనతో ఉంటుంటారు. కనుక తాము చేయవలసిన పనులకే అధిక ప్రాధాన్యం ఇవ్వలే తప్ప ఎదుటివారు చేయవలసిన కార్యాల పైన ప్రాధాన్యత గాని, అజమాయిషీ గానీ, శాశించటం గానీ, తెలుసుకోవాలనే కుతూహలం కానీ ఉండకూడదు. కేవలం తనకు సంబంధించిన, తాను చేయదగిన, తాను చేయవలసి ఉన్న అంశాలలో మాత్రమే శ్రద్ధ అధికంగా ఉంచుతూ, ఎప్పటికప్పుడు తమ తమ కర్తవ్య నిర్వహణలను మరిచిపోకుండా పదే పదే.... తనకు తానే గుర్తుంచుకొనేలా ఉండాలే తప్ప, ఇతరుల వ్యవహారాల పైన మక్కువ ఉండకూడదు. దీనినే జ్యోతిష శాస్త్ర ప్రకారం రాజ్యభావము అంటారు.

ఈ రాజ్యభావానికి రాజు తాను కనుక, తాను మాత్రమే మంచి చెడులను గురించి మనసులో విశ్లేషించుకుంటూ ఉండాలి తప్ప... ఇతరుల ప్రమేయంతో లేక ప్రోత్సాహంతో చేయకూడదు. ఒక్కోసారి చేయవలసిన పనులు గుర్తురాక పోవటంచేత కూడా అవకాశాలు దెబ్బ తింటుంటాయి. మరికొన్ని సందర్భాలలో తక్షణం తాను వెళ్ళవలసిన సమయానికి ఏదో అడ్డు పడటము, కార్యక్రమం వాయిదా పాడటము జరుగును. కనుక ఈ వారంలో రేపటి నుంచి చేయవలసిన కార్యక్రమాలను ముందుగానే పేపర్ పై ఒక దానివెంట ఒకటి నోట్ చేసుకొని తగిన స్థాయిలో వాటిని సానుకూలత చేసే ప్రయత్నాల జోలికి వెళ్తుండాలి. ఇలా వెళ్ళే సమయంలో ప్రతికూలతలు ఎదురవుతాయేమోనని ముందే తగిన రీతిలో జాగ్రత్త పడాలి. జూలై 31 వరకు ఈ దోష ప్రభావం ఉంటుంటుంది.

ధనుస్సురాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :

ఏప్రిల్ 25 ఉదయం 7.16 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు
మే 22 మధ్యాహ్నం 3.58 నుంచి 24 అర్ధరాత్రి తదుపరి 2.28 వరకు
జూన్ 18 రాత్రి 12.44 నుంచి 21 ఉదయం 10.41 వరకు
జూలై 16 ఉదయం 8.32 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు వ్యతిరేక సమయము.

వీటితో పాటు మూల నక్షత్ర జాతకులు:
ఏప్రిల్ 15 అర్థరాత్రి 12.44 నుంచి 16 రా10.19 వరకు,
ఏప్రిల్ 24 12.06 నుంచి 25 మధ్యాహ్నం 1.40 వరకు,
మే 4 ఉదయం 10.32 నుంచి 5 మధ్యాహ్నం 11.51 వరకు,
మే 13 ఉదయం 8.07 నుంచి 14 ఉదయం 6.25 వరకు,
మే 21 రాత్రి 9.08 నుంచి 22 రాత్రి 10.15 వరకు,
మే 31 సాయంత్రం 6.14 నుంచి జూన్ 1 రా 7.21 వరకు,
జూన్ 9 మధ్యాహ్నం 1.41 నుంచి 10 మ12.20 వరకు,
జూన్ 18 ఉదయం 6.02 నుంచి 19 ఉదయం 6.58 వరకు,
జూన్ 27 అర్థరాత్రి తదుపరి 2.50 నుంచి 29 ఉదయం 4.02 వరకు,
జూలై 6 రాత్రి 7.22 నుంచి 7 సాయంత్రం 5.46 వరకు,
జూలై 15 మధ్యాహ్నం 1.44 నుంచి 16 మధ్యాహ్నం 2.49 వరకు,
జూలై 25 మధ్యాహ్నం 11.25 నుంచి 26 మధ్యాహ్నం 1.02 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

పూర్వాషాడ నక్షత్ర జాతకులు:

ఏప్రిల్ 8 ఉదయం 5.43 నుంచి 9 ఉదయం 6.52 వరకు
ఏప్రిల్ 16 రా10.19 నుంచి 17 రాత్రి 7.49 వరకు,
ఏప్రిల్ 25 మధ్యాహ్నం 1.40 నుంచి 26 మధ్యాహ్నం 3.54 వరకు,
మే 5 మధ్యాహ్నం 11.51 నుంచి 6 మధ్యాహ్నం 12.41 వరకు,
మే 14 ఉదయం 6.25 నుంచి 15 ఉదయం 4.35 వరకు,
మే 22 రాత్రి 10.15 నుంచి 23 రాత్రి 12.03 వరకు,
జూన్ 1 రా 7.21 నుంచి 2 రాత్రి 7.51  వరకు,
జూన్ 10 మ12.20 నుంచి 11 ఉదయం 10.59  వరకు,
జూన్  19 ఉదయం 6.58 నుంచి 20 ఉదయం 8.31 వరకు,
జూన్ 29 ఉదయం 4.02 నుంచి 30 ఉదయం 4.31  వరకు,
జూలై  7 సాయంత్రం 5.46 నుంచి 8 సాయంత్రం 4.20 వరకు,
జూలై 16 మధ్యాహ్నం 2.49 నుంచి 17 సాయంత్రం 4.25 వరకు,
జూలై 26 మధ్యాహ్నం 1.02 నుంచి 27 మధ్యాహ్నం 1.51  వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ఉత్తరాషాఢ 1వ పాదం జాతకులు :
ఏప్రిల్ 9 ఉదయం 6.52 నుంచి 10 ఉదయం 7.30  వరకు,
ఏప్రిల్ 17 రాత్రి 7.49 నుంచి 18 సాయంత్రం 5.23 వరకు,
ఏప్రిల్ 26 మధ్యాహ్నం 3.54 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు,
మే 6 మధ్యాహ్నం 12.41 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు,
మే 15 ఉదయం 4.35 నుంచి అర్థరాత్రి తదుపరి 5.42 వరకు,
మే 23 రాత్రి 12.03 నుంచి 24 అర్థరాత్రి తదుపరి 2.28 వరకు,
జూన్ 2 రాత్రి 7.51 నుంచి 3 రాత్రి 7.50 వరకు,
జూన్ 11 ఉదయం 10.59 నుంచి 12 ఉదయం 9.40  వరకు,
జూన్ 20 ఉదయం 8.31 నుంచి 21 ఉదయం 10.41 వరకు,
జూన్ 30 ఉదయం 4.31 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు,
జూలై 8 సాయంత్రం 4.20 నుంచి 9 మధ్యాహ్నం 3.08 వరకు,
జూలై 17 సాయంత్రం 4.25 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు,
జూలై 27 మధ్యాహ్నం 1.51 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి ధనుస్సురాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో మకరరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

సంపూర్ణ చంద్రగ్రహణం -వృశ్చికరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ నామ సంవత్సర చైత్ర పూర్ణిమ రోజున ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంచే ఈ రాశివారలు జూలై 31 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ, క్రింది తెలియచేసిన తేదీలలో మాత్రం మరికొంత అధికంగా జాగ్రత్తలు తీసుకొంటే ఉత్తమము. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఆలోచించే విధి విధానాలలో కానీ, లేదా ఆచరించే కార్యాలలో కానీ లేదా తాము ఆశించే ఆదాయ విషయాలలో కానీ..... అంచనాలకు తగినట్లుగా లబ్ధి ఉండదని గమనించాలి. ఉదాహరణకు ఓ కార్యక్రమం ద్వారా, తమకు 10,000 రూపాయలు సొమ్ము ఆదాయం ఉంటుందని అంచనా వేసి, శ్రద్ధతో విశేష పరిశీలనతో కార్యాన్ని సాగించినప్పటికీ చిట్ట చివరలో వచ్చిన లబ్ధిని గమనిస్తే, తమ అంచనాలు పూర్తిగా తారుమారై 10,000 రూపాయలు ఆదాయం రావలసి ఉంటే, అది రాకపోగా మరొకొన్ని వేల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశం అధికంగా ఉంది.

కనుక లాభార్జన విషయంలో స్పష్టత అనేది ఉండనే ఉండదు. అలాగే ఆచరించే కార్యములు గానీ, ఆలోచించే ప్రణాళికలు గానీ, పూర్తి స్థాయిలో స్పష్టతను ఇవ్వవు. తమకు తామే, ఏదో ఒక సమయంలో... ఇలాంటి కార్యాలను లేక ఆలోచనలను చేయకుండా ఉండి ఉంటే చాలా బావుండేది అని బాధపడాల్సి వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం వలన ప్రయోజనమేమి ఉండదు. ఏమి చేసినా... చేతులుకాలక మునుపే ఆలోచించాలి, ఆచరించాలి.

కేవలం ఆదాయం వచ్చే పనులపైనా, కీర్తి ప్రతిష్టలు వచ్చే కార్యాలపైన లేదా తన స్థితిని పెంచుకొనే హద్దులపైనా అధికంగా గ్రహణ ప్రభావం ఉండునని తెలుసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాలలో అవార్డులు, రివార్డులు వస్తున్నాయని యోచించే వారు, చివరి క్షణంలో నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ, వ్యవహారాలలో కూడా ప్రమోషన్ కోసం గాని లేదా బదిలీ వ్యవహారాలలో గానీ..... తమకు ప్రతికూలం గానే స్థితిగతులు ఉండే అవకాశం ఉంది. ఈ లబ్ధి అనే మాటను నిత్య జీవితంలో ఎన్నో అంశాల పైన వర్తింపచేసుకోవచ్చు. అంటే కేవలం ధనార్జన మాత్రమే లబ్దిగా భావించకూడదు. ఆరోగ్యం కావచ్చు, కుటుంబ ప్రతిష్ట కావచ్చు, తన ప్రవర్తనా సరళి కావచ్చు, లేదా ఇతర వ్యాపార వ్యవహార సరళికి సంబంధించిన అంశాలు కావచ్చు. ఇన్ని అంశాలపైన.... జాతకునకు అనుకూల ఫలితాల లేక ప్రతికూల ఫలితాల అని తెలుసుకోవాలి. అనుకూలాన్నే లబ్ధి అంటాము.


కనుక లబ్ధి నొసంగె పరిస్థితులలో, స్థాయి తగ్గే అవకాశాలు చాలా అధికము. కనుక తమకు ఎలాంటి లబ్ధి రావటం లేదని ముందే గ్రహించి రోజులు వెల్లబుచ్చుకోవాలి. అంతేకాని అంతవస్తుంది, ఇంతవస్తుంది, ఇక్కడ అక్కడా స్థాయి పెరుగుతుంది, ఇక మనకు తిరుగులేదు అని అనుకోవద్దు. ఊహించిన దానికంటే తక్కువగానే వాస్తవం ఉండుననే నగ్న సత్యాన్ని వృశ్చికరాశి వారాలు తెలుసుకొని, ఖర్చును ఏదో ప్రకారంగా తగ్గించుకుంటూ, వచ్చిన లబ్ధిని ప్రోగు చేసుకొనే విధంగా ఉండాలే తప్ప ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించి భంగపడవద్దు. తమకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అనే సూక్తిని కూడా ఈ జాతకులు గుర్తుంచుకోవాలి.

వృశ్చికరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 22 రాత్రి 11.14 నుంచి 25 ఉదయం 7.16 వరకు
మే 20 ఉదయం 8.55 నుంచి 22 మధ్యాహ్నం 3.58 వరకు
జూన్ 16 సాయత్రం 5.46 నుంచి 18 రాత్రి 12.44 వరకు
జూలై 13 రాత్రి 12.59 నుంచి 16 ఉదయం 8.32 వరకు వ్యతిరేక సమయము.

వీటితో పాటు విశాఖ 4 వ పాద జాతకులు :

ఏప్రిల్ 13 ఉదయం 6.13 నుంచి 14 ఉదయం 4.47 వరకు,
ఏప్రిల్ 21 మధ్యాహ్నం 11.57 నుంచి 22 మధ్యాహ్నం 11.15 వరకు,
ఏప్రిల్ 30 అర్ధరాత్రి తదుపరి 3.46 నుంచి మే 2 ఉదయం 6.28 వరకు,
మే 10 మధ్యాహ్నం 11.57 నుంచి 11 ఉదయం 10.56 వరకు,
మే 18 రాత్రి 9.56 నుంచి 19 రాత్రి 9.04 వరకు,
మే 28 మధ్యాహ్నం 11.27 నుంచి 29 మధ్యాహ్నం 2.13 వరకు,
జూన్ 6 సాయంత్రం 5.32 నుంచి 7 సాయంత్రం 4.20 వరకు,
జూన్ 15 ఉదయం 6.27 నుంచి 16 ఉదయం 5.52 వరకు,
జూన్ 24 రాత్రి 7.28 నుంచి 25 రాత్రి 10.24 వరకు,
జూలై 3 రాత్రి 12.41 నుంచి 4 రాత్రి 10.56 వరకు,
జూలై 12 మధ్యాహ్నం 1.00 నుంచి 13 మధ్యాహ్నం 12.53 వరకు,
జూలై 21 అర్ధరాత్రి తదుపరి 3.11 నుంచి 23 ఉదయం 6.17 వరకు,
జూలై 31 ఉదయం 9.54 నుంచి అర్ధరాత్రి 12.00 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

అనూరాధ నక్షత్ర జాతకులు :
ఏప్రిల్ 4 అర్ధరాత్రి 11.36 నుంచి 5 అర్ధరాత్రి తదుపరి 2.02 వరకు,
ఏప్రిల్ 14 ఉదయం 4.47 నుంచి అర్ధరాత్రి తదుపరి 2.55 వరకు,
ఏప్రిల్ 22 మధ్యాహ్నం 11.15 నుంచి 23 మధ్యాహ్నం 11.17 వరకు,
మే 2 ఉదయం 6.28 నుంచి 3 ఉదయం 8.44 వరకు,
మే 11 ఉదయం 10.56 నుంచి 12 ఉదయం 9.39 వరకు,
మే 19 రాత్రి 9.04 నుంచి 20 రాత్రి 8.46 వరకు,
మే  29 మధ్యాహ్నం 2.13 నుంచి 30 సాయంత్రం 4.31 వరకు,
జూన్ 7 సాయంత్రం 4.20 నుంచి 8 మధ్యాహ్నం 3.02 వరకు,
జూన్ 16 ఉదయం 5.52 నుంచి 17 ఉదయం 5.41 వరకు,
జూన్ 25 రాత్రి 10.24 నుంచి 26 రాత్రి 12.55 వరకు,
జూలై 4 రాత్రి 10.56 నుంచి 5 రాత్రి 9.07 వరకు,
జూలై 13 మధ్యాహ్నం 12.53 నుంచి 14 మధ్యాహ్నం 1.06 వరకు,
జూలై  23 ఉదయం 6.17 నుంచి 24 ఉదయం 9.06 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

జ్యేష్ట నక్షత్ర జాతకులు :
ఏప్రిల్ 5 అర్ధరాత్రి తదుపరి 2.02 నుంచి 7 ఉదయం 4.05 వరకు,
ఏప్రిల్ 14 అర్ధరాత్రి తదుపరి 2.55 నుంచి 15 రాత్రి 12.44 వరకు,
ఏప్రిల్ 23 మధ్యాహ్నం 11.17 నుంచి 24 మధ్యాహ్నం 12.0 వరకు,
మే 3 ఉదయం 8.44 నుంచి 4 ఉదయం 10.32 వరకు,
మే 12 ఉదయం 9.39 నుంచి 13 ఉదయం 8.07 వరకు,
మే 20 రాత్రి 8.46 నుంచి 21 రాత్రి 9.08 వరకు,
మే 30 సాయంత్రం 4.31 నుంచి 31 సాయంత్రం 6.14 వరకు,
జూన్ 8 మధ్యాహ్నం 3.02 నుంచి 9 మధ్యాహ్నం 1.41 వరకు,
జూన్ 17 ఉదయం 5.41 నుంచి 18 ఉదయం 6.02 వరకు,
జూన్ 26 రాత్రి 12.55 నుంచి 27 అర్థరాత్రి తదుపరి 2.50 వరకు,
జూలై 5 రాత్రి 9.07 నుంచి 6 రాత్రి 7.22 వరకు,
జూలై 14 మధ్యాహ్నం 1.06 నుంచి 15 మధ్యాహ్నం 1.44 వరకు,
జూలై  24 ఉదయం 9.06 నుంచి 25 మధ్యాహ్నం 11.25 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి వృశ్చికరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో ధనస్సురాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

సంపూర్ణ చంద్రగ్రహణం - తులారాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ సంవత్సర చైత్రపూర్ణిమకు కన్యారాశిలో ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం, తులారాశి వారిపై పరోక్ష ప్రభావాలను 2015 జూలై 31 వరకు చూపించును. ముఖ్యంగా తులారాశి జాతకులు తాము తలపెట్టే ముఖ్యకార్యములు గానీ లేక జరగవలసి ఉన్న నిశ్చయ కార్యక్రమాలు గానీ లేదా ఆర్ధిక సంబంధ లావాదేవీలు గానీ.... ఒక్కోసారి అనుకోకుండా ఇతర పరిస్థితుల ప్రభావంచే వీటిపై వ్యతిరేకతలు కలుగుతూ ఉండే సూచన కలదు. అనగా జరగవలసిన కార్యక్రమము, చిట్ట చివరి క్షణంలో వాయిదాపడటం గానీ లేదా ఆగిపోవటం గానీ లేక రద్దు చేయటం గానీ జరగవచ్చు.

అదేవిధంగా ధన విషయాలలో కూడా అనుకోకుండా ఖర్చులు రావటము, అనుకున్నదానికంటే అధికంగా ఖర్చవటము జరుగును. ఓ పద్ధతి ప్రకారంగా ధన లావాదేవీలలో చక్కగా ఆచరిస్తున్నప్పటికీ, తెలియకుండానే సొమ్ము వృధా కావటానికి అవకాశాలు వస్తుంటాయి. కొన్ని కొన్ని సమయాలలో ధనాన్ని తీసుకొని వెళ్ళే సమయంలో దుష్టులు చేసే కుటిల ప్రయత్నాలకు బలి కావటం గానీ లేదా తమకు తెలియకుండానే ప్రయాణాలలో కానీ, ఇతర ప్రాంతాలలో కానీ పొరపాటున సొమ్మును మరిచిపోయి వదిలిరావటం గానీ, చోరి కాకుండానే బ్యాగ్ ద్వారా లేక పాకెట్ ద్వారా గాని సొమ్ము పోవటం తటస్థించవచ్చు.

కొన్ని సందర్భాలలో, కొంత లాభం వస్తుందనే ఆశతో ఆస్తులను గానీ లేదా బంగారం గానీ కొంటూ ఉంటారు. కానీ గ్రహణ ప్రభావం చేత తాము కొన్న బంగారం గానీ, ఆస్తి గానీ, తిరిగి మరొకరికి విక్రయం చేయాలనుకుంటే, చాలా వరకు కొనిన ధర రాకపోగా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వస్తువులను గానీ, ఆస్తులను గానీ శాశ్వతంగా ఉంచుకోవాలనే తాపత్రయంతో ఉన్నవారైతే కొనవచ్చును. అలాకాక కొని కొంత లాభానికి తిరిగి అమ్ముదామనుకుంటే మాత్రం వడ్డీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితి తలెత్తును. ఇదే విధంగా షేర్ల వ్యాపారాలు చేసేవారు తొందరపడి కొనటాలు వద్దు. ధర పడిపోతున్న షేర్లు ఉంది ఉంటే, వాటిని ఏదో రూపకంగా అమ్ముకొని, కొంతకి కొంత సొమ్ము చేసుకొనండి.

మొత్తం మీద వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాలలో లేక ఇతర స్వయం ఉపాధి రంగాలలో కానీ... తాము ఆశించిన స్థాయి కంటే తక్కువ స్థాయిలోనే లబ్ధి ఉంటుందని గ్రహించాలి. ఈ క్రింది తెలియచేసిన తేదీలలో ఆదాయ, వ్యయాల విషయాలలో.... రాక ఎక్కడ ? పోక ఎక్కడ ? అనే అంశాలపైన దృష్టిని అధికంగా పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంటే, కొంతకి కొంత నష్ట శాతాన్ని అరికట్టే అవకాశం తప్పక ఉంటుందని భావించాలి.


తులారాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 20 సాయంత్రం 6.57 నుంచి 22 రాత్రి 11.14 వరకు
మే 18 ఉదయం 4.55 నుంచి 20 ఉదయం 8.55 వరకు
జూన్ 14 మధ్యాహ్నం 1.06 నుంచి 16 సాయత్రం 5.46 వరకు
జూలై 11 రాత్రి 7.20 నుంచి 13 రాత్రి 12.59 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.


వీటితో పాటు చిత్ర 3,4 పాద జాతకులు :
ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

స్వాతి నక్షత్ర జాతకులు :
ఏప్రిల్ 12 ఉదయం 7.11 నుంచి 13 ఉదయం 6.13 వరకు,
ఏప్రిల్ 20 మధ్యాహ్నం 1.18 నుంచి 21 మధ్యాహ్నం 11.57 వరకు,
ఏప్రిల్ 29 రాత్రి 12.47 నుంచి 30 అర్ధరాత్రి తదుపరి 3.46 వరకు,
మే 9 మధ్యాహ్నం 12.40 నుంచి 10 మధ్యాహ్నం 11.57 వరకు,
మే 17 రాత్రి 11.15 నుంచి 18 రాత్రి 9.56 వరకు,
మే 27 ఉదయం 8.25 నుంచి 28 మధ్యాహ్నం 11.27 వరకు,
జూన్ 5 సాయంత్రం 6.34 నుంచి 6 సాయంత్రం 5.32 వరకు,
జూన్ 14 ఉదయం 7.20 నుంచి 15 ఉదయం 6.27 వరకు,
జూన్ 23 సాయంత్రం 4.22 నుంచి 24 రాత్రి 7.28 వరకు,
జూలై 2 అర్థరాత్రి 2.15 నుంచి 3 రాత్రి 12.41 వరకు,
జూలై 11 మధ్యాహ్నం 1.27 నుంచి 12 మధ్యాహ్నం 1.00 వరకు,
జూలై 20 రాత్రి 12.03 నుంచి 21 అర్ధరాత్రి తదుపరి 3.11 వరకు,
జూలై 30 మధ్యాహ్నం 11.46 నుంచి 31 ఉదయం 9.54 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

విశాఖ నక్షత్ర 1,2,3 పాద జాతకులు :
ఏప్రిల్ 13 ఉదయం 6.13 నుంచి 14 ఉదయం 4.47 వరకు,
ఏప్రిల్ 21 మధ్యాహ్నం 11.57 నుంచి 22 మధ్యాహ్నం 11.15 వరకు,
ఏప్రిల్ 30 అర్ధరాత్రి తదుపరి 3.46 నుంచి మే 2 ఉదయం 6.28 వరకు,
మే 10 మధ్యాహ్నం 11.57 నుంచి 11 ఉదయం 10.56 వరకు,
మే 18 రాత్రి 9.56 నుంచి 19 రాత్రి 9.04 వరకు,
మే 28 మధ్యాహ్నం 11.27 నుంచి 29 మధ్యాహ్నం 2.13 వరకు,
జూన్ 6 సాయంత్రం 5.32 నుంచి 7 సాయంత్రం 4.20 వరకు,
జూన్ 15 ఉదయం 6.27 నుంచి 16 ఉదయం 5.52 వరకు,
జూన్ 24 రాత్రి 7.28 నుంచి 25 రాత్రి 10.24 వరకు,
జూలై 3 రాత్రి 12.41 నుంచి 4 రాత్రి 10.56 వరకు,
జూలై 12 మధ్యాహ్నం 1.00 నుంచి 13 మధ్యాహ్నం 12.53 వరకు,
జూలై 21 అర్ధరాత్రి తదుపరి 3.11 నుంచి 23 ఉదయం 6.17 వరకు,
జూలై 31 ఉదయం 9.54 నుంచి అర్ధరాత్రి 12.00 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులందరూ, వారి దేశకాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో వృశ్చికరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు