ప్రపంచ చరిత్ర పేజీలలో కన్నీటి సిరాతో విషాదాక్షరాలను కొన్ని కొన్ని రోజులు లిఖిస్తుంటాయి. ఇప్పటి వరకు సంభవించిన కొన్ని భయానిక ప్రకృతి ఉత్పాతాలు పరిశీలిస్తుంటే కొంతమంది... క్యాలెండర్ తేదిలలో 26 వరల్డ్ వరస్ట్ డే గా గుర్తించాలి అంటుంటారు. ఇక వివరాలలోకి వస్తే 26 జూన్ 1926న ఆసియన్ టర్కీగా పిలుచుకొనే ఆంటోలియాలోని రోడ్స్ నగరంలో భూకంపం విలయ తాండవం చేసింది. 26 డిసెంబర్ 1939 టర్కీలో పెను భూకంపం సంభవించింది. 26 జూలై 1963లో యుగోస్లేవియా భూకంపం వచ్చి ఆరువేల మంది మరణిస్తే, 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 26 జూలై 1976న చైనాలో అత్యంత దారుణ భూకంపం సంభవించి రెండున్నర లక్షల మంది మరణించారు. 26 డిసెంబర్ 1996లో హిందూ మహా సముద్రంలో పుట్టిన సునామి దెబ్బకు నాల్గుదేశాలలో రెండులక్షల మంది మరణించారు. 26 జనవరి 2001న గణతంత్ర దినోత్సవాన గుజరాత్ భూకంపంతో పాతికవేల మందికి పైగా మరణించారు. 26 డిసెంబర్ 2003 ఇరాన్ భూకంపంలో ముప్పై వేలమంది పైన చనిపోయి బూమ్ నగరాన్నే భూకంపం భూమిలో కలిపేసింది. 26 డిసెంబర్ 2004 ఇండోనేషియాలోని సుమత్రా దేవీలలో సునామి ఎగిసిపడి దాదాపు మూడులక్షల మందిని పొట్టన పెట్టుకుంది. 26 జూలై 2005న ప్రకృతి వైపరీత్యాలతో ముంబైలో భారీ వరదలు సంభవించాయి. 26 ఫిబ్రవరి 2010 లో కూడా జపాన్లో భూకంపం సంభవించి ఆస్తి నష్టం జరిగింది. 26 జూలై 2010 తైవాన్ భూకంపంతో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 26 ఏప్రిల్ 2015 నేపాల్ భూకంపం షుమారు పదివేలమందిని చంపింది. నిన్న కాక మొన్న 26 అక్టోబర్ 2015న హిందూ కుష్ పర్వత ప్రాంతాలలో సంభవించిన భూకంపం దెబ్బకు ఆఫ్ఘన్, పాకిస్తాన్లు వణికిపోయాయి.
పైన చెప్పిన భూకంపాలన్నీ 26వ తేదీనే వచ్చినటువంటివి. ఇవి కాక ఇతర తేదిలలో కూడా పెను భూకంపాలు వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది. కేవలం 26వ తేది మాత్రమే భయపెట్టే సంఖ్యగా భావించేవారు ఎందరెందరో ఉంటారు. యాదృచ్చికంగా ఈ తేది సంభవించింది. గ్రహచార స్థితిగతులు, ఇతర అరిష్ట యోగాలు ఉన్నప్పుడే ప్రకృతి సంబంధిత ఉత్పాతాలు వస్తుంటాయి. కనుక 26వ తేది దోషమని, ఈ అంకె కలిపితే 8 సంఖ్య వస్తుందని, 8 అంటే శని గ్రహ సంకేతమని, 8 సంబంధిత తేదీలు,సమస్యలు వస్తాయని భయపడే వారు చాలా మంది ఉంటుంటారు. కనుక భవిష్య కాలంలో వచ్చే 26వ తేదిను గురించి భయం చెందవద్దు. - శ్రీనివాస గార్గేయ

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.