Sunday, May 13, 2012

గోధుమపిండి దీపారాధనతో రక్షాకవచాలకు పూజ

అంచలంచలుగా 9 కలశపూజలను పూర్తి చేసుకున్నారు కదా . ఇప్పుడు మీ వద్ద వస్త్ర రూపంలో ఉన్నవి 7 రక్షాకవచాలు.
1 . స్వస్తిక్ రక్షా వస్త్ర కవచము
2 . షోడశ బిందు త్రిభుజ వస్త్ర కవచము
3 . శ్రీం బీజ
రక్షా వస్త్ర కవచము
4 .
హ్రీం బీజ రక్షా వస్త్ర కవచము
5 . ఐం బీజ రక్షా వస్త్ర కవచము
6 .
గం బీజ రక్షా వస్త్ర కవచము
7 . ఓం బీజ రక్షా వస్త్ర కవచము
ఇవి కాక లోహ రూపంలో ఉన్న నాణెము లేక నాణెములు. మరియు ఎరుపు దారంతో ఉన్న 11 పోగుల సూత్రము.
2012 మే 15 మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు కాని,
లేదా 
2012 మే 17 గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు లేదా
2012 మే 26 శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపున...
పై తొమ్మిది రక్షాకవచాలకు ప్రత్యేకమైన పూజను నిర్వర్తించుకోవాలి.  పూజానంతరం activation ఉండదు.

పూజ విధానము
  • గృహం లోని ఈశాన్య భాగంలో కాని లేక ఈ ఇతర భాగంలో కాని మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి.
  • ఓ పీట వుంచి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరవండి. దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి.
  • దీపారాధన చేయాలి. ఈ దీపారాధన ప్రత్యేక పద్దతిలో ఉంటుంది.
  • పొట్టు ఉన్న గోధుమపిండి 100 గ్రాములు తీసుకోండి. దానికి దంచిన బెల్లాన్ని కలిపి చపాతి పిండిలా చేయాలి. 
  • ఈ గోధుమపిండిని దీపం వెలిగించటానికి 2 ప్రమిదలుగా చేసుకోండి.
  • ఈ ప్రమిదలలో మధ్య వత్తి వేసి వెలిగించండి. ఆవునెయ్యి లేక కొబ్బరి నూనెను ఉపయోగించండి. దిగువ చూపిన చిత్రంలోలా పీటకు రెండు వైపులా తమలపాకు వేసి, ఆకుపై దీపాన్ని ఉంచుకోండి.
  • మీకు అందుబాటులో లభించిన పుష్పములను వినియోగించండి.
  • బియ్యంపైన స్వస్తిక్ రక్షాకవచాన్ని వుంచండి.
  • స్వస్తిక్ పై షోడశ త్రిభుజ రక్షాకావచాన్ని ఉంచండి. స్వస్తిక్ దిగువన ఉన్న వస్త్రపు కోణము మీ వైపుకు ఉండేలా పెట్టుకోండి.
  • అలాగే త్రిభుజ కోణము మీ వైపుకు ఉండేలా, స్వస్తిక్  పై వేయండి.
  • షోడశ బిందు త్రిభుజ రక్షా కవచం పై,  'శ్రీం' అనే బీజ రక్షాకవచాన్ని ఉంచండి.
  • శ్రీం బీజ  రక్షాకవచం పై "హ్రీం" బీజ  రక్షాకవచాన్ని వుంచండి.
  • హ్రీం బీజ  రక్షాకవచం పై "ఐం" బీజ  రక్షాకవచాన్ని వుంచండి.
  • ఐం బీజ  రక్షాకవచం పై "గం" బీజ  రక్షాకవచాన్ని వుంచండి.
  • గం బీజ  రక్షాకవచం పై "ఓం" బీజ  రక్షాకవచాన్ని వుంచండి.
  •  ఆపైన "ఓం" బీజ రక్షాకవచం మధ్యలో కుంకుమ పడకుండా ఉండుటకై వెండి పళ్ళెం కాని లేక కొన్ని తమలపాకులను పరిచి దానిపై నాణెము, లేక నాణెములను ఉంచండి. కుంకుమ పూజ చేయునపుడు కుమ్కుమంతయూ ఓం రక్షా కవచంపై పడకుండా ఉండుటకై వెండి పళ్ళెం లేక తమలపాకులను ఉంచుకొన్నాము.
  • 11 పోగులతో చేసిన ఎరుపు రంగు సూత్రాన్ని ఒక నాణేనికి జాగ్రత్తగా చుట్టండి. లేదా సూత్రాన్ని జాగ్రత్తగా చుట్టి (చిక్కుపడకుండా) నాణెం పక్కన ఉంచండి.
  • తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని శ్రీ గణపతిని ప్రార్దించండి. ( పసుపు గణపతిని అవసరం లేదు )
  • ఆపై లలితాసహస్ర నామలోని ధ్యాన శ్లోకాలలో రెండవ శ్లోకాన్ని పఠి౦చండి.
శ్లో. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం
అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం
(ఓ పుష్పాన్ని తీసుకొని పై శ్లోకం చదువుతూ భక్తితో... పుష్పాన్ని నాణెంపై  ఉంచండి. )
 
తదుపరి శ్రీ లలితా సహస్రనామావళి లోని ఈ దిగువ నామాలను పఠి౦చి, అక్షతలను నాణెము, సూత్రాలపై వేయండి. లేదా కుంకుమతో నామాలు చదువుతూ పూజించండి.

1. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః  సహస్రనామాలలో 10 వ నామం
2. ఓం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః - 28 వది
3. ఓం మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితాయై నమః  40 వది
4. ఓం మరాళీమందగమనాయై నమః  సహస్రనామాలలో 47 వ నామం
5. ఓం మహాలావణ్యశేవధయే నమః  సహస్రనామాలలో 48 వ నామం
6. ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః  సహస్రనామాలలో 59 వ నామం
7. ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధ తోషితాయై నమః  75 వ నామం
8. ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః  78 వ
ది
9. ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసుర సైనికాయై నమః
సహస్రనామాలలో 81 వ నామం
 

10. ఓం మణిపూరాంతరుదితాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 101 వ నామం
11. ఓం మహాశక్త్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 109 వ నామం
12. ఓం మదనాశిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 159 వ నామం
13. ఓం మమతాహంత్ర్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 165 వ నామం
14. ఓం మనోన్మన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 207 వ నామం
15. ఓం మాహేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 208 వ నామం
16. ఓం మహాదేవ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 209 వ నామం
17. ఓం మహాలక్ష్మ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 210 వ నామం
18. ఓం మృడప్రియాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 211 వ నామం
 

19. ఓం మహారూపాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 212 వ నామం
20. ఓం మహాపూజ్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 213 వ నామం
21. ఓం మహాపాతకనాశిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 214 వ నామం
22. ఓం మహామాయాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 215 వ నామం
23. ఓం మహాసత్త్వాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 216 వ నామం
24. ఓం మహాశక్త్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 217 వ నామం
25. ఓం మహారత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 218 వ నామం
26. ఓం మహాభోగాయై నమః  
శ్రీ లలిత సహస్రనామాలలో 219 వ నామం
27. ఓం మహైశ్వర్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 220 వ నామం
 

28. ఓం మహావీర్యాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 221 వ నామం
29. ఓం మహాబలాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 222 వ నామం
30. ఓం మహాబుద్ధయే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 223 వ నామం
31. ఓం మహాసిద్ధయే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 224 వ నామం
32. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 225 వ నామం
33. ఓం మహాతంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 226 వ నామం
34. ఓం మహామంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 227 వ నామం
35. ఓం మహాయంత్రాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 228 వ నామం
36. ఓం మహాసనాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 229 వ నామం
 

37. ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 230 వ నామం
38. ఓం మహాభైరవపూజితాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 231 వ నామం
39. ఓం మహేశ్వరమహా కల్పమహా తాండవసాక్షిణ్యై నమః
సహస్రనామాలలో 232 వ నామం
40. ఓం మహాకామేశమహిష్యై నమః  
సహస్రనామాలలో 233 వ నామం
41. ఓం మహాత్రిపురసుందర్యై నమః 
సహస్రనామాలలో 234 వ నామం
42. ఓం మహాచతుషష్టికోటియోగినీ గణసేవితాయై నమః 
సహస్రనామాలలో 237 వ నామం
43. ఓం మనువిద్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 238 వ నామం
44. ఓం మధ్యమాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 370 వ నామం
45. ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః  
403 వ నామం
 

46. ఓం మదశాలిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 431 వ నామం
47. ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 432వ నామం
48. ఓం మదపాటలగండభువే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 433 వ నామం
49. ఓం మాలిన్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 455 వ నామం
50. ఓం మాత్రే నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 457 వ నామం
51. ఓం మలయాచలవాసిన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 458 వ నామం
52. ఓం మహావీరేంద్రవరదాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 493 వ నామం
53. ఓం మణిపూరాబ్జనిలయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 495 వ నామం
54. ఓం మాంసనిష్ఠాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 500 వ నామం

55. ఓం మధుప్రీతాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 510 వ నామం
56. ఓం మజ్జాసంస్థాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 524 వ నామం
57. ఓం మహాప్రళయ
సాక్షిణ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 571 వ నామం
58. ఓం మాధ్వీపానాలసాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 575 వ నామం
59. ఓం మత్తాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 576 వ నామం
60. ఓం మాతృకావర్ణరూపి
ణ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 577 వ నామం
64. ఓం మహాకైలాసనిలయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 578 వ నామం
62.
ఓం మహనీయాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 580 వ నామం
63. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 582 వ నామం
 

64. ఓం మహావిద్యాయై నమః   శ్రీ లలిత సహస్రనామాలలో 584 వ నామం
65. ఓం మాయాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 716 వ నామం
66. ఓం మధుమత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 717 వ నామం
67. ఓం మహ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 718 వ నామం
68. ఓం మహేశ్వర్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 750 వ నామం
69. ఓం మహాకాళ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 751 వ నామం
70. ఓం మహాగ్రాసాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 752 వ నామం
71. ఓం మహాశనాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 753 వ నామం
72. ఓం మహత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 774 వ నామం
 

73. ఓం మందారకుసుమప్రియాయై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 776 వ నామం
74. ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 785 వ నామం
75. ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 786 వ నామం
76. ఓం మంత్రసారాయై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 846 వ నామం
77. ఓం మనస్విన్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 930 వ నామం
78. ఓం మానవత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 931 వ నామం
79. ఓం మహేశ్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 932 వ నామం
80. ఓం మంగళాకృత్యై నమః 
శ్రీ లలిత సహస్రనామాలలో 933 వ నామం
81. ఓం మనోమయ్యై నమః  శ్రీ లలిత సహస్రనామాలలో 941 వ నామం
పై నామాలతో పాటుగా ఈ దిగువ ఇచ్చిన 21 శ్లోకాలను కూడా భక్తీతో, విశ్వాసంతో చేతులు జోడించి పఠి౦చండి.

 ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా


నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్ భూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


ఓం యా దేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు శ్రద్దారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

 
ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఓం యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
 
తదుపరి ధూప, దీప, నైవేద్య, కర్పూర నీరాజనాలను అందించండి. నైవేద్యానికి మీకు తోచిన నివేదనను ఇవ్వండి.
పూజ కార్యక్రమం పూర్తైన చివరలో జగన్మాతను మనస్పూర్తిగా ప్రార్దించండి. తదుపరి సూత్రము చుట్టిన నాణెమును లేక సూత్రమును కదపండి.
కుంకుమను రెండవరోజు భద్రపరచుకోండి.  లేదా అక్షతలను భద్రపరచుకోండి. కుంకుమను నిత్యం ధరించవచ్చును. అక్షతలను నిత్యం స్నానాంతరం శిరస్సు పై 5 అక్షతలను ఉంచుకోండి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందిపై అక్షతలను వేసుకోండి. తొమ్మిది రక్షాకవచాలను విడివిడిగా తీసి మడిచి ఒక అట్ట పెట్టెలో కాని లేక మరొక దానిలో గాని భద్రపరచుకోండి. అలాగే నాణెమును, సూత్రాన్ని కూడా అదే పెట్టెలోనే భద్రపరచుకోండి. పై పూజ కార్యక్రమాన్ని మాసానికి ఒకసారి గాని లేక ఆరు మాసాలకు ఒకసారి గాని లేక సంవత్సరానికి ఒకసారి గాని ఆచరిస్తూ ఉండండి . అవకాశం ఎప్పుడుంటే అప్పుడు ఆచరించండి. సంవత్సరానికి ఇన్ని సార్లు ఆచరించాలి అనే నియమం లేదు. గోధుమపిండితో చేసిన దీపపు ప్రమిదలను ప్రసాదం గానే కుటుంబంలోని వారందరూ స్వీకరించండి. అందులోని వత్తులను విసర్జించండి. పై నామాలతో పూజ కార్యక్రమం చేసే ప్రతి సారి పొట్టు ఉన్న గోధుమపిండిని ఉపయోగించాలి.
మాములు రోజులలో కూడా స్వస్తిక్ కవచాన్ని పూజ మందిరంలో ఉంచి దానిపై వరుస కవచాలను ఉంచి పైన నాణెము, సూత్రాలను ఉంచి మాములుగా కూడా ధ్యానిన్చుకోవచ్చును. నామాలు లేకుండా మాములుగా పూజ మందిరంలో ఉంచి ధ్యానించుకుంటే గోధుమపిండితో చేసిన దీపాలు అవసరం లేదు. తిరిగి వెంటనే వాటిని భద్రపరచుకోనేది.
పిల్లల హాల్టికెట్లు గాని, రిజర్వేషన్ టికెట్లు గాని, నెలసరి జీతం గాని, నూతన ఆభరణాలు కాని.... ఉన్నప్పుడు వాటిని కవచాలను వరుసగా ఉంచి పైన నాణెము, సూత్రము ఉంచి ఆపైన హాల్టికెట్లు, రిజర్వేషన్ టికెట్లు, నెలసరి జీతం, నూతన ఆభరణాలు, నూతన డాకుమెంట్స్ ఏమైనా ఉంచుకోవచ్చును. తిరిగి తీసుకొనేది. పై ప్రకారంగా మహా కాళీ, మహా లక్ష్మి, మహా సరస్వతుల అనుగ్రహాన్ని పొందండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.