సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు తద్వారా తుఫానుల వివరాలను వాతావరణశాఖ వారు ఒక వారం రోజుల ముందుగా తెలియచేస్తుంటారు. కాని భూకంపములను మాత్రం ఒక సెకను ముందుగా కూడా తెలియచేయలేదు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యములను జ్యోతిష్యరీత్యా తెలుసుకోవచ్చు.
ఈ విషయంలో మా కాలచక్ర పంచాంగం మరియు గ్రహభుమి పంచాంగాలలో ప్రకృతి వైపరీత్యములను ప్రకటించటం జరిగింది. హైదరాబాద్ లో పలు టీవీ చానల్స్ లో హేతువాదులతో భూకంప సమయాలను తెలపటం జరిగింది. వికృతి నామ సంవత్సర కాలచక్ర పంచాంగంలో 41 పేజిలో 2 పేరాలో ఈ రోజు సంభవించిన వివరాలను ఇచ్చాము. అలాగే గ్రహభూమి బ్లాగ్ లో కూడా 2010 మార్చ్ నెల 19 నాటి శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు - 2లో 8వ పేరాలో ముందుగానే తెలియచేయటం జరిగింది. ఇప్పటికైనా హేతువాదులు సిగ్గుతో తలవంచుకొనవలసిన అవసరం వుందని తెలియచేస్తున్నాను. - శ్రీనివాస గార్గేయ
రోశయ్య పూర్తి టర్మ్ సీటులో వుంటారా?
ReplyDeleteజగన్ సి.ఎం అవుతాడా?
తెలంగాణ వస్తుందా?
శ్రీకౄష్ణ కమిటీ ఏమని రిపోర్ట్ ఇస్తుంది?
ఈ విషయాలమీద మీ ప్రెడిక్షన్స్ ఏమిటో చెప్పండి.