విఘ్నాలను తొలగించి, సకల శుభాలను అందించే గణనాధుడిని భక్తి ప్రపత్తులతో అర్పించే భాద్రపద శు. చవితి "గణేశ చతుర్ధీ" పర్వదినాన రాత్రి సమయములలో చంద్ర దర్శనము చేసిన వారాలకు నిందలు తప్పవని పురాణ వచనము. కానీ గణపతి పూజను చక్కగా ఆచరించుకొని, వ్రతకధను విని, అక్షతలను శిరస్సు మీద ఉంచుకొన్న వారు చంద్ర దర్శనము చేసినచో దోషము కాదు. నిందలు వుండవు. కొతమంది వ్రతం ఆచరించి, కధ విని, అక్షతలు శిరస్సున వేసుకున్ననూ..... చంద్ర దర్శనం చేయరు. ఎందుకంటే....... నిందలు పడతాయనే భయం వెంటాడుతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.
కానీ శ్రీ వికృతి నామ సంవత్సరంలో భాద్రపద శు.చవితి శనివారం 11 సెప్టెంబర్ 2010 వినువీధిలో మహాద్భుతమైన అపురూప అరుదైన దృశ్యం చూడబోతున్నాము. అదే తారా శాశాంకుల సయ్యాట, దోబూచులాట.... నెలవంక పక్కనే ధగధగమెరిసే నక్షత్రం కనువిందుచేయనుంది. ఇది వినాయక చతుర్ధి పర్వదినం నాడే దర్శనం అవుతుంది. ప్రతి 8 సంవత్సరములకొకసారి గణేశ చతుర్ధిన సాయంకాల సమయములలో శుక్ర గ్రహం, చంద్రుడు స్వాతి నక్షత్రంలో కలిసిన కారణంగా, నెలవంక ప్రక్కన శుక్ర నక్షత్రం మిలమిల మెరుస్తూ వుంటుంది. గతంలో 2002, 1996, 1988, 1980, సంవత్సరాలలో దర్శనం అయింది.
మరి ఈ వినాయక పర్వదినం రోజున హైదరాబాద్ నగరంలో చంద్రుడు రాత్రి 6 గంటల 57 నిమిషాలకు అస్తమిస్తాడు. సూర్యుడు 6 గంటల 5 నిమిషాలకు అస్తమిస్తాడు. ఈ మధ్యకాలంలో చవితి చంద్రుడు శుక్రగ్రహం పక్కనే ఉంటాడు. దాదాపు 2 ఘడియలు ఈ దృశ్యాన్ని తిలకించవచ్చు. భక్తి ప్రపత్తులతో సేవించవచ్చు. ఇతర మతస్తులు ఇష్ట దైవంగా కూడా భావిస్తారు. మన గణనాయకుని జన్మదినాన వినాయక వీధిలో ఏర్పడే తారా శాశాంకాన్ని కనులవిందుగా చూసి తరించండి. తిరిగి రాబోయే విళంబి నామ సంవత్సర భాద్రపద శు.చవితి గురువారం 2018 సెప్టెంబర్ 13 న వచ్చే గణేశ చతుర్ధి రోజున, ఆపై రాబోయే పరాభవ నామ సంవత్సర భాద్రపద శు.చవితి మంగళవారం 2026 సెప్టెంబర్ 15 న వచ్చే గణేశ చతుర్ధి రోజున శుక్రగ్రహం, చంద్రుడు స్వాతి నక్షత్రంలో కలిసినందున కనువిందుచేసే తారా శాశాంకుల సయ్యాట వుంటుంది.
ఆకాశంలో ఆసమయంలో మేఘాలు కమ్ముకోనకుండావుంటే అదృష్టమే మరి.... ఇంతటి అరుదైన, అద్భుత, అదృష్ట దృశ్యాన్ని తిలకించే మహాభాగ్యం ఎంతమందికి వుంటుందో వేచి చూడాలి మరి.
Sreenivasa Gargeya గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు
ReplyDeleteహారం
Thanks for your Help.
ReplyDelete