Saturday, April 4, 2015

సంపూర్ణ చంద్రగ్రహణం - సింహరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం జూలై 31 వరకు ఉండును. అందుచే మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్ర 1వ పాదంలో జన్మించిన సింహరాశి జాతకులు, ఈ క్రింది అంశాలపై దృష్టి ఉంచుతూ, బుద్ధి బలంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే... పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఉండును.

సింహరాశి జాతకులు జూలై 31 వరకు, తాము మాట్లాడే ప్రతి విషయం మీద అవగాహన ఉంటూ మాట్లాడాలి. ఏదో మాట్లాడుతున్నాము, అవతలవారు వింటున్నారు అనే ధోరణిలో కాకుండా, మాట్లాడే అంశము, ఇతరులను ఎంత వరకు అనుకూల ప్రభావానికి తీసుకువెళ్తుందా ? లేదా ప్రతికూల పరిస్థితులను ఉత్పన్నం చేస్తుందా ?... అనే రెండు అంశాలను ఆలోచిస్తూ మాట్లాడాలి. కొన్ని సందర్భాలలో అనుకూలంగానే ఉంది అని మీరు అనుకున్నప్పటికీ, ఎదుటివారు దానిని పొరపాటుగా అర్థం చేసుకొని, మీ పైన కొంత శతృత్వ పోకడలతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా వినయంగా మాట్లాడుతూ ముక్తసరిగా సమాధానం చెబుతూ, ఎవరినీ ఎట్టి పరిస్థితులలోనూ విమర్శించే స్థాయికి వెళ్ళకుండా, దూషణలు లేకుండా, సందర్భానుసారంగా హాస్య వచనాలను పలుకుతూ ఉంటుంటే ఈ గ్రహణ ప్రభావం ఏమి ఉండదని సింహరాశి జాతకులు గుర్తుంచుకోవాలి. అలా కాకుండా తమకి ఇష్టం వచ్చిన రీతిలో పెట్రేగి పోయే జాతకులకు ఎవరూ సహాయకారులుగా రాకుండా, ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతారని గుర్తుంచుకోవాలి.

అదే మాదిరిగా కుటుంబంలోని చిన్న చిన్న విషయాలపైన గానీ, ఆర్ధిక స్థితి గతులపైన గానీ, జాగ్రత్తగా అవలోకిస్తూ, ఆలోచిస్తూ, పావులు కదుపుకుంటూ వెళ్ళాలి. తొందరపాటు తనంగా ధనాన్ని ఖర్చుపెట్టటం గానీ లేక మరొకరికి ఇవ్వటం గానీ ఉండకూడదు. అవసరమైన సమయాలలోనే, డబ్బును ఎదుటివారికోసం ఖర్చు పెట్టటానికి ప్రయత్నించండి.

దంత, నేత్ర సంబంధంగా స్వల్ప రుగ్మతలు వచ్చే అవకాశం కూడా ఉంది. లేదా ఈ పాటికి మీకేదైనా నేత్ర, దంత సమస్యలు ఉండి ఉంటే తాత్సారం చేయకుండా సమీప వైద్యులకు తెలియచేసి తగిన చికిత్స పొందాలి. అలా చేయకుండా ఉంటే, సమస్య మరింత పెరగటమే కాకుండా అతి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఆగిపోయే అవకాశాలు ఉండే సూచన కలదు. రెండు చక్రాల వాహనాలని నడిపే వారు... కళ్ళజోడు గానీ లేక హెల్మెట్ గాని తప్పకుండా వాడండి. రాత్రి సమయాలలో వాహనాన్ని నడిపే వారు కంటికి తప్పనిసరిగా రక్షక కవచంగా ఉండే అద్దాలను ధరించండి. ఎందుకంటే బండి వేగంగా వెళ్తున్నప్పుడు, కొన్ని రకాల కీటకాలు వేగంగా వచ్చి కంటికి తగిలే ప్రమాదముంది. కనుక తప్పక అద్దాలు ధరించండి. అదేవిధంగా బస్సులలో ప్రయాణం చేసేవారు కొంత అప్రమత్తతతో ఉండటం మంచిది. ఎలా గంటే వేగంగా పోతున్న వాహనాన్ని డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తే, సీట్లలో కూర్చున్నవారు ముందుకు ఉరకటము, ఎదురు సీట్లకుండే ఇనుప కడ్డీలను గానీ లేక ఇతరములను తగిలినందున దంతాలకు లేక నేత్రాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. తేనేటీగల తుట్టెల జోలికి వెళ్ళవద్దు.

మొత్తం మీద పైన చెప్పిన విషయాలపైన నిత్యం అవగాహన ఉంచగలిగితే జూలై 31 వరకు చంద్రగ్రహణ ప్రభావ దుష్ఫలితాలు ఉండనే ఉండవు.

సింహరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :

ఏప్రిల్ 16 సాయంత్రం 4.55 నుంచి 18 సాయంత్రం 5.23  వరకు
మే 13 రాత్రి 12.50 నుంచి 15 అర్ధరాత్రి తదుపరి 2.42 వరకు
జూన్ 10 ఉదయం 6.40 నుంచి 12 ఉదయం 9.40 వరకు
జూలై 7 మధ్యాహ్నం 12.10 నుంచి 9 మధ్యాహ్నము 3.08 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు మఖ నక్షత్ర జాతకులు:
ఏప్రిల్ 15 అర్థరాత్రి 12.44 నుంచి 16 రా10.19 వరకు,
ఏప్రిల్ 24 12.06 నుంచి 25 మధ్యాహ్నం 1.40 వరకు,
మే 4 ఉదయం 10.32 నుంచి 5 మధ్యాహ్నం 11.51 వరకు,
మే 13 ఉదయం 8.07 నుంచి 14 ఉదయం 6.25 వరకు,
మే 21 రాత్రి 9.08 నుంచి 22 రాత్రి 10.15 వరకు,
మే 31 సాయంత్రం 6.14 నుంచి జూన్ 1 రా 7.21 వరకు,
జూన్ 9 మధ్యాహ్నం 1.41 నుంచి 10 మ12.20 వరకు,
జూన్ 18 ఉదయం 6.02 నుంచి 19 ఉదయం 6.58 వరకు,
జూన్ 27 అర్థరాత్రి తదుపరి 2.50 నుంచి 29 ఉదయం 4.02 వరకు,
జూలై 6 రాత్రి 7.22 నుంచి 7 సాయంత్రం 5.46 వరకు,
జూలై 15 మధ్యాహ్నం 1.44 నుంచి 16 మధ్యాహ్నం 2.49 వరకు,
జూలై 25 మధ్యాహ్నం 11.25 నుంచి 26 మధ్యాహ్నం 1.02 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

పుబ్బ నక్షత్ర జాతకులు:
ఏప్రిల్ 8 ఉదయం 5.43 నుంచి 9 ఉదయం 6.52 వరకు
ఏప్రిల్ 16 రా10.19 నుంచి 17 రాత్రి 7.49 వరకు,
ఏప్రిల్ 25 మధ్యాహ్నం 1.40 నుంచి 26 మధ్యాహ్నం 3.54 వరకు,
మే 5 మధ్యాహ్నం 11.51 నుంచి 6 మధ్యాహ్నం 12.41 వరకు,
మే 14 ఉదయం 6.25 నుంచి 15 ఉదయం 4.35 వరకు,
మే 22 రాత్రి 10.15 నుంచి 23 రాత్రి 12.03 వరకు,
జూన్ 1 రా 7.21 నుంచి 2 రాత్రి 7.51  వరకు,
జూన్ 10 మ12.20 నుంచి 11 ఉదయం 10.59  వరకు,
జూన్  19 ఉదయం 6.58 నుంచి 20 ఉదయం 8.31 వరకు,
జూన్ 29 ఉదయం 4.02 నుంచి 30 ఉదయం 4.31  వరకు,
జూలై  7 సాయంత్రం 5.46 నుంచి 8 సాయంత్రం 4.20 వరకు,
జూలై 16 మధ్యాహ్నం 2.49 నుంచి 17 సాయంత్రం 4.25 వరకు,
జూలై 26 మధ్యాహ్నం 1.02 నుంచి 27 మధ్యాహ్నం 1.51  వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ఉత్తర 1వ పాదం జాతకులు :
ఏప్రిల్ 9 ఉదయం 6.52 నుంచి 10 ఉదయం 7.30  వరకు,
ఏప్రిల్ 17 రాత్రి 7.49 నుంచి 18 సాయంత్రం 5.23 వరకు,
ఏప్రిల్ 26 మధ్యాహ్నం 3.54 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు,
మే 6 మధ్యాహ్నం 12.41 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు,
మే 15 ఉదయం 4.35 నుంచి అర్థరాత్రి తదుపరి 5.42 వరకు,
మే 23 రాత్రి 12.03 నుంచి 24 అర్థరాత్రి తదుపరి 2.28 వరకు,
జూన్ 2 రాత్రి 7.51 నుంచి 3 రాత్రి 7.50 వరకు,
జూన్ 11 ఉదయం 10.59 నుంచి 12 ఉదయం 9.40  వరకు,
జూన్ 20 ఉదయం 8.31 నుంచి 21 ఉదయం 10.41 వరకు,
జూన్ 30 ఉదయం 4.31 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు,
జూలై 8 సాయంత్రం 4.20 నుంచి 9 మధ్యాహ్నం 3.08 వరకు,
జూలై 17 సాయంత్రం 4.25 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు,
జూలై 27 మధ్యాహ్నం 1.51 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో కన్యారాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

Friday, April 3, 2015

విదేశాలలో చైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం

శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ శనివారం 4.4.2015 హస్త నక్షత్ర కన్యారాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం జరుగును. సంపూర్ణ చంద్రగ్రహణ బింబము 5 నిముషాల పాటు ఉండును.

డెన్వర్, ఫోనిక్స్, లాస్ ఏంజిల్స్ నగరాలలో చంద్రగ్రహణ స్పర్శను, సంపూర్ణ స్థితిని, విడుపును చూడవచ్చును. కానీ గ్రహణ చివరి భాగాన్ని (మోక్షం) వీక్షించలేరు. పోర్ట్ ల్యాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్ నగరాలలో స్పర్శ నుంచి మోక్షం వరకు గ్రహణాన్ని పూర్తిగా వీక్షించవచ్చును. 

ఈ ప్రాంతాలలో 4 వ తేది అర్థరాత్రి తదుపరి
గ్రహణ స్పర్శ                                        - రాత్రి 2గంటల16నిముషాలు
సంపూర్ణ గ్రహణానికి చేరిక                     - రాత్రి 3గంటల 58నిముషాలు
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం        -  తె 4గంటల 03నిముషాలు
గ్రహణ ముగింపు   (మోక్షం)                  - ఉ 5గంటల 45నిముషాలు


ఆస్టిన్, చికాగో, డల్లాస్, హోస్టన్, మాంటెర్రె ఈ 5 నగరాలలో స్పర్శ స్థితిని, సంపూర్ణ స్థితిని, విడుపును, విడుపు ప్రారంభాన్ని చూడగలరు గాని మోక్షాన్ని చూడలేరు. ఎందుకంటే ఆ సమయానికి సూర్యోదయాలగును.

ఈ 5 ప్రాంతాలలో గ్రహణ స్పర్శ 4 వ తేది అర్థరాత్రి తదుపరి
గ్రహణ స్పర్శ                                        - తె 4గంటల16నిముషాలు
సంపూర్ణ గ్రహణానికి చేరిక                     - ఉ 5గంటల 58నిముషాలు
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం        - ఉ  6గంటల 03నిముషాలు
గ్రహణ ముగింపు   (మోక్షం)                  - ఉ 7గంటల 45నిముషాలు


అట్లాంటా, బోస్టన్, డెట్రాయిట్, ఫిలడెల్ఫియా, పిట్స్ బర్గ్, జాక్సన్ విల్లె, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, రిచ్మండ్  అను 9 నగరాలలో స్పర్శను మాత్రమే చూడగలరు. వెంటనే సూర్యోదయాలు కావటంతో సంపూర్ణ స్థితిని గానీ, విడుపును గానీ, మోక్షాన్ని గానీ చూడలేరు.

ఈ 9 ప్రాంతాలలో గ్రహణ స్పర్శ 5 వ తేది ఉదయం సూర్యోదయ పూర్వము
గ్రహణ స్పర్శ                                        - ఉ  5గంటల16నిముషాలు
సంపూర్ణ గ్రహణానికి చేరిక                     - ఉ 6గంటల 58నిముషాలు
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం        - ఉ 7గంటల 03నిముషాలు
గ్రహణ ముగింపు   (మోక్షం)                  - ఉ 8గంటల 45నిముషాలు


కనుక పై సమయాలలో పై ప్రాంతాలలో ఉండే గర్భిణులు గ్రహణ జాగ్రత్తలను పాటించేది.
తదుపరి పోస్టింగ్ లో సింహరాశి వారు తీసుకొనవలసిన జాగ్రత్తలు తెలుసుకోగలరు.

Thursday, April 2, 2015

సంపూర్ణ చంద్రగ్రహణం -కర్కాటకరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం వలన కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు 2015 జూలై 31 వరకు కేవలం సోదర, సోదరీ సంబంధ అంశాలలోనే ముఖ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది మినహా ఏ ఇతర అంశాలలోనూ గ్రహణ ప్రభావం ఏమీ ఉండదని గ్రహించాలి. సోదర సోదరీ  అంశాలలో ప్రభావం ఎలా ఉంటుందంటే..... అనుకోకుండా డబ్బు ఇచ్చి పుచ్చు కోవటాలలో తేడాలు వచ్చి, ఒకరినొకరు అనుకోకుండా మాటా మాటా పెంచుకొనే స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటుంటాయి. లేదా ఆస్తి సంబంధిత విషయాలలో కానీ, అన్నదమ్ముల లేక అక్క చెల్లెళ్ళ గృహ సరిహద్దు విషయాలలో కానీ లేదా తండ్రి ఇచ్చిన ఆస్తులలో వాటా పంపకాలలో కానీ తేడాలు ఉన్ననూ, లేకున్ననూ.... అనుకోకుండా వీరి మధ్య కొంత శత్రుత్వాన్ని పెంచుకుంటుంటారు. మరికొన్ని సందర్భాలలో వృద్దులుగా ఉన్న తల్లి తండ్రుల ఆలనా పాలనా చూడటానికై  అన్నదమ్ములు ఒకరినొకరు ఓ అంగీకారానికి రాకుండా, వారి తల్లి తండ్రుల స్థితి గతులను ఒక సోదరుడే చూడాలని... రెండవ వ్యక్తి కొన్ని కారణాలు చెప్తూ వాదిస్తారు. లేదా ఓ సోదరుడు తన ఇల్లు చిన్నదని పైగా కుమార్తె గర్భవతిగా ఇంట్లో ఉన్నదని, ఇలాంటి సమయంలో వృద్దులుగా ఉన్న తల్లి తండ్రులను తీసుకొని వచ్చి తన ఇంట్లో ఉంచుకోవటం కష్ట సాధ్యమని, ఏదైనా సమస్య వస్తే అందుబాటులో ఎలాంటి సౌకర్యాలు తన ఇంటికి దరి దాపులలో ఉండవని, కనుక రెండవ సోదరుడే వీరిని ఉంచుకొనేట్లయితే... తన వంతుగా, తన శక్తికి తగినట్లుగా కొంత సొమ్మును ఇస్తానని చెప్పి సోదరుడితో వాపోతాడు. కానీ సోదరుడు కొంతవరకు విన్నప్పటికీ, సోదరుని భార్య ఏదో ఒక పేచి పెట్టినందువల్ల కూడా సమస్య జటిలమయ్యే అవకాశాలు ఉంటుంటాయి.

కాబట్టి ఇలాంటి అంశాలు చెప్పుకుంటూ పోతే అనేకమనేకం ఉంటుంటాయి. ఇలాంటి విషయాలలో ముందుగా సోదరుల మధ్య లేక సోదరీల మధ్య ఓ సరైన అవగాహన ఉండాలి. కనుక ఇది గమనించి పునర్వసు నక్షత్ర చివరి పాదం వారు, పుష్యమి, ఆశ్లేష జాతకులు కింద చూపిన సమయాలలో అనవసరమైన కలహాలకు గాని, బంధు ద్వేషాలకు గాని వెళ్ళకూడదు. ఒకవేళ ఇరువురి మధ్య ఓ అవగాహన వచ్చినప్పటికీ, ఆ ఒప్పందము వ్రాత పూర్వకంగా ఉండటమే ఎంతైనా సముచితము.

కర్కాటక రాశిలోనే గురు, శుక్ర శుభగ్రహాలు జూలై 1 వ తేదిన కలవటం జరుగుతుంది. కనుక ఈ దర్శనీయమైన శుభగ్రహాలను, ఈ రాశి జాతకులు తప్పకుండా దర్శించుకొనవలసిన అవసరం ఉంది. ఇలా దర్శించినందువలన మానసికంగా, శారీరకంగా స్థిరత్వాన్ని పొందిన వారగుదురు.

కర్కాటకరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 14 మధ్యాహ్నం 3.51 నుంచి 16 సాయంత్రం 4.55  వరకు
మే 11 రాత్రి 10.17 నుంచి 13 రాత్రి 12.50 వరకు
జూన్ 7 అర్ధరాత్రి 3.41 నుంచి 10 ఉదయం 6.40 వరకు
జూలై 5 ఉదయం 10.01 నుంచి 7 మధ్యాహ్నం 12.10 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు పునర్వసు 4 వ పాద జాతకులు :
ఏప్రిల్ 13 ఉదయం 6.13 నుంచి 14 ఉదయం 4.47 వరకు,
ఏప్రిల్ 21 మధ్యాహ్నం 11.57 నుంచి 22 మధ్యాహ్నం 11.15 వరకు,
ఏప్రిల్ 30 అర్ధరాత్రి తదుపరి 3.46 నుంచి మే 2 ఉదయం 6.28 వరకు,
మే 10 మధ్యాహ్నం 11.57 నుంచి 11 ఉదయం 10.56 వరకు,
మే 18 రాత్రి 9.56 నుంచి 19 రాత్రి 9.04 వరకు,
మే 28 మధ్యాహ్నం 11.27 నుంచి 29 మధ్యాహ్నం 2.13 వరకు,
జూన్ 6 సాయంత్రం 5.32 నుంచి 7 సాయంత్రం 4.20 వరకు,
జూన్ 15 ఉదయం 6.27 నుంచి 16 ఉదయం 5.52 వరకు,
జూన్ 24 రాత్రి 7.28 నుంచి 25 రాత్రి 10.24 వరకు,
జూలై 3 రాత్రి 12.41 నుంచి 4 రాత్రి 10.56 వరకు,
జూలై 12 మధ్యాహ్నం 1.00 నుంచి 13 మధ్యాహ్నం 12.53 వరకు,
జూలై 21 అర్ధరాత్రి తదుపరి 3.11 నుంచి 23 ఉదయం 6.17 వరకు,
జూలై 31 ఉదయం 9.54 నుంచి అర్ధరాత్రి 12.00 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

పుష్యమి జాతకులు :
ఏప్రిల్ 4 అర్ధరాత్రి 11.36 నుంచి 5 అర్ధరాత్రి తదుపరి 2.02 వరకు,
ఏప్రిల్ 14 ఉదయం 4.47 నుంచి అర్ధరాత్రి తదుపరి 2.55 వరకు,
ఏప్రిల్ 22 మధ్యాహ్నం 11.15 నుంచి 23 మధ్యాహ్నం 11.17 వరకు,
మే 2 ఉదయం 6.28 నుంచి 3 ఉదయం 8.44 వరకు,
మే 11 ఉదయం 10.56 నుంచి 12 ఉదయం 9.39 వరకు,
మే 19 రాత్రి 9.04 నుంచి 20 రాత్రి 8.46 వరకు,
మే  29 మధ్యాహ్నం 2.13 నుంచి 30 సాయంత్రం 4.31 వరకు,
జూన్ 7 సాయంత్రం 4.20 నుంచి 8 మధ్యాహ్నం 3.02 వరకు,
జూన్ 16 ఉదయం 5.52 నుంచి 17 ఉదయం 5.41 వరకు,
జూన్ 25 రాత్రి 10.24 నుంచి 26 రాత్రి 12.55 వరకు,
జూలై 4 రాత్రి 10.56 నుంచి 5 రాత్రి 9.07 వరకు,
జూలై 13 మధ్యాహ్నం 12.53 నుంచి 14 మధ్యాహ్నం 1.06 వరకు,
జూలై  23 ఉదయం 6.17 నుంచి 24 ఉదయం 9.06 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ఆశ్లేష జాతకులు :
ఏప్రిల్ 5 అర్ధరాత్రి తదుపరి 2.02 నుంచి 7 ఉదయం 4.05 వరకు,
ఏప్రిల్ 14 అర్ధరాత్రి తదుపరి 2.55 నుంచి 15 రాత్రి 12.44 వరకు,
ఏప్రిల్ 23 మధ్యాహ్నం 11.17 నుంచి 24 మధ్యాహ్నం 12.0 వరకు,
మే 3 ఉదయం 8.44 నుంచి 4 ఉదయం 10.32 వరకు,
మే 12 ఉదయం 9.39 నుంచి 13 ఉదయం 8.07 వరకు,
మే 20 రాత్రి 8.46 నుంచి 21 రాత్రి 9.08 వరకు,
మే 30 సాయంత్రం 4.31 నుంచి 31 సాయంత్రం 6.14 వరకు,
జూన్ 8 మధ్యాహ్నం 3.02 నుంచి 9 మధ్యాహ్నం 1.41 వరకు,
జూన్ 17 ఉదయం 5.41 నుంచి 18 ఉదయం 6.02 వరకు,
జూన్ 26 రాత్రి 12.55 నుంచి 27 అర్థరాత్రి తదుపరి 2.50 వరకు,
జూలై 5 రాత్రి 9.07 నుంచి 6 రాత్రి 7.22 వరకు,
జూలై 14 మధ్యాహ్నం 1.06 నుంచి 15 మధ్యాహ్నం 1.44 వరకు,
జూలై  24 ఉదయం 9.06 నుంచి 25 మధ్యాహ్నం 11.25 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.


ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి కర్కాటకరాశి  జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో సింహరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

Tuesday, March 31, 2015

సంపూర్ణ చంద్రగ్రహణం - మిధునరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

మిధునరాశి జాతకులకు చంద్రగ్రహణ ప్రభావం విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ అంశాలపై ఉండును. కనుక జూలై 31 వరకు మిధున రాశి జాతకులు తమ తమ నిర్ణయాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ పావులు కదుపుతూ ఉండాలి. విద్య సంబంధిత అంశాలలోకి వస్తే ఈ నాలుగు మాసాలు పరీక్షలు రాయటాలు, ఉత్తీర్ణత కావటాలు, పై కోర్సులకు వెళ్ళటానికి అనువుగా ఉండే సమయం. ఇలాంటి సమయంలో అనవసరమైన వ్యాపకాలు ఒక్కోసారి ఎదురుకావటం గానీ లేదా కొంతమంది తప్పు సంకేతాలుగా అభిప్రాయాలను తెలియచెప్తూ, మనస్సు గాయపరిచేలా ఉంటుంటాయి. కనుక అలాంటి అంశాల మీద అసలు దృష్టి పెట్టవద్దు. కేవలం ప్రతి బుధవారం సరస్వతి దేవిని ప్రార్ధిస్తూ మీ మనస్సుకు తగిన రీతిలోనే నడుచుకుంటూ నిర్భయంగా ముందుకు సాగండి. అయితే గ్రహచార ప్రభావాలచే ఎక్కడైనా చిన్నపాటి వ్యతిరేకతలు చోటు చేసుకుంటే, వెంటనే క్రుంగిపోవద్దు. అపజయాలు అనేవి విజయమనే నిచ్చెనకు మెట్లుగా భావించాలే తప్ప నిరాశా, నిస్పృహలతో మాత్రం ఉండవద్దు. కనుకనే మనో ధైర్యంతో బుధవారాలలో సరస్వతి దేవిని ప్రార్ధించండి.

ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు కానీ తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే... తమకున్న ఏదైనా లోపాన్ని గానీ, లేదా వెలితిని గానీ సహా ఉద్యోగులకు స్పష్టం చేయవద్దు. ఒకవేళ వారు పసిగట్టి ఈ లోపాన్ని ఎత్తి చూపినప్పుడు తక్షణమే వారిమాటను కొట్టిపారేయండి. దీనితో పాటు ఉద్యోగ సరళిలో మీకు తెలిసి.... నిజంగా ఏవైనా లోపాలు ఉండి ఉంటే, వాటిని ముందు జాగ్రత్తగా చక్కదిద్దుకోవటానికి ప్రయత్నమంటూ చేసుకోండి. పూర్తిగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే దానికంటే ముందు చూపుగా గమనించుకొని దిద్దుబాటు చేసుకోవటం చాలా ఉత్తమం. ఈ మాసాలలో పై అధికారులతో వినయంగా ఉండటం ఎంతైనా శ్రేయోదాయకం. ఉద్యోగం చిన్నదైనా, పెద్దదైనా... వినయానికి ప్రాధాన్యత ఇస్తూ పావులు కదపటానికే ప్రయత్నిస్తూ, మీ లోపాలను సహా ఉద్యోగులు గమనించకుండా జాగ్రత్తపడండి.

సహా ఉద్యోగులు అమిత మిత్రులైనప్పటికీ ఈ నాలుగు మాసాలలో మాత్రం వారితో ఎలాంటి శతృత్వ పోకడలకు వెళ్ళవద్దు. అదే విధంగా ఉద్యోగ అన్వేషణలో ఉండే వారు కూడా ఇంటర్వ్యూలకు లేక ఏ ఇతర ముఖ్య వ్యవహారాలకు హాజరయ్యే అవకాశం ఉన్న సందర్భాల రోజులలో పులుపును తినకుండా ఉండటం చాలా మంచిదని గ్రహించండి. ఆరోగ్య అంశాలను విశ్లేషిస్తే.... హడావుడిగా వెళ్ళే ప్రయాణాలలో కానీ, హడావుడిగా చేసే వేగవంతమైన పనులలో కానీ.... నడకను నెమ్మదిగా ఉంచాలే తప్ప వడి వడి అడుగులు వేయవద్దు. గమనంలో ఉన్న బస్సును ఎక్కటానికి ప్రయత్నించవద్దు. బస్సు ఆగిన తర్వాతనే స్థిమితంగా ఎక్కండి. అలాగే కారు నుంచి దిగే సందర్భంలో.... ప్రక్కనుంచి ఏదైనా వాహనం వస్తున్నదేమో తెలుసుకొని, కారు తలుపు తీయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సందర్భాలలోనే సమస్య వచ్చి, ప్రమాదం వాటిల్లి, ఆరోగ్య భంగములు జరుగు సూచన కలదు.

చిన్న పిల్లలను ఎత్తుకొని ముద్దాడే సమయంలో.... వారి చేతిలో పెన్ లాంటి వస్తువులు లేకుండా గమనించాలి. ఎందుకంటే పొరపాటున కన్నుకు తగలవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో అపార్ట్ మెంట్ లలో గ్రిల్ తో పాటు క్లోస్డ్ డోర్ గా ఉండే లిఫ్ట్ పక్కన నిలబడవద్దు. ఎందుకంటే మీరు లిఫ్ట్ లో పైకి వెళ్ళాలి, అదే సమయంలో పైనుంచి హడావుడితో క్రిందకి వస్తాడు. మీరు నిలబడిన స్థితి లోపల వ్యక్తికి కనపడక తలుపును ముందుకు తోసుకొని రావటంతో, తలుపు వెనకాలే ఉన్న మీరు... క్రిందపదటమో... లేదా ముక్కుకు దెబ్బతగలటమో, లేదా కంటికి పెట్టుకున్న జోడు పగిలి గాజు ముక్కలచే కన్ను గాయమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చెబుతుంటే, కొండవీటి చేంతాడు లాగా తయారగును. కాబట్టి గమనించవలసినది ఏమిటంటే నిదానంతో వ్యవహారాలను చేస్తూ... బుద్ధి బలాన్ని ఉపయోగించి నడుచుకోవాలని అర్థము.

వాహన విషయాల కొనుగోలులో ఆలోచించి చక్కని నిర్ణయంతో వాహనాన్ని కొనండి. తొందరపడి ఎవరో ఏదో చెప్పారని ఓ వాహనం కొని తర్వాత నిరాశపడవద్దు. అంతేకాక ప్రస్తుతం మీకున్న వాహనానికి ఏమైనా మరమ్మత్తులు ఉన్నాయేమో గమనించి శ్రద్ధగా వాటిని మరమ్మత్తు చేయించి ఆ పైనే నడపటానికి ప్రయత్నించండి. రాత్రి వేళలలో మీరు కానీ, డ్రైవర్ కానీ వాహనాన్ని నడుపుతున్నప్పుడు... శృతి మించిన వేగం కాకుండా తక్కువ వేగంతోనే వెళుతూ అవసరమైన సమయాలలో విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తతోనే వాహన చోదకం చేయండి.

ప్రస్తుతం సొంత గృహం ఉండవచ్చు, లేకపోవచ్చు లేదా అద్దె ఇంట్లో ఉండవచ్చు. లేదా అద్దె కోసం ప్రయత్నాలు చేయవచ్చు. ఇలాంటి సందర్భాలలో లేని పోని భయాలు చెప్పి భయపెట్టే వారి వలన సమస్యలు వస్తాయేమోనని గ్రహించి చక్కగా వాస్తు రీత్యా ఉన్న ఇంటిని కూడా వదిలేసి వెళ్ళకండి. ఎందుకంటే వాస్తు బలం విశేషంగా ఉన్న గృహాలలో నివసించే వ్యక్తులు కూడా బాధలతో ఉంటుంటారనేది చాలా మందికి తెలియదు. గృహబలం కంటే గ్రహబలం చాలా గొప్పది.

ఇక చివరిగా జన్మనిచ్చిన తల్లి విషయంలో ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా ఈ నాలుగు మాసాలలో మాట్లాడటానికే ప్రయత్నించండి. మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి నటించి మాట్లాడవద్దు. అలా అని ముక్కుసూటిగా విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడవద్దు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్న చందాన అంటీ ముట్టనట్లుగా విషయ సరళిలో ఉండాలే తప్ప అలకలకు, విసుగులకు, క్రోధాలకు, కలహాలకు, విమర్శలకు, దూషణలకు, ఆరోపణలకు తావివ్వవద్దు.

మొత్తం మీద మిధునరాశి జాతకులు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ, చిన్నపాటి జలుబు, జ్వరము వంటివి వస్తే, సొంత వైద్యం చేసుకోకుండా, అనుభవం ఉన్న వైద్యుడినే ఆశ్రయించాలని గమనించండి.

మిధునరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 12 మధ్యాహ్నం 12.56 నుంచి 14 మధ్యాహ్నం 3.51  వరకు
మే 9 సాయంత్రం 6.29 నుంచి 11 రాత్రి 10.17 వరకు
జూన్ 5 రాత్రి 12.18 నుంచి 7 అర్ధరాత్రి 3.41 వరకు
జూలై 3 ఉదయం 7.51 నుంచి 5 ఉదయం 10.01  వరకు
జూలై 30 సాయంత్రం 5.18 నుంచి 31 అర్ధరాత్రి 12.00 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు మృగశిర 3,4 పాద జాతకులు :
ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ఆర్ద్ర జాతకులు :
ఏప్రిల్ 12 ఉదయం 7.11 నుంచి 13 ఉదయం 6.13 వరకు,
ఏప్రిల్ 20 మధ్యాహ్నం 1.18 నుంచి 21 మధ్యాహ్నం 11.57 వరకు,
ఏప్రిల్ 29 రాత్రి 12.47 నుంచి 30 అర్ధరాత్రి తదుపరి 3.46 వరకు,
మే 9 మధ్యాహ్నం 12.40 నుంచి 10 మధ్యాహ్నం 11.57 వరకు,
మే 17 రాత్రి 11.15 నుంచి 18 రాత్రి 9.56 వరకు,
మే 27 ఉదయం 8.25 నుంచి 28 మధ్యాహ్నం 11.27 వరకు,
జూన్ 5 సాయంత్రం 6.34 నుంచి 6 సాయంత్రం 5.32 వరకు,
జూన్ 14 ఉదయం 7.20 నుంచి 15 ఉదయం 6.27 వరకు,
జూన్ 23 సాయంత్రం 4.22 నుంచి 24 రాత్రి 7.28 వరకు,
జూలై 2 అర్థరాత్రి 2.15 నుంచి 3 రాత్రి 12.41 వరకు,
జూలై 11 మధ్యాహ్నం 1.27 నుంచి 12 మధ్యాహ్నం 1.00 వరకు,
జూలై 20 రాత్రి 12.03 నుంచి 21 అర్ధరాత్రి తదుపరి 3.11 వరకు,
జూలై 30 మధ్యాహ్నం 11.46 నుంచి 31 ఉదయం 9.54 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

పునర్వసు 1,2,3 పాద జాతకులు :
ఏప్రిల్ 13 ఉదయం 6.13 నుంచి 14 ఉదయం 4.47 వరకు,
ఏప్రిల్ 21 మధ్యాహ్నం 11.57 నుంచి 22 మధ్యాహ్నం 11.15 వరకు,
ఏప్రిల్ 30 అర్ధరాత్రి తదుపరి 3.46 నుంచి మే 2 ఉదయం 6.28 వరకు,
మే 10 మధ్యాహ్నం 11.57 నుంచి 11 ఉదయం 10.56 వరకు,
మే 18 రాత్రి 9.56 నుంచి 19 రాత్రి 9.04 వరకు,
మే 28 మధ్యాహ్నం 11.27 నుంచి 29 మధ్యాహ్నం 2.13 వరకు,
జూన్ 6 సాయంత్రం 5.32 నుంచి 7 సాయంత్రం 4.20 వరకు,
జూన్ 15 ఉదయం 6.27 నుంచి 16 ఉదయం 5.52 వరకు,
జూన్ 24 రాత్రి 7.28 నుంచి 25 రాత్రి 10.24 వరకు,
జూలై 3 రాత్రి 12.41 నుంచి 4 రాత్రి 10.56 వరకు,
జూలై 12 మధ్యాహ్నం 1.00 నుంచి 13 మధ్యాహ్నం 12.53 వరకు,
జూలై 21 అర్ధరాత్రి తదుపరి 3.11 నుంచి 23 ఉదయం 6.17 వరకు,
జూలై 31 ఉదయం 9.54 నుంచి అర్ధరాత్రి 12.00 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

చివరగా మిధునరాశి వారు గమనించవలసిన అతి ముఖ్యమైన ఘట్టమేమిటంటే.... జూలై 1వ తేది రాత్రి వినువీధిలో శుభగ్రహాలైన గురు, శుక్రుల కలయిక ధన, కుటుంబ స్థానంలో జరుగుతున్నది. కనుక ఆ కలయికను భక్తి విశ్వాసాలతో దర్శించి, శుభ గ్రహాల అనుగ్రహాన్ని పొందండి. ఈ కలయిక అంశాలు మరికొద్ది రోజులలో పోస్టింగ్ చేయబడును.

ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి మిధునరాశి  జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో కర్కాటక రాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

సంపూర్ణ చంద్రగ్రహణం - వృషభరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు

కన్యారాశిలో సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంచే వృషభ రాశిలో జన్మించిన జాతకులు జూలై 31 వరకు సంతాన సంబంధిత విషయాలలోనూ, నిర్ణయాలలోను జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. 18 సంవత్సరములు వయస్సు గానీ, అంతకు లోబడి గానీ ఉన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు ఒక విధంగా తీసుకోవాలి. 18 నుంచి 36 సంవత్సరాల వయసు మధ్య ఉన్న సంతానం విషయంలో జాగ్రత్తలు మరొక రకంగా తీసుకోవాలి. 36 నుంచి 54 సంవత్సరాలు మధ్య గల సంతానానికి ఇంకో రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 54 పైబడిన సంతతికి వేరే విధంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అవసరం ఉన్నది.

ఇక్కడ 54 సంవత్సరాల పైబడిన సంతతికి అన్నప్పుడు, వాళ్ళ తల్లి తండ్రుల వయసు ఎంత ఉండవచ్చునని మనం అర్థం చేసుకోవాలి. అంటే వారు దాదాపుగా వృద్దాప్య స్థితిలో ఉంటారని భావించాలి. అయితే ఈ వయసులో ఉన్న వారికి సహజంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఎలాంటి వత్తిడి లేక ఇతర సంఘర్షణలకు గురి కాకుండా ఉంటుండాలి. ముఖ్యంగా వారికి కావలసిన అవసరాలు సంతతి నుంచి అందుతాయో లేక అందవో లేక తల్లి తండ్రుల కోసం సంతానం లేని పోనీ వ్యయ ప్రయాసల కోర్చి అప్పులు చేస్తూ ఉంటారేమో అనే భావంతో కూడా కొంతమంది ఉంటుంటారు. ఈ వయసులో బ్రతికి ఏం చేయాలి.... ఎప్పటికైనా ఈ శరీరం వెళ్ళవలసిందే కదా.... ఇందుకోసంగా సంతానం చేత అప్పు చేయించి.... తన వైద్య సేవలకు ఎందుకు ఖర్చుపెట్టుకోవాలి అనే మానసిక వ్యధతో ఉండే వృద్దులు చాలా మంది ఉంటుంటారు. ఇలాంటి వారందరూ.... ఎలాంటి భయము, ఆందోళన, వత్తిడి, సంఘర్షణలకు లోను కావద్దు. ఇలాంటి వార్లకి ఒక విశేషమైన ప్రత్యేక పరిహారం ఉన్నది. కనుక దిగులు చెందక వ్యధ నొందక ధైర్యంగా ఉంటూ భగవంతుడిని ప్రార్ధిస్తూ పరిహారం పాటించటానికి ప్రయత్నం చేయండి. ఈ పరిహారం అన్నీ రాశులకు జాగ్రత్తలు చెప్పిన తర్వాత తెలియ చేయగలను. కాబట్టి 54 గానీ, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సంతతి విషయంలో తల్లి తండ్రులు ధైర్యంగా ఉండండి.

36 నుంచి 54 సంవత్సరాల వయసు మధ్య గల సంతతితో ఉన్నటువంటి తల్లి తండ్రులు మాత్రం ( తమ సంతానానికి రుణ సమస్యలు, గృహ సమస్యలు, వృత్తి వ్యాపార సమస్యలు, దాంపత్య సమస్యలు, న్యాయ స్థాన నిర్ణయాల కోసం వేచి వుండే స్థితులు, సంతానానికి సంతానానికి మధ్య సంఘర్షణలు, అనారోగ్యంతో బాధపడే సంతానం కల వారు ) ముఖ్య నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే.... మనసును కట్టడి చేసుకొని జరిగేది ఎలానూ జరుగుతుంది. జరగనిది ఎలానూ జరగదు అనే వేదాంత ధోరణిలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ తల్లి తండ్రులు ఊరక ఉండదు కదా.. తమకు మనుమలు, మనుమరాండ్రు కలగలేదనే భావన ఒక వైపు లాగుతుంటే, మరోవైపు కలిగినా వంశం వృద్ధి చెందలేకుండా ఉంటుందేమో అనే తపన కూడా ఈ నాలుగు మాసాలలో వచ్చే అవకాశం ఉంది. అయితే నాలుగు మాసాలు పూర్తిగా కాకుండా చిట్ట చివరలో చెప్పే సమయాలలోనే వారి మనస్సు కొంత కకావికలమయ్యే అవకాశం ఉంది. కనుక ఈ వయస్సు లో ఉన్న జాతకుల తల్లి తండ్రులు మాత్రం ప్రతి  బుధవారం రాత్రి ఒక  పిడికెడు శనగలను నానబెట్టేది. గురువారం ఉదయం వాటిని భూత దయతో వృక్ష సముదాయాలు లేక పూల చెట్లు ఉన్న మధ్యలో వాటిని చల్లటానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా హైరానా పడవద్దు. మీరు వెళ్ళలేక పోతే ఇతరుల చేత చల్లటానికి పంపించండి. ఇక్కడ మనసు మాత్రమే ముఖ్యమని గమనించండి.

18 సంవత్సరాల నుంచి 36 మధ్య గల వయస్కుల విషయంలో తల్లి తండ్రులు గమనించాల్సినవి అనేకం ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వివాహ, సంతాన, వ్యవహార అంశాలతో పాటు వారు నివసించే గృహ సంబంధిత విషయాలు కూడా దృష్టిలో ఉంచుకొని సరియైన ఆలోచన చేయాలి. అంటే సంతానానికి సరియైన ఉద్యోగం లేకపోతే.... అనవసరంగా వారిని ఈ నాలుగు మాసాలలో నిందించే విధంగా మాటలు రాకూడదు. చాలా తక్కువ మార్కులతో పాస్ అయినందున... ఈ గతి పట్టిందని పదిమందిలో సంతతిని కించ పరిచేలా మాటలాడవద్దు. అలాగే వివాహ విషయాలో కూడా... పెద్దల నిర్ణయానుసారంగానే జరగకుండా... సంతాన ఇష్టానుసారంగా జరిగే అవకాశాలు కొంత మందికి ఉంటుంటాయి. ఇలాంటి సందర్భాలలో ముందు జాగ్రత్తగా గమనిస్తూ... తనదైన సరళిలో నచ్చ చెప్పి... ఎట్టి కోపతాపాలకు తావివ్వకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు సంతానానికి వివాహం చేయాలన్నా ... తగిన వ్యక్తి దొరకని కారణంగా కూడా మానసిక వేదన అనుభవించే వారు ఉంటారు. ఒక వేళ వివాహం జరిగి ఉంటే వారి దాంపత్య బంధం సజావుగా సాగక... కొన్ని కొన్ని సమస్యలతో ఉండే వారు ఉంటారు. అంతేకాక ఆరోగ్య వ్యాపార వ్యవహార గృహ విషయాలలో.... అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటిగా ఉంటుంటుంది.


పైన చెప్పిన ఇలాంటి సమస్యలు సంతానానికి ఉండే తల్లి తండ్రులు సంయమనం పాటిస్తూ... జూలై 1వ తేదిన ఆకాశంలో కనపడే శుభగ్రహాల కలయికను హృదయ పూర్వకంగా దర్శించి ధన్యత నొంది అనుగ్రహం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే సంతాన కారకుడైన శుభగ్రహమే గురువు. ఇట్టి శుభ గురువు ఉచ్చ స్థితిలో ఉండి అరుదైన పరిస్థితులలో మరో శుభగ్రహమైన శుక్రుడుతో కలిసి దర్శనం ఇవ్వబోతున్నారు.  ఇది ఈ నాలుగు మాసాలలో చివరి మాసమైనప్పటికీ... ముందు జరిగే మూడు మాసాలలో తెలియ చేసే సమయాలలో మనసును స్థిమితం చేసుకుంటూ సంయమనం పాటిస్తూ ఆగ్రహాలకు తావివ్వక జాగ్రత్తగా ముందుకు సాగవచ్చు. నాల్గవ మాసంలో కనపడే గురు శుక్రుల దర్శనాన్ని దర్శించండి. ప్రత్యేక పరిహారములు అవసరం లేదు.

ఒకటి నుంచి 18 సంవత్సరాల సంతతి గల తల్లి తండ్రులు దూరాలోచనతో ఈ నాలుగు మాసాలు గడపాలి. ఎందుకంటే.... సహజంగానే ఈ నాలుగు మాసాలలో విద్య నిలయాలకు సెలవులతో పాటు నూతనంగా పాఠశాలలు ప్రారంభించటము, పై తరగతులలో చేరటము జరుగుతుంటుంటాయి. స్నేహితులు, స్నేహితురాండ్లు కలవటాలు, ఆలోచనలను పంచుకోవటాలు సహజంగా జరుగుతాయి. గ్రహచార ప్రభావం వలన వృషభరాశి జాతకుల సంతతికి మాత్రం... ఆలోచనలు అనుకూలం కాకుండా వ్యతిరేకంగా తీసుకొనే అవకాశం ఉంది. లేని పోని అలవాట్ల వైపు మొగ్గు చూపటము, డబ్బును తృణ ప్రాయంగా ఖర్చు చేయటము, ఇది ఎండల కాలం... ఎండలు మండుతుంటాయి. తల్లి తండ్రులకు తెలియకుండా స్నేహితులతో కలిసి షికార్లకి వెళ్లి.... వడదెబ్బ లేదా ఇతర సమస్యలకు లోనై  ఆరోగ్యాలు చెడగోట్టుకొనే అవకాశం ఉంటుంటుంది. అలాగే చంటి బిడ్డలు ఉన్నవారైతే... సమయానికి వారి ఆరోగ్య విషయాలను పరిరక్షిస్తూ ఉంటూ ఉండాలి. ఇలా కాక ఈ నాలుగు మాసాలలో భార్య గర్భవతి ఉన్న సందర్భాలలోని వారు.... సమయానికి వైద్యులు ఇచ్చిన నిర్ణయాలను పాటిస్తూ... తినదగిన పదార్ధాలనే తింటూ ఎండలలో తిరగకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొనవలసిన అవసరం ఉందని వృషభ రాశి జాతకులు గమనించాలి.

వృషభరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 10 ఉదయం 7.30 నుంచి 12 మధ్యాహ్నం 12.56 వరకు
మే 7 మధ్యాహ్నం 1.04 నుంచి 9 సాయంత్రం 6.29 వరకు
జూన్  3 రాత్రి 7.50 నుంచి 5 రాత్రి 12.18 వరకు
జూలై 1 ఉదయం 4.19 నుంచి 3 ఉదయం 7.50 వరకు
జూలై 28 మధ్యాహ్నం 1.52 నుంచి 30 సాయంత్రం 5.18 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.

వీటితో పాటు కృత్తిక 2,3,4 జాతకులు :
ఏప్రిల్ 9 ఉదయం 6.52 నుంచి 10 ఉదయం 7.30  వరకు,
ఏప్రిల్ 17 రాత్రి 7.49 నుంచి 18 సాయంత్రం 5.23 వరకు,
ఏప్రిల్ 26 మధ్యాహ్నం 3.54 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు,
మే 6 మధ్యాహ్నం 12.41 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు,
మే 15 ఉదయం 4.35 నుంచి అర్థరాత్రి తదుపరి 5.42 వరకు,
మే 23 రాత్రి 12.03 నుంచి 24 అర్థరాత్రి తదుపరి 2.28 వరకు,
జూన్ 2 రాత్రి 7.51 నుంచి 3 రాత్రి 7.50 వరకు,
జూన్ 11 ఉదయం 10.59 నుంచి 12 ఉదయం 9.40  వరకు,
జూన్ 20 ఉదయం 8.31 నుంచి 21 ఉదయం 10.41 వరకు,
జూన్ 30 ఉదయం 4.31 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు,
జూలై 8 సాయంత్రం 4.20 నుంచి 9 మధ్యాహ్నం 3.08 వరకు,
జూలై 17 సాయంత్రం 4.25 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు,
జూలై 27 మధ్యాహ్నం 1.51 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

రోహిణి జాతకులు :
ఏప్రిల్ 10 ఉదయం 7.30 నుంచి 11 ఉదయం 7.36  వరకు,
ఏప్రిల్ 18 సాయంత్రం 5.23 నుంచి 19 మధ్యాహ్నం 3.09 వరకు,
ఏప్రిల్  27 సాయంత్రం 6.38 నుంచి 28 రాత్రి 9.40 వరకు,
మే 7 మధ్యాహ్నం 1.04 నుంచి 8 మధ్యాహ్నం 1.03 వరకు,
మే 15 అర్థరాత్రి తదుపరి 5.42 నుంచి 16 అర్థరాత్రి 12.53 వరకు,
మే 24 అర్థరాత్రి తదుపరి 2.28 నుంచి 26 ఉదయం 5.20 వరకు,
జూన్ 3 రాత్రి 7.50 నుంచి 4 రాత్రి 7.22 వరకు,
జూన్ 12 ఉదయం 9.40 నుంచి 13 ఉదయం 8.26  వరకు,
జూన్ 21 ఉదయం 10.41 నుంచి 22 మధ్యాహ్నం 1.22 వరకు,
జూలై 1 ఉదయం 4.19 నుంచి అర్థరాత్రి తదుపరి 3.31  వరకు,
జూలై 9 మధ్యాహ్నం 3.08 నుంచి 10 మధ్యాహ్నం 2.09 వరకు,
జూలై 18 సాయంత్రం 6.32 నుంచి 19 రాత్రి 9.07 వరకు,
జూలై 28 మధ్యాహ్నం 1.52 నుంచి 29 మధ్యాహ్నం 1.09 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

మృగశిర 1,2 పాద జాతకులు :

ఏప్రిల్ 11 ఉదయం 7.36 నుంచి 12 ఉదయం 7.11 వరకు,
ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3.09 నుంచి 20 మధ్యాహ్నం 1.18 వరకు,
ఏప్రిల్  28 రాత్రి 9.40 నుంచి 29 రాత్రి 12.47 వరకు,
మే 8 మధ్యాహ్నం 1.03 నుంచి 9 మధ్యాహ్నం 12.40 వరకు,
మే 16 అర్థరాత్రి 12.53 నుంచి 17 రాత్రి 11.15 వరకు,
మే 26 ఉదయం 5.20 నుంచి 27 ఉదయం 8.25 వరకు,
జూన్ 4 రాత్రి 7.22 నుంచి 5 సాయంత్రం 6.34 వరకు,
జూన్ 13 ఉదయం 8.26 నుంచి 14 ఉదయం 7.20 వరకు,
జూన్ 22 మధ్యాహ్నం 1.22 నుంచి 23 సాయంత్రం 4.22 వరకు,
జూలై 1 అర్థరాత్రి తదుపరి 3.31 నుంచి 2 అర్థరాత్రి 2.15 వరకు,
జూలై 10 మధ్యాహ్నం 2.09 నుంచి 11 మధ్యాహ్నం 1.27 వరకు,
జూలై 19 రాత్రి 9.07 నుంచి 20 రాత్రి 12.03 వరకు,
జూలై 29 మధ్యాహ్నం 1.09 నుంచి 30 మధ్యాహ్నం 11.46 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 


ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి వృషభరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.

తదుపరి పోస్టింగ్ లో మిధునరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు