Friday, April 3, 2015

విదేశాలలో చైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం

శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ శనివారం 4.4.2015 హస్త నక్షత్ర కన్యారాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం జరుగును. సంపూర్ణ చంద్రగ్రహణ బింబము 5 నిముషాల పాటు ఉండును.

డెన్వర్, ఫోనిక్స్, లాస్ ఏంజిల్స్ నగరాలలో చంద్రగ్రహణ స్పర్శను, సంపూర్ణ స్థితిని, విడుపును చూడవచ్చును. కానీ గ్రహణ చివరి భాగాన్ని (మోక్షం) వీక్షించలేరు. పోర్ట్ ల్యాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్ నగరాలలో స్పర్శ నుంచి మోక్షం వరకు గ్రహణాన్ని పూర్తిగా వీక్షించవచ్చును. 

ఈ ప్రాంతాలలో 4 వ తేది అర్థరాత్రి తదుపరి
గ్రహణ స్పర్శ                                        - రాత్రి 2గంటల16నిముషాలు
సంపూర్ణ గ్రహణానికి చేరిక                     - రాత్రి 3గంటల 58నిముషాలు
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం        -  తె 4గంటల 03నిముషాలు
గ్రహణ ముగింపు   (మోక్షం)                  - ఉ 5గంటల 45నిముషాలు


ఆస్టిన్, చికాగో, డల్లాస్, హోస్టన్, మాంటెర్రె ఈ 5 నగరాలలో స్పర్శ స్థితిని, సంపూర్ణ స్థితిని, విడుపును, విడుపు ప్రారంభాన్ని చూడగలరు గాని మోక్షాన్ని చూడలేరు. ఎందుకంటే ఆ సమయానికి సూర్యోదయాలగును.

ఈ 5 ప్రాంతాలలో గ్రహణ స్పర్శ 4 వ తేది అర్థరాత్రి తదుపరి
గ్రహణ స్పర్శ                                        - తె 4గంటల16నిముషాలు
సంపూర్ణ గ్రహణానికి చేరిక                     - ఉ 5గంటల 58నిముషాలు
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం        - ఉ  6గంటల 03నిముషాలు
గ్రహణ ముగింపు   (మోక్షం)                  - ఉ 7గంటల 45నిముషాలు


అట్లాంటా, బోస్టన్, డెట్రాయిట్, ఫిలడెల్ఫియా, పిట్స్ బర్గ్, జాక్సన్ విల్లె, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, రిచ్మండ్  అను 9 నగరాలలో స్పర్శను మాత్రమే చూడగలరు. వెంటనే సూర్యోదయాలు కావటంతో సంపూర్ణ స్థితిని గానీ, విడుపును గానీ, మోక్షాన్ని గానీ చూడలేరు.

ఈ 9 ప్రాంతాలలో గ్రహణ స్పర్శ 5 వ తేది ఉదయం సూర్యోదయ పూర్వము
గ్రహణ స్పర్శ                                        - ఉ  5గంటల16నిముషాలు
సంపూర్ణ గ్రహణానికి చేరిక                     - ఉ 6గంటల 58నిముషాలు
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం        - ఉ 7గంటల 03నిముషాలు
గ్రహణ ముగింపు   (మోక్షం)                  - ఉ 8గంటల 45నిముషాలు


కనుక పై సమయాలలో పై ప్రాంతాలలో ఉండే గర్భిణులు గ్రహణ జాగ్రత్తలను పాటించేది.
తదుపరి పోస్టింగ్ లో సింహరాశి వారు తీసుకొనవలసిన జాగ్రత్తలు తెలుసుకోగలరు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.