Thursday, March 3, 2016

నాగబంధన, గురుచండాల తదితర అరిష్ట గ్రహణ గ్రహస్థితులకు నివారణ

2016 జనవరి 29 నుంచి ఆగస్ట్ 11 వరకు సింహరాశిలోనే గురు చండాల యోగం జరుగుతున్నది. ముఖ్యంగా ఓ వైపు సింహరాశిలో చండాల యోగం జరుగుతుంటే, సింహరాశి అధిపతి రవికి 9 మార్చి 2016 న గురు  నక్షత్రమైన పూర్వాభాద్ర కుంభ రాశిలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది.  తిరిగి 1 సెప్టెంబర్ 2016న కంకణ పూర్వక సంపూర్ణ సూర్య గ్రహణం సింహరాశిలోనే రాహుగ్రహంచే సంభవించనుంది. ఈ రెండు గ్రహణాల మధ్యలో అనగా ఏప్రిల్ 17 నుంచి జూన్ 17 వరకు వృశ్చిక రాశిలో వైరి గ్రహాలైన శని మరియు కుజుడు ఇరువురు ఏక కాలంలో వక్ర సంచారం చేస్తున్నారు. ఇది ఒక అరిష్ట యోగము. ఇది కాక  జూన్ 25 శనివారం సూర్యోదయానికి పూర్వము భారత కాలమాన ప్రకారం 3గంటల 24 నిముషాల 22 సెకన్లకు ఒకే బిందువులో గురువుపై రాహు పంజా ఏర్పడనుంది. దీనినే నాగ బంధనం అంటారు.

సహజంగా రాహువుతో కుజుడు కలిసిన, రాహువుతో శుక్రుడు కలిసినా, ఏదో ఒక సమయంలో ఒక బిందువులో నాగ బంధనం ఏర్పడుతుంది. కాని గురు గ్రహ విషయంలో మాత్రం... ప్రప్రధమంగా చండాల యోగంతో ప్రారంభమై, నాగ బంధనం జరిగి... ఆ పిమ్మట చండాల యోగం సమాప్తమవుతుంది.
నాగ బంధన ప్రభావం, నాగబంధనం జరిగిన 25 జూన్ 2015 తదుపరి దాదాపు కొన్ని మాసాల వరకు వ్యతిరిక్తంగా ఉండును. ఇందులో భాగంగా 2016 ఆగష్టు 24 ఆదివారం నాడు గురువు, శని, గ్రహాలు ఒకే బిందువులో సంఘర్షణ పూర్వకంగా కలవటం జరుగును.

కనుక రెండు మార్చి 9 సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావము మరియు కుజ శనుల వక్ర సంచార ప్రభావము నాగ బంధన ప్రభావము, కుజ శనుల కలయిక, కంకణ సూర్య గ్రహణ ప్రభావాల నివృత్తి కొరకుగా మొత్తం 7 పర్యాయములు సశాస్త్రీయ పద్దతిలో వైదిక క్రియలు చేసుకొనుటకు.. 7 అవకాశ దినములు ఉన్నవి. ఈ 7 అవకాశ దినములు ఏమనగా.... 1.  2016 మార్చి 6 మాఘ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం నాడు... 2. 3 ఏప్రిల్ 2016 ఫాల్గుణ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారమ్... 3. 1 మే 2016 ఆదివారం దుర్ముఖి చైత్ర అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం... 4. 29 మే 2016 వైశాఖ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం... 5. జూన్ 24 శుక్రవారం (నాగబంధనం జరిగే ముందురోజు)... 6. జూలై 3 ఆదివారం జ్యేష్ట అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం... 7. జూలై 31 ఆదివారం ఆషాఢ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం రోజులలో నందనవనం నాగ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో యోగి టీవీ చానల్ మరియు నా ( శ్రీనివాస గార్గేయ ) సంయుక్త ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష రీతిలో దోష నివృత్తికై, మానవాళి శ్రేయస్సుకై కార్యక్రమములు జరగనున్నవి. 

వాస్తవానికి దీని ప్రభావం మార్చ్ 9 గ్రహణం ముందునుంచే ప్రారంభమగును. ఈ విషయాన్నే 1 మార్చి 2016 మంగళవారం నాడు విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో చెప్పిన అంశాలలో కొన్ని ఏమనగా... మార్చి 9 సంపూర్ణ సూర్య గ్రహణానికి ముందు వెనుకాలలో ఇండోనేషియా, సుమిత్ర, పాకిస్తాన్, చైనా ప్రాంతాలలో భారీ భూకంప తీవ్రతలు రిక్టర్ స్కేల్ పై 6.6 గాని, 7.8 గాని ఉండునని... సునామి హెచ్చరికలు జారి అగునని తెలియచేస్తూ, దేశాల నడుమ విభేదాలు తారాస్థాయిలో ఉండి యుద్ధ భయ వాతావరణం ఉండేలా అశాంతి నెలకొనునని, ప్రజల క్షేమం కోసం కోరుకొనే ముఖ్య మంత్రులు కాని, ప్రధాన మంత్రులుకాని, దేశాధ్యక్షులు గాని (ప్రపంచమంతటా) ప్రప్రధమంగా వారి భద్రతను కట్టు దిట్టం చేసుకోవాలని తెలియని రీతిలో ఉగ్రవాద చర్యలు ఉండి అవాంచనీయ సంఘటనలు రాజకీయ వర్గీయులకు ఉండునని, గతంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన గ్రహ స్థితులకు సమానంగా ఉండే స్థితి గతులు రాబోతున్నవని తెలియచేశాను. ఈ విషయానికి సంబంధించిన దిన పత్రికల కటింగులతో పాటు... ఇదే విషయాన్నీ ఫేస్బుక్ లో కూడా పొందు పరచటం జరిగింది.


ఏప్రిల్ 17 నుంచి జూన్ 17 వరకు సింహరాశిలో పరస్పర శత్రుత్వమున్న శని గ్రహ మరియు కుజగ్రహం రెండూను వక్ర సంచారం ఉండును. ఈ సంచా...
Posted by Sreenivasa Gargeya Ponnaluri on Tuesday, March 1, 2016


దినపత్రికలలో వచ్చిన వార్తలను దృష్టిలో ఉంచుకొని భూకంపాలు వస్తాయని ప్రజలను గార్గేయ సిద్దాంతి భయపెడుతున్నాడని కొంతమంది హేతువాదులు, కొన్ని టెలివిజన్ సంస్థలు నాపై దుమ్మెత్తి పోసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలనే ఉద్దేశ్యంతో నన్ను అడగటం... విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పిన వివరాలనే వారికి తెలియ చేయటం, వారు దాన్ని వీడియో తీయటం, గార్గేయ సిద్ధాంతి భూకంపాలు వస్తాయని భయపెట్టే ధోరణిలో మాట్లాడుతున్నరనే విధంగా  2వ తేది రాత్రి ప్రైమ్ టైం వార్తలలో చెప్పాలనుకున్నారు. కాని సాయంత్రం 6.30 గంటలకల్లా అన్ని టెలివిజన్ చానల్ లో ఇండోనేషియాలో భారి భూకంపమని, సునామి హెచ్చరికలు జారి అనే వార్తలు రావటంతో... ప్రైమ్ టైం వార్తాలలో ఎలాంటి అంశాలు ప్రసారం చేయకుండానే ఆగిపోయారు. 


మొత్తం మీద గ్రహణాలు, వక్ర సంచారాలు, శని కుజుల సంఘర్షణలు, నాగ బంధనం, మరియు గురు చండాల యోగ ప్రభావాలు రాజకీయ వర్గీయులపైన అత్యధికంగా ఉండునని, సాధారణ వ్యక్తులకు కూడా కుటుంబ, ఆర్ధిక, సంతాన, దాంపత్య, వివాహ, ఉద్యోగ, వ్యాపార, రుణ, శత్రు, తదితర విషయాలలో తగు తగు రీతిలో కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకొనవలసి ఉండును. కనుక పై అరిష్ట గ్రహస్థితుల దోష నివారణకై నందనవనం నాగ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మరియు యోగి టీవీ, నా ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగును. ఈ కార్యక్రమాలకు విరాళం ఇచ్చు వారలకు ఆదాయపు పన్ను 80 జి (5) చట్టం ప్రకారం ఆదాయపు పన్ను రాయితీ లభించును. పూర్తి వివరములకై 7337596524, 7337596521, 7702021818 నంబర్లకు ఫోన్లు చేసి తెలుసుకొనవచ్చును.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.