జ్యోతిష శాస్త్ర రీత్యా గురువు ఓ శుభ గ్రహం. గురు గ్రహానికి 3 స్వనక్షత్రాలు ఉన్నాయి. అవి పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు.. జాతక చక్రాలలో గురువు రాహువుతో కలిసిన సందర్భాలలో వివాహ సంబంధ అంశాల మీద వ్యతిరేక ప్రభావాలు వస్తుంటాయి. ఈ గురు రాహు కలయికనే నాగ దోషము అంటారు. ఇక్కడ నాగ అంటే పెండింగ్ అని అర్థము. అనగా తరచూ వాయిదాలు పడటము అని భావము.
గురు రాహువులు ఒక రాశిలో ఉన్నప్పుడు, ఈ రెండు గ్రహాల మధ్య దూరమును బట్టి ఫలితములు ఉండును. అంతేతప్ప ఈ రెండు గ్రహాలూ కనపడినంత మాత్రాన సమస్యలు వస్తాయని అనుకోకూడదు. వివాహానికి సంబంధించిన అంశాలలో కర్కాటక రాశిలో గురు రాహువుల కలయిక వలన ఫలితాలు ఓ రకంగా ఉంటే, మకర రాశిలో గురు రాహు కలయిక ఫలితాలు మరో రకంగా ఉంటే, ధను, మీన రాశులలో గురు రాహు కలయిక ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయి.
వివాహము ఒక్కోసారి ఆలస్యము కావటము, చిట్ట చివరి వరకు వచ్చి స్థిరం కాకుండా వాయిదా పడటము, ఒకవేళ ఆలస్యంగా వివాహం జరిగిననూ, తదుపరి ఏవో సమస్యలు వెంటాడటము, మానసిక శారీరక సంఘర్షణలు ఎదురుకావటము, వివాహమైనప్పటికీ సంతానం లేకుండా అనేక ఇబ్బందులకు గురి కావటము, ఒక్కోసారి ద్వితీయ వివాహ యోగానికి దారి తీయటము, ఒకే ఇంట్లో ఒకే సంబంధిత రుగ్మతతో బాధపడటము లేదా అంధులుగా గాని మూగ వారిగా గాని కుటుంబంలో అధికులుగా ఉండటము మొదలైన అంశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
మేష వృశ్చిక రాశులలో గురు రాహు కలయికల వలన వ్యతిరేక ప్రభావాల తీవ్రత అధికంగానే ఉంటుంది. ఒక్కోసారి చెప్పనలవి కాని సమస్యలు ఉంటూ కష్ట నష్టాలను ఇతరులకు చెప్పుకోలేక బాధపడేవారు కూడా ఉంటుంటారు. ఇదే గురు రాహు కలయిక సింహరాశిలో ఉంటే ఫలితాలన్నీ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉండటమే కాకుండా పితరుల యొక్క ఆశీస్సులు కూడా లేకుండానే జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది.
మిధున, కన్య రాశులలో గురు రాహు కలయికలు ఉంటే ప్రముఖంగా శత్రుత్వంతో కూడిన వైవాహిక జీవితం అనుభవిస్తూ ఉండాలి. ఇక కుంభరాశిలో ఈ కలయిక జరిగితే వైవాహిక జీవితంలో చేసిన పనులే ఒకటికి రెండు సార్లు కూడా చేయవలసిన పరిస్థితులు కూడా వస్తుంటాయి.
పైన చెప్పిన వివరాలన్నీ నాణేనికి ఒకవైపున ఉన్న 50 శాతం మాత్రమే అని గమనించాలి. ఈ రెండు గ్రహాల కలయిక మధ్య దూరాన్ని బట్టే కాకుండా, వారి వారి జన్మ నక్షత్ర స్థితిని బట్టి కూడా ఫలితాలు ఉంటూ ఉంటాయి. జ్యోతిష రీత్యా 12 రాశులలో జన్మించిన వారు ఉంటుంటారు. వీర్లకు ఏ రాశిలో ఈ కలయిక ఉందో గమనించాలి. ఉదాహరణకు కృత్తిక నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులకు ప్రభావం ఓ రకంగా ఉంటే, కృత్తిక నక్షత్ర 2,3,4 పాదాలలో జన్మించిన వృషభరాశి వారికి ఫలితాలు మరో రకంగా ఉంటాయి. మొత్తం మీద గురు, రాహు కలయికలో ఉన్న నాగబంధన స్థితిగతులు మొత్తం 432 రకాలని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పవచ్చును.
ఈ 432 ప్రభావాలు వివాహ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని విచారిస్తే రక రకములైన స్థితి గతులు కనపడుతుంటాయి. ఒక్కోసారి నవాంశ చక్రంలో కూడా ఈ రెండిటి కలయికను పరిగణలోకి తీసుకొని ఫలిత విశ్లేషణ చేయాలి. అంటే జన్మించిన సమయానికి ఉన్న స్థితి గతులలో గురు రాహువులు ఉండి ఉంటే ప్రస్తుతం జాగ్రత్త ఒక విధంగా తీసుకోవాలి. జన్మ సమయానికి లేకుండా ఉండి ఉంటే, ప్రస్తుతం జరిగే ఈ కలయిక ప్రభావ విషయంలో జాగ్రత్తలు ఇంకో రకంగా తీసుకోవాలి.
కనుక గురు రాహు నాగబంధన ఒకటవ భాగానికి ముగింపు చెప్పే అంశంలో విశ్లేషించేది ఏమనగా... ఇలాంటి కలయికలు ఉన్న జాతకులు చెప్పబోయే పరిహారములను పాటిస్తూ ఉంటుంటే మానసిక ప్రశాంతతో పాటు వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పట్టేలా ఉండుటకు అవకాశం రాగలదు.
మంచి మనస్సుతో ఉంటూ నిబద్దతో కూడిన జీవితం సాగిస్తున్నప్పటికీ ఈ గురు రాహు నాగబంధన అంశాలలోని 432 ఫలితాలలో మచ్చుకు 1,2 తీసుకుంటే, తప్పు లేకపోయిననూ ఎదుటి వారి ముందు శిక్ష అనుభవించే రీతిలో ముద్దాయిగా నిలబడుతూ, ఒక్కోసారి న్యాయస్థానాల మెట్లెక్కటము, కారాగారంలో నివాసముండటము వంటి వ్యతిరేక పరిస్థితులు చోటుచేసుకుంటాయి.
కనుక ఏ నక్షత్రంలో జన్మించిననూ గురు మహాదశ గాని లేక గురు అంతర్దశ గాని, స్థూల సూక్ష్మ ప్రాణ దశలలో గురువుకు సంబంధించినవిగా ఉంటే ఫలితాలు వ్యతిరేకంగా ఉంటుంటాయని భావించాలి. కాబట్టి సింహరాశిలో ప్రస్తుతం జరిగే గురు రాహు చండాల యోగంలో భాగంగా 25 జూన్ 2016 న ఖగోళంలో రాహువుతో గురు గ్రహానికి నాగ బంధనం జరగనుంది. ఇది అనేక శతాబ్దాల తరువాత వస్తున్న గ్రహస్థితిగా అభివర్ణించాలి. కనుకనే పూర్తి స్థాయిలో పరిహార విధి విధానమును తెలుసుకుంటూ, ఆచరిస్తుంటే మేలైన పరిస్థితులు తప్పక రాగలవని జ్యోతిష శాస్త్ర నిర్ణయము.
యోగి టీవీ మరియు నా ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నాగ బంధన నివృత్తికై ఆచరించే సప్త మహా సూర్య యాగాలలో భాగంగా రెండవ యాగం 2016 ఏప్రిల్ 3 న ఆదివారం నాడు విశాఖపట్టణంలో జరగనున్నది. కనుక ఆ ప్రాంతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చును. పూర్తి వివరములకు ఈ దిగువ నంబర్లలో సంప్రదిన్చవచ్చును.
7337596524, 7337596521, 7702021818
మూడవ ధారావాహిక పోస్టింగ్‌లో సంతాన విషయాలపై నాగ బంధన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.