Saturday, May 17, 2014
Thursday, May 15, 2014
హ్రీంకార యజ్ఞము - సర్వార్థసాధక చక్ర అవసర సారంశము 8
5. సర్వార్థ సాధకచక్రము
పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో ఐదవచక్రమే సర్వార్థ సాధక చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై చతుర్దశారం పైన పది కోణాలతో ఉండే చక్రము, దీనిని బహిర్దశారము అంటారు.
దీనికి 10 కోణాలు ఉంటాయి. ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఐదవదిగా ఉన్నవిశుద్ధి చక్రమే. ఇది శరీరంలో కంఠస్థానం దగ్గర ఉండును. ఈ సర్వార్థ సాధక చక్రములో పది మంది కులోత్తీర్ణ యోగినీ దేవతలు ఉంటారు.
వాక్కునకు నాలుగు రూపాలు ఉంటాయి. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగు రూపాలు. ఇవి లలితా సహస్రంలోని 366, 368, 370, 371 నామాలలో స్పష్టమవుతుంది. 366 సంఖ్యలో ఉన్న పరాయై అనగా మానవుడు ఏది చేయాలన్నా లేదా పలకాలన్నా అంటే తన ఆలోచన లేక మాట లేక నిర్ణయం మెదడు స్థానంలో ఉన్న సహస్రారమున కల్గును. సహస్రారమందలి పరా దశలో ఉన్న వాక్కే పరా వాక్కు.
368 సంఖ్యలో ఉన్న పశ్యంత్యై అనగా ఈ వాక్కు లేక శబ్దం లేక నాదం జనించుటకు వాయువు అవసరం. ఎప్పుడైతే సహస్రారంలో ఓ మాట పలకాలి లేక ఓ శబ్దం చేయాలి అనే ఆలోచన రాగానే, పరా నాడి వలన ప్రేరణ పొంది, వాయువు మూలాధార చక్రంలో ఏర్పడును. కనుక ఇట్టి మూలాధార చక్రంలో ఉండే వాక్కు యొక్క దశనే పశ్యంతి దశ అంటారు.
370 సంఖ్యలో ఉన్న మధ్యమాయై అనే నామానికి అర్థం ఏమిటంటే పై విధంగా మూలాధారంలో జనించిన వాయువు స్వాధిష్టాన, మణిపూరక చక్రములను సుషుమ్న నాడి ద్వారా దాటి అనాహత చక్రమునకు చేరిన దశనే మధ్యమా అంటారు.
371 సంఖ్యలో ఉన్న వైఖరీరూపాయై అనే నామానికి అర్థం ఏమిటంటే అనాహత చక్రంలో మధ్యమా రూపంలో ఉన్న వాక్కు... విశుద్ధి చక్రాన్ని చేరి, అక్కడ ఆ శబ్దము ఒక స్పష్టమైన అక్షర రూపమును పొంది ఉచ్చరింపబడును. ఇదే వాక్కు యొక్క వైఖరీ రూపము.
పై నాలుగు నామాలలోని నాల్గు దశలలో వాక్కు అనేది అస్పష్టంగా (వాయురూపంలో) ఉంటుంది. నాల్గవ నామంలో చెప్పిన వైఖరీ రూపంలోనే మాటగా స్పష్టమై ఇతరులకి వినపడుతుంది. అందుకే ఈ నాల్గు రూపాలతో ఉన్న వాక్కుకు సర్వార్థసాధకము అని పేరు. సమస్త విద్యలన్నీ కంఠస్థానములో ఉన్న విశుద్ధి చక్రము నుండే వైఖరీ రూపంలో వస్తుంటాయి.
సర్వార్థసాధక చక్రానికి అధిష్టాన దేవతే త్రిపురాశ్రీ. మూలాధారంలో త్రిపురా అని చెప్పబడ్డ దేవత... ఇక్కడ త్రిపురాశ్రీ అని పిలవబడుచున్నది. శ్రీ అనగా శ్రీవిద్య. శ్రీవిద్య ఒక్కటే మోక్షప్రదము. మిగిలిన విద్యలన్నీ డబ్బు సంపాదించుకొని ఉదర పోషణతో బ్రతకటానికే.
శ్రీ లలితా రహస్య సహస్ర నామాలలో మొత్తం 12 సార్లు ( 1, 2, 3, 56, 85, 127, 392, 585, 587, 996, 997, 998) మాత్రమే శ్రీ అనే అక్షరంతో నామాలు ఉన్నవి. పరోక్షంగా చెప్పాలంటే పంచదశీ మహామంత్రాన్ని ఈ లోకంలోకి తెచ్చినవారు పన్నెండు మంది. వారికి ప్రతీకగా ఈ నామాలలో పన్నెండు సార్లు శ్రీ ఉన్నది. ఈ పన్నెండు మందే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, నందికేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, విష్ణువు, శివుడు, దుర్వాసుడు. ఈ పన్నెండు మందే ప్రఖ్యాతి గడించిన దేవి ఉపసాక మహానుభావులు.
ఈ చక్రంలోని శ్రీ అనే పదానికి పరిపూర్ణమైన భావాలన్నీ హ్రీంకార మహాయజ్ఞ పుస్తకంలో ఉండును.
ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వోన్మాదినీ.
కనుక సర్వార్థ సాధక చక్రములోని 10 కులోత్తీర్ణ యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో ఐదవముద్రను గమనించండి.
1. ఓం హ్రీం సర్వసిద్దిప్రదాయై విద్మహే హ్రీం శ్వేతవర్ణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
2. ఓం హ్రీం సర్వసంపత్ప్రదాయై విద్మహే హ్రీం మహాలక్ష్మ్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
3. ఓం హ్రీం సర్వప్రియంకర్యై విద్మహే హ్రీం కుందవర్ణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
4. ఓం హ్రీం సర్వమంగళకారిణ్యై విద్మహే హ్రీం మంగళాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
5. ఓం హ్రీం సర్వకామప్రదాయై విద్మహే హ్రీం కల్పలతాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
6. ఓం హ్రీం సర్వదుఃఖవిమోచన్యై విద్మహే హ్రీం హర్షప్రదాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
7. ఓం హ్రీం సర్వమృత్యుప్రశమన్యై విద్మహే హ్రీం సర్వసంజీవిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
8. ఓం హ్రీం సర్వవిఘ్ననివారిణ్యై విద్మహే హ్రీం సర్వకామాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
9. ఓం హ్రీం సర్వాంగసుందర్యై విద్మహే హ్రీం జగద్యోన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
10. ఓం హ్రీం సర్వసౌభాగ్యదాయిన్యై విద్మహే హ్రీం జగజ్జనన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
తదుపరి పోస్టింగ్ లో ఆరవదైన సర్వరక్షాకర చక్రం గురించి తెలుసుకుందాం. - శ్రీనివాస గార్గేయ

Monday, May 12, 2014
హ్రీంకార యజ్ఞము - సర్వసౌభాగ్యప్రద చక్ర అవసర సారంశము 7
4.
సర్వసౌభాగ్యప్రద చక్రము
పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో నాల్గవచక్రమే సర్వసౌభాగ్యప్రద చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై అష్టదళం పైన పధ్నాలుగు కోణాలు గల, చతుర్దశార ఆవరణంగా ఉండినదే సర్వసౌభాగ్యప్రద చక్రము అంటారు.
దీనికి 14 కోణాలు ఉంటాయి. ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో నాల్గవదిగా ఉన్నఅనాహత చక్రమే. ఇది శరీరంలో హృదయ స్థానం దగ్గర ఉండును. ఈ సర్వసౌభాగ్యప్రద చక్రములో పధ్నాలుగు మంది సంప్రదాయ యోగినీ దేవతలు ఉంటారు.
14 కోణాలు 14 లోకాలకు ప్రతీక. దీనిలో అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళమనే 7 అధోలోకాలు... భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే 7 ఊర్ధ్వ లోకాలకు ప్రతీకే ఈ చక్రము.
తెలుగు నిఘంటువు ప్రకారం సౌభాగ్యమంటే భాగ్యవంతము,వైభవము, సౌభాగ్యము, అందము, శుభగత్వము అనే పలు అర్థాలున్నవి.
హిందూ వివాహ వ్యవస్థలో సంప్రదాయాలు చూడటం ఓ ఆనవాయితీ. ఎంత గొప్ప ధనవంతుడు, అధికారి అయినప్పటికీ సంప్రదాయం లేనిచో సంబంధాలు చూడరు. అలాగే సంప్రదాయ బద్ధంగా ఉంటేనే సౌభాగ్యం లభిస్తుందని ఈ నాల్గవ చక్రం ద్వారా ఓ రహస్య సంకేతం తెలుస్తుంది.
మూలాధారానికి గణపతి, స్వాధిష్టానానికి బ్రహ్మ, మణిపూరకానికి విష్ణువు అధిదేవతలుగా ఉన్నట్లుగానే అనాహత చక్రానికి రుద్రుడు అధిదేవత కాగా, సర్వ సౌభాగ్యప్రద చక్రానికి అధిష్టాన దేవత పేరే త్రిపుర వాసిని. ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వవశంకరీ.
కనుక సర్వసౌభాగ్యప్రద చక్రములోని 14 సంప్రదాయ యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో నాల్గవ ముద్రను గమనించండి.
1. ఓం హ్రీం సర్వసంక్షోభిణ్యై విద్మహే హ్రీం బాణహస్తాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
2. ఓం హ్రీం సర్వవిద్రావిణ్యై విద్మహే హ్రీం కార్ముకహస్తాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
3. ఓం హ్రీం సర్వాకర్షిణ్యై విద్మహే హ్రీం శోణవర్ణాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
4. ఓం హ్రీం సర్వాహ్లాదిన్యై విద్మహే హ్రీం జగద్వ్యాపిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
5. ఓం హ్రీం సర్వసమ్మోహిన్యై విద్మహే హ్రీం జగన్మోహిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
6. ఓం హ్రీం సర్వస్తంభిన్యై విద్మహే హ్రీం జగత్స్తంభిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
7. ఓం హ్రీం సర్వజృంభిణ్యై విద్మహే హ్రీం జగత్ జృంభిణ్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
8. ఓం హ్రీం సర్వవశంకర్యై విద్మహే హ్రీం జగత్వశంకర్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
9. ఓం హ్రీం సర్వరంజిన్యై విద్మహే హ్రీం జగద్రంజిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
10. ఓం హ్రీం సర్వోన్మాదిన్యై విద్మహే హ్రీం జగన్మాయాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
11. ఓం హ్రీం సర్వార్థసాధిన్యై విద్మహే హ్రీం పురుషార్థదాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
12. ఓం హ్రీం సర్వసంపత్ప్రపూరిణ్యై విద్మహే హ్రీం సంపదాత్మికాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
13. ఓం హ్రీం సర్వమంత్రమయ్యై విద్మహే హ్రీం మంత్రమాత్రే ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
14. ఓం హ్రీం సర్వద్వంద్వక్షయంకర్యై విద్మహే హ్రీం కళాత్మికాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।
తదుపరి పోస్టింగ్ లో ఐదవదైన సర్వార్థ సాధకచక్రం గురించి తెలుసుకుందాం. - శ్రీనివాస గార్గేయ

Saturday, May 10, 2014
హ్రీంకార యజ్ఞము - సర్వసంక్షోభణ చక్ర అవసర సారంశము 6
3. సర్వసంక్షోభణ చక్రము
పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో మూడవచక్రమే సర్వసంక్షోభణ చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై షోడశదళం పైన అష్టదళ పద్మంగా గుండ్రముగా ఉండినదే సర్వసంక్షోభణ చక్రము అంటారు.

దీనికి 8 దళాలు ఉంటాయి. ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో మూడవదిగా ఉన్నమణిపూరక చక్రమే. ఇది శరీరంలో నాభి స్థానం దగ్గర ఉండును. ఈ సర్వసంక్షోభణ చక్రములో ఎనిమిది మంది గుప్తతర యోగినులనబడే దేవతలు ఉంటారు.
ఈ సర్వసంక్షోభణ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వాకర్షిణీ
ఈ సర్వసంక్షోభణ చక్రానికి అధిష్టాన దేవత త్రిపుర సుందరీ
వైదిక కర్మలయందు శ్రద్ధ తగ్గి అవైదిక కర్మలయందు ఆసక్తి పెరిగి, యజ్ఞ యాగాది క్రతువులలో ప్రజలు విముఖులైనప్పుడు సంక్షోభమేర్పడుతుంది. ఇట్టి సంక్షోభాన్ని పార్వతి పరమేశ్వరులు తొలగిస్తారు. అదే శ్రీచక్రంలో మూడవ ఆవరణకు ఉన్న విశిష్టత. అందుచేతనే దీనిని సర్వసంక్షోభణ చక్రమని పిలుస్తారు. (సంక్షోభణాన్ని ఎలా నివారించారో పురాణం గాధలున్నవి.)
తారకాసుర సంహారం తదుపరి ఇంద్రుడు పదవిని అధిష్టించటం, తదుపరి లోకాలలో వైదిక కర్మలు, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహింపబడటం, దేవతలకు వారి వారి హవిర్భాగాలు అందటం ప్రారంభమై లోకాలలో ఏర్పడ్డ సంక్షోభం నివారింపబడింది. మన్మధుడు దహనమై తదుపరి అనంగుడైనాడు. దీనికి సంకేతంగానే సర్వ సంక్షోభణ చక్రంలోని గుప్తతర యోగినులను అనంగనామంతో చెప్పటం సంప్రదాయమైనది.
లోకాలలో మరియు జీవితాలలో ఏర్పడే సంక్షోభాలను నివారించటానికే ప్రతి ఒక్కరూ హ్రీంకార మహా యజ్ఞాన్ని ఆచరిస్తూ తద్వారా సర్వసంక్షోభణ చక్రాధిదేవత అయిన త్రిపురసుందరిని ఉపాసిస్తే సమస్త సుఖాలను ప్రసాదిస్తుంది. అందుకే శ్రీ లలితా సహస్ర నామావళిలో మణిపూరబ్జనిలయా నుండి లాకిన్యాంబా స్వరూపిణి వరకు గల పది నామాలలో సర్వసంక్షోభణ చక్రం స్తుతించబడుతున్నది. ఇందులో గల ఓ నామంలో సమస్త భక్తసుఖదా అని ఉండటంలో అంతరార్ధం స్పష్టంగా గోచరమవుతుంది.
మరొక ముఖ్యమైన రహస్యమేమిటంటే అసలు మణిపూరక చక్రంలో ఉండే దేవత పేరు వయోవస్థావివర్జితా. ఈ నామమే లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. అంటే కాలానికి అతీతురాలు పరమేశ్వరి. వయసుతోను, కాలంతోను వచ్చే మార్పులు ఆమెకి ఉండవు.
బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు ఏమి లేనటువంటిదని భావము. అంటే కాల వ్యవస్థ పరమేశ్వరి కల్పితము. పరమేశ్వరి కాల కల్పనకు పూర్వమే ఉండినందున, పరమేశ్వరి వయస్సును కాలము నిర్ణయింపజాలదు.
అందుకే లలితా సహస్ర నామాలలో పరమేశ్వరిని పూర్వజా అని, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని, మహాప్రళయసాక్షిని అని స్తుతించబడింది. ఈ నవ చక్రాలలో నాభిస్థానంలో ఉన్న సర్వసంక్షోభణ చక్ర విశిష్టత చెప్పనలవికానిది.
కనుక సర్వసంక్షోభణ చక్రములోని 8 గుప్తతర యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో మూడవ ముద్రను గమనించండి.
1. ఓం హ్రీం అనంగకుసుమాయై విద్మహే హ్రీం రక్తకంచుకాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
2. ఓం హ్రీం అనంగమేఖలాయై విద్మహే హ్రీం పాశహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
3. ఓం హ్రీం అనంగమదనాయై విద్మహే హ్రీం శరహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
4. ఓం హ్రీం అనంగమదనాతురాయై విద్మహే హ్రీం ధనుర్హస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
5. ఓం హ్రీం అనంగరేఖాయై విద్మహే హ్రీం దీర్ఘకేశిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
6. ఓం హ్రీం అనంగవేగిన్యై విద్మహే హ్రీం సృణిహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
7. ఓం హ్రీం అనంగాంకుశాయై విద్మహే హ్రీం నిత్యక్లేదిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
8. ఓం హ్రీం అనంగమాలిన్యై విద్మహే హ్రీం సుప్రసన్నాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
తదుపరి పోస్టింగ్ లో నాల్గవదైన సర్వసౌభాగ్యదాయక చక్రం గురించి తెలుసుకుందాం. పాఠకులలో అసంఖ్యాకంగా అడిగిన ప్రశ్నలను బట్టి హ్రీంకార యజ్ఞం ఎందుకు చేయాలి ? హ్రీంకారమునకు మూలం ఏమిటి ? శ్రీవిద్యకు, శ్రీ యంత్రానికి ఉన్న సంబంధం ఏమిటి ? పంచదశి మంత్రానికి, శ్రీ యంత్రానికి సంబంధం ఏమిటి ? ఇంకా ఇంకా అనేకనేక ప్రశ్నలకు బ్లాగు ద్వారానే వివరాలను అందిస్తాను. సంపూర్ణ వివరాలన్నీ హ్రీంకార మహా యజ్ఞం అనే పుస్తకంలో పొందుపరుస్తూ... యజ్ఞ కార్యక్రమం నాటికే అందరికీ అందించాలనే తాపత్రయంతో ఉన్నానని తెలియచేస్తున్నాను.
- శ్రీనివాస గార్గేయ

Friday, May 9, 2014
హ్రీంకార యజ్ఞము - సర్వాశాపరిపూరక చక్ర అవసర సారంశము 5
2. సర్వాశాపరిపూరక చక్రము
పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో రెండవ చక్రమే సర్వాశాపరిపూరక చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై దిగువన 16 ఆకులుగా గుండ్రముగా ఉండినదే సర్వేశాపరిపూరక చక్రము అంటారు. ఇది సర్వ ఆశలను పరిపూర్ణం చేసే చక్రమని భావించాలి.

దీనికి 16 దళాలు ఉంటాయి. వ్యవహారికంగా పలకటంలో సర్వాశా అనకుండా సర్వేశాపరిపూరక చక్రముగా పలుకుతుంటాము. ఇది అలవాటులో పొరపాటుగా భావించి, సర్వాశాపరిపూరక చక్రము అని మాత్రమే పలకాలి.

శరీరంలో ఉన్న షట్చక్రాలలో రెండవదిగా ఉన్నస్వాధిష్టాన చక్రమే. ఇది మూలాధారానికి పై భాగాన ఉంటుంది. ఈ సర్వాశాపరిపూరక చక్రంలో పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు మొత్తం 16. ఈ పదహారింటికే పదహారు దేవతలు. ఈ చక్రం శ్రీచక్రార్చనలో భోగపాత్ర.
ఈ సర్వాశాపరిపూరక చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వవిద్రావిణీ
ఈ సర్వాశాపరిపూరక చక్రానికి అధిష్టాన దేవత త్రిపురేశ్వరి
కనుక సర్వాశాపరిపూరక చక్రంలోని 16 గుప్తయోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో రెండవ ముద్రను గమనించండి.
1. ఓం హ్రీం కామాకర్షిణ్యై విద్మహే హ్రీం రక్తవస్త్రాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
2. ఓం హ్రీం బుద్ధ్యాకర్షిణ్యై విద్మహే హ్రీం బుద్ధ్యాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
3. ఓం హ్రీం అహంకారాకర్షిణ్యై విద్మహే హ్రీం తత్త్వాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
4. ఓం హ్రీం శబ్దాకర్షిణ్యై విద్మహే హ్రీం సర్వశబ్దాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
5. ఓం హ్రీం స్పర్శాకర్షిణ్యై విద్మహే హ్రీం స్పర్శాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
6. ఓం హ్రీం రూపాకర్షిణ్యై విద్మహే హ్రీం రూపాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
7. ఓం హ్రీం రసాకర్షిణ్యై విద్మహే హ్రీం రసాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
8. ఓం హ్రీం గంధాకర్షిణ్యై విద్మహే హ్రీం గంధాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
9. ఓం హ్రీం చిత్తాకర్షిణ్యై విద్మహే హ్రీం చిత్తాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
10. ఓం హ్రీం ధైర్యాకర్షిణ్యై విద్మహే హ్రీం ధైర్యాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
11. ఓం హ్రీం స్మృత్యాకర్షిణ్యై విద్మహే హ్రీం స్మృతిస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
12. ఓం హ్రీం నామాకర్షిణ్యై విద్మహే హ్రీం నామాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
13. ఓం హ్రీం బీజాకర్షిణ్యై విద్మహే హ్రీం బీజాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
14. ఓం హ్రీం ఆత్మాకర్షిణ్యై విద్మహే హ్రీం ఆత్మస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
15. ఓం హ్రీం అమృతాకర్షిణ్యై విద్మహే హ్రీం అమృతస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
16. ఓం హ్రీం శరీరాకర్షిణ్యై విద్మహే హ్రీం శరీరాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।
తదుపరి పోస్టింగ్ లో మూడవదైన సర్వసంక్షోభణ చక్రం గురించి తెలుసుకుందాం.
Subscribe to:
Posts (Atom)