Sunday, September 8, 2013

Ponnaluri Sreenivasa Gargeya contact mobile number: 9348032385


Tuesday, August 6, 2013

లక్ష్య సాధనా సామర్ధ్యం - 3

జ్యోతిషశాస్త్రంలో 8వ స్థానాన్ని ఆయు స్థానం అంటారు. ఈ స్థానాన్ని బట్టి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించగలడో తెలుసుకోవచ్చు. కాని నాలుగు దశాబ్దాల జ్యోతిష అనుభవంతో జీవన స్థితి గతులను పరిశోధించి పరిశీలిస్తే ఒక క్రొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే మనః కారకుడైన చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క స్థితి గతులను బట్టి మన ఆయుష్షు నిర్ణయించవచ్చు. ప్రస్తుత కాలమాన పరిస్థితులను విశ్లేషిస్తే అచ్యున్నత మానవ శ్రేయస్సయిన మనఃశాంతి ఉంటే ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది . లేనిచో తగ్గుతూ ఉంటుంది. ఒక లక్ష్యాన్ని లేక గమ్యాన్ని సాధించటానికి... గతంలో చెప్పిన నాలుగు ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళవచ్చును. అలా ముందుకు వెళ్ళినప్పుడు వ్యక్తికి కావలసింది మనఃశాంతి.... ఈ మనఃశాంతి ఉంటేనే లక్ష్య సాధనవైపు వెళ్ళగలడు. మరి ఈ మనఃశాంతి లేకుండా చేయటానికి ప్రధాన కారణం వత్తిడి. కనుక ఈ వత్తిడి ఏ విధంగా ఉంటుంది ? ఎందుకు ఉంటుంది ? కారణాలు ఏమిటి ? మొదలైన వివరాల కోసం ఈ దిగువన ఉన్న 25 జూలై 2013 నాటి భక్తిమాల. టీవీ లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్ ను వీక్షించండి.

25 జూలై 2013 గ్రహబలం

Monday, August 5, 2013

లక్ష్య సాధనా సామర్ధ్యం - 2

2013 జూలై 23 తేది నాటి భక్తిమాల. టీవీ లోని వీడియో చూశారు కదా.. ప్రతి మనిషికి కోరికలు నిత్యం వస్తూ వుంటాయి. కొంతమంది ఊహలలో తేలుతూ ఉంటారు. రకరకములైన భావాలను ఊహించుకుంటుంటారు. లక్ష్యానికి, కోరికకు చాలా తేడా వుంది. ఒక లక్ష్యాన్ని సాధించటానికి గాని లేదా ఒక గమ్యాన్ని చేరటానికి గాని ఆచరించే ప్రణాళిక ఏదైతే ఉంటుందో దానిని గురించి ఊహించండి లేదా దానిని కోరికగా తెచ్చుకోండి. నవగ్రహాలలో మనఃకారకుడైన చంద్రుడు లక్ష్య సాధనలో ప్రధాన భూమికను పోషిస్తాడు. నేనేం చేయగలను ? అసమర్దుడను,  ఉత్సాహం ఉన్నప్పటికీ కార్యాచరణ వైపు మొగ్గు చూపలేని ఆశక్తుడను అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. కనుక ఆ దిశగా ఆలోచించక.. మరో దిశగా ఆలోచిస్తూ లక్ష్య సాధనకు నడుం బిగించాలి. మొదటగా నాలుగు అవరోధాలు అడ్డు తగులుతాయి. ఈ అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. మొదటి మూడు అవరోధాలు చంద్ర గ్రహానికి సంబంధించినవి. నాలుగో అవరోధం మనః కారకుడైన చంద్రుడికి, బుద్ధి కారకుడైన బుధుడికి, ఆత్మకారకుడైన రవికి సంబంధించినవి. 23వ తేది నాటి ఎపిసోడ్ లో 30 తిధులలో శుక్ల పక్ష చవితి, శుక్ల సప్తమి శుక్ల త్రయోదశి, బహుళ చవితి, బహుళ సప్తమి, బహుళ త్రయోదశి తిధులు ప్రత్యేకంగా పరిహార రూపంలో ఉపయోగపడతాయి. అయితే ఈ ఎపిసోడ్ లో మూడు గ్రహాల సహకారంతో పూర్ణిమ తిథి ఉపయోగపడుతుంది. 
ఈ నాలుగు అవరోధాలు ఏమిటో అవి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

24 జూలై 2013 గ్రహబలం

Tuesday, July 30, 2013

తెలంగాణా నిర్ణయ ముహూర్తము

30 జూలై 2013 మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై లాంచన ప్రాయ నిర్ణయం ప్రకటించిన సమయానికున్న స్థితిగతులను పరిశీలించినచో అనేక దోషాలు కనపడుతున్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నక్షత్రం చిత్ర అనగా కన్యా రాశి. ఈ చిత్ర నక్షత్రానికి... ప్రకటించిన సమయానికి ఉన్న భరణి నక్షత్రానికి తారాబలం  గమనిస్తే నైధన  తార అవుతుంది. నైధనతార అంటే చాలా ప్రమాదకరమైన తార అని భావము. అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన్మరాశి కన్యకు చంద్ర స్థితి అష్టమంలో ఉండటంకూడా దోషం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించిన సమయం మకరలగ్నం కావటం, ఈ లగ్నానికి కుజుని యొక్క తీవ్రమైన అష్టమ దృష్టి ఉండటం శుభకరం కాదు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు మకర లగ్నానికి అష్టమ స్థానంలో ఉండటం కూడా దోషపూరితం. అంతేకాక ఈ ప్రకటన ప్రకటించిన సమయంలో ఉన్న యోగము గండ యోగం కావటం కూడా శుభకరం కాదు. పై లక్షణాల కారణంచే ఈ లాంచన ప్రాయ నిర్ణయ ప్రకటన కార్యరూపం దాల్చటం కష్టసాధ్యము. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయానికి ఉన్న గ్రహస్థితి కంటే ఈ ప్రకటన వెలువడిన గ్రహస్థితి మరింత దారుణం. సమైక్యాంధ్రను కోరుకొనే తెలుగు ప్రజలందరూ సంయమనం పాటించండి. 
- గార్గేయ సిద్దాంతి

Wednesday, July 24, 2013

లక్ష్య సాధనా సామర్ధ్యం - 1

జీవితం చాలా విలువైనది. మన ఆలోచనలు, మన భావనలు కేవలం కోరికలకే పరిమితం కాకుండా అనేక లక్ష్యాలను సాధించే దిశగా ఉండటానికి జ్యోతిషశాస్త్రం ద్వారా విలువైన అంశాలను తెలుసుకోవచ్చు. కేవలం జీవనయానంలో సంభవించే ఒడి దుడుకులు కాకుండా ఆర్ధిక స్థితి గతులు కాకుండా... మహోన్నతమైన విజయ సాధన వైపు మన పయనం సాగటం కోసం జ్యోతిష్య నిర్ణయాలు అనేకం ఉన్నాయి. పేదరికం నుంచి రాచరికం వైపు వెళ్తుంటారు.  అనుకోకుండా వెనక్కి తిరిగి వస్తారు. అనుభవాలతో నిరాశా నిస్పృహలకు గురయ్యే వారూ ఉంటారు. జీవితంలో అనేక పాఠాలు నేర్చుకున్న మహనీయులు ఎంతో మంది ఉన్నారు. శూన్యంతో ప్రారంభించి నిరంతరం లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటూ ఓ క్రమ పద్దతిలో నడుస్తూ తమ జీవితాలను పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకొని సంవృద్ది వైపుకి, సంతృప్తి వైపుకి విజయం వైపుకి వెళ్లి వెలది మందికి జీవనోపాధి చూపించిన విశిష్ట వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు.

లక్ష్యాలను ఏర్పరుచుకోవటం... మన విజయానికి అవసరమైన అతి పెద్ద నేర్పు. ప్రతి వ్యక్తిలో ఏదో ఓ సహజమైన శక్తి దాగి ఉంటుంది. ఈ శక్తితో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. సామర్ధ్యాన్ని అధికం చేయవచ్చు. అదే స్థాయిలోనే ఓ ప్రేరణకు రూపమిచ్చి తారా స్థాయిలో పయనించవచ్చు. మనం ఎక్కడ నించి వచ్చామన్నది ప్రస్తుతం అనవసరం. మన పయనమెటు... అనేది అవసరం. ఈ అంశం మన ఆలోచనల మీద, భావనల మీదా ఆధారపడి ఉంటుంది. అందుకే మన మనస్సు మన జీవితంలోని దాదాపు అనీ పార్శ్వాలని సృష్టించగలదు. ఓటమి చవి చూసి... ఇంకేమి అక్కర్లేదు అనుకునేవారు ఉంటారు.... తమ సమస్యలకు, బెంగలకు ఎవరో బాధ్యులని వాపోతున్నవారు ఉంటారు. మనసు లోతుల్లో ఉండే ఓ నియంత్రణ మరియు వ్యక్తీకరణలకు సంబంధించిన సామర్ధ్యం  ప్రతి ఒక్కరిలో ఉంటుంది.... ఆ సామర్ధ్యమేమిటో తెలుసుకోవటానికి 2013 జూలై 23 నాటి భక్తిమాల.టీవీ గ్రహబలం కార్యక్రమాన్నివీక్షించటానికి దిగువన క్లిక్ చేయండి. 

23 జూలై 2013 గ్రహబలం పార్ట్ 1 
23 జూలై 2013 గ్రహబలం పార్ట్ 2