కాలచక్రం సకలం మారుస్తూ ఉంటుంది గతంలో ఉన్నది ఇప్పుడు ఉండదు . నేడు ఉన్నది
మరో రోజు ఉండదు. నిరంతరమూ మార్పులు జరగటమన్నదే వాస్తవంగా కనపడుతుంటుంది.
గత రోజులను ఎవ్వరూ కూడా మార్చలేం. కానీ ఆత్మ, మనో బలాలతో బుద్ధి బలాన్ని పెంచుకొని కాలచక్రంలో దొర్లే రానున్న రోజులలోని మన స్థితులను మార్చుకొనగలం . గతం కంటే రానున్న
భవిష్యత్ లో మీ స్థితిని ఉన్నతం చేసుకొని, పరాజయాలని విజయాలుగా
మార్చటానికి, మీ జీవిత వైఖరులను, మీ దృష్టి కోణాలను, మీ ఆలోచనలతో నూతన ప్రేరణా భావనలను మార్చుకోవటానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క నిముషం మాత్రమే...
ఆలోచించి నిర్ణయం తీసుకొని, ఆచరించిన క్షణంలో.. మీరు మీ
జీవితాన్నిమార్చుకుంటారు. మీ నిర్ణయాలు మీ చర్యలను నిర్ణయిస్తాయి. మీ
చర్యలే నూతన మార్పును సృష్టిస్తాయి. మీ జీవితంలో సానుకూల మార్పు, పరివర్తన
కలగాలంటే కేవలం నాలుగే అంశాలు అవసరం. 1. దృష్టి 2. నిర్ణయం 3. క్రియ 4.
కోరిక ... ఇవే మీ పరాజయాలని విజయాలుగా మారుస్తాయి. మీ దిశా దశలను నిర్దేశిస్తాయి. ప్రతివారి జీవితంలో సానుకూల మార్పు మహా అవసరం. అందుకే నిత్యం గమనించటానికి ప్రయత్నించండి గ్రహబలం కార్యక్రమం. - శ్రీనివాస గార్గేయ
Sunday, July 14, 2013
Saturday, July 6, 2013
10 జూలై 2013 నుంచి భక్తిమాల.టీవీలో జ్యోతిషప్రసారాలు లైవ్ లో ప్రారంభం ~ Astrological Live programmes in Bhakthimala.tv soon
భక్తిమాల.టీవీ ప్రారంభించి దాదాపు 11 మాసాలు కావచ్చింది.
ఎన్నో బాలారిష్టాలను అధిగమిస్తూ ముందుకి తీసుకొని వెళ్తున్నాము.
అయితే ఇంతవరకు జ్యోతిష కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంలో అందించలేకపోయాము.
ప్రేక్షకులు ఎంతో ఓర్పుతో ఉన్నందుకు ధన్యవాదాలు.
10 జూలై 2013 బుధవారం నుంచి నిత్యం భక్తిమాల.టీవీలో ప్రత్యక్షప్రసారం ద్వారా జ్యోతిష కార్యక్రమాలు ప్రారంభమవునని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం. ఈ మాసం నుంచే ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు జ్యోతిష సమాధానాలు కూడా ఉంటాయని తెలియచేస్తున్నాం. ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 8.30 వరకు ప్రత్యక్ష ప్రసారాలద్వారా విశేష వివరణలు, మాసవారీ గ్రహ సంచార స్థితిగతులు, ఫలితాలు, జ్యోతిశాస్త్ర సందేహాలకు శాస్త్రీయ జవాబులు, పర్వదినాలపై విశ్లేషణలు, గతంలో చెప్పిన పరిహారాల పై సందేహ నివృత్తి, రాజయోగ పరిహారాలు, షోడశ చూతపత్ర కదంబ విశ్లేషణలు మొదలైన ఆసక్తికర అంశాలను ప్రత్యక్ష ప్రసారంలో అందించగలం. ప్రేక్షకులు ఈ అవకాశాన్నివినియోగించుకోగలరని ఆశిస్తున్నాను.
ప్రత్యక్షప్రసారంలో చూడదలుచుకున్నవారు ఇక్కడ క్లిక్ చేయండి
bhakthimala.tv
- గార్గేయ సిద్దాంతి

Thursday, July 4, 2013
వివాహ సమస్యలకు గోరింట బొట్టుతో పరిహారం ~ Henna Bindi Remedy
భక్తిమాల. టీవిలో ఈ మధ్య కాలంలో వివాహ సమస్యలపై కార్యక్రమాలు
ప్రసారమయ్యాయి. ఈ సమస్యలు అనుభవిస్తున్నవారు ఎందరెందరో ఉన్నారు. ముఖ్యంగా
1977 ఏప్రిల్ 30 రాత్రి 10.30 నుంచి 1983 జూలై 13 రాత్రి 8.40 మధ్యకాలంలో
జన్మించిన వారికి వివాహమై, సమస్యలతో ఉంటుంటే... ఉపశాంతి మార్గంగా పరిహారము
గోరింట బొట్టుతో ఆచరించవచ్చు. ఈ గోరింట బొట్టును కేవంలం చైత్ర, వైశాఖ,
శ్రావణ, ఆశ్వీజ, కార్తిక, మార్గశిర మాసాలలో, కొన్ని ప్రత్యేక సమయాలలో,
ప్రత్యేకతలతో తయారుచేసుకుని ఆచరించాలి. ఈ గోరింట బొట్టును తయారు చేసుకొనటం
విధివిధానాన్ని 6 జూలై 2013 న భక్తిమాల. టీవి లో ప్రసారమగును. కనుక
వీక్షించండి. పలువురికి తెలియచేయండి.
1977 ఏప్రిల్ 30 రాత్రి 10.30 నిముషాలకు ముందు, మరియు 1983 జూలై 13 రాత్రి 8.40 నిముషాల తదుపరి జన్మించిన జాతకుల వివాహ సమస్యలకు కూడా ఉపశాంతి పరిహారం కూడా త్వరలో ప్రసారమగును.
1977 ఏప్రిల్ 30 రాత్రి 10.30 నిముషాలకు ముందు, మరియు 1983 జూలై 13 రాత్రి 8.40 నిముషాల తదుపరి జన్మించిన జాతకుల వివాహ సమస్యలకు కూడా ఉపశాంతి పరిహారం కూడా త్వరలో ప్రసారమగును.
Wednesday, July 3, 2013
Saturday, May 4, 2013
Subscribe to:
Posts (Atom)