Thursday, August 30, 2012

అధిక భాద్రపద పూర్ణిమన "హ్రీం" బీజాక్షరంతో కీర్తిముఖుడిని స్వాగతించండి.

శ్రీ నందన నామ సంవత్సరంలో భాద్రపద మాసం అధిక మాసం వచ్చినందున, అధికమాస పూర్ణిమ రోజున మరియు నిజ భాద్రపద మాస పూర్ణిమ రోజున కీర్తిముఖుడిని హ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. అధిక పూర్ణిమ 31 ఆగష్టు 2012 శుక్రవారం, నిజ పూర్ణిమ 29 సెప్టెంబర్ 2012  శనివారం ... రెండు రోజులలోను హ్రీం బీజాక్షరంతో స్వాగతించాలి. ) పార్వతి దేవిని ఆరాధించాలి.

31 ఆగష్టు 2012 శుక్రవారం నాడు రాత్రి లోపల ఈ దిగువ 16 నామాలను భక్తితో, విశ్వాసంతో కీర్తిముఖునిలో... పార్వతి దేవి రూపాన్ని స్మరిస్తూ పఠి౦చండి. ప్రత్యేక నివేదన అవసరం లేదు. ఎన్ని సార్లైనను మానసికంగా పఠి౦చండి.


ఓం హ్రీం మాహేశ్వర్వై నమః
ఓం హ్రీం కౌమార్యై నమః
ఓం హ్రీం చాముండాయై నమః
ఓం హ్రీం శచ్యై నమః
ఓం హ్రీం పుష్ట్యై నమః
ఓం హ్రీం తుష్ట్యై నమః
ఓం హ్రీం స్వధాయై నమః
ఓం హ్రీం స్వాహాయై నమః
ఓం హ్రీం లోకమాత్రే నమః
ఓం హ్రీం దిత్యై నమః
ఓం హ్రీం బ్రాహ్మ్యై నమః
ఓం హ్రీం ఇంద్రాణ్యై నమః
ఓం హ్రీం వారాహ్యై నమః
ఓం హ్రీం సావిత్ర్యై నమః
ఓం హ్రీం జయాయై నమః
ఓం హ్రీం మహాకాళ్యై నమః
పై పదహారు నామాలు పఠి౦చిన తదుపరి తన్మయత్వంగా ఓం కీర్తిముఖేభ్యో నమః అనే నామాన్ని 11 సార్లు పఠి౦చండి. సకల శుభాలకు చేరువకండి. పై ప్రకారంగానే నిజ భాద్రపద పూర్ణిమ రోజున 29 సెప్టెంబర్ 2012  శనివారం రోజున ఆచరించండి.

( కైలాసంలో శివనిలయ ద్వారానికి ఓ మహా దివ్య పురుషుని ముఖం అలంకృతమై వుంటుంది. ఆ దివ్య పురుషుడే కీర్తిముఖుడు. ఈ కీర్తిముఖుడుకి మనమందరం ఈ శ్రావణ పూర్ణిమ నుంచి స్వాగతం పలుకుదాం. కీర్తిముఖుడికి శిరస్సుపై ఓం బీజాక్షరం, కుడిచెవి ప్రక్కన గం బీజాక్షరం, ఎడమచెవి ప్రక్కన ఐం బీజాక్షరం, నాలుక కుడివైపున హ్రీం బీజాక్షరం, నాలుకకు ఎడమవైపున శ్రీం బీజాక్షరంతో కీర్తిముఖుడు చిత్రపటం ఉంటుంది.

కీర్తిముఖుడు శివుని కనుబొమ్మలనుంచి ఆవిర్భవించి శివాజ్ఞ లేకుండా స్వీయ నిర్ణయంతోనే... శివ సన్నిధికి దూతగా వచ్చిన వ్యక్తిని అధర్మ మార్గంలో సంహరించబోయాడు. కాని చివరలో శివుని ఆజ్ఞను శిరసావహించాడు. అందుకే శరీరమంతా అధర్మవర్తనకు.... పరిహారంగా పోయినను... మహా శివభక్తి తత్పరతకు మిగిలింది... ఒక ముఖం మాత్రమే. అదే ముఖం కీర్తిముఖుడుగా అనంతగౌరవాన్ని పొందుతూ.. కైలాసంలో శివుని ముఖద్వారానికి ఉండే మహా అదృష్టాన్ని పొందగలిగాడు. అంతర్లీనంగా ఓ గొప్ప సందేశం ఉన్న కారణంగానే కీర్తిముఖుని ఆవిర్భావ కధ కార్తీకమాసంలో 21 వ రోజున అనగా కార్తిక బహుళ షష్టి రోజున పారాయణా౦శమైనది.

జగన్మాత, జగత్పితలకు నిలయంగా ఉన్న కైలశమనే మన గృహంలో కూడా సకల శుభాలను అనుగ్రహించటానికి కీర్తిముఖుడు కావాలి. ఈ కీర్తిముఖుడిని సకల శుభాలు అనుగ్రహించమని భక్తితో, విశ్వాసంతో పూజించాలి.

సకల శుభాలు కలగటమంటే..... సకలదోషాలు పోవటమేనని భావం. ప్రణవ సహిత గణపతి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తులు అంతర్లీనంగా కీర్తిముఖుడిలో ఉంటారు.

ప్రతివారు నిత్యం కీర్తిముఖుడిని ఆరాధిస్తుంటే... అంతర్లీనంగా ఉన్న దైవ శక్తులను ప్రార్ధిస్తున్నట్లే.

నిత్యం పూజించే అవకాశం లేకున్నప్పటికీ, మనసారా భక్తితో అచంచల విశ్వాసంతో... దేహం లేని శిరస్సుతో ఉన్న కీర్తిముఖుడిని ఎన్ని పర్యాయాలైన వీక్షించండి. ఈ వీక్షనలే పరోక్షంగా సకల శుభాలను స్వాగతిస్తాయి.

కీర్తిముఖుడి చిత్రపటాన్ని గృహ సింహాద్వారమునకు పై భాగాన లేదా సింహాద్వారంలోనించి నేరుగా లోపలి వస్తే సింహాద్వారమున్న గోడ కాకుండా.... మిగిలిన మూడు గోడలలో ఏ గోడకైనను చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు.

ఈ విధంగా పెట్టిన చిత్రపటం వైపు నిత్యం పలుసార్లు వీక్షిస్తూ వుండటం శుభదాయకం. ఇదే చిత్రపటాన్ని పూజ మందిరంలో కూడా ఉంచుకొని పూజించటం శ్రేయోదాయకం. కంప్యూటర్ యుగంలో నిత్యం పూజాదికాలు చేయలేని వారందరికీ నవరక్షాకవచాలు, కీర్తిముఖుని చిత్రపటాలు సకల శుభాలను అనుగ్రహిస్తాయి.

ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల సంపుటంతో కీర్తిముఖుని చిత్రపటముండును. మన కన్నులతో కీర్తిముఖుని వీక్షిస్తున్నప్పుడు... చిత్రపటంలో ఉండే ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల తత్వ మహిమచే.... సకల శుభాలు కల్గునని మహానుభావుల మనోదృష్టికి అందిన అంశం.

ప్రతివారు తమ జీవితంలో శుక్ర మహాదశ రావాలని, రాక్షస రాజు శుక్రుడు అనుగ్రహం పొందాలని, కీర్తి ప్రతిష్టలు విశేషంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని, చక్కని సంసారంతో, సంతానంతో... సుఖవంతంగా విలాసంగా ఉండాలని కోరుకుంటారు. రాక్షస రాజుగా విరాజిల్లే శుక్రాచర్యులనే శుక్ర గ్రహంగా పేర్కొనటం. శుక్రునిది పంచకోణాకార మండలం.... పంచకోణాకార మండలమంటే ఓ నక్షత్ర గుర్తు. ఐదు కోణాలు, ఐదు బీజాక్షరాలతో సమ్మిళితమై ఉంటుంది. ఈ కీర్తిముఖునిలో ఐదు బీజాక్షర స్వరూపాలున్నాయి. కీర్తిముఖుడు అనబడే దివ్య పురుషుని వీక్షణ మన మీద ప్రసరిస్తే .... ఆ దైవీ శక్తుల యొక్క కటాక్షం మనం పొందినట్లేనని భావం.)


శుభం భూయాత్

Friday, August 24, 2012

ఆగండి.. ఆలోచించండి .. ఆపై నిర్ణయం తీసుకోండి.

ప్రతివారి గృహంలో వివాహం కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటుంటారు. వారికి వివాహం చేయటానికి తగిన సంబంధం కోసం వివాహ పరిచయ వేదికలకు వెళ్ళటమూ లేదా మ్యారేజ్ బ్యూరోలలో పేర్లు నమోదు చేసుకోవటం సహజంగా జరుగుతున్న తంతు. ఇది ఇలా వుండగా అమ్మాయి జాతకంతో అబ్బాయి జాతకం పొంతన చూడాలనేది శాస్త్ర నిర్ణయం. కేవలం కంప్యూటర్స్ ను నమ్ముకొని ఇరువురి జాతకాలు ఎంతవరకు కలిసాయా లేదా అనే విషయం కొరకై చాలామంది జ్యోతిష్య సాఫ్ట్వేర్ లపై ఆధారపడుతూ వుంటారు. ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి, లేకపోతే మీరు పొరపడినట్లే.

కేవలం వధూవర గుణమేలన పట్టిక అనే పాయింట్ల పట్టికపై ఆధారపడకండి. 18 పాయిన్ట్లపైన వస్తే వివాహం చేసుకోనవచ్చునని, 18  కన్నా తక్కువ వస్తే వివాహం చేయకూడదని వధూవర గుణమేలన పట్టిక సారాంశం. నిజానికి చెప్పాలంటే ఈ పట్టికను నమ్ముకొని లక్షలాది కుటుంబాలు నాశనం అయిపోయినాయి. 30  పాయిన్ట్లపైన వచ్చి కూడా న్యాయస్థానాల చుట్టూ విడాకుల కోసం తిరుగుతున్న వారెందరో !

ఒక సిద్దాంతి గారు రెండు జాతకాలను చూసి...... శభాష్ ..... భేషుగ్గా వుంది... తక్షణం వివాహం చేయండి అంటుంటే ......... మరో సిద్దాంతి.... వ్యతిరేక తీర్పుని సెలవిస్తారు. ఈ ఇద్దరి సిద్దాంతులలో..... ఎవరిని అనుసరించాలో తెలియక తలలు పట్టుకునేవారెందరో !

పోతేపోనీ... వధూవర గుణమేలన పట్టికలో అధికంగా పాయింట్లు వచ్చాయి కదా...ముందుకు వెళదాం.... అనుకోని... వివాహం చేస్తే.... సంవత్సరం తిరిగేలోపలె అసలీ విషయాలన్నీ తెరమీదకి వస్తాయి.
వరుడు కాని, వధువు కానీ అల్పాయిష్కులని పాయింట్ల పట్టిక తేల్చి చెప్పదు. ఇరువురిలో ఉన్నటువంటి వ్యాదులను పాయింట్ల పట్టిక అసలేమి చెప్పదు. ఆ దోషమని... ఈ దోషమని... కాళ్ళరిగేలా తిరిగే వారికి, నగ్న సత్యాలను తెలియచేస్తూ... ఎవరికి వారు... స్వయంగా పూర్తి స్థాయిలో జాతక పొంతన తెలుసుకొని, మాయ మాటలు చెప్పే వారి బారిన పడకుండా వుండుటకై... ఎప్పటికప్పుడు అసలుసిసలైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొనివచ్చి... మిమ్మల్ని చైతన్యపరిచి..... సమస్యలు వుంటే .... ఏ విధంగా పరిష్కారాలు చేసుకోవాలో తెలియచెప్పాల్సిన అవసరం భక్తిమాల టీవీ కి వుంది. అందుకే వారం వారం మీకోసం... ఎన్నో ఎన్నో విశేషాలను తెలియచెప్పే కార్యక్రమమే... మా కల్యాణమాల.... త్వరలోనే మీ ముందుకు రాబోతోంది. ఆస్వాదించండి.. ఆనందించండి.. ఆలోచించండి.. ఆశీర్వదించండి...... మీ శ్రీనివాస గార్గేయ, (భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగ కర్త).


Monday, August 20, 2012

గ్రహమాల కార్యక్రమం త్వరలో ప్రారంభం.



గ్రహభూమి వీక్షక అభిమానులందరికీ శుభవార్త. భక్తిమాల వెబ్ ఛానల్లో పూర్తి స్థాయిలో 24 గంటలు కార్యక్రమాలు ప్రారంభం కావటానికి కొంత సమయం పట్టినప్పటికీ ఈ లోపలే (కొద్ది రోజులలో మాత్రమే) ఉదయం ఒక గంట పాటు మరియు సాయంత్రం ఒక గంటపాటు జాతక సమస్యలకు పరిష్కారాలను ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా తెలియచేప్పటమే కాక, తెలుసుకొనవలసిన అనేక అంశాలను ప్రసారం చేయటం జరుగును. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొనగలరని ఆశిస్తాను..... మీ శ్రీనివాస గార్గేయ