4 ఏప్రిల్ 2015 శనివారం శ్రీ మన్మధ నామ సంవత్సర చైత్ర పూర్ణిమ నాడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో రాహుగ్రస్తంగా సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం దాదాపుగా 4 మాసాలపాటు ద్వాదశ రాశులపై పరోక్ష ప్రభావాన్ని చూపుతుండును. కాని ద్వాదశ రాశులవారు ఎటువంటి భయం, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కొన్ని కొన్ని అంశాలలో ముఖ్య జాగ్రత్తలు తీసుకుంటుంటే సకలం సానుకూలంగానే జరుగుతుండును. ఈ నాల్గు మాసాలలో ఈ జాగ్రత్తలను పాటిస్తూ.... జూలై 1వ తేదిన కనువిందు చేసే అద్భుత శుభ గ్రహాలను దర్శించుకొని, ప్రార్ధించాల్సిన అవసరం ఉందని గ్రహించాలి.
మేషరాశి (అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం):
రావాల్సిన బాకీలు గాని, ఇవ్వవలసిన బాకీలలో గాని కొంత అప్రమత్తత అవసరం. తొందరపడి ఋణం ఇచ్చి పుచ్చు కోవటాలలో హాడావుడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక్కోసారి మిమ్మల్ని తప్పుదారి పట్టించుటకై గిట్టని వారు కుటిల ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వీటిని గమనిస్తూ ఉంటుండాలి. ఒక్కోసారి గతంలో చేసిన ఋణము చెల్లించినప్పటికీ, చెల్లించినట్ట్లుగా తగిన ఆధారం మీ దగ్గర లేకపోవచ్చును. దీనిని ఆసరాగా చేసుకొని, ఇతరులు మరోసారి ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటుంటాయి. అంతేకాకుండా కొన్ని కొన్ని పనులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ఉంటే వాటి వివరాలను, తేదీలను గుర్తుంచుకొని తగిన రీతిలో మసలుకోవాలి. లేదా సమయానికి హామీగా ఉంటుందనే భావనతో సంతకం చేసిన చెక్కు ఇచ్చి డబ్బు తీసుకుంటుంటారు. కొంతకాలం తర్వాత డబ్బు చెల్లిస్తారు. కాని చెక్ రిటర్న్ తీసుకోరు. అవతలి వారు దానిని సమీప బ్యాంకు లో ఇచ్చి డబ్బు డ్రా చేయవచ్చును, లేదా చెక్ బౌన్సు అయ్యేలా చేసి, తర్వాతి రోజులలో ఇబ్బంది పెట్టవచ్చును. అంతేకాక ఇతరులకు డబ్బు చెల్లించే సమయాలలో, మీరు మాత్రమే వెళ్లి చెల్లించి తగు రశీదును తీసుకోండి. ఇలా కాక ఓ నమ్మకమైన వ్యక్తి అని ఒకరిని భావించి, అతని ద్వారా డబ్బు చెల్లించమని ఇచ్చారనుకుందాం. అతను చాల నమ్మకస్తుడు, కాని గ్రహచారం వలన, తాను ఆ సొమ్మును పోగొట్టవచ్చును... లేదా తన నుంచి చోరి జరగవచ్చును. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వాటిని గమనిస్తూ ముందుకు వెళ్ళాలి.
ప్రస్తుతం మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుందాం. అయినప్పటికీ ఈ నాలుగు మాసాలలో ఆహారం తీసుకొనే సమయాలలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఒక్కోసారి మనకు గిట్టని ఆహారం... తెలియక తిన్న కారణంగా సమస్యలు రావచ్చును. మల, మూత్ర విసర్జనశాలకి వెళ్లి వచ్చే సమయంలో పాదాలను, చేతులను చాలా శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఉందని, హెచ్చరికగా తెలియచేయటమైనది. అంతేకాక చేతి మరియు కాలి వ్రేళ్ళ గోళ్ళు పెరగకుండా కత్తిరించుకోవాలి. ఇలా కాకుండా మీకు ఏదైనా ఓ అనారోగ్య సమస్య ఉండి ఉంటే.... తాత్సారం చేయకుండా ముఖ్య నిర్ణయాలను సమీప వైద్యుల నుంచి తెలుసుకోవటానికి ప్రయత్నించండి. సొంత వైద్యం వద్దు. అలాకాక గతంలో ఎప్పుడైనా అనారోగ్య సమస్య ఏర్పడి... శస్త్ర చికిత్స గాని, ఇతర సంబంధిత వైద్య సేవలు తీసుకొని, ప్రస్తుతం మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ మరో మారు ఆ శాఖకి సంబంధించిన వైద్యుని యొక్క నిర్ణయాలను తీసుకొనటం (జనరల్ చెకప్) ఎంతైనా మంచిది.
మీకు ఎవరైనా ప్రత్యక్ష శత్రువులు కాని, అంతర్గత శత్రువులు కాని ఉన్నారేమో ఓ సారి ఆలోచించుకోండి. అలా ఉండి ఉంటే వారిని గురించి ఇతరులతో విమర్శలు చేయటం తగ్గించండి. లేదా వారి మీద మరింత శతృత్వ పోకడలతో విజ్రుంభించాలనే ఆలోచన చేయవద్దు. అంతేకాక ఈ నాల్గు మాసాలలో మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో అనుకోకుండా... ఏ చిన్నపాటి వ్యతిరేకత ఏదైనా మీకు ఎదురైతే వెంటనే మీరు ఆగ్రహావేశాలకు వెళ్ళవద్దు. సంయమనం పాటించండి. సమయస్పూర్తితో నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకుండే నిర్ణయాలను మీలోనే ఉంచుకోండి. మీ నీడను కూడా మీరు నమ్మకూడదని భావము. వెన్నపూసిన కత్తిలాంటి లేదా మేకవన్నె పులులు..... మిమ్మల్ని కలిసి, ఏవేవో మంచి మాటలు చెబుతూ నిదానంగా ఎవరినైనా ఓ వ్యక్తిని విమర్శిస్తూ మీతో మాట్లాడుతుంటే, మీరు తన మాటలకు తందానా అంటూ మద్దతు చెప్పవద్దు. ఇటు వినటం, అటు వదిలేయటం ఉండాలి. అలాగే పరిష్కారం కాకుండా ఉన్న తగవులు కాని లేక ఇతర బంధువుల, కుటుంబ సభ్యుల మధ్య తగవులు ఉండి ఉంటే సంయమనమే పాటించండి, ఆవేశ పడవద్దు. మాములుగా మీరు ఫోన్ లో సంభాషిస్తుంటే, అవతలి వారు మీ మాటలను రికార్డు చేసే అవకాశముంది కనుక, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. లేదా ఎదురుగా ఉన్నవారు, తమ సెల్ ఫోన్ ను కెమెరా మీ వైపు ఉండే విధంగా ఆన్ చేసి.... తమ పాకెట్ లో పెట్టుకుంటారు. ఇది గమనించక మీరు వారితో ఏమేమో మాట్లాడి... ప్రత్యక్ష సాక్షంగా మిగిలిపోతారు. కనుక ఏప్రిల్ 4 నుంచి జూలై 31 వరకు జాగ్రత్తలు తీసుకొంటూ, ఈ క్రింది తెలియచేసిన తేదీలలో కూడా మరింత జాగ్రత్తలు తీసుకొనేది. ఈ నాల్గు మాసాలలో చేసే ప్రయాణాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని భావం.
మేషరాశి వారు అధికంగా జాగ్రత్తలు తీసుకొనవలసిన అతి ముఖ్య సమయాలు :
ఏప్రిల్ 7 రాత్రి 11.18 నుంచి 10 ఉదయం 7.30 వరకు
మే 5 ఉదయం 5.31 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు
జూన్ 1 మధ్యాహ్నం 1.04 నుంచి 3 రాత్రి 7.50 వరకు
జూన్ 28 రాత్రి 9.44 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు
జూలై 26 ఉదయం 6.37 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు ప్రతికూల సమయాలని భావించాలి.
వీటితో పాటు అశ్విని జాతకులు:
ఏప్రిల్ 15 అర్థరాత్రి 12.44 నుంచి 16 రా10.19 వరకు,
ఏప్రిల్ 24 12.06 నుంచి 25 మధ్యాహ్నం 1.40 వరకు,
మే 4 ఉదయం 10.32 నుంచి 5 మధ్యాహ్నం 11.51 వరకు,
మే 13 ఉదయం 8.07 నుంచి 14 ఉదయం 6.25 వరకు,
మే 21 రాత్రి 9.08 నుంచి 22 రాత్రి 10.15 వరకు,
మే 31 సాయంత్రం 6.14 నుంచి జూన్ 1 రా 7.21 వరకు,
జూన్ 9 మధ్యాహ్నం 1.41 నుంచి 10 మ12.20 వరకు,
జూన్ 18 ఉదయం 6.02 నుంచి 19 ఉదయం 6.58 వరకు,
జూన్ 27 అర్థరాత్రి తదుపరి 2.50 నుంచి 29 ఉదయం 4.02 వరకు,
జూలై 6 రాత్రి 7.22 నుంచి 7 సాయంత్రం 5.46 వరకు,
జూలై 15 మధ్యాహ్నం 1.44 నుంచి 16 మధ్యాహ్నం 2.49 వరకు,
జూలై 25 మధ్యాహ్నం 11.25 నుంచి 26 మధ్యాహ్నం 1.02 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
భరణి జాతకులు:
ఏప్రిల్ 8 ఉదయం 5.43 నుంచి 9 ఉదయం 6.52 వరకు
ఏప్రిల్ 16 రా10.19 నుంచి 17 రాత్రి 7.49 వరకు,
ఏప్రిల్ 25 మధ్యాహ్నం 1.40 నుంచి 26 మధ్యాహ్నం 3.54 వరకు,
మే 5 మధ్యాహ్నం 11.51 నుంచి 6 మధ్యాహ్నం 12.41 వరకు,
మే 14 ఉదయం 6.25 నుంచి 15 ఉదయం 4.35 వరకు,
మే 22 రాత్రి 10.15 నుంచి 23 రాత్రి 12.03 వరకు,
జూన్ 1 రా 7.21 నుంచి 2 రాత్రి 7.51 వరకు,
జూన్ 10 మ12.20 నుంచి 11 ఉదయం 10.59 వరకు,
జూన్ 19 ఉదయం 6.58 నుంచి 20 ఉదయం 8.31 వరకు,
జూన్ 29 ఉదయం 4.02 నుంచి 30 ఉదయం 4.31 వరకు,
జూలై 7 సాయంత్రం 5.46 నుంచి 8 సాయంత్రం 4.20 వరకు,
జూలై 16 మధ్యాహ్నం 2.49 నుంచి 17 సాయంత్రం 4.25 వరకు,
జూలై 26 మధ్యాహ్నం 1.02 నుంచి 27 మధ్యాహ్నం 1.51 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
కృత్తిక 1వ పాదం జాతకులు :
ఏప్రిల్ 9 ఉదయం 6.52 నుంచి 10 ఉదయం 7.30 వరకు,
ఏప్రిల్ 17 రాత్రి 7.49 నుంచి 18 సాయంత్రం 5.23 వరకు,
ఏప్రిల్ 26 మధ్యాహ్నం 3.54 నుంచి 27 సాయంత్రం 6.38 వరకు,
మే 6 మధ్యాహ్నం 12.41 నుంచి 7 మధ్యాహ్నం 1.04 వరకు,
మే 15 ఉదయం 4.35 నుంచి అర్థరాత్రి తదుపరి 5.42 వరకు,
మే 23 రాత్రి 12.03 నుంచి 24 అర్థరాత్రి తదుపరి 2.28 వరకు,
జూన్ 2 రాత్రి 7.51 నుంచి 3 రాత్రి 7.50 వరకు,
జూన్ 11 ఉదయం 10.59 నుంచి 12 ఉదయం 9.40 వరకు,
జూన్ 20 ఉదయం 8.31 నుంచి 21 ఉదయం 10.41 వరకు,
జూన్ 30 ఉదయం 4.31 నుంచి జూలై 1 ఉదయం 4.19 వరకు,
జూలై 8 సాయంత్రం 4.20 నుంచి 9 మధ్యాహ్నం 3.08 వరకు,
జూలై 17 సాయంత్రం 4.25 నుంచి 18 సాయంత్రం 6.32 వరకు,
జూలై 27 మధ్యాహ్నం 1.51 నుంచి 28 మధ్యాహ్నం 1.52 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
ముఖ్య గమనిక : పైన చెప్పిన సమయాలన్నీ కూడా భారత కాలమాన ప్రకారమని గమనించాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరూ, వారి దేశ కాలమాన ప్రకారం, ఈ సమయాలను మార్చుకొనవలసింది.
తదుపరి పోస్టింగ్ లో వృషభరాశి జాతకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు సమయాలు

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.