Monday, December 3, 2012

కార్తిక బహుళ షష్టిన "ఓం" బీజాక్షరంతో కీర్తిముఖుడిని స్వాగతించండి.

శ్రీ నందన నామ సంవత్సరంలో కార్తిక బహుళ షష్టి 5 డిశంబర్ 2012 బుధవారం రోజున కీర్తిముఖుడిని ఓం బీజాక్షరంతో స్వాగతించాలి. పరమశివుని ఆరాధించాలి. 5 డిశంబర్ 2012 బుధవారం నాడు రాత్రి లోపల ఈ దిగువ 16 నామాలను భక్తితో, విశ్వాసంతో కీర్తిముఖునిలో... పరమశివుని రూపాన్ని స్మరిస్తూ పఠి౦చండి. మీకు తోచిన ఏదైనా తీపి పదార్ధాన్ని నివేదించండి. ఎన్ని సార్లైనను మానసికంగా పఠి౦చండి.  

ఓం శశిశేఖరాయ నమః 
ఓం నీలలోహితాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం జటాధరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్ర్తాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాదేవాయ నమః 


పై పదహారు నామాలు పఠి౦చిన తదుపరి తన్మయత్వంగా ఓం కీర్తిముఖేభ్యో నమః అనే నామాన్ని 11 సార్లు పఠి౦చండి. సకల శుభాలకు చేరువకండి.

( కైలాసంలో శివనిలయ ద్వారానికి ఓ మహా దివ్య పురుషుని ముఖం అలంకృతమై వుంటుంది. ఆ దివ్య పురుషుడే కీర్తిముఖుడు. ఈ కీర్తిముఖుడుకి మనమందరం ఈ శ్రావణ పూర్ణిమ నుంచి స్వాగతం పలుకుదాం. కీర్తిముఖుడికి శిరస్సుపై ఓం బీజాక్షరం, కుడిచెవి ప్రక్కన గం బీజాక్షరం, ఎడమచెవి ప్రక్కన ఐం బీజాక్షరం, నాలుక కుడివైపున హ్రీం బీజాక్షరం, నాలుకకు ఎడమవైపున శ్రీం బీజాక్షరంతో కీర్తిముఖుడు చిత్రపటం ఉంటుంది.

కీర్తిముఖుడు శివుని కనుబొమ్మలనుంచి ఆవిర్భవించి శివాజ్ఞ లేకుండా స్వీయ నిర్ణయంతోనే... శివ సన్నిధికి దూతగా వచ్చిన వ్యక్తిని అధర్మ మార్గంలో సంహరించబోయాడు. కాని చివరలో శివుని ఆజ్ఞను శిరసావహించాడు. అందుకే శరీరమంతా అధర్మవర్తనకు.... పరిహారంగా పోయినను... మహా శివభక్తి తత్పరతకు మిగిలింది... ఒక ముఖం మాత్రమే. అదే ముఖం కీర్తిముఖుడుగా అనంతగౌరవాన్ని పొందుతూ.. కైలాసంలో శివుని ముఖద్వారానికి ఉండే మహా అదృష్టాన్ని పొందగలిగాడు. అంతర్లీనంగా ఓ గొప్ప సందేశం ఉన్న కారణంగానే కీర్తిముఖుని ఆవిర్భావ కధ కార్తీకమాసంలో 21 వ రోజున అనగా కార్తిక బహుళ షష్టి రోజున పారాయణా౦శమైనది.

జగన్మాత, జగత్పితలకు నిలయంగా ఉన్న కైలశమనే మన గృహంలో కూడా సకల శుభాలను అనుగ్రహించటానికి కీర్తిముఖుడు కావాలి. ఈ కీర్తిముఖుడిని సకల శుభాలు అనుగ్రహించమని భక్తితో, విశ్వాసంతో పూజించాలి.

సకల శుభాలు కలగటమంటే..... సకలదోషాలు పోవటమేనని భావం. ప్రణవ సహిత గణపతి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తులు అంతర్లీనంగా కీర్తిముఖుడిలో ఉంటారు.

ప్రతివారు నిత్యం కీర్తిముఖుడిని ఆరాధిస్తుంటే... అంతర్లీనంగా ఉన్న దైవ శక్తులను ప్రార్ధిస్తున్నట్లే.

నిత్యం పూజించే అవకాశం లేకున్నప్పటికీ, మనసారా భక్తితో అచంచల విశ్వాసంతో... దేహం లేని శిరస్సుతో ఉన్న కీర్తిముఖుడిని ఎన్ని పర్యాయాలైన వీక్షించండి. ఈ వీక్షనలే పరోక్షంగా సకల శుభాలను స్వాగతిస్తాయి.

కీర్తిముఖుడి చిత్రపటాన్ని గృహ సింహాద్వారమునకు పై భాగాన లేదా సింహాద్వారంలోనించి నేరుగా లోపలి వస్తే సింహాద్వారమున్న గోడ కాకుండా.... మిగిలిన మూడు గోడలలో ఏ గోడకైనను చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు.

ఈ విధంగా పెట్టిన చిత్రపటం వైపు నిత్యం పలుసార్లు వీక్షిస్తూ వుండటం శుభదాయకం. ఇదే చిత్రపటాన్ని పూజ మందిరంలో కూడా ఉంచుకొని పూజించటం శ్రేయోదాయకం. కంప్యూటర్ యుగంలో నిత్యం పూజాదికాలు చేయలేని వారందరికీ నవరక్షాకవచాలు, కీర్తిముఖుని చిత్రపటాలు సకల శుభాలను అనుగ్రహిస్తాయి.

ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల సంపుటంతో కీర్తిముఖుని చిత్రపటముండును. మన కన్నులతో కీర్తిముఖుని వీక్షిస్తున్నప్పుడు... చిత్రపటంలో ఉండే ఓం, గం, ఐం, హ్రీం, శ్రీం అను ఐదు బీజాక్షరాల తత్వ మహిమచే.... సకల శుభాలు కల్గునని మహానుభావుల మనోదృష్టికి అందిన అంశం.

ప్రతివారు తమ జీవితంలో శుక్ర మహాదశ రావాలని, రాక్షస రాజు శుక్రుడు అనుగ్రహం పొందాలని, కీర్తి ప్రతిష్టలు విశేషంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని, చక్కని సంసారంతో, సంతానంతో... సుఖవంతంగా విలాసంగా ఉండాలని కోరుకుంటారు. రాక్షస రాజుగా విరాజిల్లే శుక్రాచర్యులనే శుక్ర గ్రహంగా పేర్కొనటం. శుక్రునిది పంచకోణాకార మండలం.... పంచకోణాకార మండలమంటే ఓ నక్షత్ర గుర్తు. ఐదు కోణాలు, ఐదు బీజాక్షరాలతో సమ్మిళితమై ఉంటుంది. ఈ కీర్తిముఖునిలో ఐదు బీజాక్షర స్వరూపాలున్నాయి. కీర్తిముఖుడు అనబడే దివ్య పురుషుని వీక్షణ మన మీద ప్రసరిస్తే .... ఆ దైవీ శక్తుల యొక్క కటాక్షం మనం పొందినట్లేనని భావం.)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.