వందల సంవత్సరాల తరువాత ఏర్పడే ఖగోళ గ్రహస్థితే షష్టాష్టక చతుష్టయము. అరిష్ట యోగములతో ఈ షష్టాష్టకం ద్వాదశ రాశులపై ప్రభావము చూపుతున్నది. గ్రహ సంబంధ షష్టాష్టకములు మూడు, గ్రహణ షష్టాష్టకము ఒకటి కలిసి మొత్తం నాలుగు షష్టాష్టక స్థితులు ఏర్పడినవి.
1. 2009 నవంబర్ 2సోమవారం నాడు రాహువు ధనుస్సు రాశి ప్రవేశం చేయడంతో, కర్కాటక రాశిలో నీచ స్థితి లో ఉన్న కుజ గ్రహంతో షష్టాష్టకము ఏర్పడినది. అంటే కర్కాటక కుజునికి ఆరవ స్థానమైన ధనస్సులో రహువుండటము, రాహువుకు ఎనిమిదవ స్థానమైన కర్కాటకంలో కుజుడుండటము మొదటి షష్టాష్టక గ్రహస్థితిగా పేర్కొనాలి.
2. 2009 డిశంబర్ 20ఆదివారం నాడు గురుగ్రహము కుంభరాశి ప్రవేశము చేయటంతో, కన్యా రాశి లో ఉన్న శని గ్రహంతో, షష్టాష్టకము ఏర్పడినది. అంటే కన్యా రాశిలోని శని గ్రహానికి ఆరవ స్థానమైన కుంభ రాశిలో గురువుండటము, కుంభ రాశికి ఎనిమిదవ స్థానమైన కన్యలో శని సంచారం చేయటము రెండవ షష్టాష్టకము.
3. 2009 డిసంబర్ 20ఆదివారం నుంచే గురుగ్రహం, కుజ గ్రహం మధ్య షష్టాష్టకము ఏర్పడినది. ఏవిధంగానంటే, కుంభ రాశిలోని గురుగ్రహానికి ఆరవ రాశియైన కర్కాటకలోని కుజుడు, అలాగే కుజ గ్రహానికి ఎనిమిదవ రాశిలో గురుగ్రహం ఉండటము మూడవ షష్టాష్టక గ్రహస్థితి.
ఇంతవరకు గ్రహాల సంచారంలో మూడు షష్టాష్టకములు ఏర్పడ్డాయి. గ్రహాలు కాక గ్రహణాలలో కూడా మరో షష్టాష్టకం ఏర్పడనున్నది.....ఎప్పుడు ? ఎక్కడ ?
4. మిధున రాశిలో భారత కాల మాన తేది ప్రకారం 2010జనవరి 1న పుష్య పూర్ణిమన ఆరుద్రా నక్షత్రంలో పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడినది. జనవరి 15పుష్య అమావాస్య రోజున మకర రాశిలో ఉత్తరాషాడ నక్షత్రంలో కంకణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. మకర రాశికి మిధున రాశి ఆరవ రాశి. మిధున రాశికి మకర రాశి అష్టమ రాశి. అనగా షష్టాష్టక రాశులలో గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇది నాల్గవ షష్టాష్టకం.
జనవరి 15తో నాల్గవ షష్టాష్టక అవయోగం ప్రారంభం కానున్నది. దీని ప్రభావం దాదాపు నాలుగు మాసాలు కొనసాగుతుంది. కానీ గ్రహాల నడుమ ఏర్పడిన షష్టాష్టకములు 25 మే 2010 వరకు కొనసాగుతుంది.
దాదాపు నాలుగు నెలలకు పైగా వుండే షష్టాష్టక చతుష్టయ ప్రభావములు ఎలా వుంటాయి అనే ఆసక్తికర వివరాలు తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.... శ్రీనివాస గార్గేయ
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.