జ్యోతిషశాస్త్రంలో 8వ స్థానాన్ని ఆయు స్థానం అంటారు. ఈ స్థానాన్ని బట్టి
వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించగలడో తెలుసుకోవచ్చు. కాని నాలుగు దశాబ్దాల
జ్యోతిష అనుభవంతో జీవన స్థితి గతులను పరిశోధించి పరిశీలిస్తే ఒక క్రొత్త
అంశం తెరపైకి వచ్చింది. అదే మనః కారకుడైన చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క
స్థితి గతులను బట్టి మన ఆయుష్షు నిర్ణయించవచ్చు. ప్రస్తుత కాలమాన
పరిస్థితులను విశ్లేషిస్తే అచ్యున్నత మానవ శ్రేయస్సయిన మనఃశాంతి ఉంటే
ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది . లేనిచో తగ్గుతూ ఉంటుంది. ఒక లక్ష్యాన్ని లేక
గమ్యాన్ని సాధించటానికి... గతంలో చెప్పిన నాలుగు ఆటంకాలను అధిగమించి
ముందుకు వెళ్ళవచ్చును. అలా ముందుకు వెళ్ళినప్పుడు వ్యక్తికి కావలసింది
మనఃశాంతి.... ఈ మనఃశాంతి ఉంటేనే లక్ష్య సాధనవైపు వెళ్ళగలడు. మరి ఈ మనఃశాంతి
లేకుండా చేయటానికి ప్రధాన కారణం వత్తిడి. కనుక ఈ వత్తిడి ఏ విధంగా ఉంటుంది
? ఎందుకు ఉంటుంది ? కారణాలు ఏమిటి ? మొదలైన వివరాల కోసం ఈ దిగువన ఉన్న 25
జూలై 2013 నాటి భక్తిమాల. టీవీ లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్ ను
వీక్షించండి.
25 జూలై 2013 గ్రహబలం
2013 జూలై 23 తేది నాటి భక్తిమాల. టీవీ లోని వీడియో చూశారు కదా.. ప్రతి
మనిషికి కోరికలు నిత్యం వస్తూ వుంటాయి. కొంతమంది ఊహలలో తేలుతూ ఉంటారు.
రకరకములైన భావాలను ఊహించుకుంటుంటారు. లక్ష్యానికి, కోరికకు చాలా తేడా
వుంది. ఒక లక్ష్యాన్ని సాధించటానికి గాని లేదా ఒక గమ్యాన్ని చేరటానికి గాని
ఆచరించే ప్రణాళిక ఏదైతే ఉంటుందో దానిని గురించి ఊహించండి లేదా దానిని
కోరికగా తెచ్చుకోండి. నవగ్రహాలలో మనఃకారకుడైన చంద్రుడు లక్ష్య సాధనలో
ప్రధాన భూమికను పోషిస్తాడు. నేనేం చేయగలను ? అసమర్దుడను, ఉత్సాహం
ఉన్నప్పటికీ కార్యాచరణ వైపు మొగ్గు చూపలేని ఆశక్తుడను అనుకునేవారు ఎంతోమంది
ఉంటారు. కనుక ఆ దిశగా ఆలోచించక.. మరో దిశగా ఆలోచిస్తూ లక్ష్య సాధనకు నడుం
బిగించాలి. మొదటగా నాలుగు అవరోధాలు అడ్డు తగులుతాయి. ఈ అవరోధాలను
ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. మొదటి మూడు అవరోధాలు చంద్ర గ్రహానికి
సంబంధించినవి. నాలుగో అవరోధం మనః కారకుడైన చంద్రుడికి, బుద్ధి కారకుడైన
బుధుడికి, ఆత్మకారకుడైన రవికి సంబంధించినవి. 23వ తేది నాటి ఎపిసోడ్ లో 30
తిధులలో శుక్ల పక్ష చవితి, శుక్ల సప్తమి శుక్ల త్రయోదశి, బహుళ చవితి, బహుళ
సప్తమి, బహుళ త్రయోదశి తిధులు ప్రత్యేకంగా పరిహార రూపంలో ఉపయోగపడతాయి.
అయితే ఈ ఎపిసోడ్ లో మూడు గ్రహాల సహకారంతో పూర్ణిమ తిథి ఉపయోగపడుతుంది.
ఈ
నాలుగు అవరోధాలు ఏమిటో అవి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో పూర్తి వివరాలు
తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
24 జూలై 2013 గ్రహబలం